మిలన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Infobox Italian comune

మిలన్ (మూస:Lang-it, About this sound listen  మూస:IPA-it; పశ్చిమ లొంబార్డ్: మిలన్ , About this sound listen ) ఇటలీ లో ఉన్న ఒక నగరము మరియు లొంబార్డి ప్రాంతానికి మరియు మిలన్ ప్రావిన్స్‌కు రాజధాని కూడా. ఈ నగరములో మాత్రము జనాభా సుమారు 1,300,000 గా ఉంటె, ఈ నగర ప్రాంతము యొక్క మొత్తం జనాభా 4,300,000 గా ఉంది, ఇది యురోపియన్ యునియన్ లోనే ఐదవ అతిపెద్ద నగర ప్రాంతము.[1] ఇటలీ లోనే అతి పెద్దదైన మిలన్ మెట్రోపాలిటన్ ప్రాంతం యొక్క జనాభా 7,400,000 ఉండవచ్చని OECD వారి అంచనా.[2]

ఈ నగరము మీడియోలానం అనే పేరుతో ఇన్సుబర్స్ అను సెల్టిక్ ప్రజలచే స్థాపించబడింది. తరువాత ఈ నగరాన్ని రోమన్లు 222 BC లో కైవసం చేసుకున్నాక రోమన్ సామ్రాజ్యం కింద ఈ నగరం ఏంతో విజయవంతమయింది. తరువాత విస్కోంటి, ఫార్జా, స్పానిష్‌లు 1500 లలో మిలన్ ని పరిపాలించగా, 1700 లలో ఆస్ట్రియన్లు పరిపాలించారు. 1796లో నెపోలియన్ I మిలన్ ని ఆక్రమించి, దానిని 1805లో ఇటలి రాజ్యానికి రాజధాని చేశాడు.[3][4] రొమాంటిక్ కాలములో ఐరోపాలోని ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా మిలన్ పేరు పొంది, అనేక కళాకారులను, సంగీత రచయితలను మరియు ప్రముఖ సాహితీవేత్తలను ఆకర్షించింది. తరువాత, రెండవ ప్రపంచ యుద్ధ సమయములో, అల్లీడ్ బాంబు దాడికి ఈ నగరము గురై తీవ్రంగా నాశనము అయింది. 1943లో జర్మనీ ఆక్రమించుకున్న తరువాత, ఇటలీ యొక్క ప్రతిఘటనకు మిలన్ ముఖ్య కేంద్రమయింది.[3] అయినప్పటికీ యుద్ధానంతరం మిలన్ మంచి ఆర్ధిక అభివృద్ది సాధించి, దక్షిణ ఇటలీ మరియు ఇతర దేశాలనుండి వేలాది పరదేశీయలు మిలన్ కు వలస వచ్చారు.[3]

జనాభాలో 13.9% మంది విదేశమునుంది వచ్చిన వారే కనుక మిలన్ ఒక అంతర్జాతీయ మరియు కాస్మోపోలిటన్ నగరము అయింది.[5] మిలన్ యురోప్ యొక్క ముఖ్య [6] రవాణా మరియు పారిశ్రామిక కేంద్రం. మిలన్ EU యొక్క అతి ముఖ్యన్మైన వ్యాపార మరియు ఆర్ధిక కేంద్రాల్లో ఒకటి. మిలన్ యొక్క ఆర్ధికవ్యవస్థ, (మిలన్ యొక్క ఆర్ధికవ్యవస్థ చూడండి) కొనుగోలు శక్తి ఆధారంగా ప్రపంచంలోనే ఇరవైఆరవ ధనవంతమైనది.[7] మిలన్ యొక్క GDP $115 బిలియను. మిలన్ మెట్రోపోలిటన్ ప్రాంతం ఐరోపాలో నాలుగవ అత్యధిక GDP కలిగి ఉంది: 2004లో € 241.2 బిలియను (US$ 312.3 బిలియను). ఇటలీలో అత్యధిక GDP (తలసరి ఆదాయము) కలిగి ఉన్న ప్రాంతాలలో ఒకటిగా మిలన్ ఉంది. మిలన్ యొక్క తలసరి ఆదాయము GDP సుమారు €35,137 (US$ 52,263). ఇది EU సగటు తలసరి ఆదాయానికి 161.1% ఎక్కువగా ఉంది.[8] అంతే కాక, విదేశీ ఉద్యోగస్తులకు మిలన్ ప్రపంచంలోనే అతి ఖరీదైన నగరాలలో పదకొండవది.[9] ప్రపంచంలోనే 28వ అతి శక్తివంతమైన మరియు ప్రాభల్యం కలిగిన నగరముగా మిలన్ వర్గీకరణ చేయబడింది.[10]

ప్రపంచ ఫేషన్ మరియు డిసైన్ రాజధానిగా మిలన్ గుర్తింపు పొందింది. ఈ నగరం, వర్తకం, పరిశ్రమ, సంగీతం, క్రీడా, సాహిత్యం, కళ మరియు మీడియా వంటి అంశాలలో ప్రపంచవ్యాప్తంగా అధిక ప్రాభల్యం కలిగి ఉంది. అందువల్ల మిలన్ GaWC యొక్క ముఖ్య ఆల్ఫా ప్రపంచ నగరాలలో ఒకటిగా నిలిచింది.[11]

ఈ లోమ్బార్డ్ మెట్రోపోలిస్ ముఖ్యంగా విశేషంగా ఫేషన్ భవనాలకు, దుకాణాలకు (వయ మొన్టేనపోలియోన్ వెంట ఉన్నవాని మాదిరిగా), మరియు పియాజా డువోమోలో ఉన్న గల్లెరియ విట్టోరియో ఇమాన్యువేల్ (ప్రపంచంలోనే అతి పురాతనమైన షాపింగ్ మాల్గా పేరున్న) వంటి విశేషాలకు ప్రసిద్ధి. ఈ నగరానికి అత్యుత్తమ సాంస్కృతిక పారంపర్యం ఉంది. ముఖ్యంగా ఎక్కడా లభ్యం కాని ప్రత్యేకమైన వంటకాలు ఈ నగరము ప్రసిద్ధి చెందింది (పనేట్టన్ క్రిస్మస్ కేక్, రిసోట్టో అల్లా మిలనీస్ వంటివి). ఈ నగరానికి ముఖ్యంగా ఒక ప్రసిద్ధ సంగీత, ముఖ్యంగా ఒపెరాటిక్ సాంప్రదాయం ఉంది. అనేక ముఖ్యమైన సంగీతకారులకు (గియుసేప్ వెర్డి) మరియు థియేటర్ లకు (టియాట్రో అల్లా స్కాలా వంటివి) ఈ నగరము పుట్టినిల్లు . అనేక ముఖ్య మ్యుసియంలు, విశ్వవిద్యాలయాలు, విద్యావిధానాలు, రాజభవనాలు, చర్చిలు మరియుగ్రంథాలయాలు (అకాడెమీ అఫ్ బ్రెర మరియు కేస్టేల్లో స్ఫోర్జేస్కో వంటివి) మిలన్ లో ఉన్నాయి. అంతే కాక, ఏ.సి. మిలన్, ఎఫ్.సి. ఇంటర్నజియనేల్ మిలానో అనే రెండు గొప్ప ప్రసిద్ధి చెందిన ఫూట్బాల్ జట్టులకు మిలన్ ప్రసిద్ధి. వీటివల్ల, ఐరోపాలోని అత్యుత్తమ జనాకర్షక పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా మిలన్ నిలిచింది. 2008లో 1.914 మిలియను కంటే ఎక్కువ విదేశీ పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శించారు.[12] 1906 సంవత్సరపు వరల్డ్ ఎక్స్పోసిషన్ కి ఈ నగరం ఆతిధ్యం ఇచ్చింది. 2015 యూనివర్సల్ ఎక్స్పోసిషన్ ఈ నగరంలోనే జరుగుతుంది.[13]

