ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్
Temporal range: 3.3–2.1 Ma
Scientific classification Edit this classification
Domain: Eukaryota
Kingdom: జంతువు
Phylum: కార్డేటా
Class: క్షీరదాలు
Order: Primates
Suborder: Haplorhini
Infraorder: Simiiformes
Family: Hominidae
Subfamily: Homininae
Tribe: Hominini
Genus: Australopithecus
Species:
A. africanus
Binomial name
Australopithecus africanus
Dart, 1925 [1]

ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్, ఆస్ట్రలోపిథెసీన్ జెనస్ కు చెందిన అంతరించిపోయిన జాతి. పాత ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్‌ లాగానే ఎ. ఆఫ్రికానస్ కూడా సున్నితమైన శారీరిక నిర్మాణం కలిగి ఉండేది. దీన్ని ఆధునిక మానవులకు ప్రత్యక్ష పూర్వీకుడిగా భావించారు. A. ఆఫ్రికానస్‌లో ఆధునిక మానవుల పోలికలు బాగా ఎక్కువ గాను, ఎ. అఫారెన్సిస్ పోలికలు బాగా తక్కువ గానూ ఉంటాయి. దీని పుర్రె మానవుని పుర్రె లాగా ఉండి, పెద్దదైన మెదడు ఉండేందుకు అనుకూలంగా ఉండేది.[2] ఎ. ఆఫ్రికానస్ ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని నాలుగు ప్రదేశాల్లో మాత్రమే కనుగొన్నారు. అవి: టౌంగ్ (1924), స్టెర్క్‌ఫోంటైన్ (1935), మకాపాన్స్‌గాట్ (1948), గ్లాడిస్వేల్ (1992).[1]

2019 జనవరిలో, ఆస్ట్రలోపిథెకస్ సెడీబాకు, దాని కంటే ప్రాచీనమైన ఆఫ్రికానస్, దాని తరువాతిదైన హోమో హ్యాబిలిస్ లతో శరీర నిర్మాణ పరంగా పోలికలున్నాయని చెబుతూనే, ఆ రెండింటి కంటే దీనిలో కొంత వైవిధ్యం ఉందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.[3]

ప్రసిద్ధ శిలాజాలు

[మార్చు]

టాంగ్ చైల్డ్

[మార్చు]
టాంగ్ చైల్డ్ పోత.

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లోని విట్వాటర్‌రాండ్ విశ్వవిద్యాలయంలో అనాటమీ విభాగానికి అధిపతి అయిన రేమండ్ డార్ట్ 1924 లో దక్షిణాఫ్రికాలోని కింబర్లీకి సమీపంలో ఉన్న టాంగ్ వద్ద సున్నపురాయి క్వారీలో దొరికిన శిలాజాలపై ఆసక్తి కనబరిచాడు.[4][5] వీటిలో కోతి లాంటి జీవి యొక్క పుర్రెలో మానవ లక్షణాలతో ఉన్న కంటి గుంటలు, దంతాలు, ముఖ్యంగా వెన్నెముక కాలమ్‌కు (ఫోరామెన్ మాగ్నమ్) పైన పుర్రె బేస్ వద్ద ఉన్న రంధ్రం వంటివి అతనికి చాలా ఆసక్తి కలిగించాయి. దాని అమరిక మానవుడిలాగా నిటారుగా ఉన్న భంగిమను సూచించాయి. ఈ హోమినిడ్- టు- హోమినిన్ ప్రైమేట్, ద్విపాద నడకను సాధించిందని కూడా అవి సూచించాయి. డార్ట్ దీనికి ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ ("ఆఫ్రికాకు చెందిన దక్షిణ కోతి") అనే పేరు పెట్టాడు;[1] " టాంగ్ చైల్డ్ " అని కూడా దీన్ని పిలుస్తారు.

