ఆఫ్రికా నుండి హోమినిన్ల తొలి వలసలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  హోమో ఎరెక్టస్ (పసుపు),   హోమో నియాండర్తాలెన్సిస్ (కావి),   హోమో సేపియన్స్ (ఎరుపు) ల వలస మార్గాలు

పాత రాతియుగం మలి దశ నుండి మధ్య రాతియుగం తొలి నాళ్ళ వరకూ, అంటే సుమారు 21 లక్షల ఏళ్ళ క్రితానికీ 2 లక్షల ఏళ్ళ క్రితానికీ మధ్యన, ఆఫ్రికా నుండి యూరేషియా అంతటా పురాతన మానవుల (హోమో జాతి) విస్తరణలు జరిగాయి. ఈ విస్తరణ లన్నింటినీ కలిపి ఆప్రికా నుండి బయటకు -1 (అవుట్ ఆఫ్ ఆఫ్రికా 1) అని పిలుస్తారు. హోమో సేపియన్స్ (శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవులు) యూరేషియాలోకి విస్తరించిన ఘటనా, ఇదీ వేరువేరు. హోమో సేపియన్ల విస్తరణ 2 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమై ఉండవచ్చు. దాన్ని "ఆఫ్రికా నుండి బయటకు -2" (అవుట్ ఆఫ్ ఆఫ్రికా 2) అని పిలుస్తారు.[1]

ఆఫ్రికా వెలుపల హోమో తొట్టతొలి ఉనికి (ఆ మాటకొస్తే అసలు ఏ హోమినిన్ అయినా సరే) 20 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. మధ్య చైనాలోని షాంగ్‌చెన్ వద్ద 21.2 లక్షల సంవత్సరాల నాడే మానవ ఉనికి ఉన్నట్లుగా 2018 లో చేసిన రాతి పనిముట్ల అధ్యయనం ద్వారా కనుగొన్నామని చైనీయులు చెప్పుకొన్నారు.[2] ఆఫ్రికా బయట లభించిన అత్యంత పురాతన మానవ అస్థిపంజర అవశేషాలు జార్జియా లోని ద్మానిసి లో (ద్మానిసి పుర్రె 4) లభించాయి. ఇవి 18 లక్షల సంవత్సరాల క్రితం నాటివి. ఈ అవశేషాలను హోమో ఎరెక్టస్ జార్జికస్ అని వర్గీకరించారు.

తరువాతి వలస 14 లక్షల సంవత్సరాల క్రితం హోమో యాంటెసెస్సర్ చేసింది. ఆ తరువాత, 8 లక్షల సంవత్సరాల కిందట హోమో హైడెల్‌బెర్గెన్సిస్ చేసింది.[3]

ప్లైస్టోసీన్ తొలి నాళ్ళ వరకూ అంటే 8 లక్షల సంవత్సరాల క్రితం వరకూ, తొలి మానవులు ఆఫ్రికా ఖండానికే పరిమితమయ్యారని 1980 ల ఆరంభం వరకూ భావించారు. తూర్పు ఆఫ్రికా వెలుపల హోమినిన్ వలసలు ప్లైస్టోసీన్ తొలినాళ్ళలో చాలా అరుదుగా కనిపించాయి.[4][5]

తొలి వలసలు

[మార్చు]

గ్రీస్, అనటోలియాల్లో లభించిన 80 లక్షల సంవత్సరాల నాటి గ్రేకోపిథెకస్, ఔరాంటోపిథెకస్ లను బట్టి హోమో కంటే పూర్వమే ఆఫ్రికా నుండి హోమినిన్ వలస జరిగిందని భావించారు. కానీ ఈ వలసలు చేసినది హోమినినే అయితే అయి ఉండవచ్చేమో గానీ హోమినిని మాత్రం కావు. ఇవి క్రీట్‌లో కనిపించిన 60 లక్షల సంవత్సరాల క్రితం నాటి ట్రాకిలోస్ పాదముద్రలకు సంబంధించినవై ఉండవచ్చు.

తూర్పు ఆఫ్రికాలో (అఫార్ డిప్రెషన్‌లో) సుమారు 56 లక్షల సంవత్సరాల క్రితం ఆస్ట్రలోపిథెసినా ఉద్భవించింది. సుమారు 40 లక్షల సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలో గ్రెసైల్ ఆస్ట్రలోపిథెసిన్స్ (ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్) లు ఉద్భవించాయి. మొట్టమొదటి పనిముట్లు కెన్యాలోని లోమెక్వీ లో కనుగొన్నారు. అవి ప్లయోసీన్ చివరి కాలం, అంటే 33 లక్షల సంవత్సరాల క్రితం, నాటివి. వాటిని ఆస్ట్రలోపిథెకస్ గార్హి గాని, పరాంత్రోపస్ ఏథియోపికస్ గానీ తయారు చేసి ఉండవచ్చు. ఈ రెండూ కూడా ఈ పనిముట్ల కాలానికే చెందిన హోమినిన్లే.[6] హోమో ఉద్భవించినది సుమారు 20 లక్షల సంవత్సరాల క్రితమని భావిస్తున్నారు. 21 లక్షల సంవత్సరాల నాటి హోమో హ్యాబిలిస్ కెన్యాలోని తుర్కానా సరస్సు వద్ద దొరికింది. హోమో ప్రజాతి, ఆస్ట్రలోపిథెకస్ నుండి వేరుపడిందనే వాదన కొంత చర్చనీయాంశంగా ఉంది. ఈ కారణంగా ఈ రెంటినీ కలిపి ఉదహరించేందుకు, వర్గీకరణలో పైఅంచెలో ఉండే "హోమినిన్" అనే వాడుతారు. "హోమినిన్" లో చింపాజీలు, మానవ పూర్వ జాతులు కూడా భాగమే.

ఆఫ్రికా వెలుపల మొట్టమొదటి హోమినిన్ ఉనికి, 20 లక్షల సంవత్సరాల క్రితం కనిపించింది. మధ్య చైనాలోని షాంగ్‌చెన్ వద్ద రాతి హస్తకృతులను కలిగి ఉన్న భూమి పొరపై 2018 లో చేసిన మాగ్నెటోస్ట్రాటిగ్రాఫిక్ డేటింగ్ ఆధారంగా అక్కడ 21.2 లక్షల సంవత్సరాల నాడే మానవ ఉనికి ఉందని తెలిసింది.[2]

