హోమో ఎర్గాస్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Homo ergaster
కాల విస్తరణ: 1.9–1.4 Ma
Early Pleistocene
KNM-ER 3733 (1.6 Million years ago, discovered 1975 at Koobi Fora, Kenya)
శాస్త్రీయ వర్గీకరణ edit
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Mammalia
Order: Primates
Suborder: Haplorhini
Infraorder: Simiiformes
Family: Hominidae
Subfamily: Homininae
Tribe: Hominini
Genus: Homo
Species:
H. ergaster
Binomial name
Homo ergaster
Groves and Mazák, 1975[1]

హోమో ఎర్గాస్టర్, హోమో ఎరెక్టస్ ఎర్గాస్టర్ [2] లేదా ఆఫ్రికన్ హోమో ఎరెక్టస్ అనేది హోమో జాతికి చెందిన అంతరించిపోయిన క్రోనోస్పీసీస్. ఇది ప్రారంభ ప్లైస్టోసీన్ సమయంలో సుమారు 19 లక్షలు - 14 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య తూర్పు, దక్షిణ ఆఫ్రికాల్లో నివసించింది.

మొదట్లో ప్రత్యేక జాతి అని ప్రతిపాదించబడిన హెచ్. ఎర్గాస్టర్‌ను ప్రస్తుతం హెచ్. ఎరెక్టస్ యొక్క ప్రారంభ రూపం గానీ, దాని ఆఫ్రికా రూపం గానీ కావచ్చని పరిగణిస్తున్నారు. [3] [4] [5]

దీని ద్విపద పేరును 1975 లో గ్రోవ్స్, మజాక్ లు ప్రచురించారు.ఎర్గాస్టర్ అంటే ప్రాచీన గ్రీకు భాషలో "పనివాడు" అని అర్థం. ఈ జాతి రాతి పనిముట్లను తయారు చేసి, తద్వారా అషూలియన్ పరిశ్రమను పరిచయ్ం చేసినందున దీనికి ఆ పేరు పెట్టారు.

సుమారు 19 లక్షల సంవత్సరాల క్రితం ( హోమో రుడాల్ఫెన్సిస్‌తో సమకాలీనమైనది) నాటి KNM-ER 2598 అనే "H. ఎరెక్టస్ లాంటి" ఆక్సిపిటల్ ఎముక, ఆఫ్రికాలో హెచ్. ఎరెక్టస్‌ ఉనికికి తొలి ఆధారం. [6] 19, 16 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య కాలపు శిలాజాలేమీ దొరకలేదు. సుమారు 16 లక్షల సంవత్సరాల క్రితం నాటి పుర్రె KNM-ER 3733 , H. ఎర్గాస్టర్ కు చెందిన అత్యంత పురాతన శిలాజం. [7] శిలాజాల లేమి కారణంగానే, 14 లక్షల సంవత్సరాల క్రితం తరువాత దాని మనుగడ గురించి నిశ్చయంగా తెలీదు. ఆ తరువాతి కాలపు హోమో రొడీసియెన్సిస్ (ఆఫ్రికన్ హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్) శిలాజమే, విశ్వసనీయమైన శరీరనిర్మాణ విశ్లేషణ చెయ్యగలిగే వీలున్న ఆఫ్రికా శిలాజం. ఇది 6 లక్షల సంవత్సరాల క్రితం నాటిది.

కనుగోలు, ప్రాతినిధ్యం వహిస్తున్న శిలాజాలు[మార్చు]

