ఖుస్రో మంజిల్
స్వరూపం
ఖుస్రో మంజిల్ | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | రాజభవనం |
ప్రదేశం | లకిడీ కా పూల్, హైదరాబాదు, తెలంగాణ |
పూర్తి చేయబడినది | 1920 |
ఖుస్రో మంజిల్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లకిడీ కా పూల్ లో ఉన్న భవనం. 1920లో ఏడవ నిజాం దళాల యొక్క చీఫ్ కమాండింగ్ ఆఫీసరైన ఖుస్రో జంగ్ బహదూర్ యొక్క నివాసంకోసం నిర్మించబడింది.[1]
నిర్మాణం
[మార్చు]ఏడవ నిజాం దగ్గర సైనిక దళాల చీప్ కమాండర్ గా ఖుస్రో జంగ్ బహదూర్ పనిచేసేవాడు. ఖుస్రో నివాసంకోసం 1920లో లక్డీకాపూల్ ప్రాంతంలో ఈ ఖుస్రో మంజిల్ ను నిర్మించారు. కోరింథియన్ పోర్టికో, భారీ యూరోపియన్ స్తంభాల మాదిరిగా నిర్మించబడింది.[2]
ఇతర వివరాలు
[మార్చు]హైదరాబాద్ మహానగర పాలక సంస్థ దీనిని వారసత్వ కట్టడంగా గుర్తించి, వారసత్వ జాబితాలోకి చేర్చింది. ఖుస్రో మంజిల్ యొక్క యాజమాన్యం అనేకసార్లు మారడంతోపాటు 2013 ఆగష్టులో ఇది కూల్చివేయబడింది.
మూలాలు
[మార్చు]- ↑ "Activists see red over Khusro Manzil demolition". 23 August 2013. Retrieved 21 January 2019.
- ↑ "Khusro Manzil". Retrieved 21 January 2019.