హోమో ఫ్లోరేసియెన్సిస్ అటువంటి ప్రారంభ వలసల నుండే వచ్చినట్లు సూచించారు. హోమో హ్యాబిలిస్ లేదా హోమో హ్యాబిలిస్‌కు దగ్గరి సంబంధీకులైన వేరే హోమో లేదా ఆస్ట్రలోపిథెకస్ లేదా తొలినాళ్ళ హోమో ఎరెక్టస్ - వీటిలో ఆఫ్రికాను వదిలి వలస వెళ్ళిన ఈ తొట్టతొలి హోమినిని ఏది అనే విషయం అస్పష్టంగా ఉంది. ఏదేమైనా, హెచ్. ఫ్లోరెసియెన్సిస్ శరీరనిర్మాణం ఆస్ట్రలోపిథెకస్ సెడీబా, హోమో హ్యాబిలిస్, డ్మానిసి మ్యాన్‌లతో చాలా సారూప్యత ఉంది. ఇది, హెచ్. ఫ్లోరేసియెన్సిస్‌కు పూర్వీకులైన హెచ్ ఎరెక్టస్ ఉద్భవించడానికంటే ముందే ఆఫ్రికా నుండి బయటికి వెళ్ళారనే సంభావ్యతకు తెరదీస్తోంది.[7] 2017 లో ప్రచురితమైన ఒక ఫైలోజెనెటిక్ విశ్లేషణలో, హెచ్. ఫ్లోరెసియెన్సిస్, హోమో హ్యాబిలిస్‌ పూర్వీకుల జాతి (బహుశా ఆస్ట్రలోపిథెసీన్) నుండి వచ్చిందని, ఇది హెచ్. హ్యాబిలిస్‌కు సోదర జాతి అనీ, దాని అంశ హెచ్. ఎరెక్టస్ కంటే పాతదనీ సూచించారు. ఈ వర్గీకరణ ఆధారంగా, హెచ్. ఫ్లోరేసియెన్సిస్ ఆఫ్రికా నుండి జరిగిన చాలా ప్రాచీన కాలానికి చెందిన - 21 లక్షల సంవత్సరాల క్రితం కంటే మునుపటి - వలసలను సూచిస్తుందని కల్పన చేసారు. 21 లక్షల సంవత్సరాల నాటి షాంగ్చెన్ హస్తకృతుల విషయంలో కూడా ఇదే సూచన చేసారు.[2]

హోమో ఎరెక్టస్

[మార్చు]
మిడిల్ ప్లైస్టోసీన్ (అషూలియన్) క్లీవర్ వలసను మ్యాప్ చూపిస్తుంది
దస్త్రం:Homo erectus new.JPG
వయోజన మగ హోమో ఎరెక్టస్ ఫోరెన్సిక్ పునర్నిర్మాణం.[8]

హోమో ఎరెక్టస్ 20 లక్షల సంవత్సరాల క్రితానికి కొద్దిగా తరువాత ఉద్భవించింది.[9] తొలి హెచ్. ఎరెక్టస్ తూర్పు ఆఫ్రికాలో హెచ్. హ్యాబిలిస్‌తో సమకాలికంగా దాదాపు 5 లక్షల సంవత్సరాల పాటు జీవించి ఉండవచ్చు.[10] పురాతన హోమో ఎరెక్టస్ శిలాజాలు ఆఫ్రికా లోను, కాకసస్ లోనూ 20 లక్షల సంవత్సరాల క్రితం తరువాత కొద్దికాలానికే కనిపించాయి. చక్కగా కాలగణన చేసిన మొట్టమొదటి యూరేషియా హెచ్. ఎరెక్టస్ జార్జియాలోని దమానిసి వద్ద లభించింది. ఇది 18 లక్షల సంవత్సరాల నాటిది.[11] తమలో వృద్ధులను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండేవారని చెప్పేందుకు, దమానిసి వద్ద దొరికిన ఒక పుర్రె ఆధారంగా ఉంది. ఈ హోమో ఎరెక్టస్ పుర్రె పెద్ద వయస్సున్న వ్యక్తిది. చనిపోవడానికి కొన్ని సంవత్సరాల ముందే, ఒక్కటి తప్ప పళ్ళన్నీ ఊడిపోయాయి. ఆ స్థితిలో తోటివారు ఎవరూ ఆదుకోకపోతే, ఆ జీవి ఏళ్ళ తరబడి మనగలిగి ఉండేది కాదు. అయితే, తోటి వారి పట్ల ఆదరణ కలిగి ఉండేవారనేందుకు ఈ ఒక్క ఆధారం సరిపోదు. గొంబే రిజర్వ్ లో పక్షపాతం బారిన పడ్డ ఒక చింపాంజీ ఏ సహాయమూ లేకుండా సంవత్సరాల పాటు జీవించిన ఉదంతం ఉంది.[12]

ఆఫ్రికా హెచ్. ఎరెక్టస్‌ను హోమో ఎర్గాస్టర్ అంటారు. వీటికి, రెండు కనుబొమలకూ ఒకే ఎముక (KNM-ER 2598) ఉంటుంది. ఇది 19 లక్షల సంవత్సరాల క్రితం నాటిదని తేల్చారు. (హోమో రుడాల్ఫెన్సిస్ కు సమకాలికులు). దీని తరువాత కొంత కాలం పాటు శిలాజాలు లేవు. ఆ తరువాత అందుబాటులో ఉన్న శిలాజం KNM-ER 3733. ఇది 16 లక్షల సంవత్సరాల క్రితం నాటి పుర్రె.[13] ఉత్తర ఆఫ్రికాలోని తొలి ప్లైస్టోసీన్ కాలం నాటి సైట్ల అధ్యయనం, తూర్పు ఆఫ్రికా, జార్జియా ల మధ్య భూభాగాల్లోని భూమి పొరల అధ్యయనాలు స్పష్టంగా లేవు. కాలనిర్ణయం చేసిన వాటిలో తొట్టతొలిది ఉత్తర అల్జీరియాలోని ఐన్ హనేచ్ (18 [14] – 12 లక్షల సంవత్సరాల క్రితం [15] ). ఇది ఓల్డోవాన్ గ్రేడ్ పొర. తొలినాళ్ళ హోమో ఎరెక్టస్, వేడిగా, పొడిగా ఉండే ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలను దాటి వలస వెళ్ళిందని ఈ సైట్లు ధృవీకరిస్తున్నాయి [4] : 2  హోమో ఎరెక్టస్ 18 లక్షల సంవత్సరాల క్రితం దక్షిణ కాకసస్‌లోకి రావడానికీ తూర్పు, ఆగ్నేయాసియాల్లోకి రావడానికీ మధ్య పెద్ద సమయం పట్టలేదు. చైనాలోని యువాన్‌మౌలోని హెచ్. ఎరెక్టస్ 17 లక్షల సంవత్సరాల క్రితం నాటిది. ఇండోనేషియాలోని జావాలోని సంగిరాన్‌లో లభించిన శిలాజం 16.6 లక్షల సంవత్సరాల క్రితం నాటిదని ఆధారాలు ఉన్నాయి .[16]

పశ్చిమ ఆసియాకు వలస వెళ్ళినది హోమో హ్యాబిలిస్ అనీ, తొలి హెచ్. ఎరెక్టస్ అక్కడే అభివృద్ధి చెందిందనీ ఫెర్రింగ్ తదితరులు (2011) సూచించారు. అక్కడి నుండి హెచ్. ఎరెక్టస్, తూర్పు ఆసియాకు (పెకింగ్ మ్యాన్), ఆగ్నేయాసియాకు (జావా మ్యాన్), ఆఫ్రికాకు (హోమో ఎర్గాస్టర్ ) ఐరోపాకూ (టౌటవెల్ మ్యాన్) కు విస్తరించింది.[17][18]

