Jump to content

వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2024

వికీపీడియా నుండి
2024 సంవత్సరంలో వివిధ వారాలలో "మీకు తెలుసా!" వాక్యాలు
01 • 02 • 03 • 04 • 05 • 06 • 07 • 08 • 09 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 • 18 • 19 • 20 • 21 • 22 • 23 • 24 • 25 • 26 • 27 • 28 • 29 • 30 • 31 • 32 • 33 • 34 • 35 • 36 • 37 • 38 • 39 • 40 • 41 • 42 • 43 • 44 • 45 • 46 • 47 • 48 • 49 • 50 • 51 • 52

01 వ వారం

[మార్చు]

02 వ వారం

[మార్చు]

03 వ వారం

[మార్చు]
  • ... డాక్టర్ అనితా భరద్వాజ్ ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వైద్య సహాయంం అందించడంలో నిపుణురాలు అనీ!
  • ... ఆనంద్ అమృతరాజ్ తన తమ్ముడు విజయ్ అమృత రాజ్ లానే టెన్నిస్ ఆటగాడనీ!
  • ... ఐఎన్ఎస్ విశాఖపట్నం భారత నావికా దళానికి చెందిన క్షిపణి విధ్వంసక నౌక అనీ!
  • ... సాయణాచార్య వేదాలకు విస్తృతంగా వ్యాఖ్యానాలు రాసిన రచయిత అనీ!
  • ... డీప్ ఫేక్ సాంకేతికత సహాయంతో డిజిటల్ మాధ్యమాలలో ఒకరికి బదులు మరొకరితో మార్చడానికి సహాయపడుతుందనీ!

04 వ వారం

[మార్చు]

05 వ వారం

[మార్చు]

06 వ వారం

[మార్చు]

07 వ వారం

[మార్చు]

08 వ వారం

[మార్చు]
  • ... నటుడు గుఫీ పెయింటల్ మహాభారతం ధారావాహికలో శకుని పాత్రకు పేరు పొందిన వాడనీ!
  • ... హిప్హాప్ తమిళ భారతదేశపు మొట్టమొదటి తమిళ హిప్ హాప్ ఆల్బం విడుదల చేసిన వాడనీ!
  • ... రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మిత్ర రాజ్యాలు బెర్లిన్ నగరాన్ని విడగొట్టడం వల్ల తూర్పు బెర్లిన్ ఏర్పడిందనీ!
  • ... సామాన్య ప్రజానీకానికి సూపర్ ఫాస్ట్ రైలు సేవలు అందుబాటులోకి తేవడానికి భారతీయ రైల్వేలు కొత్తగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ప్రారంభించారనీ!
  • ... ఆదిశంకరాచార్యులు శివానంద లహరి స్తోత్రాన్ని శ్రీశైల క్షేత్రంలో రాశాడనీ!

09 వ వారం

[మార్చు]
  • ... సిల్వియో బెర్లుస్కోనీ నాలుగు పర్యాయాలు ఇటలీ ప్రధానమంత్రిగా పని చేశాడనీ!
  • ... పశ్చిమ బెంగాల్ లో ప్రవహించే అట్రాయ్ నది ప్రస్తావన మహాభారతంలో ఉందనీ!
  • ... ఫ్లూయెంట్‌గ్రిడ్ నిత్యావసరాల సరఫరా పంపిణీ సంస్థలకు డిజిటల్ సేవలు అందించే సంస్థ అనీ!
  • ... కృష్ణ ఫలం అనేది దక్షిణ బ్రెజిల్ కు చెందిన బహుళజాతి ఫలం అనీ!
  • ... భారత తొలి ఫీల్డ్ మార్షల్ సాం మానెక్ షా జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం సామ్ బహదూర్ అనీ!