దక్షిణాఫ్రికా పాలియోంటాలజిస్ట్ జాన్ టి. రాబిన్సన్ 1949 లో దక్షిణాఫ్రికాలో ఒక కొత్త హోమినిన్‌కు చెందిన కింది దవడను కనుగొన్నాడు. దీనికి అతను టెలాంత్రోపస్ కాపెన్సిస్ అని పేరు పెట్టాడు. ప్రస్తుతం దీన్ని హోమో ఎర్గాస్టర్ అని వర్గీకరించారు. [8] ఆ టాక్సన్‌ను మొదటగా, కెన్యాలోని లేక్ రుడాల్ఫ్ (ఇప్పుడు దీన్ని తుర్కానా సరస్సు అంటున్నారు) సమీపంలో 1975 లో కోలిన్ గ్రోవ్స్, వ్రిటిస్లావ్ మజాక్ లు కనుగొన్న ఒక దవడకు పెట్టారు.; KNM-ER 992 గా పిలిచే ఈ దవడను, ఈ జాతికి టైప్ స్పెసిమెన్ గా తీసుకున్నారు. హెచ్. ఎర్గాస్టర్‌కు చెందిన పూర్తి అస్థిపంజరాన్ని 1984 లో కమోయా కిమేయు, అలాన్ వాకర్‌లు తుర్కానా సరస్సు వద్ద కనుగొన్నారు. దీనికి KNM-WT 15000 అనే గుర్తింపు, "తుర్కానా బాయ్" అని పేరూ పెట్టారు. ఇది 16 లక్షల సంవత్సరాల క్రితం నాటిది. ఇప్పటి వరకు కనుగొన్న తొలి హోమినిన్ శిలాజాలలో, దాదాపు సంపూర్ణంగా దొరికిన వాటిలో ఇది ఒకటి.

వర్గీకరణ[మార్చు]

KNM-WT 15000 ("తుర్కనా బాయ్") కపాలం పునర్నిర్మాణం. మ్యూజియం ఆఫ్ మ్యాన్, శాన్ డియాగో .
దస్త్రం:MNP - Turkanajunge 2.jpg
"తుర్కనా బాయ్" ముఖ పునర్నిర్మాణం. ఎలిసబెత్ డేనెస్, మ్యూసీ నేషనల్ డి ప్రిహిస్టోయిర్, లెస్ ఐజీస్-డి- తయాక్

1975 లో ప్రతిపాదించినప్పటి నుండి, "హోమో ఎర్గాస్టర్" అనే టాక్సన్ కు కొంత ఆమోదం లభించినప్పటికీ, 1980 ల నుండి ఎర్గాస్టర్, ఎరెక్టస్ లు రెండూ కూడా హెచ్. ఎరెక్టస్ అనే జాతికి చెందిన వేరువేరు జనాభాలుగా పరిహణించడం ఎక్కువైంది. హోమో ఎర్గాస్టర్, H. ఎరక్తస్ కే మరో రూపమని ("ఆఫ్రికన్ హోమో ఎరెక్టస్"), అది ఆఫ్రికా నుంచి బయటకు వలస వెళ్ళి, వివిధ యూరేషియన్ ఉపజాతులుగా విస్తరించిందనీ కొందరు భావిస్తారు. ఈ దృష్టికోణంలో, " హోమో ఎరెక్టస్ సెన్సు స్ట్రిక్టో " (కచ్చితమైన అర్థంలో) అనే పేరును యూరేషియన్ రకాలకు, "హోమో ఎరెక్టస్ సెన్సు లాటో" (విస్తృతార్థంలో) అనే పేరును ఆసియా, ఆఫ్రికా జనాభాకూ సూచించవచ్చు. [9] ఈ రెండింటినీ పర్యాయపదాలుగా పరిగణించాలా వద్దా అనే దానిపై అనిశ్చితి వలన "హోమో ఎరెక్టస్ / ఎర్గాస్టర్" అని కూడా ఉపయోగించారు. [10] ఈ ప్రశ్న 2003 నాటికి "పరిష్కరించని ప్రసిద్ధ సమస్య" గా వర్ణించారు. సువా తదితరులు (2007), "యురేషియా లోకి అనేక సార్లు జరిగిన జన్యు ప్రవాహాలకు హోమో ఎరెక్టసే మూలం" అయి ఉండవచ్చని తేల్చారు. [11]

