గోరన్ ఇవనీసెవిచ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోరన్ ఇవనీసెవిచ్
గోరన్ ఇవనీసెవిచ్, 2016 అక్టోబరులో వియెన్నా ఓపెన్ టోర్నమెంటులో ఆడుతూ
దేశం Croatia (1992–2004)
 Yugoslavia (1988–1992)
నివాసంమొనాకో లోని మోటె కార్లో
జననం (1971-09-13) 1971 సెప్టెంబరు 13 (వయసు 53)
స్ప్లిట్, క్రొయేషియా
ఎత్తు1.93 మీ. (6 అ. 4 అం.)
ప్రారంభం1988
విశ్రాంతి2004
ఆడే విధానంఎడమ చేతి వాటం (రెండు చేతుల బ్యాక్‌హ్యాండ్)
బహుమతి సొమ్ము$1,98,78,007
  •  అత్యధిక సంపాదనల్లో 32 వ స్థానం
Int. Tennis HOF2020[1] (member page)
సింగిల్స్
సాధించిన రికార్డులుమూస:Tennis record
సాధించిన విజయాలు22
అత్యుత్తమ స్థానముNo. 2 (1994 జూలై 4)
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్క్వా.ఫై (1989,1994,1997)
ఫ్రెంచ్ ఓపెన్క్వా.ఫై (1990, 1992, 1994)
వింబుల్డన్వి (2001)
యుఎస్ ఓపెన్సె.ఫై (1996)
Other tournaments
Tour Finalsసె.ఫై (1992,1993,1996)
Olympic Gamesసె.ఫై (1992)
డబుల్స్
Career recordమూస:Tennis record
Career titles9
Highest rankingNo. 20 (1992 జనవరి 6)
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్2రౌం (1990,1994)
ఫ్రెంచ్ ఓపెన్ఫై (1990, 1999)
వింబుల్డన్3రౌం (1989, 1993)
యుఎస్ ఓపెన్క్వా.ఫై (1997)
Team Competitions
డేవిస్ కప్వి (1005)
Hopman Cupవి (1996)
Coaching career
  • మారిన్ సిలిచ్ (2013–2016)
  • థామస్ బెర్డిక్ (2016–2017)
  • మిలోస్ రావొనిచ్ (2018–2019)
  • నోవాక్ జకోవిచ్ (2019–2024)
Coaching achievements
Coachee Singles Titles total30
List of notable tournaments
(with champion)
Last updated on: 2023 డిసెంబరు 9.

గోరన్ ఇవనీసెవిచ్ (జననం:1971 సెప్టెంబరు 13) క్రొయేషియన్ మాజీ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు, ప్రస్తుత కోచ్. అతను వైల్డ్ కార్డ్‌గా వింబుల్డన్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న ఏకైక ఆటగాడు. 2001 లో ప్రపంచ నంబరు 125 ర్యాంక్‌లో ఉన్నాడు. అతను గతంలో 1992, 1994, 1998 లో వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఇవనీసెవిచ్ కెరీర్లో అత్యుత్తమ సింగిల్స్ ర్యాంకింగ్ ప్రపంచ నం.2 ను 1994 జూలైలో సాధించాడు. అతను తన శక్తివంతమైన ఎడమ చేతి సర్వ్‌లకు ప్రసిద్ది చెందాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు వింబుల్డన్‌లో అత్యధిక ఏస్‌లు సాధించిన రికార్డు (1,377) అతని పేరిట ఉంది. 2019 లో రోజర్ ఫెదరర్ దానిని బద్దలు కొట్టాడు. ఇవానిసెవిచ్ 2013 సెప్టెంబరు నుండి 2016 జూలై వరకు మారిన్ సిలిచ్‌కు శిక్షణ ఇచ్చాడు. 2014 US ఓపెన్‌లో ఇప్పటి వరకు సిలిక్‌ అతని ఏకైక ప్రధాన టైటిల్‌ గెలవడంలో తోడ్పడ్డాడు. [2] అతను 2019 నుండి నోవాక్ జకోవిచ్‌కి కోచ్‌గా ఉన్నాడు. ఇవనీసెవిచ్ 2020లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించాడు.[3]

కెరీర్

[మార్చు]

గోరన్, గోరానా (స్కారిక్), స్రాన్ ఇవనీసెవిచ్‌ల కుమారుడు. [4] బాలుడిగా, అతను జెలెనా జెన్సిక్ వద్ద శిక్షణ పొందాడు. అతను 1988లో ప్రొఫెషనల్‌గా మారాడు. ఆ సంవత్సరమే రూడిగర్ హాస్‌తో కలిసి ఫ్రాంక్‌ఫర్ట్‌లో తన కెరీర్‌లో మొట్ట మొదటి డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. సింగిల్స్ కెరీర్‌పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినప్పటికీ, అతను డబుల్స్‌లో కూడా తొమ్మిది టైటిళ్లను గెలుచుకున్నాడు. కెరీర్‌లో అత్యధిక ర్యాంకింగ్ 20కి చేరుకున్నాడు.

1989లో, క్వాలిఫైయర్‌గా అతను ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించాడు. 1990 టూర్‌లో ఇవనీసెవిచ్ మొదటిసారి తన ప్రభావాన్ని కనబరచాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో బోరిస్ బెకర్‌ను మొదటి రౌండ్‌లోనే పడగొట్టాడు; ఆ టోర్నమెంటులో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో పీటర్ కోర్డాతో కలిసి రన్నరప్‌గా నిలిచాడు. ఆ సంవత్సరం వింబుల్డన్‌లో ఇవనీసెవిచ్, సెమీఫైనల్‌కు చేరుకుని, అక్కడ బెకర్ చేతిలో నాలుగు సెట్లలో ఓడిపోయాడు. ఇవనీసెవిచ్ తన మొదటి టూర్ సింగిల్స్ టైటిల్‌ను 1990లో స్టట్‌గార్ట్‌లో గెలుచుకున్నాడు. యుగోస్లేవియా, ప్రపంచ టీమ్ కప్‌ను గెలుచుకోవడంలో తోడ్పడ్డాడు. 1991లో క్రొయేషియా స్వాతంత్ర్యం పొందాక జట్టు నుండి నిష్క్రమించాడు. దానికి ముందు డేవిస్ కప్‌లో యుగోస్లేవియా తరపున ఎనిమిది మ్యాచ్‌లలో ఆడాడు [5] ఆ తరువాత, యుగోస్లేవియా ఫ్రాన్స్‌తో జరిగిన పోటీలను 5-0 తో కోల్పోయింది.


