సిల్వియో బెర్లుస్కోనీ
సిల్వియో బెర్లుస్కోనీ | |
---|---|
ఇటలీ ప్రధాన మంత్రి | |
In office 2008 మే 8 – 2011 నవంబరు 16 | |
అధ్యక్షుడు | జార్జియో నపోలిటానో |
అంతకు ముందు వారు | రొమానో ప్రోడి |
తరువాత వారు | మారియో మోంటి |
In office 2001 జూన్ 11 – 2006 మే 17 | |
అధ్యక్షుడు | కార్లో అజెగ్లియో సియాంపి |
Deputy |
|
అంతకు ముందు వారు | గిలియానో అమాటో |
తరువాత వారు | రోమనో ప్రోడి |
In office 1994 మే 11 – 1995 జనవరి 17 | |
అధ్యక్షుడు | ఆస్కార్ లుయిగి స్కాల్ఫారో |
Deputy |
|
అంతకు ముందు వారు | కార్లో అజెగ్లియో సియాంపి |
తరువాత వారు | లాంబెర్టో డిని |
ఫోర్జా ఇటాలియా అధ్యక్షుడు | |
In office 1994 జనవరి 18 – 2023 జూన్ 12 | |
ది పీపుల్ ఆఫ్ ఫ్రీడం అధ్యక్షుడు | |
In office 2009 మార్చి 29 – 2013 నవంబరు 16 | |
యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు | |
In office 2019 జూలై 2 – 2022 అక్టోబరు 12 | |
నియోజకవర్గం | నార్త్-వెస్ట్ ఇటలీ |
In office 1999 జూలై 20 – 2001 జూన్ 10 | |
సెనేట్ ఆఫ్ రిపబ్లిక్ సభ్యుడు | |
In office 2022 అక్టోబరు 13 – 2023 జూన్ 12 | |
నియోజకవర్గం | మోంజా |
In office 2013 మార్చి 15 – 2013 నవంబరు 27 | |
నియోజకవర్గం | మోలిస్ |
ఛాంబర్ ఆఫ్ డెప్యూటీస్ సభ్యుడు | |
In office 1994 ఏప్రిల్ 15 – 2013 మార్చి 14 | |
నియోజకవర్గం |
|
వ్యక్తిగత వివరాలు | |
జననం | మిలన్, కింగ్‌డమ్ ఆఫ్ ఇటలీ | 1936 సెప్టెంబరు 29
మరణం | 2023 జూన్ 12 మిలన్, ఇటలీ | (వయసు 86)
రాజకీయ పార్టీ |
|
ఇతర రాజకీయ పదవులు |
|
జీవిత భాగస్వామి |
|
Domestic partner | ఫ్రాన్సెస్కా పాస్కేల్ (2013–2020) |
సంతానం |
|
బంధువులు | పాలో బెర్లుస్కోని (సోదరుడు) |
నివాసం | ఆర్కోర్, ఇటలీ |
కళాశాల | మిలన్ విశ్వవిద్యాలయం |
వృత్తి |
|
నెట్ వర్త్ | US$7 billion (as of 12 జూన్ 2023[update][[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]])[1] |
సంతకం |
సిల్వియో బెర్లుస్కోనీ (ఆంగ్లం: Silvio Berlusconi; 1936 సెప్టెంబరు 29 – 2023 జూన్ 12) ఇటాలియన్ మీడియా టైకూన్, రాజకీయ నాయకుడు. ఆయన 1994 నుండి 1995 వరకు, 2001 నుండి 2006 వరకు, 2008 నుండి 2011 వరకు నాలుగు సార్లు ఇటలీ ప్రధాన మంత్రిగా చేసాడు.[2]
ఆయన 1994 నుండి 2013 వరకు ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ సభ్యుడుగా, 2022 నుండి 2023 వరకు రిపబ్లిక్ సెనేట్ సభ్యుడుగా ఉన్నాడు. గతంలో 1999 నుండి 2001 వరకు, మార్చి నుండి నవంబరు 2013 వరకు, 2019 నుండి 2022 వరకు ఆయన యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడుగా వ్యవహరించాడు.[3]
జూన్ 2023 నాటికి 6.9 బిలియన్ల యునైటెడ్ స్టేట్స్ డాలర్ల నికర విలువతో, ఆయన ఇటలీలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తి.[4]
జీవిత చరిత్ర
[మార్చు]ఆయన 1936లో ఇటలీలోని మిలాన్‌లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన న్యాయవిద్యను అభ్యసించాడు. క్రూజ్ షిప్‌లో గాయకుడుగా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తరువాత నిర్మాణ రంగంలోకి, తదుపరి మీడియా రంగంలో ప్రవేశించి దేశ చరిత్రలోనే అతిపెద్దదైన మీడియా సంస్థను స్థాపించాడు. 1994లో ఫోర్జా ఇటాలియా పార్టీని స్థాపించి రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన అదే ఏడాది దేశ ప్రధానిగా ఎదిగాడు.