మిలన్ వాసులని మిలనీస్ (ఇటలీ యన్ భాషలో [Milanesi] error: {{lang}}: text has italic markup (help) లేదా వాడుక భాషలో [Meneghini] error: {{lang}}: text has italic markup (help) లేదా[Ambrosiani] error: {{lang}}: text has italic markup (help)) అని పిలుస్తారు. మిలన్ వాసులు ఈ నగరానికి "నైతిక రాజధాని " అని పేరు పెట్టారు.[3]

విషయ సూచిక

చరిత్ర[మార్చు]

శబ్ద ఉత్పత్తి శాస్త్రం[మార్చు]

మిలన్ అనే పదం మీడియోలానం అనే లాటిన్ పదము నుండి ఉత్పన్నమయిది.

మీడియోయోలానం సంటోనం (సైన్టేస్), మీడియోలానం ఆలేర్కొరం (ఎవ్రేక్స్) వంటి ఫ్రాన్స్ లోని అనేక గాల్లో-రోమన్ స్థలాలకు ఈ పేరే ఉంది. ఈ పేరులో ఒక ప్రాంగణం లేదా ఒక గుర్తించిన ప్ర్రాంతం అనే అర్ధంగల -లన్ అనే సెల్టిక్ అంశం ఉన్నట్లుంది. (దీనికి మూలం అభయారణ్యం లేదా చర్చి అనే అర్ధంగల వెల్ష్ పదం 'ల్లన్'). అందువల్ల మీడియోలానం అంటే ఒక కేంద్ర పట్టణం లేదా సెల్టిక్ జాతికి ఒక అభయారణ్యం అని అర్ధం తీసుకోవచ్చు.[4][14]

మిలన్ నగర చిహ్నంగా మగ పంది ఎలాగా వచ్చిందనేది ఆండ్రీ అల్షియటో యొక్క ఏమ్బ్లేమట (1584) లో భావపూరితంగా వివరించబడింది. ఇది నగర గోడల మొదటి నిర్మాణానికి కింద ఉన్న ఒక చక్కలో ఉంది. ఇక్కడ ఒక మగ పంది తవ్వకం నుండి బయటికి తీసుతున్నట్లు కనిపిస్తుంది. ఇదే "సగం-ఉల్"[15] అనే అర్ధంగల మీడియోలానం అనే పదానికి మూలం. ఇది లాటిన్ మరియు ఫ్రెంచ్ భాషలలో వివరించబడింది. మిలన్ యొక్క స్థాపన బిటురిగేస్, ఆడ్యు అనే రెండు రకాల సెల్టిక్ ప్రజల వల్ల జరిగిందని చెప్పబడుతుంది. పొట్టేలు మరియు మగ పంది వీళ్ల చిహ్నాలు;[16] అందువల్ల "ఊల్ ని మోస్తున్న మగ పంది ఈ నగర చిహ్నం. ఈ జంతువుకు రెండు రూపాలు ఉన్నాయి. ఒకచోట పదునైన వెంట్రుకలతో, వేరొక చోట నునుపుగా ఉండే ఊల్ తో ఉన్నట్లు ఉంటుంది."[17] తన వివరణకు అల్షియటో ఏంతో దైవజ్ఞుడు మరియు జ్ఞానియైన అంబ్రోస్ని మూలంగా చూపిస్తున్నాడు.[18]

ఈ నగరము యొక్క జర్మన్ పేరు మైన్లాండ్ కాగా స్థానికంగా పశ్చిమ లోమ్బార్డ్ భాషలో ఈ నగరము పేరు మిలాన్.

సెల్టిక్ మరియు రోమన్ కాలాలు[మార్చు]

దస్త్రం:Ruins-imperial-complex-milan-.jpg
మిలన్ సామ్రాజ్యాధినేత రాజభవనములో యొక్క శిథిలాలుమిలన్ లో ఇక్కడ కోన్స్టాన్టినాస్ మరియు లిసినియాస్ జారీ చేసిని శాసనము

400 BC ప్రాంతములో సెల్టిక్ ఇన్సుబ్రాస్ మిలాన్ మరియు పరిసర ప్రాంతాలలో నివాసం ఏర్పరుచుకున్నారు. 222 BC లో రోమన్ లు ఈ స్థావరాన్ని జయించి, సెల్టిక్ మేధ్లన్ నుండి మీడియోలానం అనే పేరుని బలవంతంగా పెట్టారు. అప్పటికే స్థానికులు మిలాన్ అనే పేరును వాడుతూ ఉన్నారు.[14] కొన్ని శతాభ్దాల రోమన్ ఆధిపత్యం తరువాత, పశ్చిమ రోమన్ సామ్రాజ్యానికి రాజధానిగా మిలన్ ని డయోక్లేషియన్ చక్రవర్తి 293 సంవత్సరం AD లో ప్రకటించాడు. డయోక్లేషియన్ తూర్పు రోమన్ సామ్రాజ్యం (నీకోమీడియా రాజధానిగా)లో ఉండటానికి ఎంచుకునగా, అతని తోటి రాజు మాక్సిమియానస్ పశ్చిమములో ఉండిపోయాడు. వెంటనే మాక్సిమియాన్, ఒక పెద్ద సర్కస్, తెర్మే ఏర్కులీ వంటి అనేక పెద్ద భవంతులు, రాజమహలులతో కూడిన ఒక పెద్ద భవనసముదాయము మరియు అనేక ఇతర సదుపాయాలు, భవంతులును నిర్మించాడు.470 m × 85 m (1,542 ft × 279 ft)

313 నాటి మిలన్ శాసనం ద్వారా, చక్రవర్తి కాన్స్టాన్టిన్ I [[క్రైస్తవలకు/0} మత స్వేచ్చ ఇచ్చాడు.|క్రైస్తవలకు/0} మత స్వేచ్చ ఇచ్చాడు.[19]]] 402 సంవత్సరములో లో విసిగోత్లు నగరాన్ని చుట్టుముట్టారు. రాజమహలు రావెన్నకు మార్చబడింది. యాభై సంవత్సరాలు తరువాత (452లో) హన్లు నగరాన్ని ఆక్రమించారు. 539 సంవత్సరములో ఓస్ట్రోగొత్లు మిలన్ ని జయించి, బైసాన్టిన్ చక్రవర్తి జస్టినియాన్ I మీద జరిపిన గోతిక్ యుద్ధం అని చెప్పబడే యుద్ధ సమయములో నగరాన్ని నాశనం చేశారు. 569 సంవత్సరపు వేసవిలో లాంగోబార్డ్ లు (ఇటలి ప్రాంతమైన లోమ్బర్డికు పేరు దీని నుండే వచ్చింది) మిలన్ కు రక్షణ కలిగిస్తున్న చిన్న బైజాంటైన్ సైన్యాన్ని ఓడించి మిలన్ ని జయించారు. లోమ్బార్డ్ పాలనలో కొన్ని రోమ్ భవనాలు మిలన్ లో వాడుకలో కొనసాగాయి.[20] 774 సంవత్సరములో చర్లేమాగ్నె "లోమ్బార్డ్స్ కు రాజు" అనే బిరుదుని స్వీకరించటం ద్వారా అత్యంత అపూర్వమైన నిర్ణయం తీసుకున్నప్పుడు, (అంతకు ముందు జర్మనీ రాజ్యాలు అనేక సార్లు ఒకరిని ఒకరు జయిస్తూనే ఉన్నారు కాని ఎవరూ కూడా వేరొక జాతికి రాజుగా తమకు బిరుదును ప్రకటించుకోలేదు) మిలన్ ఫ్రాంక్స్‌కు లొంగిపోయింది. లొంబార్ది యొక్క ఇనప కిరీటం ఈ కాలానికి చెందినదే. అ తరువాత మిలన్ పవిత్ర రోమన్ సామ్రాజ్యములో భాగమయింది.