ఇవనీసెవిచ్ దాడి చేసే తన ఆటతీరుకు, అత్యంత శక్తివంతమైన సర్వీసుకూ ప్రసిద్ధి చెందాడు. ఎక్కువ ఏస్‌లను సర్వ్‌ చెయ్యడంలో చాలా సంవత్సరాల పాటు అతను అగ్రస్థానాన ఉండేవాడు. అప్పుడప్పుడు కోర్టులో కోపతాపాల ప్రదర్శించడానికి కూడా ప్రసిద్ధి చెందాడు. సాధారణంగా కోపాన్ని తనపైననే చూపించుకునేవాడు. ఆటలో అస్థిరతకు అతను ప్రసిద్ధి. 1992 ఆస్ట్రేలియన్ పురుషుల హార్డ్‌కోర్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇవనీసెవిచ్‌ను చంపుతామనే బెదిరింపులు వచ్చాయి. [6] అతను ఆ టోర్నీలో విజయం సాధించాడు.

1992లో, ఇవనీసెవిచ్ తన మొదటి వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. ఇవాన్ లెండిల్, స్టెఫాన్ ఎడ్‌బర్గ్, పీట్ సంప్రాస్‌లను వరుసగా ఓడించాడు.[7] [8] ఇవనీసెవిచ్ 6–7, 7–6, 6–4, 6–2 తో సంప్రాస్‌పై సెమీఫైనల్లో సాధించిన విజయం విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో ఇవనీసెవిచ్ 36 ఏస్‌లు సాధించాడు. మొత్తం మ్యాచ్‌లో ఒక్క బ్రేక్ పాయింట్‌ను కూడా ఎదుర్కోలేదు.[9] ఫైనల్‌లో, ఇవనీసెవిచ్ ఆండ్రీ అగస్సీని ఎదుర్కొన్నాడు. ఇద్దరు ఆటగాళ్లు తమ మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకునే ప్రయత్నంలో ముఖాముఖీ తలపడ్డారు. అగస్సీ చివరికి 6–7, 6–4, 6–4, 1–6, 6–4తో గెలిచాడు. [10] ఐదవ సెట్‌లో, ఇవనీసెవిచ్ 3-3 వద్ద అగస్సీ సర్వీస్‌ను బ్రేక్ చేసే స్థితిలో ఉన్నాడు, కానీ దానిని మార్చడంలో విఫలమయ్యాడు. మ్యాచ్ చివరి గేమ్‌లో, ఇవనీసెవిచ్ గేమ్‌ను ప్రారంభించేందుకు 2 డబుల్ ఫాల్ట్‌లను చేసాడు.[11] అంతకు ముందు మొత్తం మ్యాచ్‌లో కేవలం 5 డబుల్ ఫాల్ట్‌లను మాత్రమే చేసాడు. టోర్నమెంట్‌లో ఇవనీసెవిచ్ ఏస్ కౌంట్ (206) ఆ సమయానికి వింబుల్డన్ చరిత్ర లోనే అత్యధికం. 2001 లో మళ్ళీ ఇవనీసెవిచ్ 213 ఏస్‌లతో తన సొంత రికార్డును తానే అధిగమించాడు. [12] ఇవనీసెవిచ్ 1992 వింబుల్డన్ ఫైనల్‌లో అగస్సీపై 37 ఏస్‌లు సాధించగా, అగస్సీ మొత్తం టోర్నమెంట్‌లో 37 ఏస్‌లు సాధించాడు. ఆ వేసవి తర్వాత బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్ క్రీడలలో, ఇవనీసెవిచ్ అప్పుడే కొత్తగా స్వాతంత్ర్యం సాధించిన క్రొయేషియాకు ప్రాతినిధ్యం వహిస్తూ సింగిల్స్, డబుల్స్ రెండింటిలోనూ కాంస్య పతకాలను గెలుచుకున్నాడు.[13][14] అతను ప్రారంభ వేడుకలో క్రొయేషియా జట్టుకు జెండా పట్టుకుని నడిచాడు. తన సింగిల్ కాంస్య పతకాన్ని సంపాదించడానికి, అతను వరుసగా నాలుగు 5-సెట్ల మ్యాచ్‌లను గెలుచుకున్నాడు. [13] ఆ ఏడాది నాలుగు సింగిల్స్ టైటిల్స్ కూడా గెలుచుకున్నాడు.

ఇవనీసెవిచ్ 1994 లో రెండవసారి వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకున్నాడు, అక్కడ అతను డిఫెండింగ్-ఛాంపియన్ పీట్ సంప్రాస్ చేతిలో 7–6, 7–6, 6–0తో ఓడిపోయాడు. [15] ఇవనీసెవిచ్ ఆ సంవత్సరం జూలైలో తన కెరీర్లో అత్య్యుత్తమ సింగిల్స్ ర్యాంకింగ్ ప్రపంచ నంబర్ 2 కి చేరుకున్నాడు.

1995లో, ఇవనీసెవిచ్ 7–6, 6–3, 6–4తో ఫైనల్‌లో టాడ్ మార్టిన్‌ను ఓడించి గ్రాండ్ స్లామ్ కప్‌ను గెలుచుకున్నాడు. [16] వింబుల్డన్‌లో, ఇవనీసెవిచ్ మళ్లీ సెమీఫైనల్స్‌లో సంప్రాస్‌తో 6–7, 6–4, 3–6, 6–4, 3–6తో ఓడిపోయాడు.

2001 వేసవి నాటికి, ఇవనీసెవిచ్ ప్రపంచ 125 వ ర్యాంకు సాధించాడు. వింబుల్డన్‌ మెయిన్ డ్రాలో ఆటోమాటిగ్గా చోటు సంపాదించడానికి అది సరిపోలేదు. కానీ, మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిన అతని గత రికార్డు కారణంగా, సింగిల్స్ డ్రాలో ప్రవేశించేందుకు అతనికి వైల్డ్ కార్డ్ లభించింది. అతను మాజీ ప్రపంచ నం. 1 ఆటగాడు కార్లోస్ మోయాను, భవిష్యత్ ప్రపంచ నం. 1 ఆటగాడు ఆండీ రాడిక్‌ మరాత్ సఫిన్‌లతో పాటు ఫ్రెడ్రిక్ జాన్సన్, గ్రెగ్ రుసెడ్‌స్కీలను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. వర్షం కారణంగా మూడు రోజుల పాటు ఆడిన ఐదు సెట్ల సెమీఫైనల్‌లో ఫేవరెట్ టిమ్ హెన్‌మాన్‌ను ఓడించాడు. దాన్ని క్లాసిక్ ఆటగా పరిగణిస్తారు.[17][18][19] ఆ విజయంతో అతను మునుపటి సంవత్సరం రన్నరప్, మాజీ US ఓపెన్ ఛాంపియన్ పాట్రిక్ రాఫ్టర్‌తో తలపడ్డాడు. 1998 తర్వాత ఇవనీసెవిచ్‌కి ఇది మొదటి సింగిల్స్ ఫైనల్. మూడు గంటలపాటు జరిగిన మ్యాచ్‌లో ఇవనీసెవిచ్ 6–3, 3–6, 6–3, 2–6, 9–7తో రాఫ్టర్‌ను ఓడించాడు. దాంతో ఇవనీసెవిచ్, వింబుల్డన్ గెలిచిన మొదటి వైల్డ్ కార్డ్ ఆటగాడిగా, అత్యల్ప ర్యాంక్‌లో ఉన్న ఆటగాడిగా నిలిచాడు. [20] ఇప్పటి వరకు, గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను వైల్డ్ కార్డ్‌గా గెలుచుకున్న ఏకైక పురుషుడు అతనే. బ్రిటీష్ టెలివిజన్ ప్రోగ్రామ్ వారి 100 గ్రేటెస్ట్ స్పోర్టింగ్ మూమెంట్స్ జాబితాలో అతని వింబుల్డన్ విజయం పదహారవ స్థానంలో ఉంది.