2005 లో దక్షిణ కాకసస్‌లోని దమానిసి పుర్రెలను కనుగొన్నాక, ఈ ప్రశ్న తిరిగి తలెత్తింది. వాటి శరీర నిర్మాణం లోని గొప్ప వైవిధ్యం కారణంగా ఇప్పటికే హెచ్. ఎర్గాస్టర్ అని పిలుస్తున్న ఆఫ్రికా శిలాజాలను యూరేసియన్ హెచ్. ఎరెక్టస్ లోకి చేర్చవచ్చనే సూచన కలిగింది. 2013 లో 18 లక్షల సంవత్సరాల క్రితం నాటి ద్మానిసి పుర్రె-5 ను కనుగొన్నాక, యూరేషియా లోని హోమో ఎరెక్టసు, ఆఫ్రికాలోని హోమో ఎర్గాస్టరూ ఒకే కాలానికి చెందింబవని తేలింది. హోమో హ్యాబిలిస్ నుండి హోమో ఎరెక్టస్/ఎర్గాస్టర్ ఆవిర్భావం ఆఫ్రికాలో జరిగిందా అసియాలో జరిగిందా అనేది అస్పష్టంగా మారింది. [12] దీంతో, హెచ్. ఎర్గాస్టర్‌కు హెచ్ ఎరెక్టస్‌కు మరో రూపమే అనే భావన బలోపేతమైంది. [13] [14]

ద్మానిసి కనుగోళ్ళ కంటే ముందే మానవ పరిణామ క్రమంలో వివరించినంత స్పీసియేషను జరిగిందా అనే దాని పట్ల విస్తృతంగా ఆందోళన ఉండేది. హోమో జాతికి చెందిన టాక్సన్ల సంఖ్యను బాగ ఎక్కువగా చెప్పారా అనే ప్రశ్న తలెత్తింది. [15]

హెచ్ ఎర్గాస్టర్‌ పుర్రె-ఎముకలు, H. ఎరక్తస్ కంటే సన్నగా ఉన్నాయి. కళ్ళకు పైన ఉండే అంచులు (సుప్రా ఆర్బిటల్ ఫోరామెన్) ఎరెక్టస్‌లో లాగా ఎత్తుగా లేవు. H. హైడెల్‌బర్గెన్సిస్ కంటే సన్నపాటి ఎముకలు, దానికంటే ఎక్కువగా ముందుకు ఒపోడుచుకు వచ్చిన ముఖం, కిందికి జారిన నుదురూ ఉన్నాయి. తొలి హోమోయేతర జాతులతో పోలిస్తే హెచ్ ఎర్గాస్టర్‌^లో లైంగిక డైమోర్ఫిజం తక్కువగా ఉంది. [16] ముఖం చిన్నదిగాను, తక్కువ పొడుచుకువచ్చి ఉంది. వాటి కంటే చిన్న పలువరుస, పెద్ద కపాల సామర్థ్యం (తొలి ఎర్గాస్టర్ స్పెసిమెన్లలో 700–900 సెం.మీ.3 ,  తరువాతి స్పెసిమెన్లలో 900–1100 సెం.మీ.3) ఉన్నాయి. [10] టాంజానియా, ఇథియోపియా, కెన్యా, దక్షిణాఫ్రికాల్లో హోమో ఎర్గాస్టర్ అవశేషాలు లభించాయి.

హెచ్. ఎరెక్టస్ / ఎర్గాస్టర్ ( హెచ్. ఎరెక్టస్ సెన్సు లాటో) హోమో హైడెల్బెర్గెన్సిస్‌కు (ఆఫ్రికాలో హోమో రొడీసియెన్సిస్ అని కూడా పిలుస్తారు) పూర్వీకుడు. హోమో హైడెల్బెర్గెన్సిస్‌ సుమారు 8 లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. 5 లక్షల సంవత్సరాల క్రితం హెచ్. ఎరెక్టస్ చివరి జనాభా స్థానాన్ని హెచ్. హైడెల్బెర్గెన్సిస్ ఆక్రమించింది. సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం, హోమో నియాండర్తలెన్సిస్, హోమో సేపియన్స్లు హెచ్. హైడెల్బెర్గెన్సిస్ నుండి ఉద్భవించాయి. [17]

ఉత్పన్నం, విలుప్తి[మార్చు]