మధ్యయుగ కాలం[మార్చు]

థ బిస్సియోన్: పియాజ్జ డ్యూమో అర్చ్బిబిషప్ యొక్క రాజభవనము నుండి విస్కోంటి భవనములోని కోట్ ఆఫ్ ఆర్మ్స్IO<HANNES> అని క్లుప్తంగా లిఖించిన అక్షరాలు ఆర్చ్ బిషప్ గియోవాన్ని విస్కోంటికి చెందినవి (1342-1354).

మధ్య యుగాలలో మిలాన్ పో అందలి సమృద్ధి గల మైదానాలు మరియు ఆల్ప్స్ పర్వతాల నుండి ఇటలీకి దారి ఉండటం వలన అది వర్తకానికి కేంద్రంగా భాసిల్లింది. లోమ్బార్డ్ నగరాలకు వ్యతిరేకంగా ఫ్రెడెరిక్ I బార్బరోస్సా యొక్క దండయాత్ర వంటి యుద్ధం వలన 1162 వ సంవత్సరములో మిలాన్ నగరములో అధిక భాగము నాశనం అయింది. 1167 వ సంవత్సరములో లోమ్బార్డ్ లీగ్ స్థాపించినాక మిలాన్ ఆ కూటమిలో ముఖ్య పాత్ర వహించింది. 1183 వ సంవత్సరములో పీస్ ఆఫ్ కొంస్టాన్స్ ద్వారా లోమ్బార్డ్ నగరాలు సంపాదించిన స్వాతంత్ర్యము వలన మిలాన్ ఒక డచ్చీ అయింది. 1208 సంవత్సరములో రంబెర్టినో బ్యువాలెల్లి నగరానికి పోడెస్టాగా ఒక పదవీకాలం కొనసాగినాక, 1242 సంవత్సరములో ల్యూకా గ్రిమాల్డి మరియు 1282 సంవత్సరములో ల్యూచెట్టో గాట్టిలూసియో కొనసాగించారు. ఆ స్థానం మధ్యయుగ సమాజములోని హింసాత్మక రాజకీయ జీవితపు పోకడ వలన వ్యక్తిగత ప్రమాదాలతో కూడుకున్నది: 1252 లో మిలనీస్ హేరేటిక్స్ చర్చి ఇంక్విసిటర్ ను కొంటాడో మధ్య నున్నలోతు తక్కువ ప్రదేశములో(కుడివైపు చిత్రములో) హత్య చేశారు. హంతకులు తప్పించు కోవటానికి లంచం ఎర చూపించారు. ఆ తరువాత జరిగిన తిరుగుబాటులో పోడేస్టా దాదాపుగా ఉరి వేయబడ్డారు. తరువాత కాలములో హతుడు సెయింట్ పీటర్ మార్టిర్ అని పిలువబడ్డారు. 1256 లో ఆర్చ్ బిషప్ మరియు రాజకీయ ప్రముఖులు నగరము నుండి బహిష్కరణ గావించబడ్డారు. 1259 లో కాపిటానో డెల్ పోపోలోగా గిల్డ్ ల సభ్యులచే ఎన్నికైన మార్టినో డెల్ల టోర్రె నగరాన్ని బలవంతంగా ఆధీనంలోనికి తెచ్చుకుని, శత్రువులను తరిమి వేసి, నియంత మాదిరిగా పరిపాలిస్తూ, రహదారులు నిర్మించి, కాలువలు త్రవ్వించి, నగర పరిసర ప్రాంతాల నుండి సక్రమంగా పన్నులు వసూలు చేశాడు.

అయితే అతని విధానము వల్ల మిలన్ యొక్క సంపద కుప్పకూలింది; అతిగా విచ్చలవిడిగా ప్రవర్తించే కిరాయి సైనికులని వాడటం వల్ల ప్రజలకి ఆగ్రహం తెప్పించింది. దీనివల్ల డెల్ల టోర్రె యొక్క సాంప్రదాయక శత్రువులైన విస్కోంటికి మద్దతు పెరిగింది.

1262 జూలై 22 నాడు డెల్ల టోర్రె యొక్క అభ్యర్థి అయిన కామో బిషప్ రైమొండో డెల్ల టోర్రెకు బదులుగా ఒట్టోనే విస్కోంటిని మిలన్ ఆర్చ్ బిషప్‌గా పాపే అర్బన్ IV నియమించారు. తరువాత రైమొండో డెల్ల టోర్రె విస్కోంటి మత ఆచారాలకు, నమ్మకాలకు వ్యతిరేకులైన కతార్ లతో సన్నిహితంగా ఉన్నాడనే విషయాన్ని ప్రచారం చేసి, వాళ్ల మీద దేశద్రోహం గావిస్తున్నారనే నింద వేశాడు: విస్కోంటి కూడా అదే నిందని డెల్ల టోర్రె మీద వేసి, వారి ఆస్తులని స్వాదీనం చేసుకుని, వారిని మిలన్ నుండి బహిష్కరించారు. దీని మూలంగా ఒక దశాబ్దాలకు పైగా జరిగిన అంతర్ యుద్ధం వల్ల మిలన్ జనాభా మరియు ఆర్ధిక వ్యవస్థ మరింత దెబ్బ తిన్నది.

1263లో దేశాములోనుండి వెళ్లగొట్టబడినవారి బృందం ఒకటి ఒట్టన్ విస్కోంటి నేతృత్వంలో నగరం మీద తిరుగుబాటు చేసింది. కాని కొన్ని సంవత్సరాలు పాటు అన్ని వైపుల నుండి పెరిగిన హింసాకాండ ఫలితంగా, చివరకు డేసియో యుద్ధం (1277) లో అతను విజయం సాధించి, తన కుటుంబానికి నగరాన్ని సమర్పించాడు. డెల్ల టోర్రెని శాశ్వతంగా తొలగించడంలో విస్కోంటి సఫలమయి, నగరాన్ని, నగర ఆధీనము ఉన్న వానిని 15వ శతాబ్దము వరకు పాలించాడు.

