ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ
నినాదం | సముద్ర జ్ఞానం జ్ఞాన సముద్రం |
---|---|
రకం | ప్రభుత్వ యూనివర్సిటీ |
స్థాపితం | నవంబరు 14, 2008 |
వైస్ ఛాన్సలర్ | డా. మాలిని వి శంకర్ |
నిర్వహణా సిబ్బంది | 150 |
స్థానం | భారతదేశం 12°52′21″N 80°14′09″E / 12.87250°N 80.23583°E |
కాంపస్ | చెన్నై, కొచ్చి, కోల్‌కతా, ముంబై పోర్ట్, నవీ ముంబై, విశాఖపట్నం |
Acronym | IMU |
ఇండియన్ మారిటైమ్ యూనివర్శిటీ, భారత ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న ప్రభుత్వ కేంద్ర విశ్వవిద్యాలయం. ఇందులో సముద్ర శాస్త్రం నుండి సముద్ర చట్టం, చరిత్ర వరకు సముద్రానికి సంబంధించిన అనేక అంశాలను బోధిస్తారు. సముద్రంలో శోధన, రక్షణ, ప్రమాదకరమైన వస్తువుల రవాణా వంటి ఆచరణాత్మక అంశాలు కూడా వీటిలో ఉన్నాయి. మర్చంట్ నేవీ ఆఫీసర్ల శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక జాతీయ సంస్థ ఇది. IMUకి ప్రవేశాలు IMUCET ప్రవేశ పరీక్ష ద్వారా జరుగుతాయి. దీన్ని దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ సంస్థను 2008 నవంబరు 14 న ఇండియన్ మారిటైమ్ యూనివర్శిటీ చట్టం 2008 ద్వారా స్థాపించారు. IMU స్థాపనకు ముందు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కింద కింది ఏడు ప్రసిద్ధ బోధన, పరిశోధనా సంస్థలు ఉండేవి. 2008లో IMU ఏర్పడ్డాక, ఇవన్నీ దాని కిందకి వచ్చాయి.
- నేషనల్ మారిటైమ్ అకాడమీ, చెన్నై
- TS చాణక్య, ముంబై
- లాల్ బహదూర్ శాస్త్రి కాలేజ్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మారిటైమ్ స్టడీస్ & రీసెర్చ్, ముంబై
- మెరైన్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ముంబై
- మెరైన్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోర్ట్ మేనేజ్‌మెంట్, కోల్‌కతా
- నేషనల్ షిప్ డిజైన్ & రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం
దీని అధికార పరిధి భారతదేశమంతా ఉంది. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. చెన్నై, కొచ్చి, కోల్‌కతా, ముంబై పోర్ట్, నవీ ముంబై, విశాఖపట్నంలలో దీనికి ఆరు క్యాంపస్‌లు ఉన్నాయి.[1][2]
అనుబంధ కళాశాలలు
[మార్చు]IMU క్రింద అనుబంధంగా ఉన్న కళాశాలల జాబితా ఇది. 2018 నాటికి, 21 కళాశాలలు ఉన్నాయి.[1][2]
No. | కళాశాల పేరు | స్థానం |
---|---|---|
1 | ఆంగ్లో-ఈస్టర్న్ మారిటైమ్ అకాడమీ | రాయ్గడ్ |
2 | అప్లైడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మారిటైమ్ స్టడీస్ | న్యూ ఢిల్లీ |
3 | కోయంబత్తూర్ మెరైన్ కళాశాల | కోయంబత్తూర్ |
4 | కాలేజ్ ఆఫ్ షిప్ టెక్నాలజీ | పాలక్కాడ్ |
5 | డాక్టర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | పోర్ట్ బ్లెయిర్ |
6 | యూరో టెక్ మారిటైమ్ అకాడమీ | కొచ్చి |
7 | హెచ్ఐఎంటి కళాశాల (హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ ట్రైనింగ్) | చెన్నై |
8 | ఇంటర్నేషనల్ మారిటైమ్ ఇన్స్టిట్యూట్ | గ్రేటర్ నోయిడా |
9 | ఎంఎంటిఐ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రస్ట్ | ముంబై |
10 | పార్క్ మారిటైమ్ అకాడమీ | కోయంబత్తూర్ |
11 | సముద్ర శిక్షణ సంస్థ (ఎస్. సి. ఐ.) | ముంబై |
12 | సముద్ర శిక్షణ సంస్థ (ఎస్. సి. ఐ.) | తూత్తుకుడి |
13 | ఆర్ఎల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాటికల్ సైన్సెస్ | మధురై |
14 | సముద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ స్టడీస్ | పూణే |
15 | శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ స్టడీస్ | న్యూ ఢిల్లీ |
16 | సదరన్ అకాడమీ ఆఫ్ మారిటైమ్ స్టడీస్ | చెన్నై |
17 | గ్రేట్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ స్టడీస్ | ముంబై |
18 | తోలానీ మారిటైమ్ ఇన్స్టిట్యూట్ | పూణే |
19 | రెహమాన్ శిక్షణ నౌక | ముంబై |
20 | విశ్వకర్మ మారిటైమ్ ఇన్స్టిట్యూట్ | పూణే |
21 | యాక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ | ముంబై |
మూలాలు
[మార్చు]- ↑ "The list of institutes affiliated under IMU for B.Tech. Marine Engineering" (PDF). Archived from the original (PDF) on 2013-04-18.
- ↑ "The list of institutes affiliated under IMU for various courses" (PDF). Archived from the original (PDF) on 2017-03-29.