హోమినిన్‌కు అధికారికంగా "కోతి" ( -పిథెకస్ ) అనే పదాన్ని పేరులో చేర్చడం ఇదే మొదటిసారి. మనిషి, కోతి నుండి వచ్చినట్లు అధికారికంగా ప్రకటించినట్లైంది. టాంగ్ పిల్లవాడి పుర్రె, కోతులూ మానవుల మధ్య ఉన్న మధ్యంతర జాతిని సూచించాలని డార్ట్ సిద్ధాంతీకరించాడు. కానీ అతని వాదనను శాస్త్రీయ సమాజం తిరస్కరించింది. సాధారణంగా మానవునిగా పరిణమించే జీవులకు, ద్విపాద నడక కంటే ముందే పెద్ద కపాలం ("పెద్ద మెదడు") ఏర్పడాలి అనే ఆలోచనకు అనుగుణంగా ఈ తిరస్కరణ జరిగింది. ( క్రింద చూడండి, శ్రీమతి. Ples: కపాల సామర్థ్యం).[1] పిల్ట్‌డౌన్ మ్యాన్ మానవ పరిణామానికి ఆద్యుడన్న నమ్మకం ప్రబలంగా ఉన్న ఆ కాలంలో, ముఖ్యంగా బ్రిటిష్ వైజ్ఞానిక వర్గాలు, ఈ తిరస్కరణను సమర్ధించాయి. (తరువాతి కాలంలో పిల్ట్‌డౌన్ మనిషి అనేది ఫోర్జరీ అని తేలింది.)

సర్ ఆర్థర్ కీత్ 1924 ప్రాంతాల్లో శరీర నిర్మాణ శాస్త్రవేత్త, మానవ శాస్త్రవేత్త. అతడి వ్యక్తిగత ఆభిజాత్యం మేరకు హోమినిన్లు ఉద్భవించిన ప్రదేశం ఐరోపా యే అని, ఆసియా, ఆఫ్రికాలు కాదని అభిప్రాయపడ్డాడు. అతను డార్ట్ వాదనను తోసిపుచ్చుతూ, టాంగ్ పిల్లవాడి పుర్రె ఒక యువ కోతికి, మరీ ముఖ్యంగా శిశు గొరిల్లా లేదా చింపాంజీది అయి ఉంటుందనీ సూచించాడు.[6] పిల్ట్‌డౌన్ మనిషి ఆమోదయోగ్యతను సమర్థిస్తూ, ఆస్ట్రలోపిథెకస్ అయి ఉండే సంభావ్యతను ఖండించడంలో కీత్ చూపిన పట్టుదల ఈ రెండు సమస్యలను ఒక తరం పాటు విడదీయరాని విధంగా బంధించడంలో కీలక పాత్ర పోషించింది.

కీత్, పిల్ట్‌డౌన్ మనిషిని సమర్ధించడంలో తలమునకలై పోయాడు. 1953 లో పిల్ట్‌డౌన్ మనిషి వ్యవహారం బూటకమని వెల్లడవడంతో అతడి ప్రతిష్ఠ మంటగలిసింది. 1992 లో కరెంట్ ఆంత్రోపాలజీలో ప్రచురించిన సుదీర్ఘ వ్యాసంలో ఫిలిప్ టోబియాస్, బూటకంపై చేసిన పరిశోధననూ వివరించాడు. అతను కీత్ యొక్క మొండి పట్టుదల, ఆస్ట్రేలియాపిథెకస్‌పై నిరంతర వ్యతిరేకత చూపడంలోని ఉద్దేశం ఏమిటో చెబుతూ తన వాదనను సమర్పించాడు: ఆస్ట్రలోపిథెకస్ హోమినిన్ పూర్వీకుడైతే, అప్పుడు పిల్ట్‌డౌన్ మనిషి ఉనికే ఉండకపోవచ్చు, దాని అస్తిత్వం సందేహాస్పదమౌతుంది. దాన్ని అధికారికంగా దర్యాప్తు చెయ్యాలని కోరుతారు. ఆ వ్యాసంలో టోబియాస్, కీత్ చేసిన ప్రకటనలలోను అతడి చర్యలలోనూ ఉన్న అసంగతాలను సమకాలీన శాస్త్ర సమాజంతో చర్చించాడు.[7]

