1992 వేసవి ఒలింపిక్ క్రీడలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1992లో స్పెయిన్ లోని బార్సిలోనాలో జరిగిన 25వ ఒలింపిక్ క్రీడలకే 1992 ఒలింపిక్ క్రీడలు లేదా 1992 వేసవి ఒలింపిక్స్ అని పిలుస్తారు. 169 దేశాల నుంచి 9356 క్రీడాకారులు హాజరైన ఈ ఒలింపిక్ క్రీడలు 1996, జూలై 25న ప్రారంభమై ఆగష్టు 9 వరకు జరిగాయి. 1991లో సోవియట్ యూనియన్ ముక్కలు కావడంతో ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియాలు మినహా మిగితా మాజీ సోవియట్ భూభాగంలోని దేశాలు సంయుక్త జట్టుగా ఈ ఒలింపిక్ బరిలో పాల్గొని పతకాల పట్టికలో ప్రథమ స్థానం పొందింది. అమెరికాకు ద్వితీయ స్థానం లభించింది. ఆసియా ఖండం తరఫున చైనా, దక్షిణ కొరియాలు అత్యధిక పతకాలు పొందిన తొలి పది దేశాల పట్టికలో స్థానం పొందినాయి.

అత్యధిక పతకాలు పొందిన దేశాలు

[మార్చు]

32 క్రీడలు, 286 క్రీడాంశాలలో పోటీలు జరుగగా మాజీ సోవియట్ దేశాలు కలిసి ఉమ్మడిగా సంయుక్త జట్టు పేరుతో బరిలో దిగి 45 స్వర్ణాలతో పాటు మొత్తం 112 పతకాలు పొంది ప్రథమస్థానంలో నిలిచాయి. ఆ తరువాతి స్థానాలు అమెరికా, జర్మనీ, చైనాలు పొందాయి. చిన్న దేశమైన క్యూబా 14 స్వర్ణాలతో 5 వ స్థానం పొంది అందరినీ ఆశ్చర్యపరిచింది.

స్థానం దేశం స్వర్ణ పతకాలు రజత పతకాలు కాంస్య పతకాలు మొత్తం
1 సంయుక్త జట్టు 45 38 29 112
2 అమెరికా 37 34 37 108
3 జర్మనీ 33 21 28 82
4 చైనా 16 22 16 54
5 క్యూబా 14 6 11 31
6 స్పెయిన్ 13 7 2 22
7 దక్షిణ కొరియా 12 5 12 29
8 హంగేరి 11 12 7 30
9 ఫ్రాన్స్ 8 5 16 29
10 ఆస్ట్రేలియా 7 9 11 27

క్రీడలు

[మార్చు]

1992 ఒలింపిక్ క్రీడలలో భారత్ స్థానం

[మార్చు]

53 మంది సభ్యులు కల భారత బృంధం బార్సిలోనా వెళ్ళి ఎలాంటి పతకాలు లేకుండా తిరిగివచ్చింది. జాతీయ క్రీడ హాకీలో కూడా 7వ స్థానమే పొందినది. ఆర్చెరీలో ఆశలు చిగురించిన లింబారాం 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. అథ్లెటిక్స్ ఆశాకిరణం షైనీ విల్సన్ పరుగు పతకం వరకు సాగలేదు. టెన్నిస్‌లో లియాండర్ పేస్, రమేశ్ కృష్ణన్లు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. అయితే డబుల్స్‌లో వీరిరువురు కలిసి క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళగలిగారు.

ఇవికూడా చూడండి

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

బయటి లింకులు

[మార్చు]