10 వ వారం

[మార్చు]

11 వ వారం

[మార్చు]

12 వ వారం

[మార్చు]
  • ... పామర్తి వెంకటేశ్వరరావు ఎక్కువగా డబ్బింగ్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడనీ!
  • ... 1518 డ్యాన్స్ ప్లేగు లో బాధితులు కొన్ని వారాలపాటు నృత్యాలు చేశారనీ!
  • ... మిరియాలకు ఘాటైన వాసన, రుచి పైపెరిన్ అనే ఆల్కలాయిడ్ వలన కలుగుతుందనీ!
  • ... సినీనటుడు విజయ్ తమిళనాడులో కొత్తగా స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం అనీ!
  • ... హిందూ, బౌద్ధ పురాణాలలో ఎక్కువగా కనిపించే మణిమేఖల అనే దేవత నౌకాప్రమాదాల నుంచి రక్షించే దేవతగా భావిస్తారనీ!

13 వ వారం

[మార్చు]
  • ... మహారాష్ట్ర తొలి ముస్లిం ముఖ్యమంత్రి అబ్దుల్ రెహమాన్ అనీ!
  • ... ఆదివాసుల దేవాలయమైన జంగుబాయి పుణ్యక్షేత్రం తెలంగాణా, మహారాష్ట్ర సరిహద్దు అటవీప్రాంతంలో ఉందనీ!
  • ... గైర్ నృత్యం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం అనీ!
  • ... ఉత్తరాంధ్రలో కాటమరాజు కథను చెబుతూ కులగోత్రాలను పొగిడేవారిని పొడపోతలవారు అంటారనీ!
  • ... ప్రముఖ చిత్రకారుడు ఎం. ఎఫ్. హుస్సేన్ రచించి దర్శకత్వం వహించిన చిత్రం గజ గామిని అనీ!

14 వ వారం

[మార్చు]
  • ... షెర్లాక్ హోమ్స్ ఆంగ్ల రచయిత ఆర్థర్ కోనన్ డోయల్ సృష్టించిన ప్రముఖ డిటెక్టివ్ పాత్ర అనీ!
  • ... ప్రముఖ రచయిత విక్టర్ హ్యూగో రాసిన లెస్ మిజరబుల్స్ ఆధారంగా తెలుగులో బీదల పాట్లు అనే సినిమా తీశారనీ!
  • ... క్లోరో ఫామ్ ని మొదట్లో శస్త్రచికిత్స చేసేటపుడు మత్తుమందుగా వాడేవారనీ!
  • ... హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రి నిలుఫర్ హనీంసుల్తాన్ పేరు మీదుగా ప్రారంభించినదనీ!
  • ... ప్రపంచంలో అత్యంత సుదీర్ఘకాలం ఇప్పటికీ ఉనికిలో ఉన్న విజ్ఞాన సమాజం రాయల్ సొసైటీ అనీ!

15 వ వారం

[మార్చు]
  • ... మరాఠీ సాహిత్యంలో మొదటి స్త్రీవాద రచయిత్రి మాలతీ బేడేకర్ అనీ!
  • ... ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ట్వెల్త్ ఫెయిల్ సినిమా పలు విభాగాల్లో 69వ ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను దక్కించుకుందనీ!
  • ... పొగాకులో సహజంగా లభించే నికోటిన్ మానవునిలో తాత్కాలికంగా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని సృష్టించగలదనీ!
  • ... ప్రముఖ బాలివుడ్ నటి మాధురీ దీక్షిత్‌ ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం గజ గామిని అనీ!
  • ... ఆస్ట్రేలియా స్థానిక సాంప్రదాయ కథల్లో నల్ల తలల కొండచిలువ ఎక్కువగా కనిపిస్తుందనీ!
  • ... సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి కెరీర్ కోసం ఆయన తండ్రి ముత్యాల రెడ్డి ఏకంగా ఉద్యోగమే మానేసాడినీ!

16 వ వారం

[మార్చు]
  • ... అమోఘవజ్ర బౌద్ధమతానికి చెందిన వజ్రయాన తంత్ర విద్వాంసుడనీ!
  • ... చౌ నృత్యం పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఝార్ఖండ్ లో ఎక్కువగా ప్రదర్శించబడే శాస్త్రీయ నృత్యమనీ!
  • ... కృత్రిమ దారాలు తయారు చేసే రేయాన్ సహజ పట్టు, నూలు లాంటి స్పర్శ, అల్లికను ప్రదర్శించగలదనీ!
  • ... డెర్మటోమయోసైటిస్ చర్మాన్ని, కండరాలని ప్రభావితం చేసే దీర్ఘకాలిక రుగ్మత అనీ!
  • ... రాష్ట్రీయ లోక్ దళ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వమనీ!

