Jump to content

కొయ్యాన శ్రీవాణి

వికీపీడియా నుండి
కొయ్యాన శ్రీవాణీ
కొయ్యాన శ్రీవాణి
జననం
కొయ్యాన శ్రీవాణి

(1973-02-05) 1973 ఫిబ్రవరి 5 (వయసు 51)
విద్యఎం.ఎ బి.ఎల్ (ఎల్ఎల్ఎం) హ్యూమన్ రైట్స్
వృత్తిన్యాయవాది
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మెంబర్ - ఏపీ మహిళా కమీషన్
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులుకొయ్యాన ఆనందరావు, కొయ్యాన జయలక్ష్మి

కొయ్యాన శ్రీవాణి ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమీషన్ సభ్యురాలు.[1] శ్రీవాణి తన సేవా కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతకు పాటుపడుతున్నారు. ఎందరో మహిళలకు ఉపాధి అవకాశాలను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. సేవారంగం తో పాటూ రాజకీయరంగంలోనూ రాణిస్తున్నారు.

జీవిత విశేషాలు

[మార్చు]

కొయ్యాన శ్రీవాణి విజయనగరం జిల్లా బలిజపేట మండలం అంపవల్లి గ్రామంలో కొయ్యాన ఆనందరావు, కొయ్యాన జయలక్ష్మి దంపతులకు 1973 ఫిబ్రవరి 5న జన్మించారు. ఎం.ఎ బి.ఎల్ (ఎల్ఎల్ఎం) హ్యూమన్ రైట్స్ విద్యనభ్యసించారు. న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో విశేష ప్రావీణ్యం గలవారు. ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా సేవలందిస్తున్నారు.[2]  

కుటుంబ నేపధ్యం

[మార్చు]

శ్రీవాణి తాత గారు (తండ్రి గారి తండ్రి) ఇండియన్ ఆర్మీలో పనిచేసారు. బ్రిటిష్ ఇండియా హయాంలో రెండో ప్రపంచ యుద్ధంలో ఆయన పాల్గొన్నారు. పదవీ విరమణ తర్వాత అంపవల్లి గ్రామంలోనే వ్యవసాయ వృత్తిని ఎంచుకున్నారు. మరో తాత (తల్లి గారి తండ్రి) గారు స్వాతంత్ర్య సమరయోధునిగా పేరు గడించారు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా అరెస్టు అయ్యి జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యనంతరం ఆయన చివరి శ్వాస వరకూ స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ ను అందుకున్నారు. శ్రీవాణి తండ్రి కొయ్యాన ఆనందరావు బీఎస్సీ అగ్రికల్చర్ విద్యనభ్యసించి వారి కుటుంబంలోనే మొట్టమొదటి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న వ్యక్తిగా ఆదర్శంగా నిలిచారు. వ్యవసాయ శాఖలో జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు.

సమాజ సేవా కార్యక్రమాలు

[మార్చు]

కొయ్యాన ఆనందరావు, కొయ్యాన జయలక్ష్మి సేవా స్ఫూర్తిని శ్రీవాణి ఆదర్శంగా తీసుకున్నారు. ఆనందరావు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారిగా రైతులకు సేవలందించారు. తల్లి జయలక్ష్మి నర్సరీలు ఏర్పాటు, మహిళలకు శిక్షణా కార్యక్రమాల నిర్వహణలో చురుగ్గా వుండేవారు. తల్లితండ్రులు నిర్వహించే కార్యక్రమాల్లో శ్రీవాణి చిన్నతనం నుంచీ చురుగ్గా నిమగ్నంయ్యేవారు. తన తల్లి జయలక్ష్మి మనం నలుగురుకి ఉపాధి బాట కలిగించినపుడు సంతృప్తి లభ్హిస్తుందని చెప్పేవారని, ఆమె తో వున్న అనిర్వచనీయమైన అనుభంధం సేవారంగంలో ముందుకు నడిచేందుకు బాటలు వేసిందని శ్రీవాణి చెబుతారు.