మిలన్ యొక్క గత చరిత్రలో చాలా భాగం, గుఎఫ్స్, ఘిబెల్లిన్స్ అనే రెండు రాజకీయ వర్గాల మధ్య ఘర్షణలతో గడిచింది. ఎన్నో మార్లు మిలన్ నగరములో గుయేల్ఫ్స్ విజయం సాధించారు. అయితే, విస్కోంటి కుటుంబం, వారికి జర్మనీ చక్రవర్తులతో ఉన్న "ఘిబెల్లిన్" మిత్రుత్వం ఆధారంగా మిలన్ పై అధికారాన్ని (సిగ్నోరియ) వశం చేసుకోగలిగారు.[21] 1395లో ఈ చక్రవర్తులలో ఒకరైన వేన్సేస్లాస్ (1378–1400) మిలనీస్ కి డచి హొదా ఇచ్చారు.[22] మరియు 1395లొ గియన్ గలేజ్జో విస్కాంటి మిలన్ కు డ్యూక్ అయ్యారు. 14వ శతాబ్ద ప్రారంభము నుండి 15వ శతాబ్ద మధ్య దాక ఒకటిన్నర శతాబ్దాల కాలం పాటు ఘిబెల్లిన్ విస్కోంటి కుటుంబం మిలన్ లో అధికారం నిలుపుకోగలిగింది.[23]

రినైసెన్స్ మరియు హౌస్ ఆఫ్ స్ఫోర్జా[మార్చు]

స్ఫోర్జా హౌస్ యొక్క శక్తికి చిహ్నమైన థ కాస్టెల్లో స్ఫోర్జేస్కో
17 శతాబ్దములోని మిలన్

1447లో మిలన్ డ్యూక్ అయిన ఫిలిప్పో మరియా విస్కాంటి వారుసుడు లేకుండానే మరణించాడు; విస్కాంటి వంశపరంపర అంతరించడంతో, అమ్బ్రోషియన్ రిపబ్లిక్ రూపొందించబడింది. ప్రసిద్ధ మిలన్ నగర ఉపకారి మరియు సెయింట్ అయిన సెయింట్ అంబ్రోస్ పేరునుండి అమ్బ్రోషియన్ రిపబ్లిక్ అనే పేరు వచ్చింది.[24] గ్యుల్ఫ్ మరియు ఘిబెల్లిన్ వర్గాలు రెండూ అమ్బ్రోసియాన్ రిపబ్లిక్ ఏర్పడటానికి కలిసి పనిచేశాయి. అయితే, 1450లో ఈ రిపబ్లిక్ కూలిపోయి హౌస్ ఆఫ్ స్ఫోర్జాకు చెందిన ఫ్రాన్సిస్కో స్ఫోర్జా మిలన్ ని జయించాడు. దీనివల్ల ఇటలీ యొక్క రినైస్సాన్స్ లోని ముఖ్య నగరాలలో ఒకటిగా మిలన్ మారింది.[14][24]

ఫ్రెంచ్, స్పానిష్, ఆస్ట్రియన్ వారు ఆధిపత్యం వహించిన కాలాలు[మార్చు]

1740 నుండి 1780 సంవత్సరాల కాలంలో మిలన్ లోని హాబ్స్బర్గ్ డచ్చేస్ అయిన ఆస్ట్రియా మహారాణి మరియా థెరీసా I.

1492లో ఫ్రెంచ్ రాజు లూయి XII మొదటి సారిగా డచి మీదకు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు స్విస్స్ కిరాయి సైనికులు మిలన్ తరుఫున ప్రతిఘటించారు. లూయి వారసుడైన ఫ్రాన్సిస్ I మరిగ్నానో యుద్ధం లో స్విస్స్ వారిపై విజయం సాధించినాక ఈ డచిని ఫ్రెంచ్ రాజు ఫ్రాన్సిస్ Iకు సమర్పించడానికి హామీ ఇచ్చాడు. అయితే హబ్స్బుర్గ్ చార్లెస్ V ఫ్రాన్సిస్ I ని 1525లో పవియ యుద్ధం లో ఓడించినప్పుడు, మిలన్ తో సహా ఉత్తర ఇటలీ మొత్తం హౌస్ ఆఫ్ హబ్స్బుర్గ్ కైవశమైంది.[25]

1556లో చార్లెస్ V తన కుమారుడు ఫిలిప్ II మరియు తన సోదరుడు ఫెర్డినండ్ I కొరకు తన ఉన్నతాసనాన్ని వదిలి పెట్టాడు. చార్లెస్ యొక్క ఇటాలియన్ ఆస్తులు, మిలన్ తో సహా, ఫిలిప్ II మరియు హాబ్స్బుర్గ్ ల స్పానిష్ సంతతీయులకు సంక్రమించింది. ఫెర్డినాండ్ యొక్క ఆస్ట్రియన్ హాబ్స్బుర్గ్ ల సంతతీయులకు పవిత్ర రోమన్ సామ్రాజ్యం పాలానాధికారం దక్కింది. 1629-31 మధ్య కాలంలో వచ్చిన భయంకరమైన మిలన్ ప్లేగ్ వలన మొత్తము జనాభా అయిన 130,000 లో సుమారు 60,000 మంది చనిపోయారని అంచనా. బ్లాక్ డెత్తో ప్రారంభమైన ఈ ప్లేగ్ ఉపద్రవము, శతాబ్దాల కాలాలు పాటు నెలకొన్న ప్లేగ్ వ్యాధి మహమ్మారితాలూకు ఉపద్రవాలలోని ఆఖరి వాటిలో ఒకటి.[26]

1700లో చార్లెస్ II మరణంతో స్పానిష్ హబ్స్బుర్గ్ ల సంతతి అస్తమించింది. అతని మరణానంతరం 1701లో స్పానిష్ వారసత్వము కొరకు యుద్ధం మొదలైంది. స్పైన్ రాజ సింహాసనం ఆక్రమించుకోవటానికి వీలుగా ఫ్రాన్స్ కు చెందిన ఫిలిప్ అఫ్ అంజోకు మద్దతుగా అన్ని స్పానిష్ ఆస్తులను ఫ్రెంచ్ సైన్యాలు ఆక్రమించాయి. 1706లో ఫ్రెంచ్ వారు ామిల్లిస్ మరియు టురిన్ లో ఓడిపోవడంతో ఉత్తర ఇటలీ ఆస్ట్రియన్ హాబ్స్బర్గ్ ల కైవసం అయింది. స్పైన్ యొక్క ఇటలీ యన్ ఆస్తులలో అధిక భాగం మరియు లోమ్బార్డ్, దాని రాజధాని మిలన్ ల పై ఆస్ట్రియా యొక్క ఆధిపత్యాన్ని 1713లో ఉట్రేచ్ట్ ట్రీటీ లాంఛనంగా ధ్రువీకరించింది.

19వ శతాబ్దం[మార్చు]

ఫైవ్ డేస్ లో మిలనీస్ దేశభక్తులు ఆస్ట్రియా యొక్క సైన్యంతో యుద్ధం చేస్తారు.

