కార్గిల్ విజయ దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్గిల్ విజయ దినోత్సవం
కార్గిల్ విజయ దినోత్సవం
కార్గిల్ యుద్ధ జ్ఞాపకం
జరుపుకొనేవారుభారతదేశం
జరుపుకొనే రోజు26 జూలై
ఆవృత్తివార్షికం
అనుకూలనం26 జూలై 2020

కార్గిల్ విజయ దినోత్సవం ప్రతి ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా జరుపబడుతుంది. 1999, జూలై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధాని పాల్గొని అమర జవానులకు నివాళులు అర్పిస్తాడు.[1]

చరిత్ర[మార్చు]

కార్గిల్ యుద్ధ జ్ఞాపకార్థంపై ఆపరేషన్ విజయ్ సమాచారం

1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్తాన్ దేశాలమధ్య ఒప్పందం కుదిరింది. కానీ, కాశ్మీర్ ను ఆక్రమించుకోవాలన్ని కుట్రతో పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ బదర్ అనే పేరిట ఉగ్రవాదులను భారత సరిహద్దుల్లోకి పంపించింది. అప్పటి భారత ప్రభుత్వం యుద్ధం చేయకుండ ఉండేందుకు ప్రయత్నించింది. అయినా, పాకిస్తాన్ తన నిర్ణయం మార్చుకోకపోవడంతో యుద్ధానికి వెళ్ళక తప్పలేదు.

1999, మే 3న కార్గిల్ జిల్లాలో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమయింది. దీనిని భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అనే కోడ్ నేమ్ ను పెట్టుకుంది. అంతటి చలిలో, మంచు పర్వతాల్లో దాదాపు 60 రోజులపాటూ జరిగిన యుద్ధంలో ఇరుదేశాల సైనికులు చాలామంది చనిపోయారు. 527 మంది భారత సైనికులు అమరులయ్యారు.[2] చివరికి జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి, భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించింది. అందువల్ల ప్రతిఏటా జూలై 26 కార్గిల్ విజయ దినోత్సవం జరుపబడుతుంది.

కార్యక్రమాలు[మార్చు]

  1. కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు, కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజలంతా వాటిలో పాల్గొని సైనికులకు వందనాలు అర్పిస్తారు.[3][4]

మూలాలు[మార్చు]

  1. "Kargil Vijay Diwas : Nation pays homage to brave martyrs". Patrika Group (25 July 2014). మూలం నుండి 28 July 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 26 July 2019. Cite uses deprecated parameter |deadurl= (help)
  2. Vijay Diwas Archived 2009-09-30 at the Wayback Machine. The Hindu, July 27, 2009.
  3. City to observe Kargil Vijay Diwas today Archived 2009-08-01 at the Wayback Machine. Allahabad, The Times of India, TNN July 25, 2009.
  4. Ahuja, B.N.; Saxena, Paresh (1 January 2006). Pitambar's Handbook of General Knowledge. Pitambar Publishing. p. 33. ISBN 978-81 -209-0516-0. Retrieved 26 July 2019.