Coordinates: 17°00′26.6″N 81°45′21″E / 17.007389°N 81.75583°E / 17.007389; 81.75583

హేవ్ లాక్ వంతెన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హేవ్ లాక్ గోదావరి వంతెన
Coordinates17°00′26.6″N 81°45′21″E / 17.007389°N 81.75583°E / 17.007389; 81.75583
OS grid reference[1]
Carriesరైల్వే లైన్
Crossesగోదావరి
Localeతూర్పుగోదావరి జిల్లా , రాజమహేంద్రవరం భారత దేశం
Official nameహేవ్ లాక్ వంతెన
Other name(s)గోదావరి వంతెన
Maintained byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Characteristics
Total length2.7 కీలో మీటర్ల
Design life100 సంవత్సరాలు
History
Construction start1897 నవంబరు 11 (1897-11-11)
Opened1900 ఆగస్టు 30 (1900-08-30)
Closed1997
Location
పటం

హేవ్‌లాక్ వంతెన ఆంధ్ర ప్రదేశ్‌లో రాజమహేంద్రవరం వద్ద, గోదావరి నదిపై 19 వ శతాబ్దంలో బ్రిటిషు ప్రభుత్వం ఈ వంతెనను నిర్మించారు.చెన్నై నుండి కోల్‌కతా రైలు మార్గంలో ఈ వంతెన ఉంది. నూరేళ్ళకు పైగా ఉపయోగపడిన ఈ వంతెన సేవలను 1997 లో భారతీయ రైల్వే నిలిపివేసింది. ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ వంతెనను రైల్వేల నుంది కొని పర్యాటక కేంద్రంగా మార్చింది.

చరిత్ర[మార్చు]

హేవ్‌లాక్ వంతెన ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో ఉంది. బ్రిటిషు ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణాన్ని 47 లక్షల అంచనా వ్యయంతో 1897 నవంబర్ 11 న ప్రారంభించి, 1900 ఆగస్టు 30న పూర్తి చేసింది. 2.7 కి.మీ. పొడవు, 1.7 మీ వెడల్పు తో సర్ ఆర్థర్ హేవ్ లాక్ అనే బ్రిటిష్ ఇంజనీర్ పర్యవేక్షణలో దీని నిర్మాణం జరిగింది. ఈ వంతెన 118 ఏళ్ల చరిత్ర కలిగినది. ఈ వంతెన పై మొట్టమొదట మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం చేసినట్లు రికార్డులో నమోదయింది.100 ఏళ్ల పాటు నిరాటంకంగా సేవలు అందించిన ఈ వంతెన పై సేవలను భారతీయ రైల్వే 1997 సంవత్సరంలో నిలిపివేసింది. చివరిసారిగా ఈ వంతెనపై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణించినట్లు రికార్డ్ నమోదయింది[1]

పర్యాటకంగా అభివృద్ధి[మార్చు]

వాడుక నిలిపివేసిన ఈ వంతెనను 2017 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రైల్వే శాఖకు 12.5 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకుంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ నిర్మాణంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి అని నిర్ణయించుకుంది.[2]

మూలాలు[మార్చు]

  1. "The Havelock Bridge Meorial Stone". 21 March 2009.
  2. "Havelock bridge to be developed into tourist spot". The Hindu. 17 December 2008.