సరోజినీ పుల్లారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరోజినీ పుల్లారెడ్డి
సరోజినీ పుల్లారెడ్డి

సరోజినీ పుల్లారెడ్డి


శాసనసభ సభ్యురాలు
పదవీ కాలము
1967 – 1978
ముందు మీర్ అహ్మద్ అలీఖాన్
తరువాత కందల ప్రభాకరరెడ్డి
నియోజకవర్గము మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1923-02-22) 1923 ఫిబ్రవరి 22
సికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం
మరణం 2013 ఫిబ్రవరి 3 (2013-02-03)(వయసు 89)
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేస్
జీవిత భాగస్వామి పుల్లారెడ్డి బోలుంపల్లి
నివాసము బోయినపల్లి, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం

సరోజిని పుల్లారెడ్డి (ఫిబ్రవరి 22, 1923 - ఫిబ్రవరి 3, 2013) హైదరాబాదు నగర తొలి మహిళా మేయర్, మాజీ మంత్రి. 1967 నుండి 1978 వరకు భారత జాతీయ కాంగ్రేస్ నుండి మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసింది.[1]

జననం - కుటుంబం[మార్చు]

సరోజినీ 1923, ఫిబ్రవరి 22న కొండారెడ్డి, అనసూయ దంపతులకు మహబూబ్ నగర్ లో జన్మించింది. 1944లో డా. పుల్లారెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

1960లో రాజకీయాల్లోకి ప్రవేశించిన సరోజినీ 1965లో బతుకమ్మకుంట కార్పోరేటర్ గా విజయం సాధించి హైదరాబాదు నగరానికి 12వ మేయర్‌గా పదవిని చేపట్టి, ఏడాది పాటు విధులు నిర్వహించింది. 1967, 1972లో మలక్‌పేట సెగ్మెంట్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కరరెడ్డిల హయాంలో మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆరోగ్య, పబ్లిక్‌ రిలేషన్‌, మహిళ, శిశు సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేసింది.[1] 1975లో హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)కు తొలి చైర్‌పర్సన్ పదవిని చేపట్టి మాస్టర్‌ ప్లాన్‌, శాటిలైట్‌ టౌన్‌షిప్‌, హస్తినాపురం శాటిలైట్‌ టౌన్‌షిప్‌ వంటి పథకాలను విజయవంతంగా అమలుచేసింది.[2]

నిర్వహించిన పదవులు[మార్చు]

  1. హైదరాబాదు నగర తొలి మహిళా మేయర్ (1965)
  2. మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే (1967 నుండి 1978 వరకు)
  3. హైదరాబాద్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హుడా)కు మొదటి చైర్‌పర్సన్ (1975)
  4. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు (2000)

మరణం[మార్చు]

సరోజినీ 89వ ఏట 2013, ఫిబ్రవరి 3 బోయినపల్లిలోని స్వగృహంలో మరణించింది.[3][4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Malakpet (Telangana) Assembly Constituency Election Result Updates". Cite web requires |website= (help)
  2. ఆంధ్రజ్యోతి, వార్తలు (11 January 2016). "మహిళా మేయర్‌ సరోజినీ పుల్లారెడ్డి". మూలం నుండి 13 January 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 8 June 2019. Cite news requires |newspaper= (help)
  3. New Indian Express, Andhra Pradesh (3 February 2013). "Congress leader Sarojini Reddy passes away". మూలం నుండి 8 June 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 8 June 2019. Cite news requires |newspaper= (help)
  4. The Hindu, Andhra Pradesh (4 February 2013). "Sarojini Pulla Reddy dead". మూలం నుండి 8 June 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 8 June 2019. Cite news requires |newspaper= (help)