వికార్ మంజిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికార్ మంజిల్
Vikhar Manzil.jpg
సాధారణ సమాచారం
రకంరాజ భవనం
నిర్మాణ శైలిఇండో యూరోపియన్
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
పూర్తి చేయబడినది1900

వికార్ మంజిల్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న భవనం. ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా తన ఫార్సీ భార్యకోసం 1900లో ఈ భవనాన్ని నిర్మించుకున్నాడు.[1]

చరిత్ర[మార్చు]

నెక్లెస్ రోడ్ లో జలవిహార్ దాటి సంజీవయ్య పార్క్ వైపు వెళ్ళే దారిలో ఎడమవైపు రైల్వేట్రాక్ (బేగంపేట ప్రకాశ్‌నగర్ వెనుకభాగం)కు అవతలివైపు వికార్ మంజిల్ ఉంది. వికారుల్ ఉమ్రా కార్యదర్శి అయిన రజాక్ అలీబేగ్ ఎత్తయిన కొండ ప్రాంతంలో అందమైన భవనాన్ని నిర్మిస్తున్నాడు. అయితే, భవన నిర్మాణానికి కావలసిన నీళ్ళు పైకి ఎక్కించేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుండడం వల్ల తాను ఆ భవనాన్ని పూర్తి చేయదలుచుకోలేదు.[2]

ఒక పున్నమి రాత్రి వికారుల్ ఉమ్రాను ఆ భవనంలో జరిగిన విందుకు ఆహ్వానించాడు.[3] హుస్సేన్‌ సాగర్‌ తీరంలో ఎత్తైన కొండమీద ఉన్న భవనాన్ని చూసి ముచ్చటపడిన వికారుల్ ఉమ్రా, అప్పటివరకు నిర్మాణానికైన ఖర్చను రజాక్ అలీబేగ్ కు ఇచ్చి మిగిలిన భాగాన్ని పూర్తిచేసి తన మూడో భార్య నూర్జహాన్‌కు బహుకరించాడు. నూర్జహాన్‌ అసలు పేరు గులాబీ. ఈవిడ వికాజీ అనే ఒక ఉన్నత ఫార్శీ కుటుంబానికి చెందిన మహిళ. హైద్రాబాద్ నగరంలో డాక్టరుగా పనిచేస్తున్న గులాబీని ముంబైలో జరిగిన ఒక విందులో వికారుల్ ఉమ్రా చూసి ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. గులాబీ ఇస్లాం మతం స్వీకరించి నూర్జహాన్‌గా పేరు మార్చుకోవడంతోపాటూ, తన వైద్యవృత్తిని వదిలి పర్దాను పాటించి ఇంటికే పరిమితమయ్యింది.

రెండు సంవత్సరాల తరువాత 1902లో వికారుల్ ఉమ్రా చనిపోవడంతో నూర్జహాన్‌ ఈ భవనాన్ని వదిలి పారిపోయి బ్రిటీషు రెసిడెన్సీలో తలదాచుకుంది. 5వ నిజాంకు కూతురు, 6వ నిజాంకు చెల్లెలైన వికారుల్ ఉమ్రా రెండవ భార్య ఈ భవనాన్ని స్వాధీనం చేసుకోగా, పది సంవత్సరాలు చట్ట పోరాటం చేసి కోర్టు ద్వారా విజయం సాధించి నూర్జహాన్ వికార్ మంజిల్‌ను సొంతం చేసుకుంది.

ఇతర వివరాలు[మార్చు]

  1. వికారుల్ ఉమ్రా రెండవ భార్య వికార్ మంజిల్ ను స్వాధీనం చేసుకొని అందులోని విలువైన వస్తువులను తరలించడమేకాకుండా, నూర్జహాన్‌ ఇష్టంగా పెంచుకున్న పూలతోటను కూడా ధ్వంసం చేసింది.
  2. అలాంటి స్థితిలో ఉన్న వికార్ మంజిల్ ను వదిలేసి ఒక చిన్న అద్దె ఇంట్లోకి మారిన నూర్జహాన్‌ కాలక్షేపం కోసం అనేక చిత్రాలు వేసేది. దాదాపు 30 సంవత్సరాలు అక్కడే జీవించిన ఆమె 1931లో ప్లేగు వ్యాధిసోకడంతో మరణించింది.
  3. పాడుబడి పోయి గబ్బిలాలకు నిలయంగా మారిన వికార్ మంజిల్ లో రాత్రుళ్లు ఫార్సీ దయ్యం తిరుగుతుందని బేగంపేట ప్రకాశ్‌నగర్ ప్రజలు నమ్ముతున్నారు.

మూలాలు[మార్చు]

  1. "The Hindu : Palace with a view". www.hindu.com. Retrieved 3 May 2019.
  2. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (5 June 2016). "భగ్నహృదయాల మేడ - వికార్ మంజిల్". పరవస్తు లోకేశ్వర్. Archived from the original on 3 May 2019. Retrieved 3 May 2019. CS1 maint: discouraged parameter (link)
  3. "Viqar Manzil: Going back into a rich past". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 3 May 2019.