ప్లేయింగ్ స్టైల్

[మార్చు]

ఇవనీసెవిచ్ సర్వ్ అండ్ వాలీ ఆటగాడు. గ్రాస్ కోర్ట్‌లకు సరిపోయే వేగవంతమైన, దూకుడు ఆట ఆడతాడు. ఎడమ చేతితో చేసే శక్తివంతమైన, ఖచ్చితమైన సర్వీసుకు, ముఖ్యంగా ఆట కోల్పోయే దశలో ఉన్నపుడు అతడు చేసే సర్వ్‌కు గాను అతను ప్రసిద్ధి చెందాడు. టెన్నిస్ చరిత్రలో అత్యంత ఆధిపత్య సర్వర్‌లలో అతను ఒకడిగా పరిగణిస్తారు. ప్రత్యర్థి ఒక్కసారి కూడా అతని సర్వ్‌ను తిరిగి కొట్టకుండానే మొత్తం గేమ్‌లను గెలుచుకునేవాడు.

చాలా మంది సర్వ్-అండ్-వాలీయర్‌ల మాదిరిగానే, ఇవనీసెవిచ్ రిటర్న్ గేమ్, డిఫెన్సులు బలహీనంగా ఉంటాయి. బ్యాక్‌హ్యాండ్‌లో టాప్-స్పిన్‌తో కొట్టడానికి బదులు, తరచూ స్లైస్‌ను ఉపయోగిస్తాడు.

గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్

[మార్చు]

సింగిల్స్: 4 (1 టైటిల్, 3 రన్నరప్)

[మార్చు]
ఫలితం సంవత్సరం ఛాంపియన్‌షిప్ ఉపరితలం ప్రత్యర్థి స్కోరు
ఓటమి 1992 వింబుల్డన్ పచ్చిక యు.ఎస్.ఏ ఆండ్రీ అగస్సీ 7–6 (10–8), 4–6, 4–6, 6–1, 4–6
ఓటమి 1994 వింబుల్డన్ పచ్చిక యు.ఎస్.ఏ పీట్ సంప్రాస్ 6–7 (2–7), 6–7 (5–7), 0–6
ఓటమి 1998 వింబుల్డన్ పచ్చిక యు.ఎస్.ఏ పీట్ సంప్రాస్ 7–6 (7–2), 6–7 (9–11), 4–6, 6–3, 2–6
గెలుపు 2001 వింబుల్డన్ పచ్చిక ఆస్ట్రేలియా పాట్రిక్ రాఫ్టర్ 6–3, 3–6, 6–3, 2–6, 9–7

డబుల్స్: 2

[మార్చు]
ఫలితం సంవత్సరం ఛాంపియన్‌షిప్ ఉపరితలం భాగస్వామి ప్రత్యర్థులు స్కోర్
ఓటమి 1990 ఫ్రెంచ్ ఓపెన్ మట్టి Czechoslovakia పీటర్ కోర్డా స్పెయిన్సెర్గియో కాసల్



స్పెయిన్ఎమిలియో సాంచెజ్
5–7, 3–6
ఓటమి 1999 ఫ్రెంచ్ ఓపెన్ మట్టి యు.ఎస్.ఏ జెఫ్ తరంగో భారతదేశంమహేష్ భూపతి



భారతదేశంలియాండర్ పేస్
2–6, 5–7

ఇతర ముఖ్యమైన ఫైనల్స్

[మార్చు]

గ్రాండ్ స్లామ్ కప్

[మార్చు]

సింగిల్స్: 2 (1–1)

[మార్చు]
ఫలితం సంవత్సరం టోర్నమెంటు ఉపరితల ప్రత్యర్థి స్కోర్
గెలుపు 1995 గ్రాండ్ స్లామ్ కప్ కార్పెట్ (i) యు.ఎస్.ఏ టాడ్ మార్టిన్ 7–6 (7–4), 6–3, 6–4
ఓటమి 1996 గ్రాండ్ స్లామ్ కప్ కార్పెట్ (i) జర్మనీ బోరిస్ బెకర్ 3–6, 4–6, 4–6

ATP సూపర్ 9 ఫైనల్స్

[మార్చు]

సింగిల్స్: 7 (2–5)

[మార్చు]
ఫలితం సంవత్సరం టోర్నమెంటు ఉపరితల ప్రత్యర్థి స్కోర్
గెలుపు 1992 స్టాక్‌హోమ్ కార్పెట్ (i) ఫ్రాన్స్ గై మర్చిపో 7–6 (7–2), 4–6, 7–6 (7–5), 6–2
ఓటమి 1993 రోమ్ మట్టి యు.ఎస్.ఏ జిమ్ కొరియర్ 1–6, 2–6, 2–6
ఓటమి 1993 స్టాక్‌హోమ్ కార్పెట్ (i) జర్మనీ మైఖేల్ స్టిచ్ 6–4, 6–7 (6–8), 6–7 (3–7), 2–6
గెలుపు 1993 పారిస్ కార్పెట్ (i) ఉక్రెయిన్ ఆండ్రీ మెద్వెదేవ్ 6–4, 6–2, 7–6 (7–2)
ఓటమి 1994 స్టాక్‌హోమ్ కార్పెట్ (i) జర్మనీబోరిస్ బెకర్ 6–4, 4–6, 3–6, 6–7 (4–7)
ఓటమి 1995 హాంబర్గ్ మట్టి ఉక్రెయిన్ఆండ్రీ మెద్వెదేవ్ 3–6, 2–6, 1–6
ఓటమి 1996 మయామి హార్డ్ యు.ఎస్.ఏఆండ్రీ అగస్సీ 0–3 రెట్.