టాంగ్ పిల్లవాడి ఆవిష్కరణ పట్ల కీత్ వెలిబుచ్చిన నిరంతర శత్రుత్వం తీవ్రమైన పరిణామాలకు దారితీసింది; 1924 లో డార్ట్ చేసిన ప్రకటన నాటి నుండి, పిల్ట్‌డౌన్ మనిషి వ్యవహారం బూటకమని తేలేదాకా దాదాపు 30 సంవత్సరాలు పట్టింది. అప్పటికి గానీ ఆస్ట్రలోపిథెకస్కు అనుకూలంగా (హోమినిన్ స్థితి పట్ల) వచ్చిన వాదనల ప్రామాణికతకు సమర్ధన చేకూరలేదు.

శ్రీమతి. ప్లెస్

[మార్చు]
పుర్రె " శ్రీమతి. ప్లెస్ ", ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ ; ట్రాన్స్వాల్ మ్యూజియం ప్రిటోరియా.

టాంగ్ చైల్డ్ అనే పుర్రెయే మానవ పూర్వీకుడు అని చెప్పిన డార్ట్ సిద్ధాంతాన్ని ప్రిటోరియాలోని ట్రాన్స్‌వాల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి చెందిన పాలియోంటాలజిస్ట్ రాబర్ట్ బ్రూమ్ సమర్ధించాడు. 1936 లో, స్టెర్క్‌ఫోంటైన్ గుహల్లో మొదటి వయోజన ఆస్ట్రాలోపిథెసిన్‌ను కనుగొన్నారు. డార్ట్ వాదనను ఇది గట్టిగా బలపరిచింది. తరువాత, మెదడు సామర్థ్యం 485 సి.సి. కలిగిన వయోజన పుర్రెను (జిడబ్ల్యు బార్లో కనుగొన్నాడు) ప్లెసియంత్రోపస్ ట్రాన్స్‌వాలెన్సిస్ ( ట్రాన్స్‌వాల్కు చెందిన దాదాపు-మనిషి) గా వర్గీకరించాడు. 1947 ఏప్రిల్ లో, స్టెర్క్‌ఫోంటైన్ వద్ద పేలుడు జరుపుతున్నపుడు, అతను, జాన్ టి. రాబిన్సన్‌తో కలిసి మధ్య వయస్కురాలైన స్త్రీ పుర్రెను కనుగొన్నాడు.[8] (కేటలాగ్ సంఖ్య STS 5 ), దీనిని కూడా అతను ప్లెసియంత్రోపస్ ట్రాన్స్‌వాలెన్సిస్గా వర్గీకరించాడు. (బ్రూమ్ బృందం లోని కుర్రాళ్ళు దానికి "శ్రీమతి ప్లెస్" అని పేరు పెట్టారు., అయితే ప్రస్తుతం ఆ పుర్రె ఒక యువకుడికి చెందినదని భావిస్తున్నారు). తరువాతి కాలంలో ఈ రెండు శిలాజాలనూ ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్‌గా వర్గీకరించారు.

శ్రీమతి. ప్లెస్ కపాల సామర్థ్యం 485 క్యూబిక్ సెంటీమీటర్లు (సిసి) మాత్రమే. మెదడు పరిమాణంలో పెరుగుదలకు చాలా ముందే ద్విపాద నడక అభివృద్ధి చెందిందని వెల్లడించిన మొదటి శిలాజాలలో ఇది ఒకటి.[9] ఆధునిక కోతులకు ఉన్నట్లుగా, టాంగ్ పిల్లవాడిలో ముఖం ముందుకు పొడుచుకొచ్చినట్టు లేదు. ఇది ఆధునిక హోమినిన్‌లలో ఉండే లక్షణం .