17 వ వారం

[మార్చు]
  • ... అనితా గుహ ఎక్కువగా పౌరాణిక పాత్రలు పోషించిన భారతీయ నటి అనీ!
  • ... గిరిజన కళలను ప్రోత్సహించడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సంస్థ ఆదివాసీ లోక్ కళా అకాడమీ అనీ!
  • ... పత్తి, పాలియెస్టర్ తో కలిపి తయారు చేసిన వస్త్రాలు గట్టిగా, ముడతలు పడకుండా ఉంటాయనీ!
  • ... క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ను మలేరియా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారనీ!
  • ... బ్రెడ్, సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల కోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తుందనీ!

18 వ వారం

[మార్చు]
  • ... తెలుగు నటుడు రామ్మోహన్ ను ఆంధ్రా దేవానంద్ అని పిలిచేవారనీ!
  • ... పంచవాద్యం కేరళ రాష్ట్రంలో ప్రాచుర్యమైన ఆలయ కళారూపం అనీ!
  • ... దుస్తులు, కార్ల విడిభాగాలు, తివాచీలు లాంటి వివిధ వస్తువుల తయారీలో నైలాన్ ఉపయోగిస్తారనీ!
  • ... కుక్కకాటు వల్ల రేబీస్ వ్యాధికి గురైన వారిలో జలభయం ఉంటుందనీ!
  • ... ప్రపంచ విద్యారంగంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ కొన్ని శతాబ్దాలుగా ప్రముఖ స్థానాన్ని కలిగి ఉందనీ!

19 వ వారం

[మార్చు]
  • ... తెలంగాణాకు చెందిన నాయకురాలు జివి వెన్నెల ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె అనీ!
  • ... పానియా ప్రజలు కేరళ రాష్ట్రంలో కనిపించే అతిపెద్ద షెడ్యూల్డ్ తెగల్లో ఒకరు అనీ!
  • ... పెక్టిన్ను జెల్లీలు, జామ్‌లు లాంటి ఆహార పదార్థాల తయారీలో ఎక్కువగా వాడతారనీ!
  • ... 2017-18 సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన ఎలక్టోరల్ బాండ్ రాజ్యాంగ విరుద్ధమని 2024 లో సుప్రీంకోర్టు కొట్టివేసిందనీ!
  • ... అడిలైడ్ నగరం ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఐదో స్థానంలో ఉందనీ!

20 వ వారం

[మార్చు]
  • ... భారతీయ సినీ నిర్మాత, వ్యాపారవేత్త రోనీ స్క్రూవాలా 2008 లో టైమ్ పత్రికలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకడిగా నిలిచాడనీ!
  • ... ఉత్తర భారతదేశంలో భాయ్ దూజ్ పండుగను దీపావళి తర్వాత జరుపుకుంటారనీ!
  • ... సెన్నోసైడు అనే పదార్థాన్ని విరేచనకారి మందుల్లో వాడతారనీ!
  • ... ఆంధ్రభాషకు మూలపదాలను వివరించే ఆంధ్ర ధాతుమాల ను 1820కి మునుపే వేదం పట్టాభిరామశాస్త్రులు రాశాడనీ!
  • ... రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబును రూపొందించడానికి అమెరికా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టు పేరు మాన్‌హట్టన్ ప్రాజెక్టు అనీ!

21 వ వారం

[మార్చు]
  • ... మతాంగిని హజ్రా క్విట్ ఇండియా ఉద్యమంలో అమరురాలైన స్వాతంత్ర్య సమరయోధురాలనీ!
  • ... ఎనిమిది ప్రధాన భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలలో మణిపురి రాస్ లీలా నృత్యం ఒకటి అనీ!
  • ... జనుము మొక్కను 50 వేల ఏళ్ళ నుంచే వివిధ అవసరాలకు వాడుతూ వస్తున్నారనీ!
  • ... కర్ణాటలోకి చారిత్రాత్మక బసవకల్యాణ్ నగరంలో ప్రపంచంలోకెల్లా ఎత్తైన బసవేశ్వరుని విగ్రహం ఉందనీ!
  • ... అంతరించిపోతున్న పులులను కాపాడటానికి భారతప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రారంభించిదనీ!