డబుల్స్: 1 (1–0)

[మార్చు]
ఫలితం సంవత్సరం టోర్నమెంటు ఉపరితల భాగస్వామి ప్రత్యర్థి స్కోర్
గెలుపు 1991 రోమ్ మట్టి ఇటలీ ఒమర్ కాంపోరీస్ ఆస్ట్రేలియాలారీ వార్డర్



యు.ఎస్.ఏల్యూక్ జెన్సన్
6–2, 6–3

ATP కెరీర్ ఫైనల్స్

[మార్చు]

సింగిల్స్: 49 (22 టైటిల్స్, 27 రన్నరప్)

[మార్చు]
లెజెండ్
గ్రాండ్‌స్లామ్ (1–3)
గ్రాండ్ స్లామ్ కప్ (1–1)
ATP సూపర్ 9 (2–5)
ATP ఛాంపియన్‌షిప్ సిరీస్ (7–5)
ATP వరల్డ్ సిరీస్ (11–13)
ఉపరితలం వారీగా శీర్షికలు
హార్డ్ (3–8)
పచ్చిక (2–4)
క్లే (3–6)
కార్పెట్ (14–9)
ఫలితం లేదు తేదీ టోర్నమెంటు ఉపరితలం ప్రత్యర్థి స్కోర్
ఓటమి 1. మే 1989 ఫ్లోరెన్స్, ఇటలీ మట్టి. హోరేసిఓ డి లా పెనాఅర్జెంటీనా 4–6, 3–6
ఓటమి 2. మే 1990 ఉమగ్, యుగోస్లేవియా మట్టి. గోరన్ ప్రిపిక్Socialist Federal Republic of Yugoslavia 3–6, 6–4, 4–6
గెలుపు 1. జూలై 1990 స్టుట్గార్ట్ అవుట్డోర్, పశ్చిమ జర్మనీ మట్టి. గిల్లెర్మో పెరెజ్ రోల్డాన్అర్జెంటీనా 6–7(2–7), 6–1, 6–4, 7–6(7–5)
ఓటమి 3. ఆగస్టు 1990 లాంగ్ ఐలాండ్, యుఎస్ కఠినం. స్టీఫన్ ఎడ్బర్గ్Sweden 6–7(3–7), 3–6
ఓటమి 4. సెప్టెంబరు 1990 బోర్డియక్స్, ఫ్రాన్స్ మట్టి. అబ్బాయి మర్చిపోఫ్రాన్స్ 4–6, 3–6
ఓటమి 5. సెప్టెంబరు 1990 బాసెల్, స్విట్జర్లాండ్ కార్పెట్ (ఐ) జాన్ మెక్ఎన్రోయు.ఎస్.ఏ 7–6(7–4), 6–4, 6–7(3–7), 3–6, 4–6
గెలుపు 2. జూన్ 1991 మాంచెస్టర్, UK పచ్చిక పీట్ సాంప్రాస్యు.ఎస్.ఏ 6–4, 6–4
ఓటమి 6. ఆగస్టు 1991 న్యూ హావెన్, యుఎస్ కఠినం. పీటర్ కోర్డాCzechoslovakia 4–6, 2–6
గెలుపు 3. డిసెంబరు 1991 అడిలైడ్, ఆస్ట్రేలియా కఠినం. క్రిస్టియన్ బెర్గ్స్ట్రోమ్Sweden 1–6, 7–6(7–5), 6–4
ఓటమి 7. ఫిబ్రవరి 1992 మిలన్, ఇటలీ కార్పెట్ (ఐ) ఒమర్ కాంపోరేస్ఇటలీ 6–3, 3–6, 4–6
గెలుపు 4. ఫిబ్రవరి 1992 స్టుట్గార్ట్ ఇండోర్, జర్మనీ కార్పెట్ (ఐ) స్టీఫన్ ఎడ్బర్గ్Sweden 6–7(5–7), 6–3, 6–4, 6–4
ఓటమి 8. జూలై 1992 వింబుల్డన్, లండన్ పచ్చిక ఆండ్రీ అగస్సీయు.ఎస్.ఏ 7–6(10–8), 4–6, 4–6, 6–1, 4–6
గెలుపు 5. అక్టోబరు 1992 సిడ్నీ ఇండోర్, ఆస్ట్రేలియా హార్డ్ (ఐ) స్టీఫన్ ఎడ్బర్గ్Sweden 6–4, 6–2, 6–4
గెలుపు 6. అక్టోబరు 1992 స్టాక్హోమ్, స్వీడన్ కార్పెట్ (ఐ) అబ్బాయి మర్చిపోఫ్రాన్స్ 7–6(7–2), 4–6, 7–6(7–5), 6–2
ఓటమి 9. జనవరి 1993 దోహా, ఖతార్ కఠినం. బోరిస్ బెకర్జర్మనీ 6–7(4–7), 6–4, 5–7
ఓటమి 10. మే 1993 రోమ్, ఇటలీ మట్టి. జిమ్ కొరియర్యు.ఎస్.ఏ 1–6, 2–6, 2–6
గెలుపు 7. సెప్టెంబరు 1993 బుకారెస్ట్, రొమేనియా మట్టి. ఆండ్రీ చెర్కాసోవ్Russia 6–2, 7–6(7–5)
గెలుపు 8. అక్టోబరు 1993 వియన్నా, ఆస్ట్రియా కార్పెట్ (ఐ) థామస్ మస్టర్ఆస్ట్రియా 4–6, 6–4, 6–4, 7–6(7–3)
ఓటమి 11. అక్టోబరు 1993 స్టాక్హోమ్, స్వీడన్ కార్పెట్ (ఐ) మైఖేల్ స్టిచ్జర్మనీ 6–4, 6–7(6–8), 6–7(3–7), 2–6
గెలుపు 9. నవంబరు 1993 పారిస్ ఇండోర్, ఫ్రాన్స్ కార్పెట్ (ఐ) ఆండ్రీ మెద్వెదేవ్ఉక్రెయిన్ 6–4, 6–2, 7–6(7–2)
ఓటమి 12. ఫిబ్రవరి 1994 స్టుట్గార్ట్ ఇండోర్, జర్మనీ కార్పెట్ (ఐ) స్టీఫన్ ఎడ్బర్గ్Sweden 6–4, 4–6, 2–6, 2–6
