బింబిసారుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బింబిసారుడు
Bimbisara welcomes the Buddha
Founder of Haryanka dynasty
పరిపాలనసుమారు 544 –  492 BC (52 years) or c. 400 BC
పూర్వాధికారిBhattiya
ఉత్తరాధికారిAjatashatru
జననం558 BC
మరణం491 BC
SpouseKosala Devī
Chellanā
Kṣemā / Khemā
Nandā[1]
Padmāvatī / Padumavatī
Ambapālī
వంశముAjatashatru
రాజవంశంHaryanka
తండ్రిBhattiya
మతంHinduism, Jainism and Buddhism

బింబిసారుడు (మ.క్రీ.పూ. 558 - సి. క్రీ.పూ.491 బిసి [2][3] లేదా క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దం చివరిలో [4]) జైన చరిత్రలలో సెనియా లేదా శ్రేనికా అని కూడా పిలుస్తారు[5][6] మగధ రాజు (r క్రీ.పూ.543 - క్రీ.పూ.492(r. 543 – 492 BC[7] లేదా c. క్రీ.పూ.400,[8]) హర్యంక రాజవంశానికి చెందినవారు.[9] ఆయన భట్టియా కుమారుడు. .[10] ఆయన రాజ్యం విస్తరణ (ముఖ్యంగా తూర్పున అంగ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం) తరువాత మౌర్య సామ్రాజ్యం విస్తరణకు పునాదులు వేసినట్లు భావిస్తారు.[11]

ఆయన సాంస్కృతిక విజయాలకు కూడా ప్రసిద్ది చెందాడు. బుద్ధుని గొప్ప స్నేహితుడు, రక్షకుడు. హింబిను త్సాంగు అభిప్రాయం ఆధారంగా బింబిసారుడు బౌద్ధ రచనలలో ప్రసిద్ధి చెందిన రాజ్గిరు (రాజగ్రిహా) నగరాన్ని నిర్మించాడు (ఇతరులు ఆయన వారసుడికి నగరం పునాది వేసారని ఆపాదించారు).[7] ఆయన తరువాత ఆయన కుమారుడు అజాతశత్రువు సింహాసనం అధిష్టించాడు.[11]

జీవితం

[మార్చు]
King Bimbisara visits the Bamboo Garden (Venuvana) in Rajagriha; artwork from Sanchi

బింబిసారుడు భట్టియా అనే అధిపతి కుమారుడు. క్రీస్తుపూర్వం 543 లో ఆయన 15 సంవత్సరాల వయస్సులో సింహాసనాన్ని అధిష్టించాడు.[12] ఆయన హర్యంక రాజవంశం ఒక గ్రామాన్ని బలపరచడం ద్వారా మగధకు పునాదులు వేసింది. తరువాత ఇది పాటాలిపుత్ర నగరంగా మారింది. [13] బింబిసారుడు మొదటి రాజధాని గిరివ్రజా (రాజగ్రీహగా గుర్తించబడింది) వద్ద ఉంది. ఆయన తన తండ్రి రాజు బ్రహ్మదత్త చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవటానికి బహుశా అంగకు వ్యతిరేకంగా సైనిక పోరాటానికి నాయకత్వం వహించాడు. పోరాటం విజయవంతమైంది. అంగారాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువరాజు కునికా (అజతాశత్రు) ను చంపాకు రాజప్రతినిధిగా నియమించారు.[14] బింబిసారుడి తన వైద్యుడైన జీవకాను పసికర్ల వ్యాధి నయం చేయడానికి అవంతి రాజు ప్రద్యోతుడి ఉన్న ఉజ్జయినికి పంపాడు.[15] గాంధార రాజు పుక్కుసతి, బింబిసారుడిని ఒక రాయబార కార్యాలయాన్ని పంపాడు.[12]

వివాహ సంబంధాలు

[మార్చు]