22 వ వారం

[మార్చు]
  • ... శంకర్-ఎహసాన్-లాయ్ పలు భారతీయ భాషల్లో 50కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారనీ!
  • ... ఒడిషాలో జరిగే ధను జాతర ప్రపంచంలో అతిపెద్ద ఓపెన్ అయిర్ థియేటర్లో జరిగే ప్రదర్శనగా గిన్నిస్ రికార్డులో స్థానం పొందినదనీ!
  • ... కర్ణాటకలోని బనవాసి నగరం పురాతన కన్నడ రాజవంశమైన కదంబులకు రాజధాని అనీ!
  • ... భారతదేశంలో పశ్చిమం వైపుకు ప్రవహించే అతి కొద్ది నదుల్లో మహీ నది ఒకటనీ!
  • ... 1962 భారత్ చైనా యుద్ధం తర్వాత భారత ప్రభుత్వం స్థాపించిన ఏడు కేంద్ర సాయుధ బలగాల్లో ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ ఒకటనీ!

23 వ వారం

[మార్చు]

24 వ వారం

[మార్చు]
  • ... బాబర్ చక్రవర్తి కుమార్తె గుల్బదన్ బేగం హుమయూన్ నామా గ్రంథకర్తగా ప్రసిద్ధి గాంచిందనీ!
  • ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లంబాడీ ప్రజల కోసం బంజారా భవన్ ఏర్పాటు చేసిందనీ!
  • ... పొగాకు, మద్యం సేవించే వారిలో నోటి కాన్సర్ వచ్చే అవకాశం 15 రెట్లు ఎక్కువనీ!
  • ... భారతదేశంలోని పలు ప్రాంతాల్లో అరటిదూట ను వంటల్లో వాడతారనీ!
  • ... అమెరికాలోని బెల్ ల్యాబ్స్ లో జరిగిన పరిశోధనలకు పది నోబెల్ బహుమతులు వచ్చాయనీ!

25 వ వారం

[మార్చు]

26 వ వారం

[మార్చు]
  • ... ప్రముఖ జర్నలిస్టు సాగరిక ఘోష్ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయ్ జీవిత చరిత్ర రచయిత్రి అనీ!
  • ... మత్తును కలిగించే కొకైన్ వ్యసనం కావడానికి అవకాశం ఉన్నందున వైద్యులు కేవలం పరిమిత చికిత్సలకే ఉపయోగిస్తున్నారనీ!
  • ... మాహారాష్ట్రలోని పోహ్రాదేవి తీర్థ క్షేత్రం బంజారా కాశీ క్షేత్రంగా వ్యవహరించబడుతుందనీ!
  • ... సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అనీ!

27 వ వారం

[మార్చు]

28 వ వారం

[మార్చు]

29 వ వారం

[మార్చు]

30 వ వారం

[మార్చు]

31 వ వారం

[మార్చు]

32 వ వారం

[మార్చు]
  • ... అనితా బోర్గ్ సాంకేతిక రంగాల్లో మహిళల ప్రాతినిథ్యం కోసం కృషి చేసిందనీ!
  • ... క్లెయిర్‌వాయెన్స్ అనేది శాస్త్రవిజ్ఞానానికి లోబడని అతీంద్రియ శక్తి అనీ!
  • ... బెంగాలో భాషకు అధికారిక హోదా కోసం 1952లో తూర్పు పాకిస్థాన్ లో బెంగాలీ భాషా ఉద్యమం జరిగిందనీ!
  • ... భారతదేశంలోని 550 జిల్లా ప్రధాన కార్యాలయాలను కనీసం నాలుగు వరుసల రహదారులు ఏర్పాటు చేయడానికి భారతమాల ప్రాజెక్టు ఏర్పడిందనీ!
  • ... జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, సహాయ ప్రొఫెసర్ల నియామకం కోసం యూజీసీ-నెట్ పరీక్ష నిర్వహిస్తారనీ!