హోమో జాతి యొక్క ప్రారంభ జాతుల అభివృద్ధిని శాస్త్రీయ సమాజంలో తిరిగి వివరిస్తుంది. హెచ్. హబిలిస్, హోమో ప్రజాతికి పూర్వీకుడిగాను, హెచ్. ఎర్గాస్టర్‌కు ప్రత్యక్ష (తక్షణ) పూర్వీకుడు గానూ, సాధారణంగా అంగీకరించే వాదన. [8] అయితే, హబిలిస్ "హోమో" లోకి చేర్చదగ్గ జాతియేనా అనేది వివాదాస్పదంగా ఉంది. హ్యాబిలిస్, ఎర్గాస్టర్ లు తూర్పు ఆఫ్రికాలో దాదాపు 5 లక్షల సంవత్సరాల పాటు సహ ఉనికిలో ఉన్నాయనేది స్పష్టం. దీన్నిబట్టి, అవి ఒకదాని నుండి మరొకటి ఉద్భవించినట్లుగా (అనాజెనెటిక్ కనెక్షన్) కాక, ఆ రెండూ ఒక ఉమ్మడి పూర్వీకుడి నుండి వేరుపడ్డాయని భావించవచ్చు. [18]

హోమో హ్యాబిలిస్ నుండి హెచ్. ఎరెక్టస్ (హెచ్. ఎర్గాస్టర్) యొక్క ఉత్పన్నం 20 లక్షల సంవత్సరాల క్రితానికి కొద్దిగా తరువాత జరిగిందని భావిస్తున్నారు. 18 లక్షల సంవత్సరాల క్రితం, ఆఫ్రికన్ (హెచ్. ఎర్గాస్టర్), ఆసియా (హెచ్. ఎరెక్టస్ జార్జికస్) రకాలు రెండూ ఉనికిలో ఉన్నాయి. [9] జార్జియాలోని ద్మానిసి వద్ద కనుగొన్నవి హెచ్. హ్యాబిలిస్ యొక్క ఈ ప్రారంభ వారసులే అయి ఉండవచ్చు. [19]

హెచ్. ఎర్గాస్టర్ 14 లక్షల సంవత్సరాల క్రితం తరువాత శిలాజ రికార్డు నుండి అదృశ్యమయ్యే ముందు, సుమారు 500,000 సంవత్సరాల పాటు ఆఫ్రికాలో నివసించింది; అదృశ్యం కావడానికి గుర్తించదగిన కారణం ఏదీ కనబడలేదు. అదే ప్రాంతంలో చాలా కాలం తరువాత ఉత్పన్నమైన హోమో హైడెల్బెర్గెన్సిస్ శిలాజ రికార్డులో ఉన్న ఖాళీని సూచిస్తుంది. 14 నుండి 6 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య ఉన్న కాలపు శిలాజాలు ఇంకా దొరకలేదు.

పనిముట్ల ఉపయోగం[మార్చు]

కెంట్‌లో దొరికిన అషూలియన్ చేగొడ్డలి.

హెచ్. ఎర్గాస్టర్, దాని ముందున్న హెచ్. హ్యాబిలిస్ కంటే విభిన్నమైన, అధునాతనమైన రాతి పనిముట్లను ఉపయోగించింది. తనకు వారసత్వంగా వచ్చిన ఓల్డోవాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరిచింది. తరువాత మొదటి అషూలియన్ రెండంచుల గొడ్డలిని అభివృద్ధి చేసింది. [20] అషూలియన్ పనిముట్ల ఉపయోగం 16 లక్షల సంవత్సరాల క్రితం మొదలు కాగా, దాని కంటే 2 లక్షల సంవత్సరాల ముందే, హెచ్. ఎరెక్టస్ యొక్క రేఖ చీలి పోయింది.

సంఘజీవనం[మార్చు]

హోమో ఎర్గాస్టర్ లో లైంగిక డైమార్ఫిజమ్ దాని పూర్వీకులైన ఆస్ట్రలోపిథెసీన్ల (సుమారు 20%) కంటే తగ్గింది. [16] డైమోర్ఫిజంలో ఈ తగ్గుదల, స్త్రీ కోసం మగవారి మధ్య పోటీ తగ్గిందనడానికి సంకేతంగా భావిస్తున్నారు. [21] అయితే, ఇది ఆధునిక మానవులలో కంటే ఎక్కువగా ఉంది.