ఓటమి 13. జూన్ 1994 వింబుల్డన్, లండన్ పచ్చిక పీట్ సాంప్రాస్యు.ఎస్.ఏ 6–7(2–7), 6–7(5–7), 0–6
గెలుపు 10. ఆగస్టు 1994 కిట్జ్బూహెల్, ఆస్ట్రియా మట్టి. ఫాబ్రిస్ శాంటోరోఫ్రాన్స్ 6–2, 4–6, 4–6, 6–3, 6–2
ఓటమి 14. సెప్టెంబరు 1994 బుకారెస్ట్, రొమేనియా మట్టి. ఫ్రాంకో డేవిన్అర్జెంటీనా 2–6, 4–6
గెలుపు 11. అక్టోబరు 1994 టోక్యో ఇండోర్, జపాన్ కార్పెట్ (ఐ) మైఖేల్ చాంగ్యు.ఎస్.ఏ 6–4, 6–4
ఓటమి 15. అక్టోబరు 1994 స్టాక్హోమ్, స్వీడన్ కార్పెట్ (ఐ) బోరిస్ బెకర్జర్మనీ 6–4, 4–6, 3–6, 6–7(4–7)
ఓటమి 16. మే 1995 హాంబర్గ్, జర్మనీ మట్టి. ఆండ్రీ మెద్వెదేవ్ఉక్రెయిన్ 3–6, 2–6, 1–6
గెలుపు 12. డిసెంబరు 1995 గ్రాండ్ స్లామ్ కప్, మ్యూనిచ్ కార్పెట్ (ఐ) టాడ్ మార్టిన్యు.ఎస్.ఏ 7–6(7–4), 6–3, 6–4
ఓటమి 17. జనవరి 1996 సిడ్నీ అవుట్డోర్, ఆస్ట్రేలియా కఠినం. టాడ్ మార్టిన్యు.ఎస్.ఏ 7–5, 3–6, 4–6
గెలుపు 13. జనవరి 1996 జాగ్రెబ్, క్రొయేషియా కార్పెట్ (ఐ) సెడ్రిక్ పియోలిన్ఫ్రాన్స్ 3–6, 6–3, 6–2
గెలుపు 14. ఫిబ్రవరి 1996 దుబాయ్, యుఎఇ కఠినం. ఆల్బర్ట్ కోస్టాస్పెయిన్ 6–4, 6–3
ఓటమి 18. ఫిబ్రవరి 1996 ఆంట్వెర్ప్, బెల్జియం కార్పెట్ (ఐ) మైఖేల్ స్టిచ్జర్మనీ 3–6, 2–6, 6–7(5–7)
గెలుపు 15. ఫిబ్రవరి 1996 మిలన్, ఇటలీ కార్పెట్ (ఐ) మార్క్ రోసెట్స్విట్జర్లాండ్ 6–3, 7–6(7–3)
గెలుపు 16. మార్చి 1996 రోటర్డామ్, నెదర్లాండ్స్ కార్పెట్ (ఐ) యెవ్జెనీ కాఫెల్నికోవ్Russia 6–4, 3–6, 6–3
ఓటమి 19. మార్చి 1996 కీ బిస్కేన్, యుఎస్ కఠినం. ఆండ్రీ అగస్సీయు.ఎస్.ఏ 0-3, రెట్.
ఓటమి 20. ఆగస్టు 1996 ఇండియానాపోలిస్, యుఎస్ కఠినం. పీట్ సాంప్రాస్యు.ఎస్.ఏ 6–7(3–7), 5–7
గెలుపు 17. నవంబరు 1996 మాస్కో, రష్యా కార్పెట్ (ఐ) యెవ్జెనీ కాఫెల్నికోవ్Russia 3–6, 6–1, 6–3
ఓటమి 21. డిసెంబరు 1996 గ్రాండ్ స్లామ్ కప్, మ్యూనిచ్ కార్పెట్ (ఐ) బోరిస్ బెకర్జర్మనీ 3–6, 4–6, 4–6
గెలుపు 18. జనవరి 1997 జాగ్రెబ్, క్రొయేషియా కార్పెట్ (ఐ) గ్రెగ్ రుసెడ్స్కీUnited Kingdom 7–6(7–4), 4–6, 7–6(8–6)
ఓటమి 22. ఫిబ్రవరి 1997 దుబాయ్, యుఎఇ కఠినం. థామస్ మస్టర్ఆస్ట్రియా 5–7, 6–7(3–7)
గెలుపు 19. ఫిబ్రవరి 1997 మిలన్, ఇటలీ కార్పెట్ (ఐ) సెర్గి బ్రుగురాస్పెయిన్ 6–2, 6–2
ఓటమి 23. జూన్ 1997 క్వీన్స్ క్లబ్, UK పచ్చిక మార్క్ ఫిలిప్పూసిస్ఆస్ట్రేలియా 5–7, 3–6
గెలుపు 20. అక్టోబరు 1997 వియన్నా, ఆస్ట్రియా కార్పెట్ (ఐ) గ్రెగ్ రుసెడ్స్కీUnited Kingdom 3–6, 6–7(4–7), 7–6(7–4), 6–2, 6–3
గెలుపు 21. ఫిబ్రవరి 1998 స్ప్లిట్, క్రొయేషియా కార్పెట్ (ఐ) గ్రెగ్ రుసెడ్స్కీUnited Kingdom 7–6(7–3), 7–6(7–5)
ఓటమి 24. జూన్ 1998 వింబుల్డన్, లండన్ పచ్చిక పీట్ సాంప్రాస్యు.ఎస్.ఏ 7–6(7–2), 6–7(9–11), 4–6, 6–3, 2–6
ఓటమి 25. ఆగస్టు 1998 న్యూ హావెన్, యుఎస్ కఠినం. కరోల్ కుసేరాస్లొవేకియా 4–6, 7–5, 2–6
ఓటమి 26. అక్టోబరు 1998 షాంఘై, చైనా కార్పెట్ మైఖేల్ చాంగ్యు.ఎస్.ఏ 6–4, 1–6, 2–6
ఓటమి 27. నవంబరు 1998 మాస్కో, రష్యా కార్పెట్ యెవ్జెనీ కాఫెల్నికోవ్Russia 6–7(2–7), 6–7(5–7)
గెలుపు 22. జూలై 2001 వింబుల్డన్, లండన్ పచ్చిక పాట్రిక్ రాఫ్టర్ఆస్ట్రేలియా 6–3, 3–6, 6–3, 2–6, 9–7