బింబిసార తన స్థానాన్ని బలోపేతం చేయడానికి వివాహ సంబంధాలను ఉపయోగించారు. ఆయన మొదటి భార్య కోసల దేవి, కోసల రాజు మహా కోసల కుమార్తె, ప్రసేనజితు సోదరి.[16] ఆయన వధువు ఆయనకు కాశీని (అప్పటికి అది ఒక గ్రామంగా మాత్రమే ఉంది) కట్నం తీసుకుని వచ్చింది.[17] ఈ వివాహం మగధ, కోసల రాజ్యాల మద్య ఉన్న శత్రుత్వాన్ని చెరిపివేసి ఇతర రాజ్యాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి స్వేచ్ఛను ఇచ్చింది. తరువాత ఆయన లిచ్చావి రాజకుమారి " చెల్లన " ను వివాహం చేసుకున్నాడు. ఆమె రాజు కేతక కుమార్తె.[18] ఆయన మూడవ భార్య " క్షేమ " మద్రా (పంజాబు) వంశానికి చెందిన మహిళ.[19] మహావగ్గ ఆయనకు 500 మంది భార్యలు ఉన్నారని వర్ణించాడు.[12]

మరణం

[మార్చు]
Bimbisara's jail, where King Bimbisara was imprisoned, in Rajgir

మగధ రాజ్యం సింహాసనాన్ని అధిరోహించడానికి ఆయన కుమారుడు అజాతశత్రు ఆయనను ఖైదు చేసాడు. అజతశత్రు తన మొదటి బిడ్డ పుట్టిన తరువాత తండ్రిని విడుదల చేయాలని ఆదేశించాడు. కాని అప్పటికి చాలా ఆలస్యం అయింది. బింబిసారా అప్పటికే మరణించాడు. ఇది క్రీ.పూ 491 లో జరిగినట్లు నివేదించబడింది.[ఆధారం చూపాలి]

సంప్రదాయ కథనాలు

[మార్చు]

జైనము

[మార్చు]

బింబిసారుడు శ్రేనికాగా గుర్తించబడ్డాడు.[20][6] యంబధరు (ఒక జైన ముని) ప్రశాంతతకు ఆకర్షితుడై జైనమత భక్తుడిగా మారిన బింబిసారుడిని జైన సాహిత్యం రాజగృహ శ్రేనికాగా పేర్కొన్నది.[21] ఆయన తరచుగా జైనమత దైవం అయిన మహావీరుడి సామవసరణాను సందర్శించే వాడు. అతను రామాయణం నిజమైన మూలకథను గురించి,[22] ప్రఖ్యాతి చెందిన రాజర్షి (రాజు ప్రసన) గురించి అడిగాడు. [23] ఆయన తన మునుపటి జీవితంలో ఒక బలభద్ర అని చెబుతారు.[24]

జైన గ్రంథం ఆధారంగా బింబిసారుడు తన కొడుకు జైలు కైదు చేసిన తరువాత తనను తాను ఉద్రేకంతో చంపుకున్నాడు. పర్యవసానంగా ఆయన ప్రస్తుతం నివసిస్తున్న నరకంలో పునర్జన్మ పొందాడు. ఆయన పుట్టుకకు దారితీసిన కర్మలు ముగిసే వరకు ఆయన అక్కడ ఉంటాడు. [25][26] భవిష్యత్తు తీర్థంకరుల గొలుసులో మొదటివాడు తరువాతి యుగం పైకి కదలిక (ఉత్సర్పిని) ప్రారంభంలో పెరగనున్న మహాపద్మ (కొన్నిసార్లు పద్మనాభ అని పిలుస్తారు) గా పునర్జన్మిస్తానని ఆయన వ్రాసుకున్నాడు. [27]

బౌద్ధము

[మార్చు]

