Jump to content

ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

వికీపీడియా నుండి
ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం
ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం
జరుపుకొనేవారుయునైటెడ్ నేషన్స్ సభ్యులు
జరుపుకొనే రోజు24 మార్చి
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతిరోజు ఇదే రోజు

ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 24 న నిర్వహించబడుతుంది. భయంకరమైన అంటువ్యాధైన టీబీ(క్షయ) దేశంలో ప్రతి సెకనుకు ఒక్కరికి సోకుతున్నదని, ప్రతిరోజు దేశవ్యాప్తంగా 1000మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962ను క్షయవ్యాధి నివారణకు ప్రత్యేకమైన చర్యలను తీసుకోవడం ప్రారంభించింది.

ప్రారంభం

[మార్చు]

1882, మార్చి 24న డా. రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను (మైకోబ్యాక్టీరియమ్ టూబరిక్లోసిస్) మొదటిసారిగా కనుగొన్నాడు. 1982లో అంతర్జాతీయ క్షయ, ఊపిరితిత్తుల వ్యాధుల వ్యతిరేక యూనియన్, రాబర్ట్ కోచ్ క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను కనుగొని 100 సంవత్సరాలైన సందర్భంగా మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించింది.[1][2]

కార్యక్రమాలు

[మార్చు]
  1. క్షయవ్యాధిపై విస్తృత అవగాహన కలిగిచడం, ర్యాలీలు నిర్వహించడం
  2. క్షయవ్యాధి లక్షణాలు, దాని తీవ్రత తగ్గించేందుకు మందులు ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేసే శిక్షణా శిబిరాలు ఏర్పాటుచేయడం

మూలాలు

[మార్చు]
  1. మనతెలంగాణ (24 March 2018). "నగరానికి క్షయ ముప్పు…". డాక్టర్ రమణ ప్రసాద్. Archived from the original on 24 March 2019. Retrieved 24 March 2019.
  2. ప్రజాశక్తి (24 March 2018). "క్షయ నియంత్రణ సాధ్యమే..!". Archived from the original on 24 March 2019. Retrieved 24 March 2019.