Jump to content

నెక్లెస్ రోడ్డు

వికీపీడియా నుండి
(నెక్లెస్ రోడ్ నుండి దారిమార్పు చెందింది)

నెక్లెస్ రోడ్డు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ను ఆనుకొని ఉన్న రోడ్డు. ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్కు మధ్యలో ఆ రోడ్డు ఉంది.[1] సంజీవయ్య పార్కు నుండి ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్కు మీదుగా ట్యాంక్‌బండ్ రోడ్డును, ఈ నెక్లెస్ రోడ్డు కలుపుతోంది. 2021, మే 30న తెలంగాణ ప్రభుత్వం ఈ రోడ్డును పీవీ నరసింహారావు మార్గ్ గా మార్చింది.[2]

నెక్లెస్ రోడ్డు

ఏర్పాటు

[మార్చు]

హుస్సేన్ సాగర్ ను పరిరక్షించడానికి, అందంగా తీర్చిదిద్దడానికి ఏర్పాటు చేసిన బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీలో భాగంగా 1996లో హుస్సేన్ సాగర్ సరస్సుకు పశ్చిమం వైపు 3.6 కిలోమీటర్ల పొడవుతో నెక్లెస్ రోడ్డును నిర్మించారు.

పేరు వివరణ

[మార్చు]

ట్యాంక్ బండ్ చుట్టూ దానికి మణిహారంలా ఉండే రోడ్డును నెక్లెస్ రోడ్డు అంటారు. ఆకాశం నుండి చూసినప్పుడు, ఈ రోడ్డు ఒక నెక్లెస్ ఆకారంలో కనిపిస్తుంది. అందుకే దీనికి నెక్లెస్ రోడ్డు అని పేరు పెట్టారు.[3]

రెస్టారెంట్లు

[మార్చు]

ప్రదర్శనలు, సంగీత ప్రదర్శనలు, క్రీడలు, ఇతర ఆటలకోసం ఈ ప్రాంతంలో పీపుల్స్ ప్లాజా ఉంది. ఇక్కడ ఈట్ స్ట్రీట్, వాటర్ ఫ్రంట్ రెండు పేరొందిన రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో బఫేలు, వివిధ రకాల వంటకాలు ఉంటాయి. ఈ రెస్టారెంట్ల నుండి హుస్సెన్ సాగర్ దృశ్యాలు కనిపిస్తాయి.[4]

ఇతర వివరాలు

[మార్చు]

ఇక్కడ జోగి బేర్ పార్కు, సంజీవయ్య పార్కు, జలవిహార్ ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయాన్నే జాగింగ్ చేయడానికి, మారథాన్ వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి, సాయంత్రం హ్యాంగ్ఔట్‌ల వంటివి తరచూ జరుగుతుంటాయి. నెక్లెస్ రోడ్ ఎంఎంటిఎస్ స్టేషను కూడా ఉంది. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు తొందరగా వెళ్ళడానికి ఈ రోడ్డు దగ్గరి మార్గం.

రవాణా

[మార్చు]

ఇక్కడ నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషను ఉంది.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "NECKLACE ROAD AND ITS VICINITY TO BE WIFI ENABLED". Archived from the original on 2015-07-25. Retrieved 2021-01-15.
  2. ఎన్ టివి, తెలంగాణ (30 May 2021). "పీవీఎన్ఆర్ మార్గ్ గా మారిన నెక్లెస్ రోడ్…". Archived from the original on 31 May 2021. Retrieved 31 May 2021.
  3. "Necklace Road". Times of India Travel. Retrieved 2021-01-15.
  4. Feb 9, TNN / Updated:; 2015; Ist, 02:08. "Hyderabad welcomes Happy Streets with open arms | Hyderabad News - Times of India". The Times of India. Retrieved 2021-01-15. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)

ఇతర లంకెలు

[మార్చు]