హెచ్. ఎరెక్టస్ ఐరోపాలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టిందని తెలుస్తోంది. ఆగ్నేయ స్పెయిన్‌లోని 14 లక్షల సంవత్సరాల క్రితం నాటి బారాంకో లియోన్ స్థలం తొట్టతొలిది. ఈ స్థలం హోమో యాంటెసెస్సర్ కు చెందినది.[19] దక్షిణ ఇటలీలోని వివాదాస్పద పిరో నార్డ్, 17 – 13 లక్షల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు.[20] భౌగోళికంగా ఏకాకియైన ఐబీరియన్ ద్వీపకల్పంలో తొలి మానవ ఉనికిని ఇలాంటి వివిక్త (ఐసోలేటెడ్) ప్రాంతంలో మానవ జనాభా ఉండడం వారి స్థిరమైన ఉనికికి సాక్ష్యంగా పరిగణించాలి. కార్పాతియన్ పర్వతాలకు నైరుతి దిశలో ఉన్న పానోనియన్ మైదానంలో మధ్యధరా ప్రాంతం లాంటి వెచ్చని వాతావరణం ఉంటుంది. పశ్చిమ యూరోపియన్ పాలియో బయోజిగోగ్రాఫిక్ ప్రాంతపు వాతావరణం గల్ఫ్ స్ట్రీమ్ ప్రభావానికి లోనైంది. ఈ ప్రాంతం అప్పుడప్పుడూ హోమినిన్‌లు ఐబీరియన్ ద్వీపకల్పం వైపు వలస వెళ్ళేందుకు అనుకూలంగా ఉండేది. ఆగ్నేయ ఐరోపాకు, సమీప ప్రాచ్యానికీ, దక్షిణ ఆసియాకూ మధ్య జంతుజాలాల వలసలను అనేక అంశాలు ప్రభావితం చేసాయని స్పష్టంగా తెలుస్తోంది. ఆ అంశాలు: బాస్పోరస్ జలసంధి, మానిచ్ జలసంధి వంటి భౌగోళిక అవరోధాలు, ఉత్తరాన గ్రేటర్ కాకసస్ శ్రేణి కలిగిస్తున్నవాతావరణ అవరోధం మొదలైనవి. బాస్పోరస్ మూసుకుపోవడంతో (41,000 ఏళ్ళ మిలాంఖోవిచ్ చక్రం కారణంగా, సముద్ర మట్టాలు తగ్గి బాస్పోరస్‌ జలసంధి పదేపదే మూసుకు పోయి, భూమి బయటపడేది) జంతుజాలాల వలసలకు అనుకూలించింది. అలాగే యురేషియాలోని పురాతన హోమినిన్లు పశ్చిమ దిశలో వలస పోయేందుకు కూడా ఇది అనుకూలించింది.[21]

10 లక్షల సంవత్సరాల క్రితం నాటికి, హోమో ఎరెక్టస్ యురేషియా అంతటా వ్యాపించింది. (ఎక్కువగా 50 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి లోపున ఉన్న ప్రాంతంలో వ్యాప్తి చెందింది.[22] ). అయితే, పశ్చిమ ఐరోపాలో స్థిరనివాసం కొనసాగిందా, లేదా అంతర గ్లేసియల్ కాలాల్లో కొత్త వలస తరంగాలు వచ్చాయా అనేది చెప్పడం కష్టం.[23] ఉబీదియా వద్ద దొరికిన 14 లక్షల సంవత్సరాల క్రితం నాటి తొలి అషూలియన్ పనిముట్లు పశ్చిమాన నిరంతర స్థిరనివాసానికి ఆధారాలుగా ఉన్నాయి. ఎందుకంటే ఆఫ్రికా నుండి వరుసగా వలస తరంగాలు బయటికి రావడం వలన పశ్చిమ ఐరోపాకు అషూలియన్ టెక్నాలజీని తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఇండోనేషియా ద్వీపాలలో దిగువ పాతరాతియుగానికి చెందిన మానవ అవశేషాలు లభించటం, తొలి ప్లైస్టోసీన్ కాలపు చివరిలో హోమో ఎరెక్టస్ సముద్రయానం చేసిం ఉంటుందనేందుకు మంచి ఆధారం. బహుశా సముద్రంలో చేపలు పట్టేందుకు గాను, 10 లక్షల సంవత్సరాల క్రితమే నావికా యానం చేసారని బెడ్నారిక్ సూచిస్తున్నాడు.[24] మనిషి నడపగలిగే తెప్పలో 8,50,000 సంవత్సరాల క్రితమే లాంబాక్ జలసంధిలో ప్రయాణించారని అతడు భావించాడు. అలాంటి ఒక ఆదిమ తెప్ప ఎలా ఉంటుందో ఊహించి అతడు తయారు చేశాడు. ప్లైస్టోసీన్ కాలమంతటా లాంబాక్ జలసంధి కనీసం 20 కి.మీ. వెడల్పుతో ఉండేది. హోమో ఎరెక్టస్ సామర్థ్యాలకు మించినవని భావించే జల మార్గాలైన - జిబ్రాల్టర్, సిసిలియన్, బాబ్-ఎల్-మాండేబ్ లను దాటి ఆఫ్రికా నుండి బయటకు వెళ్ళి ఉంటారనేందుకు, ప్లైస్టోసీన్ తొలినాళ్ళలో హోమో ఎరెక్టస్ సాధించిన ఈ విజయం కొంత బలాన్నిస్తుంది.

హోమో హైడెల్‌బెర్గెన్సిస్

[మార్చు]
దస్త్రం:Homo heidelbergensis adult male - head model - Smithsonian Museum of Natural History - 2012-05-17.jpg
కబ్వే పుర్రె ఆధారంగా నిర్మించిన వయోజన మగ హోమో రోడీసియెన్సిస్ ఫోరెన్సిక్ రూపం.

8 లక్షల సంవత్సరాల క్రితం (క్లీవర్ పనిముట్టును వాడే అషూలియన్ సమూహాలు) ఐరోపాలో ప్రవేశించిన పురాతన మానవులను ఒక ప్రత్యేకమైన, హోమో ఎరెక్టస్-జనిత జాతిగా వర్గీకరించారు. వీటిని హోమో హైడెల్‌బెర్గెన్సిస్ అని పిలుస్తారు.[3] సుమారు 4 లక్షల సంవత్సరాల క్రితం హెచ్ . హైడెల్‌బెర్గెన్సిస్ దాని స్వంత పనిముట్ల పరిశ్రమను అభివృద్ధి చేసుకుంది. దీనిని క్లాక్టోనియన్ అని పిలుస్తారు. హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ కు హోమో రొడీసియెన్సిస్‌తో (ఆఫ్రికన్ హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్ అని కూడా అంటారు) దగ్గరి సంబంధం ఉంది. ఇది దక్షిణాది ఆఫ్రికాలో 3 లక్షల సంవత్సరాల క్రితం ఉన్నట్లుగా గమనించారు.