డబుల్స్ (9–10)

[మార్చు]
లెజెండ్
గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు (0–2)
టెన్నిస్ మాస్టర్స్ కప్ (0–0)
ATP మాస్టర్స్ సిరీస్ (1–0)
ATP అంతర్జాతీయ సిరీస్ గోల్డ్ (1–4)
ATP అంతర్జాతీయ సిరీస్ (7–4)
ఉపరితలం ద్వారా ఫైనల్స్
హార్డ్ (3–3)
క్లే (1–5)
పచ్చిక (1–1)
కార్పెట్ (4–1)
ఫలితం. . లేదు. తేదీ టోర్నమెంటు ఉపరితలం భాగస్వామి ప్రత్యర్థులు స్కోర్
గెలుపు 1. అక్టోబరు 1988 ఫ్రాంక్ఫర్ట్, పశ్చిమ జర్మనీ కార్పెట్ (ఐ) రూడిగర్ హాస్West Germany జెరెమీ బేట్స్ టామ్ నిజ్సెన్United Kingdom
నెదర్లాండ్స్
1–6, 7–5, 6–3
ఓటమి 1. అక్టోబరు 1989 పలెర్మో, ఇటలీ మట్టి. డియెగో నర్గీసోఇటలీ పీటర్ బల్లాఫ్ రుడిగర్ హాస్West Germany
West Germanyరూడిగర్ హాస్
2–6, 7–6, 4–6
ఓటమి 2. ఫిబ్రవరి 1990 బ్రస్సెల్స్, బెల్జియం కార్పెట్ (ఐ) బాలాజ్స్ టారోసీహంగరీ ఎమిలియో సాంచెజ్ స్లోబోడాన్ జివోజినోవిక్స్పెయిన్
Socialist Federal Republic of Yugoslavia
5–7, 3–6
ఓటమి 3. జూన్ 1990 ఫ్రెంచ్ ఓపెన్, పారిస్ మట్టి. పీటర్ కోర్డాCzechoslovakia సెర్గియో కాసల్ ఎమిలియో సాంచెజ్స్పెయిన్
స్పెయిన్
5–7, 3–6
ఓటమి 4. ఆగస్టు 1990 న్యూ హావెన్, U. S. కఠినం. పీటర్ కోర్డాచెక్ రిపబ్లిక్ జెఫ్ బ్రౌన్ స్కాట్ మెల్విల్యు.ఎస్.ఏ
యు.ఎస్.ఏ
5–7, 6–7
గెలుపు 2. ఫిబ్రవరి 1991 మిలన్, ఇటలీ కార్పెట్ (ఐ) ఒమర్ కాంపోరేస్ఇటలీ సిరిల్ సుక్ టామ్ నిజ్సేన్Czechoslovakia
నెదర్లాండ్స్టామ్ నిజ్సెన్
6–4, 7–6
గెలుపు 3. మే 1991 రోమ్, ఇటలీ మట్టి. ఒమర్ కాంపోరేస్ఇటలీ లారీ వార్డర్ ల్యూక్ జెన్సెన్ఆస్ట్రేలియా
యు.ఎస్.ఏ
6–2, 6–3
గెలుపు 4. జూన్ 1991 మాంచెస్టర్, UK పచ్చిక ఒమర్ కాంపోరేస్ఇటలీ ఆండ్రూ కాజిల్ నిక్ బ్రౌన్United Kingdom
United Kingdom
6–4, 6–3
ఓటమి 5. జూలై 1991 స్టుట్గార్ట్ అవుట్డోర్, జర్మనీ మట్టి. ఒమర్ కాంపోరేస్ఇటలీ వాలీ మసూర్ ఎమిలియో సాంచెజ్ఆస్ట్రేలియా
స్పెయిన్
6–2, 3–6, 4–6
గెలుపు 5. డిసెంబరు 1991 అడిలైడ్, ఆస్ట్రేలియా కఠినం. మార్క్ రోసెట్స్విట్జర్లాండ్ మార్క్ క్రాట్జ్మాన్ జాసన్ స్టోల్టెన్బర్గ్ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా
7–6, 7–6
ఓటమి 6. జూన్ 1992 క్వీన్స్ క్లబ్, UK పచ్చిక డియెగో నర్గీసోఇటలీ జాన్ ఫిట్జ్గెరాల్డ్ ఆండర్స్ జారెడ్ఆస్ట్రేలియా
Sweden
4–6, 6–7
ఓటమి 7. ఏప్రిల్ 1995 బార్సిలోనా, స్పెయిన్ మట్టి. ఆండ్రియా గౌడెంజీఇటలీ ట్రెవర్ క్రోన్మన్ డేవిడ్ మాక్ఫెర్సన్యు.ఎస్.ఏ
ఆస్ట్రేలియా
2–6, 4–6
ఓటమి 8. ఆగస్టు 1995 లాస్ ఏంజిల్స్, U. S. కఠినం. సాషా హిర్జ్న్క్రొయేషియా బ్రెంట్ హేగార్త్ కెంట్ కిన్నియర్దక్షిణాఫ్రికా
యు.ఎస్.ఏ
4–6, 5–7
గెలుపు 6. సెప్టెంబరు 1995 బోర్డియక్స్, ఫ్రాన్స్ కఠినం. సాషా హిర్జ్న్క్రొయేషియా హెన్రిక్ హోల్మ్ డానీ సాప్స్ఫోర్డ్Sweden
United Kingdom
6–3, 6–4
గెలుపు 7. ఫిబ్రవరి 1996 మిలన్, ఇటలీ కార్పెట్ (ఐ) ఆండ్రియా గౌడెంజీఇటలీ జాకబ్ హ్లాసెక్ గై మర్చిపోస్విట్జర్లాండ్
ఫ్రాన్స్అబ్బాయి మర్చిపో
6–4, 7–5
గెలుపు 8. జనవరి 1997 జాగ్రెబ్, క్రొయేషియా కార్పెట్ (ఐ) సాషా హిర్ష్జోన్క్రొయేషియా బ్రెంట్ హేగార్త్ మార్క్ కీల్దక్షిణాఫ్రికా
యు.ఎస్.ఏమార్క్ కైల్
6–4, 6–3
గెలుపు 9. ఫిబ్రవరి 1997 దుబాయ్, యుఎఇ కఠినం. సాండర్ గ్రోన్నెదర్లాండ్స్ శాండన్ స్టోల్ సిరిల్ సుక్ఆస్ట్రేలియా
చెక్ రిపబ్లిక్
7–6, 6–3
ఓటమి 9. జూన్ 1999 ఫ్రెంచ్ ఓపెన్, పారిస్ మట్టి. జెఫ్ తారంగోయు.ఎస్.ఏ మహేష్ భూపతి లియాండర్ పేస్భారతదేశం
భారతదేశం
2–6, 5–7
ఓటమి 10. ఆగస్టు 1999 లాస్ ఏంజిల్స్ కఠినం. బ్రియాన్ మాక్ఫీయు.ఎస్.ఏ బైరాన్ బ్లాక్ వేన్ బ్లాక్జింబాబ్వే
జింబాబ్వే
2–6, 6–7

