Jump to content

తుమ్మా సంజయ్

వికీపీడియా నుండి
సంజయ్ తుమ్మా
జననం (1970-04-26) 1970 ఏప్రిల్ 26 (వయసు 54)
విద్యడిప్లొమా ఇన్ హోటల్ మెనేజ్మెంట్, ఇండియన్ హోటల్ మెనేజ్మెంట్, హైద్రాబాద్
వెబ్‌సైటుhttp://www.vahrehvah.com

తుమ్మా సంజయ్ ( జననం: ఏప్రిల్ 26, 1970 ) భారతీయ చెఫ్. ఈయనకు వహ్ చెఫ్ అనే పేరుంది. ఈయన వహ్రేహ్వా.కామ్ అనే వెబ్సైట్ వ్యవస్థాపకుడు. ఈయన వంటకాలను యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో నివసిస్తున్న భారతీయులు మెచ్చుతారు.[1]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ఈయన 1970, ఏప్రిల్ 26 న హైద్రాబాద్ లో జన్మించాడు. ఈయన ఇండియన్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ లో హోటల్ మేనేజ్మెంట్ విభాగంలో డిప్లొమా విద్యను పూర్తి చేశాడు..[2]

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈయన తన 7 వ ఏటనే వంటలు చేయడం నేర్చుకున్నాడు. ఈయన తన అమ్మ వెంట వంట గదిలోకి తరచు వెళ్లి వంట చేయడం నేర్చుకున్నాడు. అలా చేస్తూ వంటపై మక్కువ పెంచుకొని హైద్రాబాద్ లోని ఇండియన్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ లో హోటల్ మేనేజ్మెంట్ విభాగంలో డిప్లొమా విద్యను పూర్తి చేశాడు. ఇలా పూర్తి చేసి అనంతరం తన మొదటి రెస్టారెంట్ ని చికాగోలో సిజిల్ ఇండియా పేరుతో ప్రారంభించాడు. 2007 లో చికాగోలో ఒక స్టూడియో ను ఏర్పరచుకొని అందులో 150 కి పైగా వంటకాలు రికార్డ్ చేసి యూట్యూబ్ లో తన ఛానల్ వహ్వాహ(Vahwah) లో పెట్టాడు. అతను పెట్టిన ప్రతి వంటకాన్ని కి పది లక్షలకు పైగా వీక్షకులు వీక్షించారు. అప్పటి నుంచి ఇతని వంటకాలు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణను పొందుతున్నాయి.,[3]

మూలాలు

[మార్చు]
  1. Murthy, Neeraja (20 June 2013). "Cooking it up virtually". The Hindu. Retrieved 25 February 2019.
  2. Vidya, Bisket. "9 Things You Should Know About Vah Chef, Sanjay Thumma!". Chai Bisket (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2017-11-07. Retrieved 2017-11-05.
  3. Muthalaly, Shonali (21 May 2014). "Hot on accessories". thehindu.com. Retrieved 21 February 2016.