శరీరనిర్మాణ పరంగానే కాకుండా, సంఘజీవనంలో కూడా హోమో ఎర్గాస్టర్, ఏ ఇతర మునుపటి జాతి కన్నా కూడా, ఆధునిక మానవులకు దగ్గరగా ఉంది. నిప్పును నియంత్రించిన మొట్టమొదటి హోమినిన్, హెచ్ ఎర్గాస్టర్: అది సహజంగా రేగే మంటలను నియంత్రించడం లోనా, తానే నిప్పును తయారుచెయ్యడం లోనా అనేది చర్చనీయాంశం. హెచ్ . ఎర్గాస్టర్‌తో ఉమ్మడి పూర్వీకుడు ఉన్న ప్రతీ హోమినిన్ లాగానే, హెచ్. ఎరెక్టస్‌ కూడా నిప్పును నియంత్రించిందని ప్రస్తుతం భావిస్తున్నారు. [22]

భాష వాడకం[మార్చు]

తుర్కనా బాయ్ కటి వెన్నుపూసలు తరువాతి మానవుల కంటే చాలా సన్నగా ఉండడాన్ని బట్టి, ఎర్గాస్టర్‌కు శ్వాసను నియంత్రించే సామర్థ్యం తక్కువగా ఉండేదని, ఆ కారణంగా సంక్లిష్ట శబ్దాలను ఉత్పత్తి చెయ్యలేకపోయేదనీ భావించారు. అయితే, తుర్కనా బాయ్ కంటే 3,00,000 సంవత్సరాల ముందు కాలానికి చెందిన దమానిసి శిలాజాల్లో కటి వెన్నుపూసలు మానవ వెన్నుపూస పరిమాణం లోనే ఉన్నాయని కనుగొన్నారు. [23] తుర్కనా బాయ్ బహుశా వెన్నెముక కాలమ్ యొక్క వ్యాధితో బాధపడి ఉంటాడని నిర్ధారించారు. [24] డమానిసి శిలాజాలు హెచ్. ఎర్గాస్టర్ వేనని ఖచ్చితంగా తేలలేదు. అవి తుర్కనా బాయ్ కంటే పాతవి అనేది మాత్రం కచ్చితం.దీన్నిబట్టి ద్మానిసి శిలాజాలకు హెచ్. ఎర్గాస్టర్‌కూ బంధుత్వం ఉందని చెప్పవచ్చు.

ఇవి కూడా చూడండి[మార్చు]