బౌద్ధ గ్రంథాల ఆధారంగా బింబిసారుడు రాజు బుద్ధుని జ్ఞానోదయానికి ముందు మొదటిసారి బుద్ధుడిని కలిశాడు. తరువాత కొన్ని ముఖ్యమైన బౌద్ధ సూత్రాలలో ప్రముఖంగా కనిపించే ఒక ముఖ్యమైన శిష్యుడు అయ్యాడు. ఆయన బౌద్ధమత బోధనలలో జ్ఞానోదయం పొందిన సోతాపన్న స్థితిని సాధించినట్లు నమోదు చేయబడింది. బింబిసారుడు స్త్రీలను బుద్ధుడిని ఆరాధించడానికి తన మందిరానికి రావడానికి సాయంకాల వేళలో అనుమతించాడు. స్త్రీలు ఎప్పుడైనా బుద్ధుడిని పూజించటానికి ఉపయోగించే జుట్టు, గోరు స్థూపాన్ని చూడాలని కోరుకున్నారు. వారి అభ్యర్థనను పాటించిన బింబిసారుడు బుద్ధుడితో మాట్లాడాడు.[28]

ఇతరులు

[మార్చు]

పురాణాల ఆధారంగా బింబిసారుడు మగధను పాలించాడు. ఆయన పాలనా కాలం 28 – 38 సంవత్సరాలు ఉంటుంది. శ్రీలంక చారిత్రక రచనలు ఆయన 52 సంవత్సరాలు పాలించాడని పేర్కొన్నాయి.[29]

మూలాలు

[మార్చు]
 1. Chandra, Jnan (1958). "SOME UNKNOWN FACTS ABOUT BIMBISĀRA". Proceedings of the Indian History Congress Proceedings of the Indian History Congress. 21. Indian History Congress: 215–217.
 2. Hugh George Rawlinson (1950), A Concise History of the Indian People. Oxford University Press, p. 46.
 3. F. Max Muller (2001): The Dhammapada And Sutta-nipata. Routledge (UK), p. xlvii. ISBN 0-7007-1548-7.
 4. Keay, John: India: A History. Revised and Updated: "The date [of Buddha's meeting with Bimbisara] (given the Buddhist 'short chronology') must have been around 400 BC."
 5. von Glasenapp 1999, p. 40-41.
 6. 6.0 6.1 Jain & Upadhye 2000, p. 59.
 7. 7.0 7.1 V. K. Agnihotri (ed.), Indian History. Allied Publishers, New Delhi 262010, p. 166 f.
 8. Keay, India: A History
 9. Peter N. Stearns (2001), The Encyclopedia of World History. Houghton Mifflin, p. 76 ff. ISBN 0-395-65237-5.
 10. Raychaudhuri 1923, p. 97.
 11. 11.0 11.1 "Bimbisara". Encyclopædia Britannica Online. Retrieved 25 జనవరి 2013.
 12. 12.0 12.1 12.2 Sen 1999, p. 112.
 13. Sastri 1988, p. 11.
 14. Upinder Singh 2016, p. 269.
 15. Kailash Chand Jain 1972, p. 99.
 16. Upinder Singh 2016, p. 271.
 17. Eck, Diana. (1998) Banaras, Columbia University Press. p. 45.ISBN 0-231-11447-8.
 18. Luniya, Bhanwarlal Nathuram. (1967) Evolution of Indian Culture, Lakshmi Narain Agarwal. p. 114.
 19. Krishna, Narendra. (1944) History of India, A. Mukherjee & bros. p. 90.
 20. Dundas 2002, p. 36.
 21. Queen Chelna and King Shrenik, archived from the original on 13 ఏప్రిల్ 2019, retrieved 14 నవంబరు 2019
 22. Dalal, Roshen (2010), Hinduism: An Alphabetical Guide, India: Penguin Books, p. 338, ISBN 9780143414216
 23. Leshyas
 24. Choksi, Mansi; Chhapia, Hemali (10 ఫిబ్రవరి 2011), "Now, meet Ravan the saint", The Times of India
 25. Jaini 1998, p. 228.
 26. Dundas 2002, p. 41.
 27. Dundas 2002, p. 40-41.
 28. John S. Strong (2007), Relics of the Buddha, p. 72, ISBN 978-0691117645
 29. Kailash Chand Jain 1991, p. 88.

వనరులు

[మార్చు]
Regnal titles
అంతకు ముందువారు
Bhattiya
King of Magadha
543–491 BC
తరువాత వారు
Ajatashatru