ఒరంగుటాన్
ఒరంగుటాన్[1] | |
---|---|
![]() | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | Elliot, 1912
|
Genus: | Pongo Lacépède, 1799
|
Type species | |
Pongo borneo Lacépède, 1799 (= Simia pygmaeus Linnaeus, 1760)
| |
Species | |
![]() | |
Orangutan distribution |
ఒరంగుటాన్ (ఆంగ్లం Orangutan) ఒక విధమైన క్షీరదము. హోమినిడే వర్గానికి చెందిన రెండు జాతుల కోతులను కలిపి ఒరాంగుటాన్ అని వ్యవహరిస్తుంటారు. వీటి తెలివికి ప్రసిద్ధి చెందిన ఒరాంగుటాన్లు చెట్లపై నివసిస్తాయి. చెట్లపై నివసించే జంతువులలో ఒరాంగుటాన్లే అత్యంత పెద్దవి. ఇతర కోతుల కంటే వీటికి పొడవాటి చేతులు ఉంటాయి. సాధారణంగా వీటి జుట్టు ఇతర పెద్ద కోతుల వలె ముదురు గోధుమ లేదా నలుపు రంగులలో కాకుండా ఎరుపు ఛాయలున్న ముదురు గోధుమ వర్ణంలో ఉంటుంది. ఇండోనేషియా, మలేషియాలకు స్థానికమైన ఒరాంగుటాన్లు, కేవలం బోర్నియో, సుమాత్రా ద్వీపాల్లోని ఉష్ణమండల అడవుల్లోనే కనిపిస్తాయి. వీటి శిలాజాలు మాత్రం జావా, థాయ్-మలయ్ ద్వీపకల్పం, వియత్నాం, చైనాలలో కూడా లభ్యమౌతున్నాయి. పాంజినే ఉపకుటుంబంలో పాంగో జాతిలో కేవలం రెండే సజీవ ప్రజాతులున్నాయి. ఈ ఉపకుటుంబంలో జైజాంటోపిథకస్, శివాపిథకస్ అనే అంతరించిపోయిన జాతులు కూడా ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ Groves, C. (2005). Wilson, D. E., & Reeder, D. M, eds (ed.). Mammal Species of the World (3rd ed.). Baltimore: Johns Hopkins University Press. pp. 183–184. OCLC 62265494. ISBN 0-801-88221-4.
{{cite book}}
:|editor=
has generic name (help); Invalid|ref=harv
(help)CS1 maint: multiple names: editors list (link)