1904 వేసవి ఒలింపిక్ క్రీడలు

వికీపీడియా నుండి
(1904 ఒలింపిక్ క్రీడలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
1904 ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న దేశాలు
1904 ఒలింపిక్ టగ్ ఆఫ్ వార్ పోటీ దృశ్యం

1904లో మూడవ ఒలింపిక్ క్రీడలు అమెరికాలోని సెయింట్ లూయీస్లో నిర్వహించబడ్డాయి. జూలై 1న ప్రారంభమైన ఈ క్రీడలు నవంబర్ 23 వరకు ప్రస్తుతం ఫ్రాన్సిస్ ఫీల్డ్‌గా పిల్వబడుతున్న సెయింట్ లూయీస్ లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించబడినవి. వాస్తవానికి ఈ క్రీడలు చికాగో నగరం నిర్వహించడానికి బిడ్ గెల్చిననూ ఏక కాలంలో రెండు అంతర్జాతీయ పోటీలను నిర్వహించడానికి లూయిసియానా పర్చేజ్ ఎక్స్పోజిషన్ ఒప్పుకోకపోవడంతో చివరికి సెయింత్ లూయీస్ నగరానికి మార్పు చేయవలసి వచ్చింది. ఈ ఒలింపిక్ క్రీడలలో 17 క్రీడలు, 91 క్రీడాంశాలు నిర్వహించగా నిర్వాహకదేశమైన అమెరికా అత్యధికంగా 79 పోటీలలో నెగ్గి ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడింది. రెండో స్థానంలో ఉన్న జర్మనీకి కేవలం 4 స్వర్ణాలు మాత్రమే వచ్చాయి. 12 దేశాల నుంచి 651 క్రీడాకారులు ఈ క్రీడలలో పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు.

అత్యధిక పతకాలు పొందిన దేశాలు

[మార్చు]

నిర్వాహక దేశమైన అమెరికా దాదాపు 80% స్వర్ణాలను సాధించి ఈ పోటీలలో ఏకఛత్రాధిపత్యం వహించింది. జర్మనీ, క్యూబా, కెనడాలు చెరో 4 బంగారు పతకాలను చేజిక్కించుకున్నాయి. 12 దేశాలు పాల్గొన్న ఈ పోటీలలో 9 దేశాలు స్వర్ణాలు సాధించాయి.

స్థానం దేశం స్వర్ణ పతకాలు రజత పతకాలు కాంస్య పతకాలు మొత్తం
1 అమెరికా 79 83 80 242
2 జర్మనీ 4 4 5 13
3 క్యూబా 4 2 3 9
4 కెనడా 4 1 1 6
5 హంగేరీ 2 1 1 4
6 బ్రిటన్ 1 1 0 2
6 సంయుక్త జట్టు 1 1 0 2
8 గ్రీసు 1 0 1 2
8 స్విట్జర్లాండ్ 1 0 1 2
10 ఆస్ట్రియా 0 0 1 1

నిర్వహించిన క్రీడలు

[మార్చు]

పాల్గొన్న దేశాలు

[మార్చు]

ఈ ఒలింపిక్ క్రీడలలో 12 దేశాలు పాల్గొన్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

బయటి లింకులు

[మార్చు]