ప్రపంచ ఏనుగుల దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ ఏనుగుల దినోత్సవం
Kissing Elephants.JPG
ఏనుగులు
తేదీ(లు)ఆగస్టు 12
ఫ్రీక్వెన్సీవార్షికం
ప్రదేశంప్రపంచవ్యాప్తంగా
స్థాపితం12 ఆగస్టు 2012 (2012-08-12)
వ్యవస్థాపకుడుప్యాట్రిసియా సిమ్స్‌, థాయ్‌లాండ్‌ రీఇంట్రడక్షన్‌ ఫౌండేషన్‌
వెబ్‌సైటు
worldelephantday.org

ప్రపంచ ఏనుగుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏనుగులను కాపాడి సంరక్షించాలన్న ఉద్దేశంతో 2012లో ఈ దినోత్సవం ఏర్పాటుచేయబడింది.[1][2][3]

చరిత్ర[మార్చు]

ఆకారం భారీగా ఉన్నా అందరితో ప్రేమగా కలిసిపోయే ఏనుగులకు కూడా భావోద్వేగాలుండటమేకాకుండా తెలివి, జ్ఞాపకశక్తి ఎక్కువపాళ్ళలో ఉంటాయి. దంతాల కోసం, ఇతర శరీర భాగాల కోసం ఏనుగులను చంపేయడంతో, వాటి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుంది.[4] ఏనుగులకోసం ఒక దినోత్సవం ఉంటే వాటి రక్షణపై అవగాహన పెరిగుతుందన్న ఉద్దేశ్యంతో కెనడాలోని కెనజ్వెస్ట్ పిక్చర్స్ చిత్రనిర్మాతలు ఏనుగుల సంరక్షణ ప్రచారకులు ప్యాట్రిసియా సిమ్స్‌, మైఖేల్ క్లార్క్ 2011లో దీనిని రూపొందించారు. థాయిలాండ్లోని ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ సెక్రటరీ జనరల్ శివపోర్న్ దర్దరానంద మద్దతుతో ప్యాట్రిసియా సిమ్స్, ఎలిఫెంట్ రీఇంట్రోడక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2012, ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం ప్రారంభించబడింది.[5] అప్పటినుండి ప్యాట్రిసియా సిమ్స్ ఈ దినోత్సవానికి నాయకత్వం వహిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలోని 65కి పైగా వన్యప్రాణుల సంస్థలు,[6] చాలామంది వ్యక్తులు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు.[7][8][9][10][11][12][13][14][15]

లక్ష్యం[మార్చు]

 1. ఆఫ్రికా, ఆసియాలోని ఏనుగుల గురించి అవగాహన కల్పించడం, అడవి ఏనుగుల యొక్క సంరక్షణ పరిష్కారాలను పంచుకోవడం

ఇతర వివరాలు[మార్చు]

 1. బందీలుగా ఉన్న ఆసియా ఏనుగులను అడవికి తిరిగి ప్రవేశపెట్టడం[16][17] గురించి విలియం షాట్నర్ తీసిన రిటర్న్ టు ది ఫారెస్ట్ చిత్రం ప్రపంచ ఏనుగు దినోత్సవం సందర్భంగా విడుదలైంది.[18]
 2. ఆఫ్రికన్ ఏనుగులు "హాని కలిగించేవి"గా, ఆసియా ఏనుగులు "అంతరించిపోతున్నవి" గా ఐయుసిఎన్ రెడ్ లిస్ట్‌ జాబితా చేర్చబడ్డాయి[19][20]
 3. ఆఫ్రికన్, ఆసియా ఏనుగులు పన్నెండు సంవత్సరాలలో అంతరించిపోతున్నాయని ఒక పరిరక్షణాధికారి చెప్పాడు[21]
 4. ప్రస్తుతం ఆఫ్రికా ఏనుగుల సంఖ్య 4 లక్షలుండగా, ఆసియా ఏనుగులు నలభై వేలున్నాయి.[22]

మూలాలు[మార్చు]

 1. "Overview", World Elephant Day website
 2. Maria Sowter, "World Elephant Day This Sunday", Into The Wild, 2012
 3. "World Elephant Day 2012", The Huffington Post, 2012
 4. ఆంధ్రజ్యోతి, నవ్య-లిటిల్స్ (11 August 2017). "ఏనుగమ్మ.. ఏనుగు". www.andhrajyothy.com. Archived from the original on 12 ఆగస్టు 2019. Retrieved 12 August 2019. Check date values in: |archivedate= (help)
 5. "Elephant Reintroduction Foundation", World Elephant Day website
 6. "Associates" Archived 2018-12-19 at the Wayback Machine, World Elephant Day website
 7. Xinhua, "World Elephant Day brings attention to elephants' plight", The Global Times, 2013
 8. Philip Mansbridge, "Is This Year's World Elephant Day the Last Chance for Elephants?", The Huffington Post, 2013
 9. Raj Phukan, "World Elephant Day celebrated at Nagaon", Assam Times, 2013
 10. Jennifer Viegas, "Elephants Get Unlikely Help -- But Is It Enough?", Discovery News, 2013
 11. "World Elephant Day - Thailand Must Shut Down Ivory Trade" Archived 2016-02-20 at the Wayback Machine, Chiangrai Times, 2013
 12. "12 years until elephants are all wiped out as one dies every 15 minutes", Metro, 2013
 13. Jason Bell, "World Elephant Day - time to take stock", Africa Geographic, 2013
 14. Bettina Wassener, "Mourning the Elephants", The New York Times, 2012
 15. Fidelis E. Satriastanti, "Sumatran Elephants Still Face Imminent Threats" Archived 2014-08-10 at the Wayback Machine, Jakarta Globe, 2013
 16. "Elephants Return to the Forest" Archived 2018-09-09 at the Wayback Machine, American Museum of Natural History
 17. "Elephant Reintroduction Foundation", Elephant Reintroduction Foundation website
 18. "Return to the Forest", World Elephant Day website
 19. "Loxodonta Africana (African elephant)", IUCN
 20. "Elephas maximus (Asian elephant, Indian elephant)", IUCN
 21. John Ingham, "Elephants 'extinct within 12 years'", Express, 2013
 22. ఆంధ్రభూమి, ఆదివారం (10 August 2019). "ఆపదలో గజరాజు..!". www.andhrabhoomi.net. Archived from the original on 12 ఆగస్టు 2019. Retrieved 12 August 2019. Check date values in: |archivedate= (help)

ఇతర లంకెలు[మార్చు]