జటాయు సేన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీతను రావణుడు అపహరించేటపుడు అడ్డుకొన్న జటాయువు

జటాయు సేన మహిళలు, చిన్నారుల భద్రతకు కంకణబద్ధమైన సేన. దీని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సి.ఎస్.రంగరాజన్ 2019 ఆగస్టు 13న ప్రారంభించాడు.[1]

నేపధ్యం

[మార్చు]

మొయినాబాద్‌లో ఓ ఘటన జరిగింది. ఓ ఆగంతుకుడు ద్విచక్రవాహనంపై 10 ఏళ్ల బాలికను తీసుకెళ్తున్నాడు. ఆ బాలిక గట్టిగా ఏడుస్తోంది. ఆ దారిలో పోయే ఎవ్వరూ రక్షించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. దుండగుడి బారి నుంచి ఆ బాలికను నదీమ్‌ అనే వ్యక్తి కాపాడాడు. మహిళా భద్రత కోసం, స్త్రీలపై అనుచితంగా ప్రవర్తించేవారిని అడ్డుకున్న ఆ వ్యక్తిలాంటి వారితో కలసి "జటాయు సేన"ను రంగరాజన్ ప్రారంభించాడు. స్త్రీలపై అనుచితంగా ప్రవర్తించేవారిని అడ్డుకున్న వ్యక్తులే జటాయు సైనికులు.[2] ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, చివరికి ప్రతి ఇంట్లో ఈ సేన ఉండాలనేది వారి ఆకాంక్ష. స్త్రీలను గౌరవించే ప్రతి ఒక్కరూ జటాయు సేన సభ్యులే. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిని అడ్డుకోవడమే జటాయుసేన లక్ష్యం. రామాయణంలో రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లేప్పుడు జటాయువు ఆ దశకంఠుడిని అడ్డుకుని, ప్రాణత్యాగం చేసింది. ఆ పక్షి పేరుతోనే మహిళా భద్రతకు జటాయు సేనను ప్రారంభిస్తున్నట్లు రంగరాజన్‌ తెలిపాడు.[3] దుండగుడి బారి నుంచి బాలికను కాపాడిన నదీమ్‌ అనే వ్యక్తి ఈ సేనలో తొలి సైనికుడిగా చేరాడు. నదీమ్‌ను రంగరాజన్ దుశ్శాలువా, పూలమాలతో సన్మానించాడు. ప్రతి ఒక్కరూ నదీమ్‌లా ఆలోచించి మహిళలు, చిన్నారులపై దాడులను అడ్డుకోవాలని అతను పిలుపునిచ్చాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Chilkur temple forms Jatayu Sena".
  2. "చిలుకూరు ఆలయం ఆధ్వర్యంలో "జటాయు సేన"". Archived from the original on 2019-08-15. Retrieved 2019-08-15.
  3. "మహిళల భద్రతకు జటాయు సేన".[permanent dead link]
  4. "'జటాయు సేన' ప్రారంభం".[permanent dead link]
  5. "Women protection: Visa Balaji temple forms Jatayu Sena".

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జటాయు_సేన&oldid=3831960" నుండి వెలికితీశారు