లిటిల్ ఫుట్

[మార్చు]

1997 లో, పాలియో ఆంత్రోపాలజిస్టు రోనాల్డ్ జె. క్లార్క్, లిటిల్ ఫుట్ (StW 573) అనే ఆస్ట్రలోపిథెకస్ అస్థిపంజరం అవశేషాలను వెలికి తీయడం మొదలుపెట్టాడు. అంతకు ముందు దీన్ని స్టెర్క్‌ఫోంటైన్ గుహ వ్యవస్థలో కనుగొన్నారు. నమూనా వెలికితీత, విశ్లేషణలు 2018 లో పూర్తి చేసారు.[10] లిటిల్ ఫుట్‌ను ప్రస్తుతానికి ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్‌గా వర్గీకరించారు; ఇది అఫారెన్సిస్ లేదా ఆఫ్రికానస్ జాతులకు చెందినది కాదని క్లార్క్ సూచిస్తున్నాడు. ఇది మకాపాన్స్‌గాట్, స్టెర్క్‌ఫోంటెయిన్ ల వద్ద కనుగొన్న ఒక ప్రత్యేకమైన ఆస్ట్రలోపిథెకస్ జాతికి (రేమండ్ డార్ట్, దీనికి ఆస్ట్రలోపిథెకస్ ప్రొమేథియస్ అని పేరు పెట్టాడు).[11][12] 2015 లో రేడియో ఐసోటోపిక్ టెక్నిక్ ద్వారా చేసిన విశ్లేషణ ప్రకారం లిటిల్ ఫుట్ సుమారు 37 లక్షల సంవత్సరాల కిందటిదని తేలింది [13]

అవయవ నిర్మాణం, వ్యాఖ్యానాలు

[మార్చు]

ఎ. ఆఫ్రికానస్‌కు చెందిన అనేక లక్షణాలు ఎ. అఫారెన్సిస్‌తో సరిపోలాయి. ఎ. అఫారెన్సిస్‌ కాళ్ళ కన్నా చేతులు పొడవుగా ఉండే ద్విపాద హోమినిన్ (చింపాంజీలలో కూడా కనిపించే లక్షణ మిది) లో మానవులకు ఉండే అధునాతన కపాల లక్షణాలు కొద్దిగా ఉన్నాయి. (శ్రీమతి ప్లెస్ కపాలంలోను, STS 71 లోనూ ఉంది). చెట్లు ఎక్కడానికి అనువుగా ఉండే వంగిన వేళ్ళతో సహా ఆదిమ లక్షణాలు కూడా దీనికి ఉన్నాయి.

ఎ. ఆఫ్రికానస్, తరువాతి కాలం లోని హోమినిన్లకు, తద్వారా మానవులకూ ప్రత్యక్ష పూర్వీకుడిగా కాకుండా, పరాంత్రోపస్‌గా పరిణామం చెందిందని కొంతమంది పరిశోధకులు భావించారు. మరీ ముఖ్యంగా పి. రోబస్టస్, ఎ. ఆఫ్రికానస్ నుండి వచ్చిందని భావించారు. పి. రోబస్టస్ ఒకింత దృఢంగా ఉన్నప్పటికీ, పి. రోబస్టస్, ఎ.ఆఫ్రికానస్ ల కపాలాలు రెండూ ఒకేలా ఉన్నాయి. ఎ. ఆఫ్రికానస్ కపాలం ఆధునిక చింపాంజీతో బాగా దగ్గరగా సరిపోలి ఉంది; ఈ రెండు మెదళ్ళూ 400 సిసి నుండి 500 సిసి దాకా ఉన్నాయి. ఇవి బహుశా కోతి లాంటి తెలివితేటలను కలిగి ఉండేవి. ఎ. ఆఫ్రికానస్ ఒక కటి వలయాన్ని గమనిస్తే ఇది . అఫారెన్సిస్ కంటే సమర్థవంతమైన ద్విపాద నడకను కలిగి ఉండేదని తెలుస్తుంది. ఎ . ఆఫ్రికానస్‌ చేతి ఎముకలపై 2015 లో చేసిన అధ్యయనంలో, పనిముట్ల వాడకం వలన ఎముకల్లో కలిగే మార్పులు ఈ జాతిలో ఉన్నట్లుగా గమనించారు. అలాంటి అవయవ నిర్మాణాలను బట్టి పనిముట్ల తయారీ, వాడకం ఇంతకుముందు అనుకున్న కాలం కంటే ముందే మొదలు పెట్టి ఉంటారని చెప్పవచ్చు.[14]