3 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో తొలి హెచ్. హైడెల్‌బెర్గెన్సిస్‌కు దగ్గరి సంబంధం ఉన్న వంశపరంపర నుండి హోమో సేపియన్స్ ఉద్భవించాయి.[25] "అవుట్ ఆఫ్ ఆఫ్రికా 2" మొదటి తరంగం, పశ్చిమ ఆసియాలో హెచ్. సేపియన్ల మొట్టమొదటి ఉనికి, 3 లక్షలు - 2 లక్షల సంవత్సరాల క్రితం జరిగి ఉండవచ్చు.[25] 1.3 లక్షల సంవత్సరాల క్రితం ఉనికి ఉందని మాత్రం నిర్ధారణగా తెలిసింది.[26] ప్రస్తుత ఆఫ్రికాయేతర జనాభా దాదాపు అంతటికీ, ఆఫ్రికా నుండి 70- 50 వేల సంవత్సరాల క్రితం వలస వచ్చిన హెచ్. సేపియన్స్ తరంగమే కారణమని జన్యు పరిశోధన సూచిస్తోంది.[27][28][29]

ఆఫ్రికా నుండి బయటికి మార్గాలు

[మార్చు]

ఆఫ్రికా నుండి పశ్చిమ ఆసియాకు వెళ్ళే మార్గంగా బాబ్-ఎల్-మండేబ్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇది ఆఫ్రికా కొమ్మును, అరేబియానూ కలుపుతుంది. ప్లైస్టోసీన్‌లో కొన్ని కాలాల్లో, సంద్ర మట్టం తగ్గి భూమి బయటపడినపుడు, ఇది నడిచి వెళ్ళేందుకు వీలుగా ఉండి ఉండవచ్చు. ఇతర మార్గాలు - లెవాంటైన్ కారిడార్, జిబ్రాల్టర్ జలసంధి. 1970 లలో సిసిలీ జలసంధి మీదుగా ఒక మార్గాన్ని సూచించారు గానీ, ప్రస్తుతం దాన్ని సంభావిత మార్గంగా పరిగణించడం లేదు.

బాబ్-ఎల్-మండేబ్ జలసంధి

బాబ్-ఎల్-మండేబ్ తూర్పు ఆఫ్రికా, అరేబియా ద్వీపకల్పాల మధ్య ఉన్న 30 కి.మీ. జలసంధి. మధ్యలో, అరేబియా తీరం నుండి 3 కి.మీ. దూరంలో పెరిమ్ అనే చిన్న ద్వీపం ఒకటి ఉంది. ఇది తూర్పు ఆఫ్రికాను యురేషియాకు చాలా దగ్గర చేస్తుంది కాబట్టి, యురేషియాలోకి వలసల అధ్యయనంలో ఈ జలసంధికి చాలా ప్రాముఖ్యత ఉంది.

అరేబియాతో ఉన్న ఈ భూ సంబంధం ప్లయోసీన్‌ ఇపోక్‌లో కనుమరుగైంది.[30] మధ్యలో అప్పుడప్పుడూ ఏర్పడుతూ, మునిగిపోతూ ఉండి ఉండవచ్చు.[31] ఎర్ర సముద్రం నుండి హిందూ మహాసముద్రంలోకి జల ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ భూసంధి లేకుండా దాటడం కష్టం.

పెరిమ్ ద్వీపంలో ఓల్డోవాన్ పనిముట్లు దొరికాయని చెప్పారు.[32] అంటే ప్లైస్టోసీన్‌ మొదట్లో జలసంధిని దాటి ఉండవచ్చని ఇది సూచిస్తుంది. అయితే ఈ కనుగోళ్ళను (డిస్కవరీలు) ఇంకా ధృవీకరించలేదు.[33]

జిబ్రాల్టర్ జలసంధి, మధ్యధరా నుండి అట్లాంటిక్ లోకి ప్రవేశించే మార్గం. ఇక్కడ స్పానిష్, మొరాకో తీరాల మధ్య దూరం 14 కి.మీ.మాత్రమే ఉంటుంది. ప్లైస్టోసీన్‌లో గ్లేసియేషను కారణంగా సముద్ర మట్టాలు తగ్గడం వల్ల ఇది 10 కి.మీ. లోపే ఉండేది. లోతైన ప్రవాహాలు పడమర దిశలో ప్రవహిస్తూంటాయి. ఉపరితల జలం మధ్యధరా ప్రాంతంలోకి బలంగా తోసుకొస్తుంది. ఆగ్నేయ స్పెయిన్ లోని బారాంకో లియోన్ వద్ద (14 లక్షల సంవత్సరాల క్రితం) [19] ఉత్తర స్పెయిన్‌లోని సిమా డెల్ ఎలిఫాంటే వద్ద (12 లక్షల సంవత్సరాల క్రితం) లభించిన హోమినిన్ అవశేషాలు జిబ్రాల్టర్ జలసంధి మీదుగా యురేషియాలోకి ప్రవేశించడాన్ని వివరిస్తాయి.[34][35] కానీ 13 – 17 లక్షల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్న దక్షిణ ఇటలీలోని పిర్రో నార్డ్ లో లభించిన ఆధారాలు, ఈ వలసలు తూర్పు నుండి వచ్చి ఉండవచ్చని సూచిస్తోంది [20] ఈ విషయాన్ని పరిష్కరించడానికి ప్రస్తుతమున్న ఆధారాలు సరిపోవు.[5]

1973 లో సిసిలీలో కనుగొన్న సిసిలియన్ ఓల్డోవాన్ పనిముట్లపై [36] ఆధారపడి, సిసిలీ జలసంధి మీదుగా ఒక మార్గం ఉండేదని అలిమెన్ (1975) చెప్పాడు [37] అయితే, రేడియోమెట్రిక్ తేదీలను బయట పెట్టలేదు. అక్కడి హస్తకృతులు ప్లైస్టోసీన్ మధ్య కాలానివి అయ్యే అవకాశమూ ఉంది.[38] ప్లైస్టోసీన్ సమయంలో భూవంతెన ఉండే అవకాశం లేదు.[4] : 3 

వలసలకు కారణాలు

[మార్చు]

వాతావరణ మార్పు, హోమినిన్‌ల అనుకూలీకరణ

[మార్చు]

