హోలీ ట్రినిటీ చర్చి, హైదరాబాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హోలీ ట్రినిటీ చర్చి
Holytrinitychurchbolarumsecunderabad.png
ప్రాథమిక సమాచారం
ప్రదేశంబొల్లారం, సికింద్రాబాదు , తెలంగాణ
ప్రావిన్స్సికింద్రాబాదు
వాస్తు సంబంధ వివరణ
లక్షణాలు

హోలీ ట్రినిటీ చర్చి సికింద్రాబాదులోని బొల్లారం ప్రాంతంలో ఉన్న క్రైస్తవ ప్రార్థనామందిరం. దీనిని 1847లో బ్రిటిష్ సైనిక అధికారుల కోసం నిర్మించారు.[1]

చరిత్ర[మార్చు]

బొల్లారంలో ఉన్న బ్రిటిష్ ఆర్మీ అధికారులకోసం చర్చిని నిర్మించడంకోసం కావలసిన భూమి ఆనాటి నిజాంచే ఇవ్వబడింది. బ్రిటిష్ రాణి విక్టోరియా చర్చి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించింది.

నిర్మాణం[మార్చు]

ఇది గోతిక్ శైలీలో నిర్మించబడింది. ఇందులోని గాజు కిటికీలు ఇంగ్లాండ్ దేశీయ చర్చిలలోని కిటికీల మాదిరిగానే ఉంటాయి.[2] బ్రిటిష్ సైనికుల, అధికారులు, వారి కుటుంబాల జ్ఞాపకార్థం స్మారక చిహ్నాలు చర్చి యొక్క గోడలపై ఏర్పాటుచేయబడ్డాయి. ప్రక్కనే ఉన్న స్మశానవాటికలో 1851 నుండి సమాధులు ఉన్నాయి.

బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తిచే క్లాసిక్ యూరోపియన్ నిర్మాణంలో ఈ చర్చి నిర్మించబడింది. ఈ చర్చి ప్రస్తుతం 6 గ్రామాలకు చెందిన 15 ప్రాంతాలోని సుమారు 370 కుటుంబాలకు చెందిన బ్రిటీష్ సైన్యం అధికారులకు, కుటుంబాలకు ఆరాధనా స్థలంగా ఉంది.

రాణి సందర్శన[మార్చు]

1983, నవంబర్ 20న రాణి ఎలిజబెత్ II ఈ చర్చిని సందర్శించి, బిషప్ విక్టర్ ప్రేమసాగర్ ఆధ్వర్యంలో రెవరెండ్ బి.పి.సుగంధర్, రెవరెండ్ ప్రభాకర్, ఆనాటి పాస్టర్ జి.జె.హామిల్టస్ సారధ్యంలో ప్రిన్స్ ఫిలిప్ తో కలిసి 36వ వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంది.[3]

ఎలక్ట్రిక్ హార్మోనియం[మార్చు]

ఎలక్ట్రిక్ హార్మోనియం

ఈ చర్చిలో శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించే ఎలక్ట్రిక్ హార్మోనియం ఉంది. మిస్క్విత్ అండ్ కంపెనీ తయారుచేసిన ఈ హార్మోనియం 1903, మేలో ప్రజలు ఇచ్చిన చందాలతో కొనబడింది.

పాస్టర్ల జాబితా[మార్చు]

 1. లావ్ డేవిడ్ (1947-1950)
 2. ఎస్. స్టీఫన్ (1950-1954)
 3. కోటిలింగం (1954-1955)
 4. డబ్ల్యూ.జి. కార్బ్లిడ్జ్ (1955-1956)
 5. చిన్నయ్య (1956-1964)
 6. పి.ఆర్. ధర్మరాజ్ (1964-1966)
 7. పి.ఎ. ముత్తయ్య (1966-1969)
 8. టి. అశ్విర్వాదం (1969-1972)
 9. బి.డి. ప్రేమ్ సాగర్ (1972-1974)
 10. ఇ. పి. ఏసుదాసు (1975)
 11. సిమోన్ (1975)
 12. పి. సేవ ప్రకాషన్ (1976-1977)
 13. బి. ఎలియజర్ (1977-1979)
 14. పి.ఎ. ముత్తయ్య (1979-1980)
 15. పి.వై. లూకా (1980-1982)
 16. జి.జె. హామిల్టన్ (1982-1984)
 17. సిహెచ్.డి. సదానంద్ (1984-1986)
 18. టి.బి. ప్రభకర్ రావు (1986-1987)
 19. ఎన్.డి. పాల్ రాజ్ (1987-1990)
 20. సిహెచ్.డి. సదానంద్ (1990-1994)
 21. డి. ప్రసన్న కుమార్ (1994)
 22. ఎన్.డి. పాల్ రాజ్ (1994-1997)
 23. పి. యేసుచంకర్ (1997-2002)
 24. సిహెచ్.డి. సదానంద్ (2002-2004)
 25. టి. డానీ సుబోధ్ (2004-2008)
 26. డి. ప్రసన్న కుమార్ (2008-2010)
 27. డి. జాన్ జోనాథన్ (2010-2012)
 28. కట్టా జాచియాస్ (2012)
 29. ఎ. సి. సాల్మన్ రాజ్ (2012-2016)

మూలాలు[మార్చు]

 1. సాక్షి, ఫీచర్స్ (25 December 2014). "క్రిస్టియన్ మిషనరీలు 100 plus". మల్లాది కృష్ణానంద్. Archived from the original on 26 March 2019. Retrieved 3 April 2019.
 2. "INTACH". Archived from the original on 22 జనవరి 2007. Retrieved 2 ఏప్రిల్ 2019.
 3. "Welcome to Holy Trinity Church Bolarum". htcbolarum.org. Archived from the original on 3 అక్టోబర్ 2013. Retrieved 2 ఏప్రిల్ 2019.

ఇతర లంకెలు[మార్చు]