ఇస్కీమియా
ఇస్కీమియా | |
---|---|
కాలి యొక్క వాస్కులర్ ఇస్కీమియా లక్షణం, సైనోసిస్ | |
ప్రత్యేకత | వాస్కులర్ శస్త్ర చికిత్స |
సంక్లిష్టతలు | రక్తహీనత, చర్మం దద్దుర్లు, కీళ్లవాతం, పేగు క్యాన్సర్ |
సాధారణ ప్రారంభం | క్రమంగా, అకస్మాత్తుగా |
కాల వ్యవధి | దీర్ఘ కాలం |
కారణాలు | అథెరోస్క్లెరోసిస్, ఫైబ్రోమస్కులర్ డైస్ప్లాసియా, వాస్కులైటిస్, ట్యూమర్ |
ఇస్కీమియా అనేది శరీర కణజాలానికి రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం ఫలితంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన అనారోగ్య పరిస్థితి.[1]దీనిలో ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, మెసెంటెరిక్ ఇస్కీమియా వంటి రకాలు ఉన్నాయి. శరీరంలో ప్రభావితమైన ప్రదేశంపై ఆధారపడి రోగ లక్షణాలు ఉంటాయి. [2] రోగం ప్రారంభం క్రమంగా ఉండవచ్చు లేదా ఆకస్మాత్తుగా ఉండవచ్చు. [1]
అథెరోస్క్లెరోసిస్, ఫైబ్రోమస్కులర్ డైస్ప్లాసియా, వాస్కులైటిస్ వంటి వ్యాధుల నుండి లేదా క్రమంగా కణితుల (ట్యూమర్ల) కారణంగా ఏర్పడిన బాహ్య ఒత్తిడి వలన ఈ రోగం సంభవించవచ్చు. [1] బ్లాట్ క్లాట్, వాసోస్పాస్మ్ లేదా బృహద్ధమని విచ్ఛేదనం కారణంగా ఆకస్మిక కేసులు సంభవించవచ్చు.[1]
ఈ పరిస్థితిని నివారించాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంభించాలి . [2] 1855 నుండి ఈ పదం డాక్యుమెంట్ లో మొదటగా ఉపయోగించారు. [3] ఈ పదం గ్రీకు ఇస్సేయిన్ నుండి వచ్చింది, దీని అర్థం "నిగ్రహించడం" హైమా అంటే "రక్తం". [3]
ప్రస్తావనలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Occlusive Peripheral Arterial Disease - Heart and Blood Vessel Disorders". Merck Manuals Consumer Version. Archived from the original on 19 March 2021. Retrieved 27 February 2021.
- ↑ 2.0 2.1 "What Is Ischemia?". WebMD (in ఇంగ్లీష్). Archived from the original on 1 March 2021. Retrieved 27 February 2021.
- ↑ 3.0 3.1 "Definition of ISCHEMIA". www.merriam-webster.com (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2021. Retrieved 27 February 2021.