Jump to content

మెట్ఫార్మిన్

వికీపీడియా నుండి
మెట్ఫార్మిన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
N,N-డైమిథైలిమిడో డై కార్బో నిమిడిక్ డయామైడ్
Clinical data
వాణిజ్య పేర్లు ఫోర్టామెట్, గ్లూకోఫేజ్, గ్లుమెట్జా
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a696005
లైసెన్స్ సమాచారము EMA:[[[:మూస:EMA-EPAR]] Link]US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం C (AU) ? (US)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (CA) POM (UK) -only (US)
Routes నోటి ద్వారా తీసుకుంటారు
Pharmacokinetic data
అర్థ జీవిత కాలం 4–8.7 గంటలు
Excretion Urine (90%)
Identifiers
ATC code ?
Chemical data
Formula C4H11N5 
  • CN(C)C(=N)N=C(N)N
  • InChI=1S/C4H11N5/c1-9(2)4(7)8-3(5)6/h1-2H3,(H5,5,6,7,8)
    Key:XZWYZXLIPXDOLR-UHFFFAOYSA-N checkY

Physical data
Density 1.3±0.1 g/cm³

మెట్ఫార్మిన్, అనేది మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఉపయోగించే ఔషధము. దీనిని గ్లుకోఫేజ్ వాణిజ్య పేరు క్రింద విక్రయించుతారు. ఇది టైప్ 2 మధుమేహం చికిత్సకు ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారిలో[1], మొదటగా సిఫారసు చేసే ఔషధం.[2][3] ఇది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ చికిత్సలో కూడా ఉపయోగించుతారు. దీనికి, బరువు పెరుగుటతో సంబంధం లేదు. దీనిని నోటి ద్వారా తీసుకుంటారు.[2] ప్రభావం 4 నుండి 8 గంటల సగటు వ్యవధిలొ ఉంటుంది. మెట్‌ఫార్మిన్ మరియు ఫెన్‌ఫార్మిన్ మధుమేహం చికిత్సలో ప్రధానమైన మందులు. అయినప్పటికీ, వీటిని వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

రోగులు మెట్ఫార్మిన్ ఔషధాన్ని సాధారణంగా బాగా తట్టుకోగలరు.[4] సాధారణ దుష్ప్రభావాలలో అతిసారం, వికారం, కడుపు నొప్పి ఉంటాయి. దీని వలన రక్తంలో చక్కెర తగ్గిపోయే ప్రమాదాన్ని ఎక్కువ ఉండదు. మందులను అతిగా పెద్ద మోతాదులో ఉపయోగించినా లేదా తీవ్రమైన మూత్రపిండాల సమస్యలు ఉన్న వ్యక్తులలోను ఈ ఔషధాన్ని సిఫారసు చేస్తే రక్తంలో అధిక లాక్టిక్ ఆమ్లం స్థాయిలు ఏర్పడి, ఆందోళన కలిగిస్తుంది. కాలేయ వ్యాధి ఉన్న వారికి కూడా దీనిని సిఫారసు చేయరు. గర్భధారణ సమయంలో ఏర్పడే మధుమేహానికి ఈ ఔషధ వినియోగం వల్ల స్పష్టమైన హాని లేనప్పటికీ, సాధారణంగా ఇన్సులిన్ కు ప్రాధాన్యత ఇస్తారు. మెట్ఫార్మిన్ ఒక బిగువనైడ్ యాంటీహైపర్ గ్లైసిమిక్ ఏజెంట్ (మందు). కాలేయం ద్వారా గ్లూకోజ్ ఉత్పత్తి తగ్గించి, శరీర కణజాలాల ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది.[2]

1922లో మెట్ఫార్మిన్ ను కనుగొన్నారు. ఫ్రెంచ్ వైద్యుడు జీన్ స్టెర్న్ 1950లలో మానవులపై దీని ప్రభావం గురించి అధ్యయనం ప్రారంభించాడు. ఈ మెట్ఫార్మిన్ మధుమేహం కోసం అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఔషధం.[5] ఇది సాధారణ ఔషధంగా అందుబాటులో ఉంది.[2] 1957 లో ఫ్రాన్స్ లో, 1995 లో యునైటెడ్ స్టేట్స్ లో దీనిని ఔషధంగా ప్రవేశపెట్టారు.[2][6] దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చారు.[7] అభివృద్ధి చెందిన దేశాల్లో 2014 నాటికి దీని ధర నెలకు US $0.20 ఇంకా $6 మధ్య ఉంది.[8] యునైటెడ్ స్టేట్స్ లో ఇది నెలకు 5 నుండి 25 USD వరకు ఖర్చు అవుతుంది.[2] UKలో, ఒక ప్రామాణిక 500 mg టాబ్లెట్ ధర సుమారు £13.[9] 2017 నాటికి యునైటెడ్ స్టేట్స్ లో దీనికి 78 మిలియన్లకు పైగా ప్రిస్క్రిప్షన్లు లభించాయి . ఇది వైద్యులు సాధారణంగా సూచించే నాల్గవ ఔషధం.[10][11]

