బెంగాలీ భాషా ఉద్యమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బెంగాలీ భాషా ఉద్యమం అన్నది 1952లో తూర్పు పాకిస్తాన్లో (అంతకుపూర్వం తూర్పు బెంగాల్ అనీ, ఈనాడు బంగ్లాదేశ్‌ అనీ పేరొందిన ప్రాంతం) ఎక్కువమంది మాట్లాడే బెంగాలీ భాషని పాకిస్తాన్ దేశవ్యాప్తంగా ప్రధాన భాషల్లో ఒకటిగా గుర్తించి వివిధ రంగాల్లో దాని వాడకాన్ని కొనసాగించమని కోరుతూ ప్రారంభించిన ఉద్యమం. ఈ డిమాండ్లలో ప్రభుత్వ వ్యవహారాల్లో ఉపయోగించడాన్ని అనుమతించడం, ప్రసార మాధ్యమాల్లో వాడకాన్నీ, కరెన్సీపైనా, స్టాంపులపైనా దాని ముద్రణను కొనసాగించడం, విద్యాబోధనలో బెంగాలీ మాధ్యమాన్ని కొనసాగించడం, బెంగాలీకి బెంగాలీ లిపిని వాడడాన్ని కొనసాగించడం భాగం.

1948లో ఢాకాలోని బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ముహమ్మద్ అలీ జిన్నా. ఈ సభలోనే జిన్నా పాకిస్తాన్ జాతీయ భాషగా "ఉర్దూ తప్ప ఇంకేమీ ఉండదు" అని ప్రకటించాడు.

బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారత ఉపఖండానికి స్వాతంత్ర్యం లభించినప్పుడు బ్రిటిష్ ఇండియా భారతదేశం, పాకిస్తాన్‌లుగా విభజించబడింది. అలా ఏర్పడిన పాకిస్తాన్‌లో పశ్చిమ పాకిస్తాన్‌తో భౌగోళికంగా ఆనుకని లేకుండా సుదూరంలో ఉండి బెంగాలీ జాతీయులతో కూడిన తూర్పు బెంగాల్ ప్రావిన్సు కూడా ఉంది. దానితో పాటుగా, వేర్వేరు జాతులు, భాషల సమూహాలు పాకిస్తాన్ డొమినియన్‌లో భాగంగా ఉండేవి. ఉపఖండంలోని ముస్లింలకు ప్రత్యేక దేశం అన్న మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం కావడంతో తూర్పు పాకిస్తాన్‌ని ఇస్లామీకరణ చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా ఏకైక సమాఖ్య భాషగా ఉర్దూ ఉంటుందని పాకిస్తానీ నాయకులు ప్రతిపాదించారు. ప్రత్యామ్నాయంగా పర్సో-అరబిక్ లిపిలో కానీ,[1][2][3] రోమన్ లిపిలో కానీ[4] రాసే బెంగాలీకి అధికారిక హోదా ఇవ్వవచ్చనీ, లేదంటే మొత్తం పాకిస్తాన్‌కి అరబిక్ ఏకైక అధికారిక భాష చేయవచ్చనీ ప్రతిపాదనలు చేశారు.[5][6][7][8][9]

1952 ఫిబ్రవరి 21న ఢాకాలో కర్ఫ్యూను ఉల్లంఘించాలని నిర్ణయించుకున్న సందర్భంలో నిరసనకారులు

బెంగాలీ భాషీయులు అధిక సంఖ్యాకులుగా ఉన్న తూర్పు బెంగాల్ ప్రావిన్సులో ఈ పరిణామాలు విస్తృతమైన నిరసనలకు దారితీశాయి. జాతుల మధ్య ఉద్రిక్తతలు, కొత్త చట్టంపై సామూహిక అసంతృప్తి వంటివి పెరుగుతూ ఉండడం కారణంగా బహిరంగ సమావేశాలు, ర్యాలీలను ప్రభుత్వం నిషేధించింది. ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఇతర రాజకీయ కార్యకర్తలు చట్టాన్ని ధిక్కరించి 1952 ఫిబ్రవరి 21న నిరసన చేపట్టారు. ఆ రోజు విద్యార్థులు నిరసనకారులను పోలీసులు కాల్చి చంపడంతో ఉద్యమం పరాకాష్టకు చేరుకుంది. ఈ మరణాలు భారీ ఎత్తున ప్రజా ఆందోళనలను, అశాంతిని రేకెత్తించాయి. అనేక సంవత్సరాల ఘర్షణ తరువాత, పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం 1956లో బెంగాలీ భాషకు అధికారిక హోదాను మంజూరు చేసింది.

