ఖజానా బిల్డింగ్ మ్యూజియం
Appearance
Established | 1580 (నిర్మాణం), 2013 (మ్యూజియంగా) |
---|---|
Location | గోల్కొండ కోట, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
Director | పురావస్తు శాఖ |
ఖజానా బిల్డింగ్ మ్యూజియం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మ్యూజియం. ఫతే దర్వాజ నుంచి బాలా హిసార్‌కు పోయే దారిలో ఉన్న ఈ ఖజానా బిల్డింగ్ కుతుబ్ షాహీల కాలంలో నిర్మించబడింది.[1][2] దీనిని సైనికాధికారుల కార్యాలయాలుగా, ఆయుధాగారంగా ఉపయోగించేవారు.
నిర్మాణం
[మార్చు]కుతుబ్ షాహి రాజులు తమ ధనాన్ని దాచడానికి ఖాజానాకోసం 1580లో దీనిని నిర్మించారు. గోల్కొండ కోటకు సమీపంలో ఉన్న ఈ భవనం 2013లో పునరుద్ధరించి మ్యూజియంగా మార్చబడింది.
మ్యూజియంలో
[మార్చు]కాకతీయులు, చాళుక్యులు, బహమనీ, కుతుబ్‌షాహీల శాసనాలు, కుతుబ్ షాహాలు ఉపయోగించిన ఫిరంగులు, పురావస్తు శాఖకు లభించిన నాణేలు, 3 వేలకు పైగా ఆయుధాలు, రాతి శిల్పాలు, బహ్మణి రాజ్యం నుండి వచ్చిన కళాఖండాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి.[3] 2018లో మ్యూజియం మూసివేయబడింది.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ Shanker, CR Gowri. "Khazana building in Hyderabad turns into museum". Deccan Chronicle. Retrieved 5 January 2019.
- ↑ "'Khazana building' proposed for Telangana museum". The Hindu (in Indian English). 31 August 2009. ISSN 0971-751X. Retrieved 5 January 2019.
- ↑ నమస్తే తెలంగాణ, చరిత్రకు చిహ్నం మ్యూజియం (18 May 2018). "ఖజానా బిల్డింగ్". Archived from the original on 5 January 2019. Retrieved 5 January 2019.
- ↑ Nizamuddin, Md (6 March 2018). "Renovated museum remains closed". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 5 January 2019.
- ↑ Sharjeel (31 January 2018). "Treasure locked and lost in Khazana Building Museum". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 5 January 2019.