33 వ వారం

[మార్చు]
  • ... పీటోంగ్‌టార్న్ షినవత్రా థాయ్‌లాండ్ చరిత్రలో అతి పిన్న వయసురాలైన ప్రధాని, దేశంలో రెండో మహిళా ప్రధాని అనీ!
  • ... ప్రముఖ ఆంగ్ల రచయిత్రి అగాథా క్రిస్టీ నవలలు సుమారు 200 కోట్లకు పైగా ప్రతులు అమ్ముడయ్యాయనీ!
  • ... డిఫ్తీరియా వ్యాధిలో మెడ పెద్దగా వాపు వచ్చి శ్వాస నాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉందనీ!
  • ... మిల్లెట్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా చిరుధాన్యాల రైతులకు సహాయపడే సంస్థ అనీ!
  • ... మహమూద్ ఖిల్జీ సేనపై సాధించిన విజయానికి గుర్తుగా రాజస్థాన్ రాజపుత్రులు విజయ స్తంభను స్థాపించారనీ!
  • ... భారతదేశంలో రహదారి సుంకాల చెల్లింపు కోసం వాడే ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకేతికత ద్వారా పని చేస్తుందనీ!

34 వ వారం

[మార్చు]

35 వ వారం

[మార్చు]

36 వ వారం

[మార్చు]
  • ... బీజాపూర్ సుల్తాన్ కి చెందిన చాంద్ బీబీ అక్బర్ సేనలను ఎదిరించి అహ్మద్ నగర్ ను రక్షించిన యోధురాలనీ!
  • ... యశోదా హాస్పిటల్స్ లో 2015లో ర్యాపిడ్ ఆర్క్ సాంకేతికను ఉపయోగించి పది వేలమందికి పైగా చికిత్స చేసిందనీ!
  • ... బ్రిటిష్ ఇండియాలో మూడు అతిపెద్ద సంస్థానాల్లో ఒకటైన మైసూర్ రాష్ట్రం కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కలుపుకుని కర్ణాటక రాష్ట్రంగా ఏర్పడిందనీ!
  • ... క్యాబినెట్ సెక్రటరీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో అత్యంత ఉన్నత స్థాయి పదవి అనీ!
  • ... భారతదేశంలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీని ప్రవేశపెట్టిన మొదటి కళాశాల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ అనీ!

37 వ వారం

[మార్చు]
  • ... క్రొయేషియాకు చెందిన గోరన్ ఇవనీసెవిచ్ వైల్డ్ కార్డుతో ప్రవేశించి వింబుల్డన్ సింగిల్స్ గెలుచుకున్న ఏకైక ఆటగాడనీ!
  • ... ఆమ్నీసియా సోకిన వారు క్రమంగా జ్ఞాపకశక్తిని కోల్పోతారనీ!
  • ... తీరాంధ్ర జమీందారీ సంస్థానమైన చుండి సంస్థానం ముఖ్యపట్టణం నెల్లూరు జిల్లా, వోలేటివారిపాలెం మండలంలో ఉందనీ!
  • ... ప్రపంచంలో అతిపెద్ద కణభౌతికశాస్త్ర పరిశోధనాలయాన్ని నిర్వహించేది సెర్న్ అనీ!
  • ... అమరావతి కళ పురాతన ఆంధ్రప్రదేశ్ లో ధాన్యకటకంలో విలసిల్లిన భారతీయ కళా శైలి అనీ!

38 వ వారం

[మార్చు]
  • ... వ్యక్తిత్వ వికాస నిపుణుడు, నాయకుడు శివ్ ఖేరా నోటా విషయంపై సుప్రీంకోర్టులో కేసు వేశాడనీ!
  • ... కర్ణాటకలోని మణిపాల్ విశ్వవిద్యాలయ పట్టణం ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేలమందికి పైగా విద్యార్థులను ఆకర్షిస్తుందనీ!
  • ... పాకిస్తాన్ లొంగుబాటు పత్రం 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి ముగింపుకు గుర్తుగా పరిగణించబడుతుందనీ!
  • ... రోల్స్ రాయిస్ కారును సొంతం చేసుకున్న మొదటి భారతీయ నటి నదీరా అనీ!
  • ... హైదరాబాదులోని శిల్పకళా వేదిక టెర్రకోటతో తయారైన నిర్మాణమనీ!

39 వ వారం

[మార్చు]