ఓ శీతోష్ణస్థితిలో ఏదైనా జాతికి చెందిన నిరవధికంగా జీవించగల వ్యక్తుల సంఖ్య అందుబాటులో ఉన్న వనరుల పరిమితికి లోబడి ఉంటుంది. మోయగల సామర్థ్యం (కారీయింగ్ కెపాసిటీ) అంటే ఇదే. ఈ పరిమితిని చేరుకున్న తరువాత, వ్యక్తులు తాముండే ప్రదేశాల్లో కంటే, అప్పటిదాకా వెళ్ళని బయటి ప్రాంతాల్లోనే ఆహారాన్ని సంపాదించుకోవడం తేలిక అవుతుంది. హోమో హ్యాబిలిస్, దాని ఆవాస పరిధుల నుండి బయటికి విస్తరించడానికి ముందే కొన్ని కనీస ప్రవర్తనా అనుకూలతలను అభివృద్ధి చేసుకోగలిగింది (వేటాడే జంతువుల సరసన చేరడం వంటివి).[39][40] హోమో ఎరెక్టస్ ఈ అనుగుణ్యతను అందిపుచ్చుకుని, మరింతగా పెచుకుని బయటి పర్యావరణాలకు అనుకూలంగా మార్చుకుంది.[41] కొత్త, పర్యావరణ అనుగుణ్యమైన హోమినిన్ జనాభా పాత స్థావరాలకు తిరిగి వచ్చి పూర్వీకుల జనాభా స్థానాన్ని ఆక్రమించి ఉండవచ్చు.[42] అంతేకాకుండా, 18, 12, 6 లక్షల సంవత్సరాల క్రితం, దశలవారీగా అడవులు కుదించుకుపోవడం, తదనుగుణంగా హోమినిన్లను మోయగలిగే సామర్థ్యం అడవులకు తగ్గడం వంటివి, అవి బహిరంగ మైదానాలకు వెళ్ళాల్సిన అవసరాన్ని, ఒత్తిడినీ కలిగించి ఉండవచ్చు.[43][44]

హోమో ఎరెక్టస్‌కు చేకూరిన ఈ కొత్త పర్యావరణ అనుకూలత్వం, అనుకూలమైన వాతావరణం, ప్రారంభ ప్లైస్టోసీన్‌లో అది లెవాంటైన్ కారిడార్‌ దిశగా వెళ్ళడానికి ఉపకరించి ఉండవచ్చు.[4]

జంతుజాలం వెనువెంట

[మార్చు]

ఓల్డోవాన్ హోమినిన్లు మాంసాహారులు కాదని రాతి విశ్లేషణ సూచిస్తోంది.[45] అయితే, తడి కాలాల్లో ఉత్తరానికి వలస వెళ్ళే జంతువులను హోమో ఎరెక్టస్ అనుసరించినట్లు కనిపిస్తుంది, బహుశా అవి తినగా వదిలేసే ఆహారం కోసం అయి ఉండవచ్చు. కోరపళ్ళ పిల్లి మెగాంటెరియన్ ప్రారంభ, మధ్య ప్లైస్టోసీన్ కాలాల్లో ఆహార పిరమిడ్లో శీర్షాన ఉండేది. 15 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో అంతరించిపోవడానికి[46] ముందే, ఇది సినాయ్ గుండా వలస వెళ్ళింది. ఉబీడియా లోని 14 లక్షల సంవత్సరాల క్రితం నాటి లెవాంటైన్ హోమినిన్ స్థలం లోని జంతుజాల అవశేషాల్లో ఇది కూడా ఉంది.[23] ఇది ఎముకలను పగలగొట్ట లేక వాటిలోని మజ్జను వదిలేసేది. బహుశా ఈ ఎముకలే హోమినిన్లకు ముఖ్యమైన ఆహార వనరుగా ఉండి ఉండవచ్చు -మరీ ముఖ్యంగా గ్లేసియల్ కాలాల్లో.[47][48]

చల్లని యురేషియా కాలంలో, హోమినిన్‌ల ఆహారం ప్రధానంగా మాంసం అయి ఉంటుంది. అషూలియన్ వేటగాళ్ళు ఆహారం కోసం పిల్లులతో పోటీపడి ఉండాలి.

జంతువుల నుండి సంక్రమించే వ్యాధులు

[మార్చు]

ఆఫ్రికా నుండి వలస వచ్చిన హోమినిన్లు యురేషియాలో విజయవంతంగా మనగలగడానికి కారణం, ఆఫ్రికాలో ఉండే జూనోటిక్ వ్యాధులు అక్కడ లేకపోవడమని బార్-యోసేఫ్, బెల్ఫెర్-కోహెన్‌లు చెప్పారు[3] జంతువుల నుండి మానవులకు వ్యాపించే వాటిని జూనోటిక్ వ్యాధులంటారు. హోమినిన్లకే ప్రత్యేకించిన వ్యాధి ఇతరులకు వ్యాపించాలంటే, తాను ఆశించిన మానవుణ్ణి ఎక్కువ కాలం సజీవంగా ఉంచాలి. కానీ, జూనోటిక్ వ్యాధులు అలా కాదు, మనుషులు లేకపోయినా అవి తమ జీవిత చక్రాన్ని పూర్తి చేయగలవు. అయినప్పటికీ, ఈ అంటువ్యాధులు మానవ ఉనికికి బాగా అలవాటు పడ్డాయి, వాటితో పాటు పరిణామం చెందాయి. ఆఫ్రికన్ కోతి జనాభా సాంద్రత ఎంత ఎక్కువైతే, వ్యాధి అంత బాగా ప్రబలుతుంది. గొంబే రిజర్వ్ లో మరణించే చింపాంజీల్లో 55% వ్యాధుల తోనే మరణిస్తాయి. వాటిలో ఎక్కువ భాగం జూనోటిక్.[49] ఈ వ్యాధులలో ఎక్కువ భాగం ఇప్పటికీ వేడిగా, తడిగా ఉండే ఆఫ్రికన్ పర్యావరణాల్లోనే ఎక్కువగా ఉంది. హోమినిన్లు పొడిగా, చల్లగా ఉండే పై అక్షాంశాల్లోని ఆవాసాలకు మారిన తర్వాత, జనాభా పెరుగుదలకు ఉన్న ఒక ప్రధానమైన అడ్డంకి తొలగిపోయింది.

శారీరక లక్షణాలు

[మార్చు]

హోమో హ్యాబిలిస్ ఖచ్చితంగా ద్విపాది అని తేలినప్పటికీ, దాని పొడవాటి చేతులను బట్టి అది చెట్లపై నివసించడానికి అనుకూలంగా ఉండేదని తెలుస్తోంది.[50] దానితో పోలిస్తే హోమో ఎరెక్టస్‌కు పొడవాటి కాళ్లు, పొట్టి చేతులూ ఉన్నాయి. ఈ విషయాన్ని బట్టి, దీనికి భూమ్మీద జీవించడం తప్పనిసరి అయిందని భావించవచ్చు. అయితే కాలు పొడవుగా ఉండడం ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో అస్పష్టంగా ఉంది.[51] కేవల శరీర పరిమాణం, మంచి నడక సామర్థ్యానికి, మనుగడకూ దోహదపడినట్లు తెలుస్తోంది.[52] పెద్ద ఆకారం వలన హోమో ఎరెక్టస్, దేహంలో ఉండే నీటిని నెమ్మదిగా కోల్పోయేది. దీనివలన వడదెబ్బ తగిలే లోపు ఎక్కువ దూరం ప్రయాణించగలిగేది.[53] మామూలు వేగంతో సుదీర్ఘ కాలం పాటు నడవగలిగే ఈ సామర్థ్యమే యురేషియాలో వలసలు నెలకొల్పుకునేందుకు నిర్ణయాత్మక కారణమై ఉండవచ్చు.[54]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మరింత చదవడానికి