నెపోలియన్ లోమ్బార్దిని 1796లో జయించి, మిలన్ ని సిసల్పైన్ రిపబ్లిక్కు రాజధానిగా ప్రకటించాడు. తరువాత మిలన్ ని ఇటలీ రాజ్యానికి రాజధానిగా ప్రకటించి, డ్యూమోలో పట్టాభిషేకం జరుపుకున్నాడు. నెపోలియన్ ఆక్రమణ ముగిసిన తరువాత, వియన్నా కాంగ్రెస్ లోమ్బార్ది, మిలన్ లని, వేనేటోతో పాటు తిరిగి ఆస్ట్రియాకు ఇచ్చేసింది.[27] ఈ కాలములో మిలన్, లిరిక్ ఒపేరాకు కేంద్రంగా మారింది. 1770లలో ఇక్కడే మొజార్ట్ మూడు ఒపెరాలని టియట్రో రీజియో ద్యూకాల్ లో మొదటిసారిగా ప్రదర్శించాడు. తరువాత ల స్కెల ప్రపంచంలోనే థియేటర్ లకు ఒక ప్రమాణంగా మారింది. ఇక్కడే బెల్లిని, డోనిజెట్టి, రోస్సిని మరియు వెర్డి అధ్బుత ప్రదర్శనలు ఇచ్చారు. వెర్డి మిలన్ కు తన బహుమతి అయిన "కాస డి రిపోసో పర మ్యుసికిస్టి" లోనే పాతిపెట్టబడ్డాడు. లా కాన్నోబియాన మరియు టీట్రో కర్కనో అనునవి 19వ శతాబ్దంలోని ఇతర థియేటర్ లలో ముఖ్యమైనవి .

1864 సంవత్సరం ప్రాంతంలో మిలన్ లోని కేంద్రీయ స్టేషను

1848 మార్చ్ 18 నాడు, "ఇదు రోజులు" (ఇటలీ యన్ భాషలో:లే సిన్క్యు జియోర్నేట్ ) అనబడే ఆ రోజులలో, మిలన్ వాసులు ఆస్ట్రియా పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఫీల్డ్ మార్షల్ రాడేట్స్కీ తాత్కాలికంగా నగరములోనుండి వైదొలగవలసి వచ్చింది. అయితే జూలై 24న కస్టోజాలో ఇటలీ సైన్యాన్ని ఓడించి, రాడేట్స్కీ తిరిగి మిలన్ మరియు ఉత్తర ఇటలీ మీద ఆస్ట్రియన్ ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించాడు. అయినప్పటికి ఇటలీ లోని దేశీయవాదులు సర్దినియా రాజ్యం నేతృత్వంలో, ఇటలీ యొక్క ఏకీకరణ/0} కొరకు ఆస్ట్రియా పాలనని తొలగించాలని పిలుపు ఇచ్చారు. సార్దీనియా, ఫ్రాన్స్ రెండూ కలిసి ఒక స్నేహబంధము ఏర్పరచుకుని ఆస్ట్రియాని సోల్ఫెరినో యుద్ధంలో 1859లో ఓడించాయి.[28] ఈ యుద్ధం తరువాత, మిలన్ మరియు ఇతర లోమ్బార్ది ప్రాంతాలు సర్దినియా రాజ్యంలో కలిసి పోయాయి. ఈ రాజ్యం త్వరలోనే అనేక ఇటలీ ప్రాంతాలని తమ ఆధీనంలో తీసుకువచ్చింది. 1861లో ఇటలీ రాజ్యంగా పేరు మార్చబడింది.

ఇటలీ యొక్క రాజకీయ ఏకీకరణ ఉత్తర ఇటలీ మీద మిలన్ యొక్క వ్యాపారాత్మక ఆధిపత్యాన్ని బలపరిచింది. భారీగా రైల్వే నిర్మాణాలు జరిగి, ఉత్తర ఇటలీ యొక్క ముఖ్య రైలు కేంద్రంగా మిలన్ ను మలిచింది. అతి వేగంగా జరిగిన పారిశ్రామికీకరణం అనంతరం మిలన్ ఇటలీ యొక్క ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రంగా తయారయింది. అయితే 1890లలో ద్రవ్యోల్బణం ఎక్కువగా పెరగడంతో జరిగిన అల్లరి సందర్భంగా ఏర్పడిన బావ-బెక్కరిస్ మారణకాండ మిలన్ ని కుదిపేసింది. మిలన్ బ్యాంకులు ఇటలీ ఆర్ధిక రంగంలో వహించిన ముఖ్య పాత్ర వల్ల, ఈ నగరము దేశంలోనే ప్రధాన ఆర్ధిక కేంద్రమయింది. మిలన్ యొక్క ఆర్ధిక అభివృద్ది వల్ల 19వ శతాబ్ద చివరలో మరియు 20వ శతాబ్ద ప్రారంభములో నగర విస్తరణ మరియు జనాభా పెరుగుదల వేగంగా జరిగాయి.[4]

20వ శతాబ్దం[మార్చు]

మిలన్ లో 1906 లో జరిగిన ప్రపంచ ప్రదర్శన సందర్భముగా ఉపయోగించిన ప్రధాన హాల యొక్క ఆకృతి
1914 సంవత్సరములో మిలన్ నగరము యొక్క పటము

1919లో బెనిటో ముస్సోలినీ బ్లాక్ షర్ట్స్‌ని ఏర్పాటు చేశాడు. వీళ్లు ఇటలీ ఫాసిస్ట్ ఉద్యమానికి మిలన్ లో ముఖ్యులుగా ఉన్నారు. 1922లో ఈ నగరము నుండి మార్చ్ ఆన్ రోమ్ మొదలయింది.

రెండవ ప్రపంచ యుద్ధ సమయములో బ్రిటిష్ మరియు అమెరికా బాంబు దాడిలో మిలన్ కు తీవ్ర నష్టం జరిగింది. 1943లో ఇటలీ యొక్క యుద్ధ విరమణ జరిగినా కూడా, జర్మన్ లు ఉత్తర ఇటలీ లోని అధిక ప్రాంతాన్ని 1945 వరకు ఆక్రమించుకునే ఉన్నారు. మిలన్ మీద జరిగిన ఘోరమైన అల్లైడ్ బాంబు దాడులలో కొన్ని 1944లో జరిగాయి. వాటిలో అనేక దాడులు మిలన్ రైల్వే స్టేషను వైపు గురి పెట్టబడ్డాయి. 1943లో ఇటలీలో జర్మనీ ఆక్రమణకు వ్యతిరేకత పెరిగి మిలన్ లో ఎక్కువ ఘర్షణలు జరిగాయి.

యుద్ధం ముగిసేసరికి, పో వ్యాలీ కాంపైన్ లో భాగంగా అమెరికా యొక్క 1వ అర్మర్డ్ విభాగం మిలన్ వైపుకు చొచ్చుకు వచ్చింది. కాని వాళ్లు చేరే ముందే, ఇటలీ ప్రతిఘటన ఉద్యమము ప్రారంభమయి మిలన్ లో బహిరంగ తిరుగుబాటు జరిగి నగరాన్ని విడుపించటం జరిగింది. సమీపంలో ముసోలిని మరియు ఇటలీ సోషల్ రిపబ్లిక్ అందలి అనేక సభ్యులు (రిపబ్లికా సోషల్ ఇటలీ యానా, లేదా RSI), డోన్గో వద్ద జరిగిన ఉద్యమకారులకు పట్టుబడి, చంపివేయబడ్డారు. 29 ఏప్రియల్ 1945 నాడు ఫాసిస్ట్ ల మృతదేహాలు మిలన్ కు తీసుకువెళ్లబడి, పియజెల్ లోరెటో అనే ఒక పెద్ద బహిరంగ ప్రాంగణంలో సంప్రదాయానికి విరుద్ధంగా తలక్రిందులుగా వేలాడదీయబడ్డాయి.