దస్త్రం:National Service Scheme Program.jpg
భేటీ బచావో - భేటీ పదావో కార్యక్రమంలో కొయ్యాన శ్రీవాణి

వివాహం తరువాత ఎదురైనా ఒడిదుడుకులతో తీవ్ర మానసిక సంఘర్షణ అనుభవించిన శ్రీవాణి తనలాంటి ఎందరో మహిళలకు ఆసరాగా నిలవాలని భావించారు. వారిని ఆ బాధ నుంచి బయటకు తెచ్చి వారి కాళ్లపై వారు నిలబడేలా చేసేందుకు 2007 సంవత్సరంలో కేఈడబ్ల్యూఎస్ సంస్థను ప్రారంభించారు. తన సంస్థలో స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందజేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన విశాఖలో రెడీమేడ్ గార్మెంట్ కంపెనీల్లో వారికి ఉపాధి కల్పిస్తున్నారు. 2007 - 2011 సంవత్సరాల మధ్య గ్రామీణ ప్రాంతాల్లో 18 నుంచి 30 ఏళ్ల లోపు వయసు గల 5600 మంది మహిళలకు (తక్కువ చదువుకున్న వారు, చదువు మధ్యలో ఆపిన వారు) శిక్షణ అందజేశారు. వారికి వివిధ వస్త్ర పరిశ్రమల్లో ఉపాధిని అందజేశారు. 10వ తరగతి మాత్రమే చదువుకున్న 1200 మంది యువకులకు వివిధ షాపింగ్ మాల్స్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మహిళలకు ఆర్ధిక సాధికారత చేకూరడం ద్వారా తమ పిల్లలను చదివించుకోవడమే కాకుండా కుటుంబానికి భరోసా అందుతుంది.

అవార్డులు

[మార్చు]

శ్రీవాణి సమాజ సేవా కార్యక్రమాలను గుర్తించిన గ్లోబల్ అచీవర్స్ ఫౌండేషన్ (న్యూడిల్లీ) జాతీయస్థాయి సమాజ సేవ ఎక్స్ లెన్స్ అవార్డుతో 2012 ఆగస్టు 27న ఆమెను సత్కరించింది. 2013 ఫిబ్రవరి 15న మదర్ థెరిస్సా సద్భావన అవార్డు ఆమెను వరించింది.

రాజకీయ నేపధ్యం

[మార్చు]

శ్రీవాణి తండ్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు వీరాభిమాని కావడంతో 1983లో టీడీపీ స్థాపన నుంచి పార్టీలో కొనసాగారు. అప్పటి నుంచి వారి కుటుంబం తెలుగుదేశం కుటుంబంతో అనుబంధం ఏర్పరచుకుంది.శ్రీవాణి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగు దేశం పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.[3] పార్వతీపురం నియోజకవర్గంలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపుకు ఆమె విశేష కృషి చేసారు.

ఏపీ మహిళా కమిషన్ మెంబర్ గా

[మార్చు]
ఏపీ మహిళా కమీషన్ చైర్ పెర్సన్ నన్నపునేని రాజకుమారి తో మహిళా కమీషన్ మెంబర్ కొయ్యాన శ్రీవాణి

శ్రీవాణి సమాజ సేవా కార్యక్రమాలు, పార్టీకి ఆమె అందిస్తున్న సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తించారు. 2016 జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మెంబర్ గా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి పార్వతీపురంలో నియోజకవర్గంలో మహిళల సమస్యలపై మరింత చురుగ్గా ఆమె స్పందిస్తున్నారు.[4] వేధింపులకు, అన్యాయానికి గురైన  స్త్రీలకు అండగా నిలుస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత స్త్రీలకు ప్రభుత్వ పధకాలు అందే విధంగా పనిచేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో మహిళా సమస్యలపై గళమెత్తుతున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Srivani appointed member of Women Commission". The Hans India (in ఇంగ్లీష్). 2016-07-11. Retrieved 2019-01-22.
  2. "BIO - DATA OF KOYYANA SRIVANI" (PDF).[permanent dead link]
  3. "koyyana srivani Archives". Pride of Telugu (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-10-02. Retrieved 2019-01-22.
  4. "Women's panel member visits jail". The Hindu (in Indian English). Special Correspondent. 2017-10-14. ISSN 0971-751X. Retrieved 2019-01-22.{{cite news}}: CS1 maint: others (link)

బయటి లంకెలు

[మార్చు]