మహబూబ్ చౌక్ క్లాక్ టవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహబూబ్ చౌక్ క్లాక్ టవర్
Mahbob chowk clock tower.jpg
మహబూబ్ చౌక్ క్లాక్ టవర్
రకంటవర్
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ
విస్తీర్ణంచార్మినార్
నిర్మించినది1892

మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చార్మినార్ కు పడమర వైపున్న క్లాక్ టవర్. 1880లో పైగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా ఈ ఐదు అంతస్తుల క్లాక్ టవర్ ను నిర్మించాడు.

నిర్మాణం[మార్చు]

పైగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా 1887-1894 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో 1892లో హైదరాబాద్ వాస్తుశిల్పి వారసత్వం యొక్క ముఖ్యమైన భాగంగా పరిగణించబడిన మహబూబ్ చౌక్ ప్రాంతంలోని చిన్న తోట మధ్యలో ఐదు అంతస్తుల్లో ఈ క్లాక్ టవర్ నిర్మించబడింది.[1][2]

టర్కీష్ శైలిలో నిర్మించబడిన క్లాక్ టవర్ నాలుగు వైపుల నాలుగు పెద్ద గడియారాలు ఉన్నాయి, నాలుగు దిశల నుండి సమయాన్ని చూడవచ్చు.

మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ (1890లో)

ప్రదేశం[మార్చు]

చార్మినార్ కు పడమర వైపున, లాడ్ బజార్ కు సమీపంలో ఈ మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ ఉంది.[3][4][5][6]

మూలాలు[మార్చు]

  1. "Mahboob Chowk clock tower cries for attention". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 23 January 2019.
  2. "Tourists tend to avoid Mahboob Chowk Clock Tower". Deccan Chronicle (in ఇంగ్లీష్). 25 July 2019. Retrieved 23 January 2019.
  3. "Mahboob Chowk Clock Tower lies in neglect". The Siasat Daily. 21 October 2014.
  4. "Hyderabad's Heritage - Mesmerising Architectural Splendours". KnowAP. 2 July 2009.
  5. "After decades of neglect, Hyd's 126-year-old Mahboob Chowk clock starts ticking again". The News Minute. 1 October 2018. Retrieved 23 January 2019.
  6. "Time stands still at Mahboob Chowk, only apathy ticks - Times of India". The Times of India. Retrieved 23 January 2019.