యుద్ధ అనంతరం, ఈ నగరము ఆస్ట్రియా నుండి పారిపోయి వస్తున్న జ్యూస్ లకు శరణార్ధ నిలయంగా నిలిచింది. 1950ల మరియు 1960ల మధ్య కాలంలో ఆర్ధిక మహాద్భుతం సమయములో దేశాము నుండి, ముఖ్యంగా దక్షిణ ఇటలీ నుండి అధిక సంఖ్యలో జనం మిలన్ కు వలస రావడంతో, నగర జనాభా 1971లో 1,723,000 కు పెరిగింది. ఈ సమయములో మిలన్ లో నాశనమయిపోయిన అనేక భవనాలు, కర్మాగారాలు పునర్నిర్మించబడ్డాయి. యుద్ధానంతరం వేగవంతంగా ఏర్పడిన ఆర్ధిక అభివృద్ది మూలాన II బూమ్ అని పిలువబడే దశ ఇటలీలో నెలకొన్నది. అనేక నూతన మరియు ఆధునిక భవనాలు, టోర్రె వెలస్క, పిరేలి టవర్ వంటి ఆకాశాన్నంటే భవనాలు, కాల్పనిక మరియు నూతనత్వం సంతరించుకున్న పలు భవంతులు ఈ నగరములో నిర్మించబడినవి. 1960ల చివర నుండి 1970ల మొదటి వరకు బ్రిగేట్ రాస్ లేక రెడ్ బ్రిగేడ్స్ అని పిలువబడే మార్క్సిస్ట్/లెనినిస్ట్/కమ్యునిస్ట్ ఇటలీ యన్ సమూహము వలన విపరీతముగా బాధింపబడిన మిలన్ నగరం రాజకీయ మార్పులు మరియు వ్యతిరేకతలతో నిండిపోయి ఉంది. 1969 డిసెంబరు 12 సంవత్సరములో పియజ్జా ఫోన్టానాలోని అగ్రరియన్ బ్యాంక్ లో ఒక బాంబు ప్రేలిన కారణాన పదిహేడుగురు ప్రజలు మరణించి ఎనభై ఎనిమిదిమంది గాయపడటం జరిగింది.

మిలన్ లోని జనాభా 1970 ల చివరలో తగ్గిపోవటం మొదలయి, గత 30 సంవత్సరాలలో నగరములోని మొత్తం జనాభాలో దాదాపు మూడవ వంతు మంది బయటినున్న క్రొత్త శివారు ప్రాంతాలు, చిన్న నగరాలకు వలస వెళ్ళారు.[29] అదే సమయములో ఆ నగరమునకు ఆకర్షింపబడి విదేశీయులు ఎక్కువ సంఖ్యలో వలస రావటం మొదలయింది. అదే సమయములో జరిగిన చిహ్నము వంటి ఒక క్రొత్త విషయము ఎంతో వేగముగా మరియు గొప్పగా విస్తరించిన "మిలనీస్ చైనా టౌన్" అనబడు ఒక జిల్లా. ఇది వయా పవోలో సర్పి,వయా బ్రమాన్టే, వయా మేస్సినా మరియు వయా రోస్మినీ పరిసర ప్రాంతాలలోని ఝెజియాంగ్ అనబడు ప్రాంతం నుండి వలస వచ్చిన చైనీయుల జనాభాతో నిండి, ఈనాడు నగరములోని అత్యంత సుందరమైన జిల్లాలలో ఒకటిగా నిలిచింది. మిలన్ ఇటలీలోని ఫిలిపినొస్ లో మూడవ వంతు మందికి నివాసమై, అధికముగా నుండి, స్థిరముగా పెరుగుతూ 33,000[30] కంటే కొంచెం అధికంగా ఉండి, సంవత్సరానికి సగటున 1000 మంది జననాలు కలిగి ఉన్న, జనాభాకు స్థావరమయింది.[31]

దస్త్రం:Pirelli T1.png
యుద్ధానంతరం ఇటలీ లో సంభవించిన ఆర్ధిక అద్భుతానికి గుర్తుగా నిర్మాణం లో ఉన్న పిరెల్లి స్తూపము
20 శతాబ్దము తొలి భాగములో మిలన్ లోని పియజ్జ డెల్ డ్యూమో యొక్క చిత్రము

1980 లలో మిలన్ పరిశ్రమలు అత్యంత సఫలీకృతమవటం మొదలయింది. అది వస్త్రాలకు మరియు పలురకాల బట్టల లేబుల్స్ కు ప్రధాన ఎగుమతిదారు కావటంతో, దాని ప్రధాన కేంద్రం నగరంలోనే ప్రారంభమయి మిలన్ ప్రధాన ఫ్యాషను కేంద్రముగానూ అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన(అర్మానీ, వెర్సెస్ మరియు దోల్స్ & గబ్బానా వంటివి) ప్రధాన ఫ్యాషన్ నగరం గానూ వెల్లివిరిసింది. నగరములోని ఇంపైన దుస్తుల తయారీదారులు తయారు చేసిన సాంప్రదాయక మరియు వాడుకవైన, పొందికైన, సరసమైన ధరలకు లభ్యమయ్యే దుస్తులు ఆ నగరాన్ని ప్రపంచములోనే ముఖ్యమైన పోటీదారుగా నిలబెట్టి, హాట్ కౌచర్ లేక ఉన్నత స్థాయి ఫ్యాషన్ కు ప్రపంచపు రాజధానిగా పారిస్ యొక్క శతాబ్దపు స్థాయికి ప్రమాదము కల్పించింది. మిలన్ ను సందర్శించే అంతర్జాతీయ పర్యాటకలు సంఖ్య పెరిగింది. ముఖ్యంగా చైనా, జపాన్, సుదూర తూర్పు దేశాలనుండి వచ్చేవారి సంఖ్య పెరగటం జరిగింది. ఈ అభివృద్ధి మరియు "ఫేషన్ రాజధాని"గా నగరము మీద ఏర్పడిన ఒక కొత్త అభిప్రాయం, ఈ రెండూ కలిపి, పాత్రికేయులు మధ్య మిలన్ కు "మిలానో డ బెరే" అనగా "త్రాగడానికి మిలన్ " అనే పేరు ప్రాచుర్యంలోనికి వచ్చింది.[32]

1990లలో టాన్జెన్టోపోలి అనే ఒక పెద్ద రాజాకీయ కుంభకోణం మిలన్ ని కుదిపేసింది. ఈ కుంభకోణం పలజ్జో డేల్లె స్టేల్లిన్ భవన సముదాయంలో జరిగింది. అనేక మంది రాజకీయవేత్తలు మరియు వ్యాపారవేత్తలు లంచగొండితనానికి పాల్పడినట్టు ఆరోపణలతో విచారించబడ్డారు. నగరములో ఒక ఆర్ధిక సంక్షోభం ఏర్పడి, 1950లు మరియు 1980లలోని పరిస్థితులతో పోల్చుకుంటే, పారిశ్రామిక అభివృద్ధి తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ మిలన్ ఒక ఫేషన్ మరియు డిజైన్ రాజధాని అనే భావం మరింత పెరగటంతో మియు మియు వంటి క్రొత్త లేబెల్ లు ఏర్పడ్డాయి. 1990ల చివరలో మిలన్ లోని పారిశ్రామిక మరియు ఆర్ధిక అభివృద్ధి కొంచం పెరిగింది.