టాప్ 10 విజయాలు

[మార్చు]
# Player Rank Event Surface Rd Score  
1989
1. Sweden Kent Carlsson 9 Hamburg, Germany Clay 2R 7–5, 4–6, 6–1 71
2. అర్జెంటీనా Alberto Mancini 10 Palermo, Italy Clay QF 3–6, 7–5, 6–4 56
3. స్విట్జర్లాండ్ Jakob Hlasek 9 Basel, Switzerland Hard (i) 2R 4–6, 6–3, 7–5 46
1990
4. జర్మనీ Boris Becker 3 French Open, Paris, France Clay 1R 5–7, 6–4, 7–5, 6–2 51
5. స్పెయిన్ Emilio Sánchez 9 Stuttgart, Germany Clay SF 6–4, 6–4 24
6. యు.ఎస్.ఏ John McEnroe 9 Stockholm, Sweden Carpet (i) 3R 6–4, 6–4 11
1991
7. Sweden Stefan Edberg 2 Davis Cup, Zagreb, Yugoslavia Clay (i) RR 6–4, 6–2 7
8. యు.ఎస్.ఏ Pete Sampras 9 Manchester, United Kingdom Grass F 6–4, 6–4 11
9. యు.ఎస్.ఏ Andre Agassi 8 Sydney, Australia Hard (i) QF 7–5, 7–6(7–3) 19
10. యు.ఎస్.ఏ Andre Agassi 8 Tokyo, Japan Carpet (i) QF 6–3, 6–4 16
11. ఫ్రాన్స్ Guy Forget 6 Stockholm, Sweden Carpet (i) 3R 7–6(15–13), 7–6(7–5) 15
1992
12. యు.ఎస్.ఏ Jim Courier 1 Stuttgart, Germany Carpet (i) QF 3–6, 7–6(7–2), 7–6(10–8) 9
13. Sweden Stefan Edberg 2 Stuttgart, Germany Carpet (i) F 6–7(5–7), 6–3, 6–4, 6–4 9
14. స్పెయిన్ Carlos Costa 10 French Open, Paris, France Clay 4R 6–3, 4–6, 6–1, 6–1 9
15. Sweden Stefan Edberg 2 Wimbledon, London, United Kingdom Grass QF 6–7(10–12), 7–5, 6–1, 3–6, 6–3 8
16. యు.ఎస్.ఏ Pete Sampras 3 Wimbledon, London, United Kingdom Grass SF 6–7(4–7), 7–6(7–5), 6–4, 6–2 8
17. Sweden Stefan Edberg 3 Sydney, Australia Hard (i) F 6–4, 6–2, 6–4 8
18. జర్మనీ Boris Becker 10 Stockholm, Sweden Carpet (i) QF 7–5, 6–4 7
19. Sweden Stefan Edberg 3 Stockholm, Sweden Carpet (i) SF 6–4, 7–6(10–8) 7
20. యు.ఎస్.ఏ Michael Chang 5 ATP Tour World Championships, Frankfurt, Germany Carpet (i) RR 7–6(7–4), 6–2 4
21. యు.ఎస్.ఏ Jim Courier 1 ATP Tour World Championships, Frankfurt, Germany Carpet (i) RR 6–3, 6–3 4
22. నెదర్లాండ్స్ Richard Krajicek 10 ATP Tour World Championships, Frankfurt, Germany Carpet (i) RR 6–4, 6–3 4
1993
23. యు.ఎస్.ఏ Pete Sampras 1 Rome, Italy Clay SF 7–6(7–4), 6–2 6
24. ఆస్ట్రియా Thomas Muster 9 Vienna, Austria Carpet (i) F 4–6, 6–4, 6–4, 7–6(7–3) 12
25. యు.ఎస్.ఏ Michael Chang 7 Paris, France Carpet (i) 3R 7–6(7–5), 7–5 11
26. యు.ఎస్.ఏ Pete Sampras 1 Paris, France Carpet (i) QF 7–6(7–3), 7–5 11
27. Sweden Stefan Edberg 6 Paris, France Carpet (i) SF 4–6, 7–6(7–4), 7–6(7–3) 11
28. ఉక్రెయిన్ Andriy Medvedev 8 Paris, France Carpet (i) F 6–4, 6–2, 7–6(7–2) 11
29. స్పెయిన్ Sergi Bruguera 4 ATP Tour World Championships, Frankfurt, Germany Carpet (i) RR 6–4, 7–6(7–4) 8
30. Sweden Stefan Edberg 5 ATP Tour World Championships, Frankfurt, Germany Carpet (i) RR 7–6(7–3), 6–7(5–7), 6–3 8
1994
31. జర్మనీ Boris Becker 10 Wimbledon, London, United Kingdom Grass SF 6–2, 7–6(8–6), 6–4 5
32. Sweden Stefan Edberg 5 Tokyo, Japan Carpet (i) SF 6–4, 6–4 2
33. యు.ఎస్.ఏ Michael Chang 9 Tokyo, Japan Carpet (i) F 6–4, 6–4 2
34. యు.ఎస్.ఏ Andre Agassi 8 Stockholm, Sweden Carpet (i) QF 6–1, 3–6, 7–6(10–8) 2
35. జర్మనీ Boris Becker 3 Grand Slam Cup, Munich, Germany Carpet (i) QF 6–4, 6–1 5
1995
36. స్పెయిన్ Alberto Berasategui 7 Barcelona, Spain Clay QF 1–6, 6–4, 6–4 9
37. Russia Yevgeny Kafelnikov 9 World Team Cup, Düsseldorf, Germany Clay RR 6–4, 7–6(7–4) 4
38. Sweden Magnus Larsson 10 World Team Cup, Düsseldorf, Germany Clay F 6–4, 6–4 4
39. Russia Yevgeny Kafelnikov 7 Wimbledon, London, United Kingdom Grass QF 7–5, 7–6(13–11), 6–3 6
40. Russia Yevgeny Kafelnikov 6 Grand Slam Cup, Munich, Germany Carpet (i) SF 7–6(9–7), 4–6, 6–3, 6–4 10
1996
41. దక్షిణాఫ్రికా Wayne Ferreira 10 Dubai, United Arab Emirates Hard QF 6–2, 6–1 9
42. జర్మనీ Boris Becker 4 Antwerp, Belgium Carpet (i) SF 6–4, 7–6(7–5) 9
43. Russia Yevgeny Kafelnikov 8 Rotterdam, Netherlands Carpet (i) F 6–4, 3–6, 6–3 6
44. యు.ఎస్.ఏ Michael Chang 4 Miami, United States Hard QF 6–4, 6–4 6
45. యు.ఎస్.ఏ Pete Sampras 2 Miami, United States Hard SF 2–6, 6–4, 6–4 6
46. Russia Yevgeny Kafelnikov 3 Moscow, Russia Carpet (i) F 3–6, 6–1, 6–3 4
47. ఆస్ట్రియా Thomas Muster 5 ATP Tour World Championships, Hanover, Germany Carpet (i) RR 6–4, 6–4 4
48. నెదర్లాండ్స్ Richard Krajicek 8 ATP Tour World Championships, Hanover, Germany Carpet (i) RR 6–4, 6–7(4–7), 7–6(7–1) 4
49. Russia Yevgeny Kafelnikov 3 Grand Slam Cup, Munich, Germany Carpet (i) SF 6–7(6–8), 2–6, 6–3, 6–2, 6–4 4
1997
50. ఆస్ట్రియా Thomas Muster 2 Davis Cup, Graz, Austria Clay (i) RR 6–7(5–7), 7–5, 6–7(5–7), 6–2, 7–5 5
51. యు.ఎస్.ఏ Michael Chang 2 World Team Cup, Düsseldorf, Germany Clay RR 6–2, 2–6, 6–3 4
52. United Kingdom Greg Rusedski 4 Vienna, Austria Carpet (i) F 3–6, 6–7(4–7), 7–6(7–4), 6–2, 6–3 9
1998
53. United Kingdom Greg Rusedski 8 Split, Croatia Carpet (i) F 7–6(7–3), 7–6(7–5) 16
54. United Kingdom Greg Rusedski 5 Hamburg, Germany Clay 3R 6–4, 6–2 23
1999
55. Russia Yevgeny Kafelnikov 2 Basel, Switzerland Carpet (i) QF 4–6, 6–3, 6–4 44
56. బ్రెజిల్ Gustavo Kuerten 5 Vienna, Austria Hard (i) 1R 6–1, 6–7(2–7), 6–4 43
2001
57. Sweden Thomas Enqvist 9 Indian Wells, United States Hard 2R 7–6(7–1), 6–3 126
58. Russia Marat Safin 3 Wimbledon, London, United Kingdom Grass QF 7–6(7–2), 7–5, 3–6, 7–6(7–3) 125
59. ఆస్ట్రేలియా Pat Rafter 10 Wimbledon, London, United Kingdom Grass F 6–3, 3–6, 6–3, 2–6, 9–7 125
60. బ్రెజిల్ Gustavo Kuerten 1 Tennis Masters Cup, Sydney, Australia Hard (i) RR 6–2, 6–7(2–7), 6–4 13