లైంగిక డైమోర్ఫిజం

[మార్చు]

ద్విపాద ప్రైమేట్ ఎ. ఆఫ్రికానస్‌ కటి వెన్నెముకలో మానవుడికి ఉండేలాంటి లైంగిక డైమోర్ఫిజం ఉన్నట్లుగా ఇటీవల పరిశోధనల్లో తేలింది. గర్భధారణ సమయంలో కటి మీద పడే భారాన్ని మరింత సమర్థవంతంగా భరించడానికి, స్త్రీకి అవసరమయ్యే ఈ పరిణామ స్వరూపం, ద్విపాదులు కాని ప్రైమేట్లకు అవసరం లేదు.[15]

2011 లో దంతాలపై చేసిన అధ్యయనంలో దక్షిణ ఆఫ్రికాలోని ఎ. ఆఫ్రికానస్, పి. రోబస్టస్ సమూహాల్లో ఆడజంతువులు అవి పుట్టిన ప్రాంతం నుండి దూరంగా స్థిరపడేవని తేలింది.[16][17]

జియోక్రొనాలజీ

[మార్చు]

లిటిల్ ఫుట్ పై ఇటీవల చేసిన విశ్లేషణలో ఇది సుమారు 37 లక్షల సంవత్సరాల నాటిదని తేలింది.[13] ఇది గతంలో తెలియని జాతికి చెందినదని, పరాంత్రోపస్ రోబస్టస్‌, ఆస్ట్రలోపిథెకస్ ప్రోమేథియస్ ల లక్షణాలతో సరిపోలే లక్షణాలు కలిగినదనీ రోనాల్డ్ క్లార్క్ చేసిన వాదనను ఇది బలోపేతం చేస్తుంది. కానీ, చాలామంది శాస్త్రవేత్తలు ఈ నమూనాను ఎ. ఆఫ్రికానస్‌లో కలిపేసారు.[18][19] తొలుత జరిపిన డేటింగు ప్రకారం ఇది 30 – 20 లక్షల సంవత్సరాల కిందటిదని చెప్పారు.[20][21]

మకాపాన్స్‌గాట్ శిలాజాలు 30 – 26 లక్షల సంవత్సరాల క్రితం నాటివి. స్టెర్క్‌ఫోంటెయిన్ వద్ద దొరికినవి 26 – 20 లక్షల క్రితం నాటివి. మిసెస్ ప్లెస్ శిలాజం 20 లక్షల సంవత్సరాల నాటిది. గ్లాడిస్వాలే శిలాజాలు సుమారు 24 – 20 లక్షల సంవత్సరాల క్రితం నాటివి. టాంగ్ పిల్లల వయస్సు గుర్తించడం చాలా కష్టమైంది. ప్రస్తుతం దీని డేటింగు ప్రాజెక్టుపై పని జరుగుతోంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మానవ పరిణామం

