ఆమ్నీసియా
ఆమ్నీసియా | |
---|---|
ఇతర పేర్లు | ఆమ్నీసిక్ సిండ్రోమ్ |
వీడియో వివరణ | |
ప్రత్యేకత | మానసిక వ్యాధుల శాస్త్రం; నాడీ వ్యాధులు |
లక్షణాలు | జ్ఞాపకశక్తి కోల్పోవడం |
కారణాలు | తలకి గాయం తగలడం, థయామిన్ లోపం, స్ట్రోక్, మూర్ఛలు, చిత్తవైకల్యం, మద్యపానం, మెదడు కణితులు, కొన్ని మందులు, మెదడువాపు, తాత్కాలిక మతిమరుపు, తీవ్రమైన మానసిక ఒత్తిడి |
రోగనిర్ధారణ పద్ధతి | లక్షణాలు |
చికిత్స | అంతర్లీన కారణాన్ని పరిష్కరించడంబట్టి; జ్ఞాపక శక్తి పెంపొందించే పరికరాలు లేదా సలహా సమావేశాలు |
ఆమ్నీసియా అనేది గత సంఘటనలు, జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సామర్థ్యాన్ని కోల్పోవడాన్ని ఆమ్నీసియా (మతిమరపు) అంటారు. ఇది నిర్దిష్ట వ్యవధిలో కొంత వరకు కానీ (పాక్షికం) లేదా పూర్తిగా కానీ మరపు రావచ్చు. సాధారణంగా రోజువారీ పనులు, నైపుణ్యాలను ప్రదర్శించే సామర్థ్యం అలాగే ఉంటుంది. కానీ వ్యక్తులు వాస్తవాలను గుర్తుంచుకోగల సామర్థ్యం మాత్రమే కోల్పోతారు. జ్ఞాపకశక్తి కోల్పోవడం కొంచెంగా లేక శాశ్వతంగా ఉండవచ్చు. స్థిరంగా ఉండవచ్చు లేదా క్రమంగా తీవ్రమవవచ్చు.[1]
ఈ లక్షణాలకి కారణాలలో తలకి గాయం తగలడం, థయామిన్ లోపం, స్ట్రోక్, మూర్ఛలు, చిత్తవైకల్యం, మద్యపానం, మెదడు కణితులు, కొన్ని మందులు, మెదడువాపు, తాత్కాలిక గ్లోబల్ మతిమరుపు, తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నాయి. మెదడులోని వివిధ ప్రదేశాలు ప్రభావం ఉన్నప్పటికీ, ఈ మెదడు అంతర్లీన విధానం పూర్తిగా వివరణ కాలేదు. రోగనిర్ధారణ లక్షణాల ఆధారంగా ఉంటుంది ఇంకా నిర్దుష్ట నాడీ మానసిక వ్యాధుల పరీక్షల ఆధారాలు కూడా తీసుకుంటారు. [1] ఇది నిర్దుష్టమైన ప్రేరణ, శ్రద్ధ లేదా తార్కిక సామర్థ్యం ఉండదు. [2]
ఈ వ్యాధి అంతర్లీన కారణాన్ని పరిష్కరించడంబట్టి నిర్వహణ ఉంటుంది. [1] జ్ఞాపక శక్తి పెంపొందించే పరికరాలు లేదా సలహా సమావేశాలు (కౌన్సెలింగ్) ఉపయోగకరంగా ఉండవచ్చు. [3] మందులు సహాయపడవు. [3] మతిమరపు పెరుగుతున్న లక్షణాలతో దీర్ఘకాలికంగా సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు చాలా బాధ పడుతున్నారు. [1]
మొత్తానికి ఈ కేసుల ప్రాబల్యం అస్పష్టంగా ఉంది. [3] సుమారు 12% వ్యాధిగ్రస్తులకు తలకు గాయం తర్వాత అనారోగ్య సమస్యలు ఉంటాయి, అయితే 18% వరకు ఒత్తిడి వలన కూడా సమస్యలు ఉండవచ్చు. [3] ఆ జ్ఞాపకశక్తి కోల్పోవడమనే సమస్య మెదడుకు సంబంధించినదని మధ్య కాలంలో కనుగొన్నారు.[4] ఈ 'ఆమ్నీసియా' పదం ప్రాచీన గ్రీకు నుండి ఏర్పడింది. ''ἀ-'' (a-); ''μνήσις'' (mnesis). దీని అర్ధం - జ్ఞాపక శక్తి లేకుండా 'మతిమరుపు' అని. [5]
ఇది కూడా చూడండి
[మార్చు]ప్రస్తావనలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Amnesia - Brain, Spinal Cord, and Nerve Disorders". Merck Manuals Consumer Version. Archived from the original on 26 February 2021. Retrieved 26 February 2021.
- ↑ "Amnesias - Neurologic Disorders". Merck Manuals Professional Edition. Archived from the original on 24 June 2021. Retrieved 27 February 2021.
- ↑ 3.0 3.1 3.2 3.3 Sharma, Sangeeta (2019). The 5-Minute Clinical Consult 2020 (in ఇంగ్లీష్). Wolters kluwer india Pvt Ltd. pp. 40–41. ISBN 978-93-89702-05-7. Archived from the original on 2021-06-24. Retrieved 2021-04-24.
- ↑ Parkin, Alan J. (2013). Memory and Amnesia: An Introduction (in ఇంగ్లీష్). Psychology Press. p. 85. ISBN 978-1-135-06436-5. Archived from the original on 2021-06-24. Retrieved 2021-04-24.
- ↑ Kaufman, David Myland; Milstein, Mark J. (2012). Kaufman's Clinical Neurology for Psychiatrists E-Book (in ఇంగ్లీష్). Elsevier Health Sciences. p. 109. ISBN 978-1-4557-4004-8. Archived from the original on 2021-06-24. Retrieved 2021-04-24.