స్టెరాయిడ్
స్టెరాయిడ్ (స్టెరాయిడ్ కొలెస్టరాల్ నుంచి ఈ పేరు వచ్చింది.[1]) అనేది జీవశాస్త్రపరంగా చురుగ్గా ఉండే ఒక సేంద్రియ సమ్మేళనం. ఇది నాలుగు వలయాలుగా ఒక ప్రత్యేకమైన అణు ఆకృతి కలిగి ఉంటుంది. స్టెరాయిడ్లు రెండు ప్రధానమైన జీవక్రియలు నిర్వహిస్తాయి. కణత్వచంలో ప్రధానమైన భాగాలుగా ఉండి వాడి అస్థిరస్థితిని మారుస్తాయి. రెండవది సిగ్నలింగ్ అణువులుగా పనిచేస్తాయి. మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలలో వందలకొద్దీ స్టెరాయిడ్లను కనుగొనవచ్చు. అన్ని స్టెరాయిడ్లు కణాల లోపల స్టెరోల్స్, లానోస్టెరోల్, సైక్లోఆర్టినోల్ నుంచి ఉత్పత్తి అవుతాయి.
స్టెరాయిడ్ల కేంద్ర నిర్మాణం సాధారణంగా పదిహేడు కర్బన పరమాణువులు, ఒకదానితో ఒకటి అతుక్కున్న నాలుగు వలయాలతో బంధింపబడి ఉంటాయి. ఇందులో ఆరు సైక్లే హెక్సేన్ వలయాలు, ఒక సైక్లోపెంటేన్ వలయం.
జీవ ప్రాముఖ్యత
[మార్చు]స్టెరాయిడ్లు, వాటి మెటబాలైట్స్ సిగ్నలింగ్ అణువులుగా (ముఖ్యంగా స్టెరాయిడ్ హార్మోనులు) పనిచేస్తాయి. స్టెరాయిడ్లు, పాస్పోలిపిడ్స్ కలిపి కణత్వచంలో భాగాలు.[2] కొలెస్టరాల్ వంటి స్టెరాయిడ్స్ మెంబ్రేన్ ప్రవాహ స్థితిని తగ్గిస్తాయి.[3]
లిపిడ్స్ (కొవ్వు పదార్థాలు) లాగానే స్టెరాయిడ్లు కూడా అధిక సాంద్రత కలిగిన శక్తి నిల్వలు. అయినప్పటికీ, అవి సాధారణంగా శక్తి వనరులు కావు; క్షీరదాలలో, అవి సాధారణంగా జీవక్రియలో పాల్గొని విసర్జించబడతాయి.
ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో సహా అనేక రుగ్మతలలో స్టెరాయిడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కణితి లోపల, బయట స్టెరాయిడ్ ఉత్పత్తి క్యాన్సర్ కణాల దూకుడును ప్రోత్సహిస్తుంది.[4]
మందులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Harper, Douglas. "sterol | Etymology, origin and meaning of sterol by etymonline". Online Etymology Dictionary. Retrieved 2023-03-19.
- ↑ Silverthorn DU, Johnson BR, Ober WC, Ober CE, Silverthorn AC (2016). Human physiology : an integrated approach (Seventh ed.). [San Francisco]. ISBN 9780321981226. OCLC 890107246.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link) - ↑ Sadava D, Hillis DM, Heller HC, Berenbaum MR (2011). Life: The Science of Biology (9 ed.). San Francisco: Freeman. pp. 105–114. ISBN 978-1-4292-4646-0.
- ↑ Lubik AA, Nouri M, Truong S, Ghaffari M, Adomat HH, Corey E, Cox ME, Li N, Guns ES, Yenki P, Pham S, Buttyan R (2016). "Paracrine Sonic Hedgehog Signaling Contributes Significantly to Acquired Steroidogenesis in the Prostate Tumor Microenvironment". Int. J. Cancer. 140 (2): 358–369. doi:10.1002/ijc.30450. PMID 27672740. S2CID 2354209.