అలా ఇటలీకి నాలుగు సార్లు ప్రధానిగా ఉన్న ఆయన దేశాన్ని అత్యధిక కాలం పాలించిన నేతగా గుర్తింపు పొందాడు. అలాగే స్థానికంగా తిరుగులేని మీడియా అధినేతగా, దేశంలో మూడో సంపన్న వ్యక్తిగా కూడా పేరుతెచ్చుకున్నాడు.
ఇప్పుడు కూడా ఆయన పార్టీ ప్రస్తుత ప్రధాని జార్జియా మెలోని వామపక్ష సంకీర్ణ సర్కారులో భాగస్వామిగా ఉన్నది. అయితే ఆయన ఎలాంటి పదవిలో కొనసాగడంలేదు. దీనికి కారణం పన్ను ఎగవేత మోసాలకు పాల్పడినందుకు గాను ఆయనపై ఆరేళ్ల పాటు రాజకీయాల నుంచి నిషేధం అమలులోఉంది. అంతేకాకుండా ఆయన చుట్టూ అనేక వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి. విలాసాలతోపాటు అనేక లైంగిక ఆరోపణలు, అవినీతి కేసులు ఎదుర్కొన్నాడు.
మరణం
[మార్చు]కొన్నేళ్లుగా లూకేమియాతో బాధపడుతున్న 86 ఏళ్ల ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 జూన్ 12న ఇటలీలోని మిలన్లో తుదిశ్వాస విడిచాడు.[5][6]
ఆయన మరణంతో ఇటలీలో రాజకీయ అస్థిరత కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Silvio Berlusconi". Forbes. 5 April 2023. Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.
- ↑ "Silvio Berlusconi". Biography. A&E Television Networks. 2 April 2014. Archived from the original on 6 January 2019. Retrieved 5 January 2019. Updated 26 February 2018.
- ↑ Roberts, Hannah (27 May 2019). "Silvio Berlusconi is back on the Italian political scene. How did he get there?". The Independent. Retrieved 21 August 2022.
- ↑ "Silvio Berlusconi & family". Forbes (in ఇంగ్లీష్). Retrieved 12 June 2023.
- ↑ "Silvio Berlusconi ist tot". Der Spiegel (in German). 12 June 2023. Retrieved 12 June 2023.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Giuffrida, Angela (12 June 2023). "Silvio Berlusconi, former Italian prime minister, dies aged 86". The Guardian. Retrieved 12 June 2023.
- ↑ "Italy's Former Prime Minister Silvio Berlusconi Passed Away - Sakshi". web.archive.org. 2023-06-12. Archived from the original on 2023-06-12. Retrieved 2023-06-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
- 1936 జననాలు
- 2023 మరణాలు
- ఇటాలియన్ వ్యాపారవేత్తలు
- క్యాన్సర్ వ్యాధి మరణాలు
- లుకేమియా మరణాలు
- ఇటలీ శాసనసభ XII డిప్యూటీలు
- ఇటలీ శాసనసభ XIII డిప్యూటీలు
- ఇటలీ XIV శాసన సభ డిప్యూటీలు
- ఇటలీ శాసనసభ XV డిప్యూటీలు
- ఇటలీ శాసనసభ XVI డిప్యూటీలు
- ఫోర్జా ఇటాలియా రాజకీయ నాయకులు
- గ్రాండ్ క్రాసెస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ రొమేనియా
- ఇంటర్నేషనల్ ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డు
- ఇటాలియన్ ఫ్రీమాసన్స్
- ఇటాలియన్ రోమన్ కాథలిక్కులు
- ఇటాలియన్ వ్యతిరేక కమ్యూనిస్టులు
- ఇటాలియన్ బిలియనీర్లు
- ఇటాలియన్ మాస్ మీడియా యజమానులు
- ఇటాలియన్ వార్తాపత్రిక ప్రచురణకర్తలు
- ఇటాలియన్ రాజకీయ పార్టీ వ్యవస్థాపకులు
- ఇటాలియన్ ప్రచురణకర్తలు
- పనామా పేపర్లలో పేరున్న వ్యక్తులు
- మోసానికి పాల్పడిన రాజకీయ నాయకులు
- యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు
- ఇటలీ ప్రధాన మంత్రులు
- ఇటలీలో రైట్-వింగ్ పాపులిజం
- ది పీపుల్ ఆఫ్ ఫ్రీడమ్ పొలిటీషియన్స్
- మిలన్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు
- CS1 maint: unrecognized language