Jump to content

జి. రోహిణి

వికీపీడియా నుండి
జి. రోహిణి
డిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
In office
21 ఏప్రిల్ 2014 – 13 ఏప్రిల్ 2017
Nominated byభరత సుప్రీం కోర్టు కొలీజియం
Appointed byప్రణబ్ ముఖర్జీ
అంతకు ముందు వారుఎన్.వి.రమణ
తరువాత వారుగీతా మిట్టల్ (ఏక్టింగ్)
వ్యక్తిగత వివరాలు
జననం (1955-04-14) 1955 ఏప్రిల్ 14 (వయసు 69)
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్

జి. రోహిణి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆమె 2014 ఏప్రిల్ 21 న, ఆమె ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తిగా నియమితురాలయింది. [1] ఆమె గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా కూడా పనిచేసింది. 13.04.2017 న ఆమె ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసింది. ఆమె స్థానంలో జస్టిస్ గీతా మిట్టల్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా నియమితులయింది.

జీవితం తొలి దశలో

[మార్చు]

జి. రోహిణి 1955 ఏప్రిల్ 14 న భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది. ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీని, విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో న్యాయవాద విద్యనభ్యసించింది. [2] ఆమె 2001 లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయింది. ఆమె గతంలో న్యాయవాదిగా పనిచేసినపుడు ఆడపిల్లల రక్షణ, పని చేసే మహిళల వంటి సమస్యలపై ఎక్కువగా కృషిచేసింది. [3] ఆంధ్రప్రదేశ్ లా జర్నల్స్ రిపోర్టర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఆమె లీగల్ జర్నలిజంలో పాల్గొంది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం ఓబిసి యొక్క ఉప వర్గీకరణను పరిశీలించడానికి 2017 అక్టోబర్‌లో రోహిణిని భారత రాష్ట్రపతి నియమించారు. అందరికీ, ప్రత్యేకంగా ఇతర వెనుకబడిన తరగతుల సభ్యులకు ఎక్కువ సామాజిక న్యాయం, చేరికను సాధించడానికి ఈ నిర్ణయం తీసుకోబడింది. [4]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Delhi gets its first woman Chief Justice". The Hindu. 22 April 2014. Retrieved 23 April 2014.
  2. "The Hon'ble Ms. Justice G. Rohini". National Informatics Centre. Andhra Pradesh High Court. Retrieved 11 March 2014.
  3. "Delhi HC set to get first woman Chief Justice". The Indian Express. 24 February 2014. Retrieved 11 March 2014.
  4. "Justice Rohini to head sub-categorisation panel". Press Information Bureau GOI.