Jump to content

ఒరంగుటన్-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడు

వికీపీడియా నుండి
గత 20 మిలియన్ సంవత్సరాలలో హోమినోయిడియా స్పీసియేషన్ నమూనా.

ఒరంగుటన్-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడు హోమినినే, పొంగినే అనే ఉప కుటుంబాల చివరి ఉమ్మడి పూర్వీక జాతి. అంటే గొరిల్లా, చింపాంజీ, మానవులు - ఈ మూడింటి ఉమ్మడి పూర్వీకుడికి, ఒరంగుటన్లకూ ఉన్న చివరి ఉమ్మడి పూర్వీకుడన్నమాట. ఈ జాతి మధ్య మయోసీన్‌లో 110-160 లక్షల సంవత్సరాల క్రితం నివసించినట్లుగా అంచనా వేసారు. [1] [2] [3]

హోమినోయిడియా (హోమినాయిడ్లు, వాలిడులు)
హైలోబాటిడే (గిబ్బన్లు)
హోమినిడే (హోమినిడ్లు, గొప్ప వాలిడులు)
పొంగినే
(ఒరంగుటన్లు)
హోమినినే
గొరిల్లిని
(గొరిల్లా)
హోమినిని
పానినా
(చింపాంజీలు)
హోమినినా (మానవులు)

స్వరూపం, జీవావరణం

[మార్చు]

ఒరంగుటన్, మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడు తోకలేనిది, వెడల్పాటి, చదినైన పక్కటెముకలు కలిగినదీను. దాని శరీర పరిమాణం పెద్దది. మెదడు పెద్దది. ఆడవారిలో, కోరపళ్ళు వారి వారసులలో లాగా కురచనవడం మొదలైంది. [4] : 201 

ఒరంగుటన్లకు యాంటీరియర్ లింగువల్ గ్లాండ్స్ (నాలుక కొనల వద్ద గ్రంథులు. వీటిని ఎపికల్ లింగువల్ గ్లాండ్స్ అని కూడా అంటారు) ఉన్నాయి. హోమినిన్స్ లో ఉన్నట్టు చంకల్లోను, గజ్జల్లోనూ వెంట్రుక లున్నాయి. వీటిని టెర్మినల్ వెంట్రుక లంటారు. [4] : 193 

క్షీరదం ఎంత పెద్దదైతే టెర్మినల్ వెంట్రుకలు అంత పల్చగా ఉంటాయి. [4] : 195 

ఎపికల్ లింగువల్ గ్రంథులు ఆంత్ర గ్రంథుల వ్యవస్థ లోని ప్రత్యేక గ్రంథులు. దిగువ భాగంలో నాలుక కొన దగ్గర ప్రోటీన్లను, శ్లేష్మాన్నీ స్రవించే ఒక జత గ్రంథులు ఉన్నాయి. ఇవి గొప్ప వాలిడులలో మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి చివరి ఉమ్మడి పూర్వీకులలో కూడా ఇవి ఉంటాయని అర్థం. [4] : 195 

తరువాతి గొప్ప వాలిడుల కంటే ఒరంగుటన్ల తోటే ఎక్కువ పోలి ఉండేది మానవ పుర్రె. మానవులకు కంటి గుంటల పైన రెండు కళ్ళకు విడివిడిగా రెండు చిన్న అంచులు ఉంటాయి. వీటిని సూపర్‌సిలియరీ తోరణాలు అంటారు. [4] : 229 

ఒరంగుటన్ పుర్రె మానవులతో సమానమైన సూపర్సిలియరీ తోరణాలను చూపిస్తుంది

మానవులు, ఒరంగుటన్లు కాకుండా మిగిలిన గొప్ప వాలిడులకు రెండు కళ్ళ గుంటలనూ కలుపుతూ ఒకే ఎత్తైన గట్టు ఉంటుంది. దీన్ని సుప్రా ఆర్బిటల్ టోరస్ అని పిలుస్తారు. [4] : 229 

గొరిల్లా పుర్రె, సుప్రార్బిటల్ టోరస్‌తో

స్టెమ్-ఒరంగుటన్లు - యూరోపియన్ వలసలకు రుజువు

[మార్చు]

కాండం సమూహం అనేది క్లాడిస్టిక్స్లో ఒక పదం, ఇది పాన్-సమూహాన్ని కిరీటం సమూహానికి మైనస్ చేస్తుంది (అందువల్ల పాన్-గ్రూపులోని అన్ని జీవన సభ్యులకు మైనస్). మరో మాటలో చెప్పాలంటే, ఇది కిరీటం సమూహాల యొక్క ఆదిమ బంధువుల సమూహం, కానీ కిరీటం సమూహం యొక్క చివరి సాధారణ పూర్వీకులను కలిగి ఉండదు. కాండం సమూహంలోని సభ్యులందరూ అంతరించిపోయారు.