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1998లో ఇవనీసెవిచ్, కాస్మోపాలిటన్ మ్యాగజైన్ 1996 సెప్టెంబరు ఎడిషన్ కవర్‌పై సెర్బియా-క్రొయేషియా మోడల్ టట్జానా డ్రాగోవిక్‌ను చూసి ఆమెతో డేటింగ్ చేసాడు. [21] [22] 2009లో డ్రాగోవిక్‌ను పెళ్ళి చేసుకున్నాడు. వారికి అంబరు మారియా, ఇమాన్యుయేల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అ తరువాత వాళ్ళు విడాకులు తీసుకున్నారు.[23] [24] అతని రెండవ భార్య నివ్స్ కానోవిచ్.

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఫిల్మోగ్రఫీ, టెలివిజన్

[మార్చు]

సినిమా

[మార్చు]
సినిమా
సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు
2001 వింబుల్డన్ అధికారిక చిత్రం 2001 అతనే

టెలివిజన్

[మార్చు]
టెలివిజన్
సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు
2005 Mjenjačnica అతనే

సంగీత వీడియోలు

[మార్చు]
సంగీత వీడియోలు
సంవత్సరం కళాకారుడు శీర్షిక గమనికలు
2007 నినా బద్రిక్ "దా సే ఓపెట్ తేబి వ్రతిం" క్రొయేషియన్ మ్యూజిక్ వీడియో

వీడియో

[మార్చు]
  • వింబుల్డన్ 2001 ఫైనల్: రాఫ్టర్ Vs ఇవనీసెవిచ్ స్టాండింగ్ రూమ్ మాత్రమే, DVD విడుదల తేదీ: 30 అక్టోబరు 2007, రన్ టైమ్: 195 నిమిషాలు, ASIN: B000V02CT6.

మూలాలు

[మార్చు]
  1. "Goran Ivanišević and Conchita Martínez to be inducted into International Tennis Hall of Fame in 2020". International Tennis Hall of Fame. 28 January 2020.
  2. "Marin Cilic – Timeline | Facebook". Archived from the original on 2016-09-03. Retrieved 2016-07-21 – via Facebook.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Goran Ivanišević". International Tennis Hall of Fame.
  4. "Svoje vino predstavio i Srđan Ivanišević". Slobodna Dalmacija. 24 November 2009. Retrieved 11 July 2010.
  5. TENNIS; With Minds on Homeland at War, New York Times
  6. A Fighter on Home Ground Ivanisevic, His Fans, His Family, and the War, The New York Times.
  7. Finn, Robin (30 June 1992). "TENNIS; McEnroe Moves Up but Lendl Bows Out". The New York Times.
  8. Muscatine, Alison (5 July 1992). "Emotional Ivanisevic Ready To Serve Notice". The Washington Post.
  9. Muscatine, Alison (5 July 1992). "Agassi, Ivanisevic Gain Berths in Men's Final". The Washington Post.
  10. "Andre Agassi... Remembering 1992 Wimbledon". atptour.com. 10 July 2020.
  11. Kirkpatrick, Curry (13 July 1992). "Agassi and Ecstacy". Sports Illustrated.
  12. "Goran Ivanisevic voulait et méritait cette victoire". RDS.ca (in French). 9 July 2001.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  13. 13.0 13.1 Penner, Mike (7 August 1992). "Ivanisevic Assures Croatia of First Medal". Los Angeles Times.
  14. "Ivanisevic headlines Hall of Fame nominations". Reuters. 21 August 2019.
  15. "Sampras Lowers Boom on Ivanisevic". The Washington Post. 4 July 1994.
  16. "Pile of Aces Earns Ivanisevic Richest Payday in Tennis". Chicago Tribune. 11 December 1995.
  17. Curtis, Jake (2013-06-22). "The Most Memorable Matches in Wimbledon History". Bleacher Report (in ఇంగ్లీష్). Retrieved 2023-09-08.
  18. Farthing, Tim (2020-06-13). "Top 20 Wimbledon Classics Since 2000: Ivanisevic v Henman, 2001". Tennishead (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2023-09-08.
  19. Ilic, Jovica (2023-07-05). "When Rain and Drama Unleashed: The Epic Henman vs. Ivanisevic Wimbledon Battle". Tennis World USA (in ఇంగ్లీష్). Retrieved 2023-09-08.
  20. "Classic Matches: Ivanišević vs. Rafter". BBC Sport. 31 May 2004. Retrieved 20 January 2008.
  21. L., L. (31 December 2019). "Zbog ove fotografije Ivanišević je 'okrenuo sve' da dođe do njenog broja: nakon 24 godine otkrivena poznata Hrvatica u epizodi 'Prijatelja', divio joj se Chandler". Slobodna Dalmacija. Retrieved 7 January 2023.
  22. Bobanović, Paula (21 March 2013). "Love story: Unatoč aferama njihova ljubav traje 15 godina". 24sata.hr. Retrieved 7 January 2023.
  23. Lokas, Marija (8 April 2013). "Razvode se Goran Ivanišević i Tatjana Dragović: Nisu uspjeli preživjeti obostrane preljubničke afere!". Jutarnji list. Retrieved 7 January 2023.
  24. M., B. (8 April 2013). "Nakon četiri godine braka rastaju se Tatjana i Goran Ivanišević!". Večernji list. Retrieved 7 January 2023.