జమ్మలమడుగు పిచ్చయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జమ్మలమడుగు పిచ్చయ్య
Jammalamadugu Pichaiah.jpg
జననంజమ్మలమడుగు పిచ్చయ్య
(1918-12-21) 1918 డిసెంబరు 21
భారత కూచిపుడి గ్రామం, కృష్జా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
నివాస ప్రాంతందేశాయిపేట, వరంగల్‌ జిల్లా , తెలంగాణ
ప్రసిద్ధిబాల్‌ బాడ్మింటన్‌ క్రీడాకారుడు
మతంహిందూ
భార్య / భర్తసత్యవతి
పిల్లలుసుశీల, జానకిదేవి
తండ్రిపున్నయ్య
తల్లినాగమ్మ

జమ్మలమడుగు పిచ్చయ్య ( జననం: డిసెంబరు 21, 1918 ) తొలి తరం బాల్‌ బాడ్మింటన్‌ క్రీడాకారుడు. ఈ క్రీడలో గెలుచుకున్న తొలి అర్జున అవార్డు గ్రహీత ఇతనే.[1]

జననం[మార్చు]

ఈయన 1918, డిసెంబరు 21న కృష్జా జిల్లాలోని కూచిపుడి గ్రామంలో నాగమ్మ, పున్నయ్య దంపతులకు ఏడుగురు సంతానంలో మూడో వాడిగా జన్మించాడు.[2]

క్రీడా ప్రస్థానం[మార్చు]

ఈయన పదోతరగతి తప్పడంతో ధ్యాసంతా క్రీడలపై మళ్ళింది. ఈ క్రమంలో బందరు పట్టణంలో మినర్వ క్లబ్‌ మరియు మోహన్‌ క్లబ్‌లలో బాల్‌ బ్యాడ్మింటన్‌ ఆడడం అలవాటు చేసుకున్నాడు. 1935-36లో నర్సారావుపేటలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో విజేతగా నిలిచాడు. 1947-48లో గుడివాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. 1950 దశకంలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ క్రీడల్లో పాల్గొనలేకపోయాడు కాని 1954-55లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 1956, 1957 సంవత్సరంలో మద్రాస్‌, పాండిచ్చేరి రాష్ట్రాలలో జరిగిన జాతీయ పోటీల్లో జట్టు కెప్టెన్‌గా వహించి గెలుపొందారు మరియు తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన 15 జాతీయస్థాయి పోటీల్లో కెప్టెన్‌గా వహించి 9 ఛాంపియన్‌షిప్‌లను గెలుపొందడంలో కీలకపాత్ర వహించాడు.[3]

పురస్కారాలు[మార్చు]

భారత బాల్ బాడ్మింటన్‌ క్రీడా రంగానికి ఇతను చేసిన సేవలకు 1970లో అర్జున అవార్డును ప్రకటించింది. కాని 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం కారణంగా ఆ సంవత్సరంలో ఈ అవార్డును అందుకోలేకపోయాడు. 1972లో అప్పటి భారత రాష్ట్రపతి ఐన వి.వి గిరి గారి చేతుల మీదుగా దిల్లీలో ఈ అవార్డును స్వీకరించాడు.

వివాహం[మార్చు]

ఈయన భార్య సత్యవతి. ఈయనకు ఇద్దరు కుమార్తెలు సుశీల, జానకిదేవి ఉన్నారు. ఈయన భార్య సత్యవతి 2007లో మృతి చెందారు.

మూలాలు[మార్చు]

  1. "101 ఏళ్ల అర్జునుడు". 21-12-2018. మూలం నుండి 2018-12-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2018-12-21. Cite news requires |newspaper= (help); Check date values in: |date= (help)
  2. "జమ్మలమడుగు పిచ్చయ్య". 21 డిసెంబర్, 2018. Cite news requires |newspaper= (help); Check date values in: |date= (help)
  3. "గతం ఘనం.. నేడు దైన్యం". ఆగస్టు 24, 2014. Cite news requires |newspaper= (help)