డ్రైయోపిథెసీన్‌లు గొప్ప వాలిడులకు చెందిన అంతరించిపోయిన సోదర క్లేడ్. ఈ క్లేడ్‌లో అనేక ప్రజాతుల శిలాజాలను కనుగొన్నారు [4] : 226  వీటిని బట్టి, ఒరాంగుటన్-మానవ చివరి సాధారణ పూర్వీకుడు 80 లక్షల సంవత్సరాల క్రితం ఉనికిలో ఉండేదనే సిద్ధాంతానికి ఇవి మద్దతుగా నిలుస్తున్నాయి. డ్రైయోపిథెసీన్‌లను మొట్టమొదట ఫ్రాన్స్‌లో కనుగొన్నారు. దీనికి ఫ్రంటల్ సైనస్ (ముక్కుకు పైన రెండు కళ్ళ మధ్య పుర్రెలో ఉండే నాలుగు జతల రంధ్రాలు) పెద్దగా ఉంది. ఈ డ్రైయోపిథెసీన్‌లకు ఆఫ్రికా గొప్ప వాలిడులతో సంబంధం ఉందని దీన్ని బట్టి తెలుస్తోంది. ఆసియాలో మాత్రమే కనిపించే ఒరంగుటన్లకు వాటితో సంబంధం లేదు. డ్రైయోపిథెసీన్‌ల దంతాలపైని పింగాణీ మందంగా ఉంది. ఇది వాలిడుల కుండే మరో లక్షణం.

ఈ ఆవిష్కరణలను బట్టి మానవుల దగ్గరి బంధువులు ఆఫ్రికాలో ఉద్భవించాయి అనే సిద్ధాంతాన్ని కూడా సమర్థిస్తున్నాయి. హోమినినే మొదట ఆసియాకు చెందినవి, ఆఫ్రికాలో గొప్ప వాలిడులు అంతరించిపోయాక ఆఫ్రికాలో తిరిగి వ్యాపించాయి అనే ప్రత్యామ్నాయ సిద్ధాంతానికి ఇది విరుద్ధంగా ఉంది, [5]

ఐరోపాలో వాలిడులు 170 లక్షల సంవత్సరాల క్రితం నాటి శిలాజ రికార్డుల్లో కనిపిస్తాయి. తొలి మయోసీన్ కాలంలో, ఐరోపా, ఆఫ్రికాల మధ్య టెథిస్ సముద్రం మీదుగా భూవంతెనలు ఉండేవి. గొప్ప వాలిడుల పూర్వీకులు ఈ భూవంతెన మీదుగా ఆఫ్రికా నుండి ఐరోపా వెళ్లాయి. ఆధునిక గొప్ప వాలిడులు 125 లక్షల సంవత్సరాల క్రితం నాటి ఐరోపా, ఆసియాల శిలాజ రికార్డుల్లో కనిపిస్తాయి. [6] ఈ వలసలతో ఆసియాలో నివసిస్తున్న ఏకైక గొప్ప కోతిగా ఒరంగుటన్ మిగిలిపోయింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Jha, Alok (November 19, 2004). "Ape discovery fills gap in evolutionary jigsaw". The Guardian. Archived from the original on May 9, 2015. Retrieved May 8, 2015.
  2. "Ancient Ape Discovered: Last Ape-Human Ancestor?". National Geographic News. November 18, 2004. Retrieved May 8, 2015.
  3. Hansford, Dave (November 13, 2007). "New Ape May Be Human-Gorilla Ancestor". National Geographic News. Retrieved May 8, 2015.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 Kane, Jonathan; Willoughby, Emily; Michael Keesey, T. (2016-12-31). God's Word or Human Reason?: An Inside Perspective on Creationism. ISBN 9781629013725.
  5. Kunimatsu, Y.; et al. (2007). "A new Late Miocene great ape from Kenya and its implications for the origins of African great apes and humans". Proceedings of the National Academy of Sciences. 104 (49): 19220–19225. doi:10.1073/pnas.0706190104. PMC 2148271. PMID 18024593.
  6. Dawkins, Richard; Wong, Yan (2016). The Ancestor’s Tale. ISBN 978-0544859937.