[మార్చు]
  • Antón, Susan C.; Swisher, Carl C., III (2004), "Early Dispersals of Homo from Africa", Annual Review of Anthropology, 33: 271–96, doi:10.1146/annurev.anthro.33.070203.144024.{{citation}}: CS1 maint: multiple names: authors list (link)
  • Eudald Carbonell; Marina Mosquera; Xosé Pedro Rodríguez; José María Bermúdez de Castro; Francesc Burjachs; Jordi Rosell; Robert Sala; Josep Vallverdú (2008), "Eurasian Gates: The Earliest Human Dispersals", Journal of Anthropological Research, 64 (2), (subscription required): 195–228, doi:10.3998/jar.0521004.0064.202, JSTOR 20371223, S2CID 85227705.
  • Ciochon, Russell L. (2010), "Divorcing Hominins from the Stegodon–Ailuropoda Fauna: New Views on the Antiquity of Hominins in Asia", in John G. Fleagle; et al. (eds.), Out of Africa I: The First Hominin Colonization of Eurasia, Vertebrate Paleobiology and Paleoanthropology Series, Dordrecht: Springer, pp. 111–26, doi:10.1007/978-90-481-9036-2_8, ISBN 978-90-481-9035-5. ISBN 978-90-481-9036-2 (online).
  • Dennell, Robin (2009), The Palaeolithic Settlement of Asia, Cambridge World Archaeology, Cambridge: Cambridge University Press, ISBN 978-0-521-84866-4.ISBN 978-0-521-61310-1 (paperback).
  • Dennell, Robin (2010), "'Out of Africa I': Current Problems and Future Prospects", in John G. Fleagle; et al. (eds.), Out of Africa I: The First Hominin Colonization of Eurasia, Vertebrate Paleobiology and Paleoanthropology Series, Dordrecht: Springer, pp. 247–74, doi:10.1007/978-90-481-9036-2_15, ISBN 978-90-481-9035-5. ISBN 978-90-481-9036-2 (online).
  • Rabett, Ryan J. (2012), Human Adaptation in the Asian Palaeolithic: Hominin Dispersal and Behaviour during the Late Quaternary, Cambridge: Cambridge University Press, ISBN 978-1-107-01829-7.
  • Zaim, Yahdi (2010), "Geological Evidence for the Earliest Appearance of Hominins in Indonesia", in John G. Fleagle; et al. (eds.), Out of Africa I: The First Hominin Colonization of Eurasia, Vertebrate Paleobiology and Paleoanthropology Series, Dordrecht: Springer, pp. 97–110, doi:10.1007/978-90-481-9036-2_7, ISBN 978-90-481-9035-5. ISBN 978-90-481-9036-2 (online).