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Australopithecus africanus". archaeologyinfo.com. Archived from the original on 2006-06-13. Retrieved 2019-11-11.
  2. "Human Evolution by The Smithsonian Institution's Human Origins Program". si.edu. Archived from the original on 2005-11-02. Retrieved 2019-11-11.
  3. Dartmouth College (17 January 2019). "Understanding our early human ancestors: Australopithecus sediba". EurekAlert!. Retrieved 21 January 2019.
  4. "Raymond Dart and our African origins". uchicago.edu.
  5. "Biographies: Raymond Dart". talkorigins.org.
  6. Suid-Afrikaanse wetenskap, volumes 1–2, South African Association for the Advancement of Science, 1947, p. 35
  7. Tobias, Phillip V. (June 1992) An Appraisal of the Case Against Sir Arthur Keith. Current Anthropology .
  8. K. Kris Hirst. "John T. Robinson". About.com Education. Archived from the original on 2008-06-20. Retrieved 2019-11-11.
  9. Endocranial Capacity of Early Hominids, Charles A. Lockwood, William H. Kimbel. Science 1 January 1999:Vol. 283 no. 5398 p. 9
  10. Geggel, Laura (December 11, 2018). "'Miracle' Excavation of 'Little Foot' Skeleton Reveals Mysterious Human Relative". Live Science. Retrieved December 11, 2018.
  11. Clarke, R.J., (2008) "Latest information on Sterkfontein's Australopithecus skeleton and a new look at Australopithecus"; South African Journal of Science, Vol 104, Issue 11 & 12, Nov / Dec, 2008, 443–449. See also "Who was Little Foot?" The Witness, 20 March 2009.
  12. Bower, Bruce, (2013) "Notorious Bones"; Science News, August 10, 2013, Vol. 184, No. 3, p. 26.
  13. 13.0 13.1 Gardner., Elizabeth K.; Purdue University (April 1, 2015). "New instrument dates old skeleton before 'Lucy'; 'Little Foot' 3.67 million years old". Science Daily. Retrieved April 3, 2015.
  14. Skinner MM; Stephens, NB; Tsegai, ZJ; Foote, AC; Nguyen, NH; Gross, T; Pahr, DH; Hublin, JJ; Kivell, TL; et al. (2015). "Human-like hand use in Australopithecus africanus". Science. 347 (6220): 395–399. Bibcode:2015Sci...347..395S. doi:10.1126/science.1261735. PMID 25613885. S2CID 5485374.
  15. Why Pregnant Women Don't Tip Over. Amitabh Avasthi for National Geographic News, December 12, 2007. This article has good pictures explaining the differences between bipedal and non-bipedal pregnancy loads.
  16. Bowdler, Neil (2 June 2011). "Ancient cave women 'left childhood homes'". BBC News. Retrieved 2011-06-02.
  17. Copeland SR; Sponheimer, Matt; De Ruiter, Darryl J.; Lee-Thorp, Julia A.; Codron, Daryl; Le Roux, Petrus J.; Grimes, Vaughan; Richards, Michael P.; et al. (2011). "Strontium isotope evidence for landscape use by early hominins". Nature. 474 (7349): 76–78. doi:10.1038/nature10149. PMID 21637256. S2CID 205225222.
  18. Bruxelles L., Clarke R. J., Maire R., Ortega R., et Stratford D. – 2014. - Stratigraphic analysis of the Sterkfontein StW 573 Australopithecus skeleton and implications for its age. Journal of Human Evolution.
  19. "New stratigraphic research makes Little Foot the oldest complete Australopithecus". phys.org.
  20. =Herries, A.I.R., Shaw, J. 2011. Palaeomagnetic analysis of the Sterkfontein palaeocave deposits; age implications for the hominin fossils and stone tool industries. J. Human Evolution. 60, 523-539.
  21. =Herries, A.I.R.., Hopley, P., Adams, J., Curnoe, D., Maslin, M. 2010. Geochronology and palaeoenvironments of the South African early hominin bearing sites: a reply to ‘Wrangham et al., 2009: Shallow-Water Habitats as Sources of Fallback Foods for Hominins’ Am. J. Phys. Anthro. 143, 640–646.

బయటి లింకులు

[మార్చు]