2000ల మొదట్లో, 1990ల మొదట్లో పెరుగుదల లేకుండ ఉన్న మిలన్ యొక్క ఆర్ధిక వ్యవస్థ, మళ్ళీ కొద్దిగా అభివృద్ధి చెందటం ప్రారంభమయింది. కాని ఇది కొద్ది కాలమే ఉండి, టాన్జెన్టోపోలి కుంభకోణము నుండి నగరం బయట పడినప్పటికీ, మిలన్ లో మరొక ఆర్ధిక మాంద్యం మరియు సంక్షోభం ఏర్పడింది. దీనివల్ల మిలన్ యొక్క పారిశ్రామిక ఎగుమతులు వేగంగా పడిపోయాయి. ఆసియాకు చెందిన వస్త్ర సంస్థలు, కొంత బలహీనపడుతున్న మిలన్ ఫేషన్ లేబెల్ లకు పోటీగా రావటం మొదలుపెట్టాయి. అయితే, మిలన్ తన బలమైన ఆర్ధిక వ్యవస్థని అలాగే కొనసాగించగలిగింది. ఫియర (ముఖ్యంగా పారిశ్రామిక డిజైన్ కు సంబంధించిన వస్తువుల ప్రదర్శన) నగరానికి బయట [33] ఉన్న రో అనే ప్రాంతానికి మార్చడం, 2008లో ఎక్స్పో 2015[34] నగరములో జరగనున్నదనే ప్రకటన వెలువడటం వంటి కారణాల వలన నగర భవిష్యత్తు మెరుగయింది. క్రొత్త నిర్మాణాలకు మరియు అవంట్-గార్డ్ భవనాలు నిర్మించడానికి అనేక క్రొత్త పథకాలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిలన్ యొక్క పారిశ్రామిక ఉత్పత్తి తగ్గినప్పటికీ,[35] నగరానికి ప్రచురణ, ఆర్ధిక రంగం, బ్యాకింగ్, ఆహార ఉత్పత్తి, IT టెక్నాలజీ, లాజిస్టిక్స్, రవాణా, పర్యాటకం వంటి ప్రత్యామ్నాయ ఆర్ధిక ఆదాయపు వనరులు విజయవంతంగా ఏర్పడ్డాయి.[35] మొత్తం మీద, మిలన్ జనాభా ఇటీవల స్థిరపడినట్లు కనిపిస్తుంది. 2001 నుండి నగర జనాభాలో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉంది.[29]

మునిసిపల్ పరిపాలన[మార్చు]

మిలన్ లోని తొమ్మిది జిల్లాలు

రాజకీయాలు[మార్చు]

మిలన్ తొమ్మిది బరోలుగా విభజించబడింది. వీటిలో ఎనిమిది బరోలని సెంటర్-రైట్ సంకీర్ణము (1-8) పరిపాలిస్తుండగా ఒక బరోని సెంటర్-లెఫ్ట్ సంకీర్ణము (9)పరిపాలిస్తుంది.

పరిపాలన విభాగాలు[మార్చు]

మిలన్ నగరము జొనా అని పిలవబడే పరిపాలన విభాగాలుగా విభజించబడింది. 1999కు ముందు నగరములో 21 జోనులు ఉండేవి; 1999లో విభాగాల సంఖ్యని 21 నుండి 9 కు తగ్గించటానికి పాలనా వ్యవస్థ నిర్ణయించింది. ప్రస్తుతము జొనా 1 స్పెయిన్-కాలపు నగర గోడల పరిధి లోపల ఉన్న"చారిత్రాత్మిక కేంద్రం" పరిధిలోనే ఉంది; మిగిలిన ఎనిమిది విభాగాలు జొనా 1 సరిహద్దు నుండి నగర పరిధి వరకు విస్తరించి ఉన్నాయి.[36]

భూగోళశాస్త్రం[మార్చు]

నైసర్గిక స్వరూపం[మార్చు]

మిలన్ జిల్లా పశ్చిమ-మధ్య ప్రాంతములోని పడన్ పచ్చిక బయలు లో టిసినో, అడ్డా, పో అనే నదుల మధ్య ఉంది. ఇక్కడ ఆల్ప్స్ పర్వత ప్రారంభము కూడా ఉన్నది. ఇది 181 కిలోమీటర్లు 2 విస్తీరణము కలిగి ఉండి, సముద్ర మట్టాని కంటే 122 మీటర్లు ఎత్తున ఉంది.

వాతావరణము[మార్చు]

మిలన్ తేమగా ఉండే సబ్ ట్రాపికల్ వాతావరణము (కొప్పెన్ వాతావరణ వర్గీకరణ ప్రకారం Cfa )[37] కలిగి ఉంది. దీనితో పాటు ఖండాంతర లక్షణాలని కూడా కొన్నిటిని కలిగి ఉంది. ఇది ఉత్తర ఇటలీ యొక్క అంతర్గత భూములలో ఉన్నట్లుగానే ఉంటుంది. అక్కడ వేసవులు ఉష్ణంగా, తేమగా ఉండి, శీతాకాలాలు చలిగా నిమ్ముగా ఉంటాయి. ఇటలీలోని ఇతర ప్రాంతాలలో మేడిటెర్రనేయన్ వాతావరణము నెలకుంటుంది.[38]

నగర కేంద్రములో సగటు ఉష్ణోగ్రత −3 to 4 °C (27 to 39 °F) జనవరి లోనూ మరియు 19 to 30 °C (66 to 86 °F) జులై లోనూ ఉంటుంది. శీతాకాలములో హిమపాతం సాధారణమే. అయితే గత 15-20 సంవత్సరాలలో హిమపాతము తగ్గింది. మిలాన్ యొక్క చారిత్రాత్మిక సగటు 35 మరియు 45 సెంటీమీటర్ల మధ్యలో (16"/18") ఉంది; 1-3 రోజులలో 30-50 సెంటీమీటర్ల కంటే ఎక్కువ హిమపాతం నియమిత కాలములో జరుగుతూ ఉంటుంది. అత్యధికంగా 80-100 సెంటీమీటర్ల ప్రసిద్ధ హిమపాతం జనవరి 1985లో కురిసింది. తేమశాతం సంవత్సరమంతా ఎక్కువగానే ఉంటుంది. వార్షిక వర్షపాతం సగటుగా 1000 మిల్లీమీటర్లు(40 అంగుళాలు) ఉంటుంది.[38]

ఈ నగరము సామాన్యంగా పో బసిన్ లో మాదిరిగా తరచూ పొగమంచుతో కప్పబడి ఉంటుంది. అయితే దక్షిణ ప్రాంతములో వరి పంటపొలాలు తీసివేయడము, నగర ఉష్ణ ద్వీప ప్రభావం మరియు కాలుష్య స్థాయి తగ్గడం వంటి కారణాలవల్ల ఈ పరిస్థితి ఇటీవల కాలములో, కనీసం నగర కేంద్రంలోనైనా, తగ్గింది.

