Jump to content

జలవిహార్

అక్షాంశ రేఖాంశాలు: 17°22′08″N 78°28′51″E / 17.368989°N 78.48087°E / 17.368989; 78.48087
వికీపీడియా నుండి
జలవిహార్
Locationహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
Coordinates17°22′08″N 78°28′51″E / 17.368989°N 78.48087°E / 17.368989; 78.48087
Ownerఆర్. జె. రావు
General Managerఎన్. వి. రామరాజు
Opened20 May 2007
Operating seasonమొత్తం సంవత్సరం
Area12.5 ఎకరాలు (5.1 హె.)
Websitewww.jalavihar.in
జలవిహార్, హైదరాబాదు

జలవిహార్ అనగా వాటర్ పార్క్, ఇది హైదరాబాదులో ఉంది. దీని విస్తీర్ణం 12.5 ఎకరాలు (5.1 హెక్టార్లు). ఈ జలవిహార్ ను సంజీవయ్య పార్క్ పక్కన, హుస్సేన్ సాగర్ సరస్సు వెంబడి 20 మే 2007న ప్రారంభించారు.

నేపథ్యం

[మార్చు]

ప్రవాస భారతీయుడు ఆర్.జె.రావు, వ్యక్తుల సమూహం స్థానిక పర్యాటక శాఖతో ఒక పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిన 220 మిలియను (US$2.8 million) నిధులు సమకూర్చారు. ఈ శాఖ నెక్లెస్ రోడ్ లో హుస్సేన్ సాగర్ సరస్సును ఆనుకొనివున్న 12.5 ఎకరాల (5.1 హెక్టార్లు) భూమిని ఈ ప్రాజెక్ట్ కొరకు మంజూరు చేసింది. ఈ భూమిని 33 సంవత్సరాలకు ఒప్పందానికి వార్షిక వ్యయం 3.4 మిలియను (US$43,000), 5% మొత్తం స్థూల ఆదాయాలతో ఏర్పాటు చేయబడింది. ఈ యేర్పాట్లు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సమీక్షించవలసి యుంటుంది[1]

ఈ భూమిని 2000 సంవత్సరంలో నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నున్న సమయంలో యిచ్చినప్పటికీ ఈ భూములలో ఆక్రమణలు, యాజమాన్య సమస్యల కారణంగా పనులు నిలిపివేయబడ్డాయి.[2] ఆ తర్వాత స్థానిక ప్రభుత్వం ప్రాజెక్టులు కేటాయించుటకు ప్రోబ్ పద్ధతిని ప్రారంభించింది[3] . ఈ ప్రాజెక్టును 2006 మధ్య కాలంలో ప్రారంభించడానికి భారతదేశ సుప్రీం కోర్టు అనుమతి తెలిపింది. ఈ అనుమతి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతుల ఆధారంగా సుప్రీం కోర్టు అంగీకరించింది.[4]

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఫలితంగా హెచ్చు లాభదాయకత కారణంగా స్థానిక ప్రభుత్వం ఈ పాజెక్టు విధానాన్ని 2010లో కొనసాగించుటకు ప్రతిపాదించింది[5].

యిటీవల జూలై 2013లో సామాజిక మార్కెటింగ్, ఆన్‌లైన్ అభివృద్ధి కంపెనీలు జలవిహార్ లో ఉద్యోగాలను కంపెనీ వెబ్‌సైట్ లో ఉంచుతున్నారు. ఆన్‌లైన్ మార్కెటింగ్, సామాజిక మార్కెటింగ్ కొరకు వెబ్‌సైట్ లో పొందుపరచునున్నారు. యిరుపక్షాల మధ్య ఒప్పందం ఐదు సంవత్సరాలవరకు కొనసాగుతుంది.

సౌకర్యాలు

[మార్చు]

ఈ పూల్ మన దేశంలోనే అతిపెద్దది. దీని విస్తీర్ణం 18000 చ.అడుగులు. దీనిలో 1000 మంది ప్రజలకు సదుపాయాన్ని కల్పించే విధంగా నిర్మించబడింది[1]. మొత్తం పార్కులో నిర్మాణ వైశాల్యం 10% మాత్రమే ఉంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న చెత్తను నివారించడానికి జలవిహార్ చుట్టూ సరైన ఫెన్సింగ్ ఉంచడం జరిగింది. ఈ పార్కులో ముఖ్యంగా రెండు జోన్లు కలవు -- అవి వినోదం, పార్టీ. ఇందులో వేవ్ పూల్, డ్రై రైడ్స్, మిని ట్రైన్, ఫుడ్ కోర్టులు ఉన్నాయి. పార్టీ జోన్ ల 2000 మంది ప్రజలు ఉండే విధంగా లాన్ ను యెర్పాటు చేయడం జరిగినది[1].

చిత్రమాలిక

[మార్చు]

సూచికలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. 1.0 1.1 1.2 M. L., Melly Maitreyi (17 May 2007). "Jalavihar to have country's biggest wave pool". The Hindu. Archived from the original on 19 మే 2007. Retrieved 9 October 2010.
  2. "HUDA chief inspects Jalvihar site". The Hindu. 6 April 2006. Archived from the original on 22 ఆగస్టు 2010. Retrieved 9 October 2010.
  3. "Imax row: More to it than meets the eye". The Times of India. 6 June 2006. Retrieved 9 October 2010.
  4. "Court's nod for Jalavihar project". The Hindu. 20 July 2006. Archived from the original on 16 జూలై 2007. Retrieved 9 October 2010.
  5. "AP Tourism to rope in more private parties". The Hindu Business Line. 27 May 2010. Retrieved 9 October 2010.

యితర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జలవిహార్&oldid=3832010" నుండి వెలికితీశారు