బండి యాదగిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బండి యాదగిరి తెలంగాణకు చెందిన విప్లవ కవి . అతను ఒక భూస్వామ్య ప్రభువు గురించి ప్రసిద్ధ పాట బండి ఎన్క బండి కట్టి [1] వ్రాసాడు, ఇది మా భూమి చిత్రం కోసం తిరిగి వ్రాయబడింది.

యాదగిరి తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ నుండి వామపక్ష పార్టీలో సాధారణ సభ్యుడు. [2]

జీవిత విశేషాలు[మార్చు]

తుంగతుర్తి ప్రాంతంలోని నూతనకల్‌ మండలం వెంకిపల్లి (వెలకలపల్లి)కు చెందిన నాగిళ్లి వెంకమ్మ, రాములు దంపతులకు బండి యాదగిరి జన్మించాడు. చిన్నప్పటి నుండే గంజి మెతుకులకు అల్లాడిన జీవితం అతనిది. ఆ కాలంలో తెలంగాణ పరగణాకు చెందిన పేదల జీవన స్థితి అంతే. అలాంటి మనుషులను పట్టి పీడిస్తున్న నిజాం ముష్కరులు, భూస్వామ్య పెత్తందారులు సాగించిన ఆగడాలకు అంతులేని సమయమది. ప్రశ్నించే గొంతుకల కోసం ధైర్యం ఇచ్చే గుండెల కోసం ఎదురు చూస్తున్న వేళ యాదగిరి ఓ పాటై, మాటల తూటై బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిజాం సైన్యాన్ని గడగడలాండించిన ధిశాలి[3]..

ప్రస్తావనలు[మార్చు]

  1. http://www.thehindu.com/arts/cinema/article439322.ece
  2. http://www.hindu.com/2009/12/17/stories/2009121761591200.htm
  3. "బండెనక బండి కట్టి... | సూర్యాపేట‌ | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2019-09-14.