ఖాదర్‌వలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా.ఖాదర్ వలి
Dr.Khader, Food and nutrient expert,Mysore.jpg
ఖాదర్ వలి
విద్యఎం.యస్సీ
పి.హెచ్.డి (స్టెరాయిడ్స్)
క్రియాశీల సంవత్సరాలు1997 నుండి ప్రస్తుతం
సుపరిచితుడుస్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార,ఆరోగ్య నిపుణులు
జీవిత భాగస్వామిఉష
తల్లిదండ్రులుహుస్సేనప్ప
హుసేనమ్మ

ఖాదర్ వలి స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార - ఆరోగ్య నిపుణుడు, హోమియో వైద్యుడు. అతను "మిల్లెట్ మ్యాన్"గా సుపరిచితుడు[1]. అతను సిరిధాన్యాల ఆవశ్యకత గురించి ప్రపంచానికి తెలియజేసిన శాస్త్రవేత్త. ఆరోగ్యం విషయంలో సిరిధాన్యాల ఆవశ్యకత గురించి అనేక పరిశోధనలు చేసిన వ్యక్తి. అతను సిరిధాన్యాల పురరుద్ధరణకు 20 యేళ్ళుగా శ్రమిస్తున్నాడు. అతను కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదలు ఈ ఐదు సిరిధాన్యాలను వెలికితీసి వాటి ప్రాధాన్యతను తిరిగి మళ్ళీ ప్రపంచానికి తెలియజేసాడు[2].

జీవిత విశేషాలు[మార్చు]

అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా, ప్రొద్దుటూరులో హుస్సేనమ్మ, హుస్సేనప్ప దంపతులకు జన్మించాడు. అతను బియస్సీ (ఎడ్యుకేషన్), ఎం.ఎస్సీ (ఎడ్యుకేషన్) లను మైసూరులోని రీజనల్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో చదివాడు. అతను స్టెరాయిడ్స్ అంశంగా పి.హెచ్.డిని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరులో చేసాడు. ఆ సమయంలో సహవిద్యార్థి ఉషను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అతను బెవెర్టన్ ఓరెగన్ లో పర్యావరణ శాస్త్రంపై పోస్టు డాక్టరల్ ఫెలోగానూ, సి.ఎఫ్.టి.ఆర్.ఐలో శాస్త్రవేత్తగాను మూడు సంవత్సరాలు పనిచేసాడు. తరువాత అతను భారతదేశంలో ఒక సంవత్సరం పాటు, నాలుగున్నర సంవత్సరాల పాటు యు.ఎస్ లోని డ్యూపాండ్ అనే కంఫెనీలో పనిచేసాడు[3]. అతను ఆహారపదార్థాలపై ప్రభావం చూపుతున్న ఏజంట్, ఆరెంజ్, డయాక్సిన్లు వంటి విషతుల్య రసాయనాలను నిర్వీర్యం చేయడంపై పరిశోధనలు చేయడం జరిగింది. ఆహారం వాణిజ్యమవుతున్న నేపథ్యంలో తాను పరాయి దేశంలో ఉద్యోగం చేయటం కన్నా స్వదేశంలో ఆరోగ్యవంతమైన సమాజంకోసం కృషిచేయడం జీవితానికి అర్థవంతంగా ఉంటుందని 1997లో భారతదేశానికి తిరిగివచ్చి మైసూరులో స్థిరపడ్డాడు[4]. అంతరించిపోతున్న ఐదు రకాల సిరిధాన్యాల పునరుద్ధరణకు కృషిచేయడం జరిగింది. సిరి ధాన్యాలను వాడే క్రమంలో ఒక్కొక్క సిరిధాన్యంలో ఉన్న ఔషథ గుణాల వల్ల భయంకరమైన జబ్బులు కూడా తగ్గుతాయని కనుగొన్నాడు. అందుకే ఈ ఐదురకాల ధాన్యాలకు "సిరిధాన్యాలు" అని పేరు పెట్టాడు[5]. ఈ ధాన్యాలను పండించే రైతులకు సిరులు తెచ్చి పెడతాయని, ఈ ధాన్యాలను తిన్న ప్రజలకు ఆరోగ్యం వస్తుంది. కనుక వీటికి సిరిధాన్యాలు అని పేరు పెట్టాడు. తన వద్దకు వచ్చే రోగులకు సిరిధాన్యాలు, కషాయాలతొ పాటు అవసరమైతే హోమియో మందులు వాడమని సూచనలిస్తూంటాడు. వరిబియ్యం, గోధుమలు, పాలు, మాంసాహారం, సమయపాలన లేని ఆహారం, జన్యుమార్పిడి పంటలు, రసాయన ఎరువులు, పురుగుల మందులు పర్యావరణాన్ని, ఆహారాన్నివిషతుల్యంగా మార్చివేసి ప్రాణాంతక వ్యాధులు అత్యంత వేగంగా రావడానికి కారణం అవుతున్నాయని అతను భావిస్తున్నాడు. ప్రస్తుతం రైతులు వాడుతున్న కృత్రిమ ఎరువుల వల్ల భూమి మొత్తం కాలుష్యం అయిపోతుందని ఇలాగే కృత్రిమ ఎరువులను వాడితే వచ్చే 30 సంవత్సరాలలో భూమిపై పంటలు పండించడానికి వీలు కాకుండా పోతుందని తెలియజేస్తుంటారు. భారతదేశంలోపట్టిపీడిస్తున్న రోగాలు మధుమేహం, ఊబకాయం, పి.సి.ఓ.డి, రక్తహీనత, క్యాన్సర్, చిన్నపిల్లలో రజస్వల త్వరగా రావడం వంటి అనేక రోగాలకు వారు తీసుకొనే ఆహారమే కారణమని తెలియజేస్తున్నాడు. అందుకే తానే స్వయంగా భారతదేశనికి వచ్చి అంతరించిన చిరుధాన్యాలను ఎనిమిది ఎకరాల బీడు భూములను కొని వ్యవసాయం చేసి చిరుధాన్యాలను పండించడం మొదలుపెట్టాడు. వాటినే విత్తనాలుగ రైతులకు ఇవ్వడం జరిగింది. వాటినిఏ విధంగా పండించాలో రైతులకు తెలియజేసాడు. మనం తినే గోధుమలు, వరి, జొన్నలు వంటి ఇతర ధాన్యాల కంటే ఈ సిరి ధాన్యాలు అనేక రోగాలను నిర్మూలించడానికి తోడ్పడతాయని కనుగొన్నాడు. భారతదేశంలో అంతరించిపోతున్న సిరిధాన్యాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి భారతదేశంలోని అనేక ప్రాంతాలను నిర్విరామంగా పర్యటిస్తూ సిరిధాన్యాల గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాడు[6]. 20 సంవత్సరాలుగా ఈ సిరిధాన్యాల గురించి ప్రజలకు తెలియజేయడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు.

