వెబ్ సర్వర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Multiple web servers may be used for a high-traffic website.

వెబ్ సర్వర్ అనగా HTTP ప్రోటోకాల్ ద్వారా అభ్యర్థనలను మన్నించే ఒక సాంకేతిక పరిజ్ఞానం. HTTP అనేది వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా పత్రాలను కంప్యూటరు నెట్వర్కుల్లోకి పంచిపెట్టడం లాంటి పనులకు వాడే ప్రాథమిక నియమావళి. వెబ్ సర్వర్ అనే పదం ఒక కంప్యూటరుకు, లేదా ఒక అప్లయన్సుకు, లేదా HTTP అభ్యర్థనలను స్వీకరించే సాఫ్ట్ వేరుకు వాడుతూ ఉంటారు.

HTML డాక్యుమెంట్లని భద్రపరచడం, ప్రాసెస్ చేయడం, క్లైంటు అడిగన HTML డాక్యుమెంట్లని అందించడము వెబ్ సర్వర్ యొక్క ప్రాథమిక విధులు. క్లైంటు, సర్వర్లు సమాచారం ఇచ్చి పుచ్చుకోవడానికి HTTP ప్రోటోకాల్ (నియమావళి) ను అనుసరిస్తాయి. అందించబడే డాక్యుమెంట్లు ప్రధానంగా HTML డాక్యుమెంట్లు. వాటిలో పాఠ్యం మాత్రమే కాకుండా బొమ్మలు, స్టైల్ షీట్లు, స్క్రిప్టులు కూడా ఉండవచ్చు.

ఏదైనా యూజర్ ఏజెంటు అంటే వెబ్ బ్రౌజరు (విహరిణి), లేదా వెబ్ క్రాలరు(వెబ్ ని జల్లెడపట్టే ప్రోగ్రాములు) ఒక రిసోర్సు కోసం వెబ్ సర్వర్ కు HTTP నియమావళిని అనుసరించి ఒక అభ్యర్థన పంపుతుంది. అందుకు ప్రతిస్పందనగా వెబ్ సర్వర్ ఆ రిసోర్సుకు సంబంధించిన విషయాన్ని లేదా అలాంటిదేమీ లేకపోతే ఒక దోష సందేశాన్నో యూజర్ ఏజెంటుకు పంపిస్తుంది. సాధారణంగా రిసోర్సులు ఫైళ్ళ రూపంలో డిస్కులో భద్రపరచబడి ఉంటాయి. కానీ ఇది వెబ్ సర్వర్ ను అభివృద్ధి చేసిన విధానం మీద ఆధారపడి ఉంటుంది.

వెబ్ సర్వర్ ప్రధాన బాధ్యత డాక్యుమెంట్లను అందించడం అయినప్పటికీ మొత్తం HTTP నియమాలన్నింటినీ అభివృద్ధి చేయాలంటే క్లైంటు నుంచి సమాచారం సేకరణకు పద్ధతులు కూడా ఉండాలి. దీంతో వెబ్ ఫారాలను సమర్పించవచ్చు. ఫైళ్ళను సర్వర్ లోకి ఎక్కించవచ్చు.