Jump to content

లక్డికాపూల్

అక్షాంశ రేఖాంశాలు: 17°24′10″N 78°28′1″E / 17.40278°N 78.46694°E / 17.40278; 78.46694
వికీపీడియా నుండి
(లకిడీ కా పూల్ నుండి దారిమార్పు చెందింది)
లక్డికాపూల్
సమీప ప్రాంతం
లక్డికాపూల్ రైల్వే స్టేషను
లక్డికాపూల్ రైల్వే స్టేషను
లక్డికాపూల్ is located in Telangana
లక్డికాపూల్
లక్డికాపూల్
తెలంగాణలో ప్రాంతం ఉనికి
లక్డికాపూల్ is located in India
లక్డికాపూల్
లక్డికాపూల్
లక్డికాపూల్ (India)
Coordinates: 17°24′10″N 78°28′1″E / 17.40278°N 78.46694°E / 17.40278; 78.46694
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోహైదరాబాదు
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 004
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంమలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

లక్డికాపూల్, తెలంగాణ రాష్ట్ర్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదులోని పురాతన శివారు ప్రాంతాలలో ఇది ఒకటి. దీనికి సమీపంలో లక్డికాపూల్ ఎంఎంటిఎస్, రవీంద్ర భారతి, హెచ్‌పి పెట్రోల్ పంప్, టెలిఫోన్ భవన్, కలెక్టర్ కార్యాలయం, సిఐడి కార్యాలయం, గ్లోబల్ హాస్పిటల్స్ ఉన్నాయి.

పద వివరణ

[మార్చు]

హిందీ, ఉర్దూ భాషలలో లక్డికా అంటే "చెక్కతో చేసినది" అని, పూల్ అంటే "వంతెన" అని అర్థం. చెక్కతో తయారుచేసిన వంతెన పేరు మీదుగా ఈ ప్రాంతానికి లక్డికాపూల్ అనే పేరు వచ్చింది.

రవాణా

[మార్చు]

లక్డికాపూల్ ప్రాంతం రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఇతర ప్రాంతాలతో కలుపబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రదేశం నుండి నగరంలోని పలు ప్రాంతాలకు బస్సులు నడుపబడున్నాయి. ఇక్కడ లక్డి కా పూల్ రైల్వే స్టేషను, లక్డికాపూల్ మెట్రో స్టేషను ఉన్నాయి.[1]

ప్రభుత్వ ఆసుపత్రులు

[మార్చు]
  1. నీలోఫర్ ఆసుపత్రి
  2. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నీలోఫర్
  3. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, శాంతి నగర్

ఇతర వివరాలు

[మార్చు]

ఈ ప్రాంతం చరిత్రను ఆవిష్కరించేలా హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లక్డికాపూల్ కూడలిలో చెక్క వంతెన నమూనాను ఏర్పాటు చేయబడింది.[2]

మూలాలు

[మార్చు]
  1. Telangana Today, Hyderabad (25 February 2020). "Focus now on Hyderabad Metro Phase II: MD". Archived from the original on 12 December 2020. Retrieved 12 December 2020.
  2. Telangana Today, Hyderabad (21 August 2019). "Beautified Lakdi-ka-pul to be opened on Thursday". Archived from the original on 12 December 2020. Retrieved 12 December 2020.