ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్
నినాదం | तमसो मा ज्योतिर्गमय (తమసో మా జ్యోతిర్గమయా) |
---|---|
రకం | సార్వజనిక సాంకేతిక సంస్థ (పబ్లిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) |
స్థాపితం | 1959 |
చైర్మన్ | కె. రాధాకృష్ణన్ |
డైరక్టరు | మణీంద్ర అగర్వాల్ |
విద్యాసంబంధ సిబ్బంది | 597[1] |
విద్యార్థులు | 8,236[1] |
అండర్ గ్రాడ్యుయేట్లు | 4,089[1] |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 1,897[1] |
డాక్టరేట్ విద్యార్థులు | 2,250[1] |
స్థానం | కల్యాణ్ పూర్ ఉత్తరప్రదేశ్, భారతదేశం |
కాంపస్ | Urban, 1,000 ఎకరాలు (400 హె.) |
రంగులు | Blue & silver |
అథ్లెటిక్ మారుపేరు | ఐఐటియన్లు |
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (ఐఐటీ కాన్పూర్) అనేది భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్‌లో ఉన్న ఒక సార్వజనిక సాంకేతిక సంస్థ (పబ్లిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ). దీనిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చట్టం కింద భారత ప్రభుత్వం జాతీయ ప్రాధానత్య కలిగిన విద్యాసంస్థగా ప్రకటించింది. మొదటగా ప్రారంభించిన ఐఐటీల్లో ఇదీ ఒకటి.
1055 ఎకరాల్లో విస్తరించి ఉన్న పచ్చటి ప్రాంగణంలో విస్తరించి ఉన్న ఐఐటీ కాన్పూర్ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ఒకటిగా పేరు గాంచింది.[2] ఇది 1963 లో దేశంలో మొదటిసారిగా కంప్యూటర్ సైన్స్‌ని ప్రారంభించింది. అలాగే భారతదేశంలో రెండు చిన్న విమానాలు, ఒక ఎయిర్ స్ట్రిప్, ఓపెన్ ఎయిర్ థియేటర్ (OAT) కలిగి ఉన్న ఏకైక ఐఐటీ ఇది. ఈ సంస్థ 1959లో కాన్పూర్ ఇండో-అమెరికన్ ప్రోగ్రామ్ (KIAP)లో భాగంగా తొమ్మిది US పరిశోధనా విశ్వవిద్యాలయాల కన్సార్టియం సహాయంతో స్థాపించబడింది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "NIRF 2023" (PDF). NIRF. Archived (PDF) from the original on 6 June 2023. Retrieved 2 October 2023.
- ↑ "NIRF Rankings: IIT-Kanpur stands 5th in country". The Times of India. 10 September 2021. Archived from the original on 18 April 2023. Retrieved 7 April 2023.
- ↑ "Norman Dahl: Kanpur Indo-American Program" (PDF). Archived (PDF) from the original on 26 June 2010. Retrieved 3 February 2012.
- ↑ Financial Statements and Performance Indicators