తుమ్మల రమాదేవి
తుమ్మల రమాదేవి వ్యాపారవేత్త, తెలుగు టెలివిజన్ ఛానెళ్ళ నిర్వాహకురాలు. ఆమె ప్రారంభించి నడిపిస్తున్న వనిత టీవీ ప్రత్యేకించి మహిళల కోసం నడుపుతున్న ఛానెళ్ళలో భారతదేశంలోకెల్లా మొదటిది.[1] ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత ఛానెళ్ళను నిర్వహిస్తున్న రచన టెలివిజన్ నెట్వర్క్స్ లో ఆమె డైరెక్టర్.
వ్యక్తిగత జీవితం
[మార్చు]రమాదేవి గుంటూరులో జన్మించింది. ఆమె డబుల్ ఎం.ఎ., ఎల్.ఎల్.బి., ఎం.బి.ఎ. చదివింది. 2006 వరకు ఈ డిగ్రీలు, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుకున్నది. మీడియా రంగంలో పనిచేయడం ప్రారంభించాకా చదువుకు విరామం ఇచ్చింది. భర్త [[తుమ్మల నరేంద్ర చౌదరి]] ఎన్ టీవీ, భక్తి ఛానెళ్ళ వ్యవస్థాపకుడు, రచన టెలివిజన్ నెట్ వర్క్స్ అధినేత. వారి కుమార్తె రచన కూడా మీడియా నిర్వహణలోనే పనిచేస్తున్నది.[2]
మీడియా రంగం
[మార్చు]రచన టెలివిజన్ నెట్ వర్క్స్
[మార్చు]2006లో రచన టెలివిజన్ నెట్వర్క్స్ ప్రారంభించినప్పుడు భర్త నరేంద్ర చౌదరితో కలిసి రమాదేవి డైరెక్టరుగా బాధ్యతలు స్వీకరించింది. 24 గంటల న్యూస్ ఛానెల్ అయిన ఎన్టీవీ, హిందూ ఆధ్యాత్మిక ఛానెల్ అయిన భక్తి టీవీలు ఈ సంస్థ ద్వారానే ప్రారంభమయ్యాయి.[2]
వనిత ఛానెల్
[మార్చు]2009లో భారతదేశంలో మహిళలకే ప్రత్యేకించిన తొలి టెలివిజన్ గా వనిత టీవీ ప్రారంభించింది. ఈ ఛానెల్ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా రమాదేవి వహించింది.[2] వనిత ఛానెల్ కార్యక్రమాలు పలు టీవీ నంది, యునిసెఫ్, లాడ్లీ మీడియా పురస్కారాలు వంటి అవార్డులు సాధించాయి.[3][4][5] లాభనష్టాలకు అతీతంగా వనిత ఛానెల్ నడుపుతోంది. "మహిళలు కేవలం వినోద సాధనాలకు ఆదాయమార్గాలుగా మాత్రమే మిగిలిపోతున్న వైనమే... వారి కోసం ప్రత్యేక ఛానెల్ ఆలోచన కలిగించింది" అన్నది వనిత ఛానెల్ ఏర్పాటు వెనుక రమాదేవి ఆలోచన.[2]
సాంఘిక సేవ, పరిశోధన
[మార్చు]ఈ విభాగం ఖాళీగా ఉంది. మీరు ఇది జోడించడం ద్వారా సహాయపడుతుంది. |
మూలాలు
[మార్చు]- ↑ "Rachana Television Pvt. Ltd appoints Deepak Dubey as DGM- Sales and Marketing (North) – Exchange4media". Indian Advertising Media & Marketing News – exchange4media (in ఇంగ్లీష్). Archived from the original on 9 మే 2019. Retrieved 9 May 2019.
- ↑ 2.0 2.1 2.2 2.3 "వనిత ఠీవి...". సాక్షి (ఫ్యామిలీ ed.). 1 September 2009. p. 1.
- ↑ ఆర్., కృష్ణయ్య. "సామాజిక సందేశాలకు టీవీ మాధ్యమం". www.prajasakti.com. Archived from the original on 9 మే 2019. Retrieved 9 May 2019.
- ↑ "తెలుగు మీడియాకు యూనిసెఫ్ అవార్డులు". Update AP. Archived from the original on 9 మే 2019. Retrieved 9 May 2019.
- ↑ "Laadli media awards presented". The Hindu (in Indian English). 14 December 2013. Retrieved 10 May 2019.