మూలాలు

[మార్చు]
  1. The term "Out of Africa I" is informal and somewhat rare. The phrase Out of Africa used on its own generally refers to "Out of Africa II", the expansion of anatomically modern humans into Eurasia. "Out of Africa I" is used in 2004, in Marco Langbroek, 'Out of Africa': an investigation into the earliest occupation of the Old World, p. 61, and as the title of a collection of essays, J. G. Fleagle et al. (eds.), Out of Africa I: The First Hominin Colonization of Eurasia (2010). see also: Israel Herschkovitz (26 January 2018). "The earliest modern humans outside Africa". Science. 359 (6374): 456–459. Bibcode:2018Sci...359..456H. doi:10.1126/science.aap8369. PMID 29371468. S2CID 206664380.
  2. 2.0 2.1 2.2 Zhu Zhaoyu; Dennell Robin; Huang Weiwen (黄慰文); Wu Yi (吴翼); Qiu Shifan (邱世藩); Yang Shixia (杨石霞); Rao Zhiguo (饶志国); Hou Yamei (侯亚梅); Xie Jiubing (谢久兵) (2018). "Hominin occupation of the Chinese Loess Plateau since about 2.1 million years ago". Nature. 559 (7715): 608–612. Bibcode:2018Natur.559..608Z. doi:10.1038/s41586-018-0299-4. ISSN 0028-0836. PMID 29995848. S2CID 256770283. "Eight major magnetozones are recorded in the Shangchen section, four of which have normal polarity (N1 to N4) and four of which have reversed polarity (R1 to R4). By comparison with the geomagnetic polarity timescale […] magnetozone N4 corresponds to the Réunion excursion (2.13–2.15 Ma) in L28." ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Zhu2018" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. 3.0 3.1 3.2 Bar-Yosef, O.; Belfer-Cohen, A. (2001). "From Africa to Eurasia — early dispersals". Quaternary International. 75 (1): 19–28. Bibcode:2001QuInt..75...19B. doi:10.1016/S1040-6182(00)00074-4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Bar-Yosef, O. 2001" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. 4.0 4.1 4.2 4.3 Lahr, M. M. (2010). "Saharan Corridors and Their Role in the Evolutionary Geography of 'Out of Africa I'". In Baden, A.; et al. (eds.). Out of Africa I: The First Hominin Colonization of Eurasia. Springer Netherlands. pp. 27–46. ISBN 978-90-481-9035-5.
  5. 5.0 5.1 Straus, L. G.; Bar-Yosef, O. (2001). "Out of Africa in the Pleistocene: an introduction". Quaternary International. 75 (1): 2–4. Bibcode:2001QuInt..75....1S. doi:10.1016/s1040-6182(00)00071-9.
  6. Semaw, S (2000). "The World's Oldest Stone Artefacts from Gona, Ethiopia: Their Implications for Understanding Stone Technology and Patterns of Human Evolution Between 2·6–1·5 Million Years Ago". Journal of Archaeological Science. 27 (12): 1197–1214. Bibcode:2000JArSc..27.1197S. doi:10.1006/jasc.1999.0592.
  7. Dembo, M.; Matzke, N. J.; Mooers, A. Ø.; Collard, M. (2015). "Bayesian analysis of a morphological supermatrix sheds light on controversial fossil hominin relationships" (PDF). Proceedings of the Royal Society B: Biological Sciences. 282 (1812): 20150943. doi:10.1098/rspb.2015.0943. PMC 4528516. PMID 26202999. Retrieved 21 April 2017.
  8. Reconstruction by W. Schnaubelt & N. Kieser (Atelier WILD LIFE ART), 2006, Westfälisches Museum für Archäologie, Herne, Germany.
  9. Van Arsdale, A. P. (2013). "Homo erectus – A Bigger, Smarter, Faster Hominin Lineage". Nature Education Knowledge. 4 (1): 2.
  10. Spoor, F.; Leakey, M. G.; Gathogo, P. N.; Brown, F. H.; Antón, S. C.; McDougall, I.; Leakey, L. N. (2007). "Implications of new early Homo fossils from Ileret, east of Lake Turkana, Kenya". Nature. 448 (7154): 688–91. Bibcode:2007Natur.448..688S. doi:10.1038/nature05986. PMID 17687323. S2CID 35845.
  11. Garcia, T.; Féraud, G.; Falguères, C.; de Lumley, H.; Perrenoud, C.; Lordkipanidze, D. (2010). "Earliest human remains in Eurasia: New 40Ar/39Ar dating of the Dmanisi hominid-bearing levels, Georgia". Quaternary Geochronology. 5 (4): 443–451. Bibcode:2010QuGeo...5..443G. doi:10.1016/j.quageo.2009.09.012.
  12. Bauer, H. R. (1977). "Chimpanzee Bipedal Locomotion in the Gombe National Park, East Africa". Primates. 18 (4): 913–921. doi:10.1007/bf02382940. S2CID 41892278.
  13. William H. Kimbel, Brian Villmoare, "From Australopithecus to Homo: the transition that wasn't", Philosophical Transactions of the Royal Society B, 13 June 2016, DOI: 10.1098/rstb.2015.0248.
  14. Sahnouni, M.; Hadjois, D.; van der Made, J.; Derradji, A. Canals; Medig, M.; Belahrech, H.; Harichane, Z.; Rabhi, M. (2002). "Further research at the Oldowan site of Ain Hanech, North-eastern Algeria". Journal of Human Evolution. 43 (6): 925–937. doi:10.1006/jhev.2002.0608. PMID 12473489.
  15. Geraads, D.; Raynal, J.-P.; Eisenmann, V. (2004). "The earliest occupation of North Africa: a reply to Sahnouni et al. (2002)". Journal of Human Evolution. 46 (6): 751–761. doi:10.1016/j.jhevol.2004.01.008. PMID 15183674.
  16. Rightmire, G. P. (2001). "Patterns of hominid evolution and dispersal in the Middle Pleistocene". Quaternary International. 75 (1): 77–84. Bibcode:2001QuInt..75...77R. doi:10.1016/S1040-6182(00)00079-3.
  17. Ferring, R.; Oms, O.; Agusti, J.; Berna, F.; Nioradze, M.; Shelia, T.; Tappen, M.; Vekua, A.; Zhvania, D. (2011). "Earliest human occupations at Dmanisi (Georgian Caucasus) dated to 1.85-1.78 Ma". Proceedings of the National Academy of Sciences. 108 (26): 10432–10436. doi:10.1073/pnas.1106638108. PMC 3127884. PMID 21646521.
  18. Augusti, Jordi; Lordkipanidze, David (June 2011). "How "African" was the early human dispersal out of Africa?". Quaternary Science Reviews. 30 (11–12): 1338–1342. Bibcode:2011QSRv...30.1338A. doi:10.1016/j.quascirev.2010.04.012.
  19. 19.0 19.1 Toro-Moyano, I.; Martínez-Navarro, B.; Agustí, J.; Souday, C.; de Castro, Bermúdez; Martinón-Torres, M.; Palmqvist, P. (2013). "The oldest human fossil in Europe, from Orce (Spain)". Journal of Human Evolution. 65 (1): 1–9. doi:10.1016/j.jhevol.2013.01.012. hdl:10072/338463. PMID 23481345.
  20. 20.0 20.1 Arzarello, M.; Marcolini, F.; Pavia, G.; Pavia, M.; Petronio, C.; Petrucci, M.; Sardella, R. (2007). "Evidence of earliest human occurrence in Europe: the site of Pirro Nord (Southern Italy)". Die Naturwissenschaften. 94 (2): 107–12. Bibcode:2007NW.....94..107A. doi:10.1007/s00114-006-0173-3. PMID 17061119. S2CID 42198.
  21. Croitor, Roman (2018). "A Description of Two New Species of the Genus Rucervus (Cervidae, Mammalia) from the Early Pleistocene of Southeast Europe, with Comments on Hominin and South Asian Ruminants Dispersals". Quaternary. 1 (2): 17. doi:10.3390/quat1020017.
  22. the northermost known Middle Pleistocene site is Whithlingham, at 52.6° N. Mourre, V., Implications culturelles de la technologie des hachereaux, doctoral thesis, Université de Paris X – Nanterre (2003) Fig. 48 (p. 115).
  23. 23.0 23.1 Martínez-Navarro, B.; Belmaker, M.; Bar-Yosef, O. (2009). "The large carnivores from 'Ubeidiya (early Pleistocene, Israel): biochronological and biogeographical implications". Journal of Human Evolution. 56 (5): 514–24. doi:10.1016/j.jhevol.2009.02.004. PMID 19427671.
  24. Bednarik, R. G. (2001). "Replicating the first known sea travel by humans: the Lower Pleistocene crossing of Lombok Strait". Journal of Human Evolution. 16 (3): 229–242. doi:10.1007/bf02437414. S2CID 83823911.