మెట్‌ఫార్మిన్ మరియు ఫెన్‌ఫార్మిన్ అనే మందులు, తరచుగా మార్కెట్లో గ్లైసీ ఫేజ్ వంటి బ్రాండ్ పేర్లతో లభిస్తాయి. ఈ మందులు దాదాపు 50 సంవత్సరాలుగా మధుమేహం చికిత్సలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. వీటి ప్రధాన పని శరీర కణాలలో గ్లూకోజ్ (చక్కెర) వినియోగాన్ని పెంచడం, ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం.

చరిత్ర: ప్రారంభంలో ఈ మందులను కటిక చేదుగా ఉండే 'ఫ్రెంచ్ లేలాక్' అనే పువ్వు నుండి తయారు చేసేవారు.

ప్రయోజనాలు:

రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ: ఈ మందులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని తగ్గించడంలో సహాయపడతాయి.మధుమేహం వచ్చి పదేళ్లు దాటిన తర్వాత కూడా అలాగే ఈ మందులను వాడటం సరైనది కాదు. సన్నగా ఉన్నవారు ఈ మందులను వాడకూడదు. లావుగా ఉన్నవారికి ఇవి మంచివి. హైపోగ్లైసీమియా ప్రమాదం తక్కువ: ఈ మందుల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా చాలా తగ్గిపోయే ప్రమాదం (హైపోగ్లైసీమియా) తక్కువ. నిత్య జీవనశైలికి అనుకూలం: నియమ నిబంధనలు లేకుండా తినే మధుమేహ రోగులకు ఇవి బాగా ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యం: 14 సంవత్సరాల పాటు ఈ మందులను ఉపయోగించిన మధుమేహ రోగులలో గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. బరువు తగ్గింపు: ఈ మందులు బరువు తగ్గించడంలో కూడా సహాయపడతాయి

మూలాలు

[మార్చు]
  1. Clinical Obesity (2nd ed.). Oxford: John Wiley & Sons. 2008. p. 262. ISBN 978-0-470-98708-7. Archived from the original on 2017-09-08.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Metformin Hydrochloride". The American Society of Health-System Pharmacists. Archived from the original on 24 December 2016. Retrieved 2 January 2017.
  3. Maruthur NM, Tseng E, Hutfless S, Wilson LM, Suarez-Cuervo C, Berger Z, Chu Y, Iyoha E, Segal JB, Bolen S (June 2016). "Diabetes Medications as Monotherapy or Metformin-Based Combination Therapy for Type 2 Diabetes: A Systematic Review and Meta-analysis". Annals of Internal Medicine. 164 (11): 740–51. doi:10.7326/M15-2650. PMID 27088241.
  4. Triggle CR, Ding H (January 2017). "Metformin is not just an antihyperglycaemic drug but also has protective effects on the vascular endothelium". Acta Physiologica. 219 (1): 138–151. doi:10.1111/apha.12644. PMID 26680745.
  5. Fischer, Janos (2010). Analogue-based Drug Discovery II. John Wiley & Sons. p. 49. ISBN 978-3-527-63212-1. Archived from the original on 2017-09-08.
  6. McKee, Mitchell Bebel Stargrove, Jonathan Treasure, Dwight L. (2008). Herb, nutrient, and drug interactions : clinical implications and therapeutic strategies. St. Louis, Mo.: Mosby/Elsevier. p. 217. ISBN 978-0-323-02964-3. Archived from the original on 2017-09-08.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  7. World Health Organization (2019). World Health Organization model list of essential medicines: 21st list 2019. Geneva: World Health Organization. hdl:10665/325771. WHO/MVP/EMP/IAU/2019.06. License: CC BY-NC-SA 3.0 IGO.
  8. "Metformin". Archived from the original on 3 August 2017. Retrieved 11 January 2016.
  9. Hitchings, Andrew; Lonsdale, Dagan; Burrage, Daniel; Baker, Emma (2019). The Top 100 Drugs: Clinical Pharmacology and Practical Prescribing (in ఇంగ్లీష్) (2nd ed.). Elsevier. pp. 154–155. ISBN 978-0-7020-7442-4. Archived from the original on 22 May 2021. Retrieved 9 November 2021.
  10. "The Top 300 of 2020". ClinCalc. Archived from the original on 12 February 2021. Retrieved 7 April 2020.
  11. "Metformin Hydrochloride - Drug Usage Statistics". ClinCalc. 23 December 2019. Archived from the original on 19 May 2021. Retrieved 7 April 2020.