సి. ఎస్. రంగరాజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి. ఎస్. రంగరాజన్
విద్యబయోమెడికల్ ఇంజనీరింగ్
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తిఅర్చకుడు
తల్లిదండ్రులు
  • సౌందరరాజన్ (తండ్రి)
చిలుకూరు బాలాజీ ఆలయం
చిలుకూరు తిరుగుబాటు

సి. ఎస్. రంగరాజన్ చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు.[1] వృత్తి రీత్యా బయో మెడికల్ ఇంజనీరు అయిన రంగరాజన్ సాంప్రదాయబద్ధంగా వస్తున్న చిలుకూరు బాలాజీ ఆలయ అర్చక బాధ్యతలను స్వీకరించడం కోసం ఆ వృత్తిని వదిలి పెట్టాడు. ఈయన ఒక దళిత భక్తుని భుజాలపై ఎక్కించుకుని ఆలయ ప్రవేశం చేయించి అంతర్జాతీయ గుర్తింపు పొందాడు.[2]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

రంగరాజన్ తండ్రి చిలుకూరు బాలాజీ సాంప్రదాయ అర్చకులైన సౌందరరాజన్. సౌందరరాజన్ తన అర్చక సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నత విద్యనభ్యసించాడు. కామర్స్ లెక్చరర్ గా చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగాడు. ముగ్గురు మగపిల్లల్లో రంగరాజన్ రెండో వాడు. క్రైస్తవ మిషనరీ పాఠశాలలో చదివాడు. ఈయనకు చిన్నప్పటి నుంచి వైద్యరంగం మీద ఆసక్తి ఉండేది. కానీ లెక్కల్లో మంచి మార్కులు వచ్చేవి. రెండింటి కలయికగా ఉంటుందని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బయోమెడికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆఖరి సంవత్సరంలో ఉండగానే సహాధ్యాయి నరేంద్ర తో కలిసి తక్కువ ఖర్చుతో పని చేసే సిరంజీ ఇన్ఫ్యూషన్ పంప్ ని కనిపెట్టాడు.

ఉద్యోగం

[మార్చు]

తాము కనిపెట్టిన పరికరాన్ని పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేయడం కోసం నరేంద్రతో కలిసి ఎన్. ఆర్ బయోమెడికల్స్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించాడు. కానీ కొద్దిరోజులకే వీరిద్దరికీ మనస్పర్థలు వచ్చి రంగరాజన్ చెన్నై కి చెందిన మెడ్ ట్రానిక్స్ సంస్థలో ఉద్యోగిగా చేరాడు. ఆరేళ్ళ తర్వాత అదే సంస్థ హైదరాబాదులో విభాగం ప్రారంభించడంతో అక్కడికి మారిపోయాడు. ఆ సంస్థ దక్షిణాదికంతా ముఖ్య అధికారిగా నియమించింది.

అర్చకత్వం

[మార్చు]

చిలుకూరులో వెంకటేశ్వర స్వామి విగ్రహం వెలసిన తర్వాత అక్కడికి వచ్చిన అహోబిలం మఠం స్వామీజీ అక్కడ పూజలు చేయడం కోసం తన శిష్యుణ్ణి అక్కడే ఉండిపొమ్మన్నాడనీ, రంగరాజన్ ఆ వంశస్థుడేనని ఆయన విశ్వాసం.

జటాయు సేన

[మార్చు]

జటాయు సేన మహిళలు, చిన్నారుల భద్రతకు కంకణబద్ధమైన సేన. దీని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సి.ఎస్.రంగరాజన్ 2019 ఆగస్టు 13న ప్రారంభించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Adivi, Sashidhar (17 April 2018). "Chilkur Balaji temple priest re-enacts 2,700-year-old ritual". Deccan Chronicle. Deccan Chronicle. Retrieved 27 May 2018.
  2. జె., రాజు (20 May 2018). "ఆ స్పర్శకి కన్నీళ్లొచ్చేశాయ్‌..!". eenadu.net. ఈనాడు. Archived from the original on 2018-05-26. Retrieved 27 May 2018.
  3. "Chilkur temple forms Jatayu Sena".