వరల్డ్ వైడ్ వెబ్
పొడిపదాలు | WWW |
---|---|
మొదలైన తేదీ | 1989టిమ్ బెర్నర్స్ లీ | by
సంస్థ | సెర్న్ |
వరల్డ్ వైడ్ వెబ్ (WWW లేదా వెబ్) అనేది అంతర్జాలం (ఇంటర్నెట్) ద్వారా సమాచారాన్ని పంచుకునే వేదిక. దీని ద్వారా సాంకేతిక నిపుణులే కాకుండా సామాన్యులు కూడా సులభంగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వీలుంటుంది.[1] ఇది హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ (HTTP) యొక్క నిర్దిష్ట నిబంధనల ప్రకారం పత్రాలు మరియు ఇతర వెబ్ వనరులను ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.[2]
వెబ్ ను ఆంగ్ల కంప్యూటర్ శాస్త్రవేత్త అయిన టిమ్ బెర్నర్స్ లీ 1989 లో సెర్న్ లో పనిచేస్తుండగా రూపొందించాడు. దీన్ని 1991 లో ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా సమాచార నెట్వర్క్ సృష్టించాలనే ఉద్దేశంతో దీనిని రూపొందించారు. పత్రాలు మరియు ఇతర మీడియా కంటెంట్ వెబ్ సర్వర్ల ద్వారా నెట్‌వర్క్‌కు అందుబాటులో ఉంటాయి. వెబ్ బ్రౌజర్ల వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా వీటిని యాక్సెస్ చేయవచ్చు. వరల్డ్ వైడ్ వెబ్‌లోని సర్వర్‌లు, వనరులను యూనిఫాం రిసోర్స్ లొకేటర్ (URL) ద్వారా గుర్తిస్తాము.
అసలైనవీ, ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నవీ హైపర్‌టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ (HTML) సాయంతో సృష్టించబడిన వెబ్ పేజీ డాక్యుమెంట్లే. HTML లో వాడుకరి ఇంటరాక్షన్ కి ఉపయోగపడే ప్లెయిన్ టెక్స్ట్, బొమ్మలు, ఆడియోలు, వీడియోలు, స్క్రిప్టులు మొదలైనవన్నీ ఇంప్లిమెంట్ చేసే వీలుంది. అందులో ఇతర వెబ్ రిసోర్సులకు దారి చూపే హైపర్ లింకులను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి హైపర్ లింకులను అనుసరిస్తూ వివిధ వెబ్ సైట్లలో విహరించడాన్ని వెబ్ నావిగేషన్ లేదా వెబ్ సర్ఫింగ్ అంటారు. వెబ్ అప్లికేషన్లు అంటే అప్లికేషన్ సాఫ్ట్‌వేర్లలాగా పనిచేసే వెబ్ పేజీలు. వెబ్ లో సమాచారం HTTP (హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్) ద్వారా అంతర్జాలంలో ప్రయాణిస్తూ ఉంటుంది. ఒకే రకమైన ఇతివృత్తం కలిగిన వెబ్ వనరులను కలిపి, సాధారణంగా ఒక డొమైన్ పేరుతో ఒక వెబ్‌సైటును తయారు చేస్తాయి. ఒకే వెబ్ సర్వర్ పలు వెబ్‌సైట్‌లను అందించవచ్చు. అయితే కొన్ని వెబ్‌సైట్‌లు, ముఖ్యంగా అత్యంత జనాదరణ పొందినవి బహుళ సర్వర్ల ద్వారా అందించబడవచ్చు. అనేక వ్యాపార, ప్రభుత్వ సంస్థలు, వ్యక్తిగత వినియోగదారులు వెబ్‌సైట్ కంటెంట్ ని సృష్టిస్తూ ఉంటారు. ఇందులో అపారమైన విద్యా, వినోదం, వాణిజ్య, ప్రభుత్వ సమాచారం ఉంది.
ప్రస్తుతం వెబ్ అనేది ప్రపంచంలో అత్యంత ప్రబలమైన సమాచార వేదిక.[3][4][5] ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్లమంది ప్రజలు ఇంటర్నెట్ ని దీని ద్వారానే వినియోగిస్తున్నారు.
చరిత్ర
[మార్చు]ఆంగ్ల కంప్యూటర్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్ లీ సెర్న్ లో పనిచేస్తుండగా వెబ్ ను ఆవిష్కరించాడు.[6][7] ప్రతిక్షణం మారుతూ ఉండే తను పనిచేసే పెద్ద సంస్థలో పత్రాలనూ, డేటా ఫైళ్ళనూ భద్రపరచడం, తాజాకరించడం, వెతుకులాడటం అనే సమస్యకు పరిష్కారం కనుగొనాలని అనుకున్నాడు. అంతే కాకుండా సెర్న్ తో కలిసి పనిచేసే బయటి సంస్థలతో సమాచారాన్ని పంచుకోవడం కూడా ఇందులో భాగమే. సాధారణంగా యునిక్స్ ఆపరేటింగ్ సిస్టం లో ఉండే ట్రీ నిర్మాణం ప్రకారం నిర్వహించడానికి ఆయనకు ఇష్టం లేదు. అలాగే వాక్స్ నోట్స్ తరహాలో కీవర్డ్స్ ఆధారంగా నిర్వహించే పద్ధతి కూడా అతనికి నచ్చలేదు. 1980 లో సెర్న్ లో తాను రూపొందించిన ఎన్‌క్వైర్ అనే ప్రైవేట్ సిస్టంలో భావనలను వాడటానికి నిర్ణయించుకున్నాడు. 1965 లో టెడ్ నెల్సన్ రూపొందించిన హైపర్ టెక్స్ట్ నమూనా గురించి తెలుసుకున్నాడు. అందులో పత్రాలలో ఉండే పాఠ్యంలోనే హాట్‌స్పాట్ అనబడే హైపర్ లింక్స్ ద్వారా మనకు ఇష్టం వచ్చిన రీతిలో అనుసంధానం చేసుకోవచ్చు. తాను ఆలోచిస్తున్న మార్గం సరైనదే అని ధృవపరిచిందీ భావన.[8][9]
మూలాలు
[మార్చు]- ↑ Wright, Edmund, ed. (2006). The Desk Encyclopedia of World History. New York: Oxford University Press. p. 312. ISBN 978-0-7394-7809-7.
- ↑ "What is the difference between the Web and the Internet?". W3C Help and FAQ. W3C. 2009. Archived from the original on 9 July 2015. Retrieved 16 July 2015.
- ↑ Bleigh, Michael (16 May 2014). "The Once And Future Web Platform". TechCrunch. Archived from the original on 5 December 2021. Retrieved 9 March 2022.
- ↑ "World Wide Web Timeline". Pews Research Center. 11 March 2014. Archived from the original on 29 July 2015. Retrieved 1 August 2015.
- ↑ Dewey, Caitlin (12 March 2014). "36 Ways The Web Has Changed Us". The Washington Post. Archived from the original on 9 September 2015. Retrieved 1 August 2015.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;AHT
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;samm2016
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Rutter, Dorian (2005). From Diversity to Convergence: British Computer Networks and the Internet, 1970-1995 (PDF) (Computer Science thesis). The University of Warwick. Archived (PDF) from the original on 10 October 2022. Retrieved 27 December 2022.
- ↑ Tim Berners-Lee (1999). Weaving the Web. Internet Archive. HarperSanFrancisco. pp. 5–6. ISBN 978-0-06-251586-5.