నోట్స్[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Groves, CP; Mazek, V (1975). "An approach to the taxonomy of the hominidae: gracile Villafranchian hominids of Africa". Casopis Pro Mineralogii a Geologii. 20: 225–247.
 2. Noel T. Boaz, Russell L. Ciochon, Dragon Bone Hill: An Ice-Age Saga of Homo erectus, Oxford University Press (2004).
 3. "Homo ergaster – Many researchers deny any validity to the species at all. On the whole though, most researchers see too little difference between ergaster and erectus to form the basis of a species of the former, separated from the latter". ArchaeologyInfo.com. Archived from the original on 7 అక్టోబరు 2015. Retrieved 30 అక్టోబరు 2015.
 4. "Homo erectus/ergaster and Out of Africa: Recent Developments in Paleoanthropology and Prehistoric Archaeology" (PDF). Universitat Rovira i Virgili, Tarragona, Spain. Archived from the original (PDF) on 1 ఆగస్టు 2020. Retrieved 26 డిసెంబరు 2015.
 5. "An Overview of the Siwalik Acheulian & Reconsidering Its Chronological Relationship with the Soanian – A Theoretical Perspective". Research School of Archaeology and Archaeological Sciences University of Sheffield. Retrieved 26 డిసెంబరు 2015.
 6. William H. Kimbel, Brian Villmoare, "From Australopithecus to Homo: the transition that wasn't", Philosophical Transactions of the Royal Society B, 13 June 2016, DOI: 10.1098/rstb.2015.0248.
 7. Lepre CJ, Kent DV, "Chronostratigraphy of KNM-ER 3733 and other Area 104 hominins from Koobi Fora", J Hum Evol. 2015 Sep; 86:99-111. doi: 10.1016/j.jhevol.2015.06.010.
 8. 8.0 8.1 Wood, Bernard; Collard, Mark (2001). "The Meaning of Homo". Ludus Vitalis. 9 (15): 63–74.
 9. 9.0 9.1 Tattersall, Ian; Schwartz, Jeffrey (2000). Extinct Humans. Boulder, Colorado: Westview/Perseus. ISBN 978-0-8133-3482-0.
 10. 10.0 10.1 Hazarika, Manji (16–30 జూన్ 2007). "Homo erectus/ergaster and Out of Africa: Recent Developments in Paleoanthropology and Prehistoric Archaeology".
 11. Suwa G, Asfaw B, Haile-Selassie Y, White T, Katoh S, WoldeGabriel G, Hart W, Nakaya H, Beyene Y (2007). "Early Pleistocene Homo erectus fossils from Konso, southern Ethiopia". Anthropological Science. 115 (2): 133–151. doi:10.1537/ase.061203.
 12. Bernard Wood, "Did early Homomigrate 'out of' or 'in to' Africa?", PNAS vol. 108, no.26 (28 June 2011), 10375–10376.
 13. Rightmire, G. P.; Lordkipanidze, D.; Vekua, A. (2006). "Anatomical descriptions, comparative studies and evolutionary significance of the hominin skulls from Dmanisi, Republic of Georgia". Journal of Human Evolution. 50 (2): 115–141. doi:10.1016/j.jhevol.2005.07.009. PMID 16271745.
 14. Gabunia, L.; Vekua, A.; Lordkipanidze, D.; Swisher Cc, 3.; Ferring, R.; Justus, A.; Nioradze, M.; Tvalchrelidze, M.; Antón, S. C. (2000). "Earliest Pleistocene hominid cranial remains from Dmanisi, Republic of Georgia: Taxonomy, geological setting, and age". Science. 288 (5468): 1019–1025. Bibcode:2000Sci...288.1019G. doi:10.1126/science.288.5468.1019. PMID 10807567. {{cite journal}}: |first4= has numeric name (help)
 15. Kramer, A (1993). "Human Taxonomic Diversity in the Pleistocene: Does Homo erectus Represent Multiple Hominid Species?". American Journal of Physical Anthropology. 91 (2): 161–171. doi:10.1002/ajpa.1330910203. PMID 8317558.
 16. 16.0 16.1 McHenry, Henry M. (1994). "Behavioral ecological implications of early hominid body size". Academic Press Limited.
 17. G. Philip Rightmire (1998). "Human Evolution in the Middle Pleistocene: The Role of Homo heidelbergensis". Evolutionary Anthropology. 6 (6): 218–227. doi:10.1002/(sici)1520-6505(1998)6:6<218::aid-evan4>3.0.co;2-6.
 18. Urquhart, James (8 ఆగస్టు 2007). "Finds Test Human Origins Theory". Retrieved 11 మే 2019.
 19. Tattersall, Ian (2008). "An Evolutionary Frameworks for the Acquisition of Symbolic Cognition by Homo sapiens".
 20. World History: Patterns of Interaction. McDougal Littell. 1999. ISBN 978-0-395-87274-1. {{cite book}}: Cite uses deprecated parameter |authors= (help)
 21. Gray, Peter B. (2010). The Evolution and Endocrinology of Human Behavior: a Focus on Sex Differences and Reproduction. Cambridge, UK: Cambridge University Press. pp. 277–292. ISBN 978-0-521-70510-3.
 22. Goren-Inbar, Naama; Alperson, N; Kislev, ME; Simchoni, O; Melamed, Y; Ben-Nun, A; Werker, E (30 ఏప్రిల్ 2004). "Evidence of Hominin Control of Fire at Gesher Benot Ya 'aqov, Israel". Science. 304 (5671): 725–727. Bibcode:2004Sci...304..725G. doi:10.1126/science.1095443. PMID 15118160.
 23. Bruce Bower (6 మే 2006). "Evolutionary Back Story: Thoroughly Modern Spine Supported Human Ancestor". Science News Online. 169 (18): 275–276. doi:10.2307/4019325. JSTOR 4019325.
 24. Wong, Kate (నవంబరు 2003). "Stranger in a new land". Scientific American. 289 (5): 74–83. Bibcode:2003SciAm.289e..74W. doi:10.1038/scientificamerican1103-74. PMID 14564816.

వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]