1952 ఫిబ్రవరి 21న పోలీసు కాల్పుల్లో మరణించి, ప్రజల్లో అమరవీరులుగా పేరొందిన విద్యార్థులు, ఉద్యమకారుల సంస్మరణార్థం నిర్మించిన షహీద్ మినార్ 1956లో వారిలో ఒకడైన అబుల్ బర్కాత్ కుటుంబసభ్యుల చేతులమీదుగా శంకుస్థాపన చేస్తున్న దృశ్యం

ఈ భాషా ఉద్యమం తూర్పు బెంగాల్ ప్రావిన్సులోనూ, తరువాత తూర్పు పాకిస్తాన్లోనూ బెంగాలీ జాతీయతను, గుర్తింపు బలపడడానికి, బహిరంగంగా ప్రకటించుకోగలగడానికి దారితీసింది. తర్వాతికాలంలో తూర్పు బెంగాల్ స్వయంప్రతిపత్తి కోరుతూ 6-అంశాల ఉద్యమం, తదనంతరం బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, బెంగాలీ భాషా అమలు చట్టం, 1987 సహా బెంగాలీ జాతీయవాద ఉద్యమాలకు ఇది ఒక నేపథ్యంగా నిలిచింది. బంగ్లాదేశ్‌లో, ఫిబ్రవరి 21ను భాషా ఉద్యమ దినోత్సవంగానూ, జాతీయ సెలవు దినంగానూ జరుపుకుంటారు. ఈ ఉద్యమాన్నీ, దాని బాధితులనూ గుర్తుచేసుకోవడానికి ఢాకా మెడికల్ కాలేజీ సమీపంలో షహీద్ మినార్ అన్న స్మారక చిహ్నం నిర్మించారు. 1999 సెప్టెంబరు 17న యునెస్కో భాషా ఉద్యమానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రజల జాతి భాషా హక్కులకు నివాళిగా ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది.[10]

ఆధార రచనలు

[మార్చు]
  • Al Helal, B (2003). Bhasha Andoloner Itihas (History of the Language Movement) (in Bengali). Agamee Prakashani, Dhaka. ISBN 984-401-523-5.
  • Umar, Badruddin (1979). Purbo-Banglar Bhasha Andolon O Totkalin Rajniti পূর্ব বাংলার ভাষা আন্দোলন ও তৎকালীন রজনীতি (in Bengali). Dhaka: Agamee Prakashani.
  • Umar, Badruddin (2004). The Emergence of Bangladesh: Class Struggles in East Pakistan (1947–1958). Oxford University Press. ISBN 0-19-579571-7.
  • Uddin, Sufia M. (2006). Constructing Bangladesh: Religion, Ethnicity, and Language in an Islamic Nation. Chapel Hill: The University of North Carolina Press. ISBN 0-8078-3021-6.

మూలాలు

[మార్చు]
  1. Nag, Sajal (30 December 2022). Nation and Its Modes of Oppressions in South Asia (in ఇంగ్లీష్). Taylor & Francis. ISBN 978-1-000-81044-8. Retrieved 27 November 2022.
  2. Maloney, Clarence (1978). Language and Civilization Change in South Asia (in ఇంగ్లీష్). Brill Archive. pp. 145, 146. ISBN 978-90-04-05741-8. Retrieved 27 November 2022.
  3. হোসেন, সেলিনা; বিশ্বাস, সুকুমার; চৌধুরী, শফিকুর রহমান, eds. (21 February 1986). 1513. একুশের স্মারকগ্রন্থ' ৮৬ - সম্পাদনায় (in Bengali). Bangladesh: Bangla Academy. pp. 52–73. Retrieved 27 November 2022.
  4. হোসেন, সেলিনা; বিশ্বাস, সুকুমার; চৌধুরী, শফিকুর রহমান, eds. (21 February 1986). 1513. একুশের স্মারকগ্রন্থ' ৮৬ - সম্পাদনায় (in Bengali). Bangladesh: Bangla Academy. pp. 52–73. Retrieved 27 November 2022.
  5. প্রিনস, এরশাদুল আলম (20 February 2022). "বাংলা হরফের ওপর শয়তানি আছর". banglanews24.com (in Bengali). Retrieved 3 January 2017.
  6. Brown, Michael Edward; Ganguly, Sumit (2003). Fighting Words: Language Policy and Ethnic Relations in Asia (in ఇంగ్లీష్). MIT Press. p. 77. ISBN 978-0-262-52333-2. Retrieved 27 November 2022.
  7. Zein, Subhan; Coady, Maria R. (22 September 2021). Early Language Learning Policy in the 21st Century: An International Perspective (in ఇంగ్లీష్). Springer Nature. p. 136. ISBN 978-3-030-76251-3. Retrieved 27 November 2022.
  8. Chaube, Shibani Kinkar (26 October 2016). The Idea of Nation and Its Future in India (in ఇంగ్లీష్). Taylor & Francis. p. 122. ISBN 978-1-315-41432-4. Retrieved 27 November 2022.
  9. হোসেন, সেলিনা; বিশ্বাস, সুকুমার; চৌধুরী, শফিকুর রহমান, eds. (21 February 1986). 1513. একুশের স্মারকগ্রন্থ' ৮৬ - সম্পাদনায় (in Bengali). Bangladesh: Bangla Academy. pp. 52–73. Retrieved 27 November 2022.
  10. Glassie, Henry and Mahmud, Feroz.2008.Living Traditions. Cultural Survey of Bangladesh Series-II. Asiatic Society of Bangladesh. Dhaka. International Mother Language Day

మరింత చదవండి

[మార్చు]
  • Anwar S. Dil (2000). Bengali language movement to Bangladesh. Ferozsons. ISBN 978-969-0-01577-8.
  • Robert S. Stern (2000). Democracy and Dictatorship in South Asia: Dominant Classes and Political Outcomes in India, Pakistan, and Bangladesh. Praeger Publishers. ISBN 978-0-275-97041-3.
  • Syed Manzoorul Islam (1994). Essays on Ekushey: The Language Movement 1952. Bangla Academy. ISBN 984-07-2968-3.

బయటి లింకులు

[మార్చు]