Jump to content

పంజాబ్ పునరావాస కార్యక్రమం

వికీపీడియా నుండి
పంజాబ్ విభజన

పంజాబ్ పునరావాస కార్యక్రమం అన్నది 1947లో భారత్ పాకిస్తాన్ మధ్య పంజాబ్ విభజన జరిగాక భారతదేశంలోని తూర్పు పంజాబ్కి వలస వచ్చిన హిందువులు, సిక్కులకు భారత ప్రభుత్వం నిర్వహించిన పునరావాస కార్యక్రమం.

పంజాబ్ విభజన

[మార్చు]

భారత దేశ స్వాతంత్య్రం పొందిన సందర్భంగా 1947లో భారత్, పాకిస్తాన్ ల మధ్య విభజన జరిగింది.ఇది హిందూ, ముస్లిం, సిక్కు మతాల ప్రజల మధ్య అలజడికి కారణమైనది.మత కల్లోల్లాలు రేగాయి.పాకిస్తాన్ లో భాగమైన పశ్చిమ పంజాబ్ నుంచి హిందువులు, సిక్కులు, భారతదేశం లోని తూర్పుపంజాబ్ నుండి ముస్లింలు పాకిస్తాన్ కు వలసలు వచ్చారు. ఇవి ప్రపంచంలో అతిపెద్ద వలసలు. దీనివల్ల కాందిశీకుల నివాసం, తిండి, బట్ట, ఇతర సౌకర్యాలు కల్పించడం నవ స్వతంత్ర భారత ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది.[1]

భూ సమస్య

[మార్చు]

పశ్చిమ పంజాబు నుంచి వచ్చిన కాందిశీకులలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. వీరిలో చేతి వృత్తుల వారు, వ్యాపారులు, కూలీలు ఉన్నారు.దేశ రాజధాని ఢిల్లీకి 20 మైళ్ళ దూరంలో ఉన్న ఫరీదాబాద్ వద్ద టౌన్ షిప్ ఏర్పాటు చేశారు.శరణార్ధులకు భోజన సౌకర్యాలు కల్పించారు.ఇక భూమి సమస్యకు వస్తే మొదట్లో ప్రతి కాందిశీక రైతుకు పది ఎకరాలు కేటాయించారు.సేద్యానికి తగిన చర్యలు తీసుకున్నారు.తరువాత శాశ్వత కేటాయిపుల కోసం అభ్యర్ధన పత్రాలను ఆహ్వానించారు. 1948 మార్చి 10 తేదీ నుంచి పత్రాలు స్వీకరించారు. ఒక్క నెలలోనే 50 లక్షల పైనే దరఖాస్తులు అందాయి. సభల్లో దరఖాస్తులు చదివి, నిజమైనవి ఆమోదించారు.భూమి విషయంలో మోసం చేయాలని ప్రయత్నించినవారికి కారాగార శిక్షలు వేశారు.ఈ పనుల కోసం 7,000 మంది ఉద్యోగుల పనిచేసారు. లండన్ లోం 'స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్' లో చదువుకున్న సర్దార్ తర్లోక్ సింగ్ను ఈ పనుల పర్యవేక్షణకు రిహాబిలిటేషన్ డైరెక్టర్ జనరల్ గా నియమించారు.1949 నవంబరు నాటికల్లా టర్లోక్సింగ్, సిబ్బంది కలసి 2,50,000 భూ కేటాయింపులు చేశారు. దాదాపు లక్ష కుటుంబాలు పునః సమీక్ష కోరాయి.దీనివల్ల 80,000 హెక్టార్ల భూమి మళ్లీ చేతులు మారింది.[1]

నష్ట భావన

[మార్చు]

ఇన్ని చేసినా నష్ట భావన పోలేదు. సిక్కులకు భూములు, సౌకర్యాలు వచ్చాయి గానీ, వారు ప్రేమించే ఆరాధనా స్థలాలు పాక్ లో ఉండి పోయాయి.వాటిల్లో ఒకటి, లాహోర్ లోని గురుద్వారా. అక్కడే వారికి ప్రీతిపాత్రమైన రంజిత్ సింగ్ సమాధి అయ్యాడు.అలాంటిదే సిక్కు మత స్థాపకుడైన నానక్ జన్మ స్థలం నాన్ కానా సాహిబ్.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 గుహా, రామచంద్ర (2010). గాంధీ అనంతర భారతదేశం. హైదరాబాద్: ఎమెస్కో బుక్స్. pp. 87–91.