పుస్తకాలు[మార్చు]

 • ఆరోగ్య"సిరి"[7]
 • సిరిధాన్యాలు[8][9]
 • సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం[10][11]

మూలాలు[మార్చు]

 1. "Desi foods mitigate modern diseases, says Millet Man - Navya Media English". DailyHunt (in ఇంగ్లీష్). Retrieved 2019-01-14.
 2. statetv. "సిరిధాన్యాలు బుక్ - Dr Khader vali PDF Book Free Download Telugu". STATETV. Retrieved 2020-03-06.
 3. p, shilpa (2016-08-14). "Sunday story: Positive grains of truth for a negative age". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2019-01-14.
 4. "Podcast: Millets— India's age-old super-food". https://www.theweek.in. March 26, 2019. {{cite web}}: External link in |website= (help)CS1 maint: url-status (link)
 5. "Wonder millets for women's health". www.thehansindia.com. Retrieved 2019-01-14.
 6. "Clipping of Sakshi Telugu Daily - Hyderabad Main". epaper.sakshi.com. Retrieved 2019-01-14.
 7. "Arogya Siri - online Telugu Books". www.logili.com (in ఇంగ్లీష్). Retrieved 2019-01-14.
 8. "Siri Dhanyalu - online Telugu Books". www.logili.com (in ఇంగ్లీష్). Retrieved 2019-01-14.
 9. "సిరిధాన్యాలు - ఖాదర్ వలి గారి క్రొత్త పుస్తకం రైతు నేస్తం ఫౌండేషన్.pdf". Google Docs. Retrieved 2019-01-14.
 10. "Siri Dhanyalatho Sampurna Aarogyam – సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం Telugu Book By Dr. Khader Vali – JSN BOOKS – THE LARGEST ONLINE TELUGU BOOK STORE IN ANDHRA PRADESH, INDIA" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-03-05. Retrieved 2019-01-14.
 11. "Millet Book Telugu.pdf". Google Docs. Retrieved 2019-01-14.

వీడియోలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]