  25. 25.0 25.1 Callaway, Ewan (7 June 2017). "Oldest Homo sapiens fossil claim rewrites our species' history". Nature. doi:10.1038/nature.2017.22114. Retrieved 11 June 2017. Posth, Cosimo (4 July 2017). "Deeply divergent archaic mitochondrial genome provides lower time boundary for African gene flow into Neanderthals". Nature Communications. 8: 16046. Bibcode:2017NatCo...816046P. doi:10.1038/ncomms16046. PMC 5500885. PMID 28675384.
  26. Armitage, Simon J.; Jasim, Sabah A.; Marks, Anthony E.; Parker, Adrian G.; Usik, Vitaly I.; Uerpmann, Hans-Peter (January 2011). "The southern route "out of Africa": evidence for an early expansion of modern humans into Arabia". Science. 331 (6016): 453–6. Bibcode:2011Sci...331..453A. doi:10.1126/science.1199113. PMID 21273486. S2CID 20296624.
  27. Pagani, Luca (13 October 2016). "Genomic analyses inform on migration events during the peopling of Eurasia". Nature. 538 (7624): 238–242. Bibcode:2016Natur.538..238P. doi:10.1038/nature19792. PMC 5164938. PMID 27654910.
  28. Posth C, Renaud G, Mittnik M, Drucker DG, Rougier H, Cupillard C, Valentin F, Thevenet C, Furtwängler A, Wißing C, Francken M, Malina M, Bolus M, Lari M, Gigli E, Capecchi G, Crevecoeur I, Beauval C, Flas D, Germonpré M, van der Plicht J, Cottiaux R, Gély B, Ronchitelli A, Wehrberger K, Grigorescu D, Svoboda J, Semal P, Caramelli D, Bocherens H, Harvati K, Conard NJ, Haak W, Powell A, Krause J (2016). "Pleistocene Mitochondrial Genomes Suggest a Single Major Dispersal of Non-Africans and a Late Glacial Population Turnover in Europe". Current Biology. 26 (6): 827–833. doi:10.1016/j.cub.2016.01.037. PMID 26853362. S2CID 140098861.
  29. Haber M, Jones AL, Connel BA, Asan, Arciero E, Huanming Y, Thomas MG, Xue Y, Tyler-Smith C (June 2019). "A Rare Deep-Rooting D0 African Y-chromosomal Haplogroup and its Implications for the Expansion of Modern Humans Out of Africa". Genetics. 212 (4): 1421–1428. doi:10.1534/genetics.119.302368. PMC 6707464. PMID 31196864.
  30. Redfield, T. F.; Wheeler, W. H.; Often, M. (2003). "A kinematic model for the development of the Afar depression and its paleogeographic implications". Earth and Planetary Science Letters. 216 (3): 383–398. Bibcode:2003E&PSL.216..383R. doi:10.1016/s0012-821x(03)00488-6.
  31. Haq, B. U.; Hardenbol, J.; Vail, P. R. (1987). "Chronology of fluctuating sea levels since the Triassic". Science. 235 (4793): 1156–67. Bibcode:1987Sci...235.1156H. doi:10.1126/science.235.4793.1156. PMID 17818978. S2CID 24673686.
  32. Chauhan, P. R. (2009). "Early Homo Occupation Near the Gate of Tears: Examining the Paleoanthropological Records of Djibouti and Yemen", in: E. Hover and D.R. Braun (Eds.) Interdisciplinary Approaches to the Oldowan, Springer Netherlands, 49–59. doi:10.1007/978-1-4020-9059-2
  33. Groucutt, H. S.; Petraglia, M. D. (2012). "The prehistory of the Arabian peninsula: deserts, dispersals, and demography". Evolutionary Anthropology. 21 (3): 113–25. doi:10.1002/evan.21308. PMID 22718479. S2CID 13705573.
  34. Carbonell, E. J. M.; Bermudez de Castro, J. L. A.; Allue, E.; Bastir, M.; Benito, A.; Caceres, I.; Verges, J. M. (2005). "An Early Pleistocene hominin mandible from Atapuerca-TD6, Spain". Proceedings of the National Academy of Sciences. 102 (16): 5674–5678. Bibcode:2005PNAS..102.5674C. doi:10.1073/pnas.0501841102. PMC 556125. PMID 15824320.
  35. Carbonell, E.; Bermúdez de Castro, J. M.; Parés, J. M.; Pérez-González, A.; Cuenca-Bescós, G.; Ollé, A.; Arsuaga, J. L. (2008). "The first hominin of Europe" (PDF). Nature. 452 (7186): 465–9. Bibcode:2008Natur.452..465C. doi:10.1038/nature06815. hdl:2027.42/62855. PMID 18368116. S2CID 4401629.
  36. Alimen, H. (1975). "Les 'Isthmes' hispano-marocain et Sicilo-Tunisien aux temps Acheuléens". L'Anthropologie, 79, 399–436.
  37. Bianchini, G. (1973). "Gli 'hacheraux' nei giacimenti paleolitici della Sicilia sud occidentale". Proceedings of the XV Scientific Meeting of the Italian Institute of Prehistory and Protohistory, 11–25 October 1972.
  38. Villa, P (2001). "Early Italy and the colonization of Western Europe". Quaternary International. 75 (1): 113–130. Bibcode:2001QuInt..75..113V. doi:10.1016/s1040-6182(00)00083-5.
  39. Brantingham, P. J. (1998). "Hominid–Carnivore Coevolution and Invasion of the Predatory Guild". Journal of Anthropological Archaeology. 17 (4): 327–353. doi:10.1006/jaar.1998.0326.
  40. Lewis, M. E., & Werdelin, L. (2007). "Patterns of change in the Plio-Pleistocene carnivorans of eastern Africa: Implications for hominin Evolution". In R. Bobe, Z. Alemseged, & A. K. Behrensmeyer (Eds.), Hominin environments in the East African Pliocene: An assessment of the faunal evidence. Springer, 77–106.
  41. Marean, C. W. (1989). "Sabertooth cats and their relevance for early hominid diet and evolution". Journal of Human Evolution. 18 (6): 559–58. doi:10.1016/0047-2484(89)90018-3.
  42. Eldredge, N.; Gould, S. J. (1997). "On Punctuated Equilibria". Science. 276 (5311): 337–341. doi:10.1126/science.276.5311.337c. PMID 9139351.
  43. Potts, R (1996). "Evolution and climate variability". Science. 273 (5277): 922–923. Bibcode:1996Sci...273..922P. doi:10.1126/science.273.5277.922. S2CID 129580598.
  44. Cerling, T.E.; Harris, J.M.; MacFadden, B.J.; Leakey, M.G.; Quade, J.; Eisenmann, V.; Erleringer, J.R. (1997). "Global vegetation change through the Miocene/Pliocene boundary" (PDF). Nature. 389 (6647): 153–158. Bibcode:1997Natur.389..153C. doi:10.1038/38229. S2CID 4400133.
  45. Shipman, P. A. T. (1984). Hunting in Early Hominids: Theoretical Framework and Tests, 27–43.
  46. Arribas, A.; Palmqvist, P. (1999). "On the Ecological Connection Between Sabre-tooths and Hominids: Faunal Dispersal Events in the Lower Pleistocene and a Review of the Evidence for the First Human Arrival in Europe". Journal of Archaeological Science. 26 (5): 571–585. Bibcode:1999JArSc..26..571A. doi:10.1006/jasc.1998.0346.
  47. Lewis, M.E., Werdelin, L. (2010). "Carnivoran Dispersal Out of Africa During the Early Pleistocene: Relevance for Hominins?". In: A. Baden et al. (Eds.), Out of Africa I: The First Hominin Colonization of Eurasia. Springer Netherlands, pp. 13-26.
  48. Turner, A (1999). "Assessing earliest human settlement of Eurasia: Late Pliocene dispersions from Afric". Antiquity. 73 (281): 563–570. doi:10.1017/s0003598x0006511x. S2CID 162093694.
  49. Goodall, J., (1986). The Chimpanzees of Gombe: Patterns of Behavior. Belknap Press of Harvard University Press, Cambridge, MA.
  50. Ruff, C (2009). "Relative limb strength and locomotion in Homo habilis". American Journal of Physical Anthropology. 138 (1): 90–100. doi:10.1002/ajpa.20907. PMID 18711733.
  51. Steudel, K (1996). "Limb morphology, bipedal gait, and the energetics of hominid locomotion". American Journal of Physical Anthropology. 99 (2): 345–55. doi:10.1002/(SICI)1096-8644(199602)99:2<345::AID-AJPA9>3.0.CO;2-X. PMID 8967332.
  52. Steudel, K. L. (1994). "Locomotor energetics and hominid evolution". Evolutionary Anthropology: Issues, News, and Reviews. 3 (2): 42–48. doi:10.1002/evan.1360030205. S2CID 85387559.
  53. Wheeler, P. E. (1992). "The thermoragulatory advantages of large body size for hominids foraging in Savannah environments". Journal of Human Evolution. 23 (4): 351–362. doi:10.1016/0047-2484(92)90071-g.
  54. Klein, R. G. (1999). The human career: Human biological and human origins, (2nd ed.). Chicago: Chicago University Press. 249-250.