Jump to content

ఆంథోని వాన్ లీవెన్‌హుక్

వికీపీడియా నుండి
ఆంథోని వాన్ లీవెన్‌హుక్
Portrait by Jan Verkolje, after 1680
జననం(1632-10-24)1632 అక్టోబరు 24
డెల్ఫ్ట్, డచ్ గణతంత్ర రాజ్యం
మరణం1723 ఆగస్టు 26(1723-08-26) (వయసు 90)
డెల్ఫ్ట్, డచ్ గణతంత్ర రాజ్యం
రంగములు
ప్రసిద్ధి
సంతకం

ఆంథోని వాన్ లీవెన్‌హుక్ (అక్టోబరు 24, 1632 - ఆగస్టు 26, 1723) డచ్ దేశానికి చెందిన జీవశాస్త్రవేత్త. ఈయనను సూక్ష్మజీవ శాస్త్రానికి ఆద్యుడిగా (the Father of Microbiology) భావిస్తారు.

డచ్ గణతంత్రరాజ్యంలోని డెల్ఫ్ట్ లో జన్మించిన లీవెన్‌హుక్ యవ్వనంలో ఒక వస్త్రవ్యాపారిగా పనిచేశాడు. 1654లో స్వంతంగా దుకాణం ఏర్పాటు చేశాడు. ప్రాంతీయ మునిసిపల్ రాజకీయాల్లో గుర్తింపు సాధించాడు. కటకాల (లెన్స్) తయారీలో ఆసక్తి పెంచుకున్నాడు. 1670వ దశకంలో సూక్ష్మదర్శిని సహాయంతో సూక్ష్మజీవుల మీద అధ్యయనం చేయడం ప్రారంభించాడు.

తానే స్వయంగా రూపొందించిన ఏకకటక (సింగిల్ లెన్స్) సూక్ష్మదర్శిని సహాయంతో సూక్ష్మజీవుల మీద ప్రయోగాలు సాధించిన మొట్టమొదటి వాడయ్యాడు. వాటి సాపేక్ష పరిమాణాన్ని అంచనా వేసిన వారిలో కూడా ఈయనే ప్రథముడు. ఈయన పరిశీలించిన వాటిలో ఎక్కువ భాగం ఏకకణ జీవులు. ఇంకా సరస్సుల్లో జలాల నుంచి కొన్ని బహుకణ జీవులను కూడా కనుగొన్నాడు. కండర కణజాలం, బ్యాక్టీరియా, ఎర్ర రక్త కణాలు, స్ఫటికాలు కు సంబంధించి సూక్ష్మ పరిశీలనలను పొందుపరిచాడు. ఈయన ఎటువంటి పుస్తకాలు రాయకపోయినా రాయల్ సొసైటీకి రాసిన అవ్యవస్థిత లేఖల్లో ఆయన కనుగొన్న విషయాలను వర్ణించాడు. రాయల్ సొసైటీ ఫిలసాఫికల్ ట్రాన్సాక్షన్స్ లో భాగంగా వీటిని ప్రచురించింది.

జీవితం

[మార్చు]

లీవెన్ హుక్ డచ్ గణతంత్రరాజ్యంలోని డెల్ఫ్ట్ లో అక్టోబరు 24, 1632 న జన్మించాడు. అతని తండ్రి ఫిలిప్స్ ఆంటోనిజ్ వాన్ లీవెన్‌హుక్ బుట్టలు తయారు చేసేవాడు. ఆంథోనీ ఐదు సంవత్సరాల వయసులో ఉండగానే ఈయన మరణించాడు.

గమనికలు

[మార్చు]
  1. Van Leeuwenhoek is universally acknowledged as the father of microbiology because he was the first to undisputedly discover/observe, describe, study, conduct scientific experiments with microscopic organisms (microbes), and relatively determine their size, using single-lensed microscopes of his own design.[1] Leeuwenhoek is also considered to be the father of bacteriology and protozoology (recently known as protistology).[2][3]

మూలాలు

[మార్చు]
  1. Lane, Nick (6 March 2015). "The Unseen World: Reflections on Leeuwenhoek (1677) 'Concerning Little Animal'." Philosophical Transactions of the Royal Society B: Biological Sciences . 2015 Apr; 370 (1666): doi:10.1098/rstb.2014.0344
  2. Dobell, Clifford (1923). "A Protozoological Bicentenary: Antony van Leeuwenhoek (1632–1723) and Louis Joblot (1645–1723)". Parasitology. 15 (3): 308–319. doi:10.1017/s0031182000014797. S2CID 84998029.
  3. Corliss, John O (1975). "Three Centuries of Protozoology: A Brief Tribute to its Founding Father, A. van Leeuwenhoek of Delft". The Journal of Protozoology. 22 (1): 3–7. doi:10.1111/j.1550-7408.1975.tb00934.x. PMID 1090737.