మూస:Milan weatherbox

వాస్తుశాస్త్రము మరియు ముఖ్యముగా చూడదగిన స్ధలాలు[మార్చు]

వాస్తుశాస్త్రము[మార్చు]

సాంటా మేరియా డెల్లె గ్రజీ.
సాన్ సిమ్ప్లిసిఅనో యొక్క పురాతన బేసిలికా నుండి రోమనెస్క్ ఫేకేడ్ వరకు

పురాతన రోమన్ స్థావరము యొక్క శిథిలాలు కొన్నే మిగిలి ఉన్నాయి. ఈ స్థావరము తరువాత కాలములో పశ్చిమ రోమన్ సామ్రాజ్యం యొక్క రాజధానిగా మారింది.

4వ శతాబ్దము CE యొక్క రెండవ భాగములో మిలన్ బిషప్ గా సెయింట్ అంబ్రోస్ ఉండేవారు. నగర నిర్మాణ ప్రణాళిక, కేంద్రము యొక్క పునఃరూపకల్పన (కేథడ్రల్ మరియు బాప్టిస్ట్రరీలు ఇప్పుడు లేవు), నగర ద్వారాల్లో నిర్మించిన గొప్ప బాసిలికాలు వంటి అంశాలఫై అతని ప్రభావం ఎక్కువగా ఉండేది:శాంట్ అంబ్రోగియో, బ్రోలోస్ లో ఉన్న సాన్ నజారో, సాన్ సిమ్ప్లిసియానో మరియు శాంట్ యూస్తోర్గియో వంటి మధ్య శాతబ్దాలలో రేఫర్బిష్ చేయబడిన అతి సుందరమైన మరియు అతి ముఖ్యమైన, చర్చిలు మిలన్ లో ఉన్నాయి.

మిలన్ లోని లియోనార్డో కాలము నాటి కేంద్రీయ పధక రచనతో గీసిన ఒక వాస్తుశాస్త్ర చిత్రము. (పారిస్ మాన్యుస్క్రిప్ట్ B)

ఇటలీలో గోతిక్ వాస్తుశాస్త్రం యొక్క అతి పెద్దదైన మరియు అతిముఖ్యమైన ఉదాహరణ, ప్రపంచములోనే నాలుగవ అతి పెద్ద కేథడ్రలైన మిలన్ కేథడ్రల్.[39] రోమ్ లోని సెయింట్ పీటర్ బసిలికా, సేవిల్లె కేథడ్రల్ మరియు ఐవరీ కోస్ట్ లోని ఒక క్రొత్త కేథడ్రల్, మొదటి మూడు అతి పెద్ద కేథడ్రల్ లు.[39] 1386 - 1577 మధ్య నిర్మించబడిన ఈ కేథడ్రల్ లో, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పాలరాయి శిల్పాలు ఉన్నాయి. విస్తరించి కనబడే ఒక స్వర్ణ మడోనా శిల్పము ఈ నగర చిహ్నాలకు తలమానికంగా నిలిచింది. ఈ మడోన శిల్పాన్ని మిలన్ వాసులు మడునిన (చిన్న మడోనా) అని పిలుస్తారు.

మిలన్ కాథేడ్రల్: ఫ్రాన్సేస్కో మరియా రిచ్చినో (1614) యొక్క థ మడోన్న డెల్'అల్బెర్టో చాపెల్

14వ - 15వ శతాబ్ద మధ్యకాలములో స్ఫోర్జా కుటుంబము ఈ నగరాన్ని పరిపాలించేటప్పుడు, పాత విస్కోంటి కోట విస్తరించబడి కాస్టెల్లో స్ఫోర్జేస్చోగా రూపుదిద్దబడింది: సేప్రియో మరియు లేక్ కోమో పరిసరాల్లో నుండి చిక్కిన వేట జంతువులతో నింపబడి చుట్టూ ప్రహరీ గోడ కలిగిన ఒక వేట స్థలము మధ్యలో హుందాతనము నిండిన ఒక రినైసంస్ దర్బార్ ఇక్కడ ఉంది. ప్రసిద్ధ భవననిర్మాణ నిపుణులు ఈ నిర్మాణములో పాల్గొన్నారు. వారిలో ఫ్లోరెంటైన్ ఫిలరేట్ ఎత్తైన కేంద్ర ద్వారపు స్థూపాన్ని నిర్మించారు. సైన్య నిపుణుడు బార్టోలోమియో గాడియో కూడా ఈ నిర్మాణములో పాల్గొన్నారు.[40]

ఫ్రాన్సిస్కో స్ఫోర్జా, ఫ్లోరెన్స్ అఫ్ కసిమో డి మెడిసి మధ్య నెలకొన్న రాజాకీయ మిత్రత్వం వాస్తుశాస్త్ర రంగంలో గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. మిలన్ లో భావన నిర్మాణ రంగం మీద బ్రునేల్లెస్చి యన్ రినైసన్స్ వాస్తుశాస్త్ర నమూనాల ప్రభావం చూపాయి.

మెడిసి బ్యాంక్ ఉన్న ఒక పలజ్జోనే ఈ టస్కాన్ ప్రభావం చూపిన మొదటి భవనాలలో ఒకటి. ఈ భవనము యొక్క ప్రధాన ద్వారము మాత్రమే ఇప్పుడు ఉంది. సాన్ లోరెంజోతో ముడిపడి ఉన్న కేంద్రంగా రూపొందించబడిన పోర్టినారి చాపెల్ కూడా ఈ టుస్కాన్ ప్రభావం ఉన్న భవనము. ఈ భవనం, బ్యాంక్ వారి మిలన్ శాఖ యొక్క మొదటి మేనేజర్ కొరకు నిర్మించబడింది. ఒస్పెడేల్ మగ్గియోర్ అనే ఒక పెద్ద ప్రజా వైద్యశాల ఫిలరేటే మిలన్ లో ఉన్నప్పుడు రూపొందించారు. అదే కాక ట్రియటైస్ ఆన్ ఆర్కిటెక్చర్ అనే గొప్ప గ్రంథాన్ని కూడా రచించారు. నక్షత్రము ఆకారములో ఉన్న ఒక ఆదర్శ నగర నిర్మాణానికి ప్రణాళిక దీంట్లో ఉంది. స్ఫోర్జిండా అని పిలవబడే ఈ నగరము ఫ్రాన్సిస్కో స్ఫోర్జా గౌరవార్థం నిర్మించవలసిన నగరము. ఫిలరేటే ఈ నగర నిర్మాణము కేంద్ర ప్రణాళిక రూపంలో జరగాలని గట్టిగా వాదించాడు. 1482 నుండి 1499లో మిలన్ ఫ్రెంచ్ ఆధీనములో వచ్చేవరకు లియోనార్డో డా విన్సి మిలన్ లో ఉన్నప్పుడు ఒక టిబురియో అనగా కేథడ్రల్ కు అడ్డముగా నిర్మించిన స్థూపాన్ని రూపొందించడానికి నియమించబడ్డారు. అయితే అ స్థూపము నిర్మాణానికి అతన్ని ఎన్నుకోలేదు.[41][42] కేంద్ర ప్రణాళికతో కూడిన భవన నిర్మాణ విషయములో అయన ఫిలరేట్ తో కలిసి చూపించిన ఆసక్తి కారణాన ఆ సమయములో అనేక భవన నిర్మాణాల యొక్క వాస్తుశాస్త్ర రేఖాచిత్రాలు [చిత్రాలు] తయరుకావటం జరిగింది. డానాటో బ్రమంటే మరియు ఇతరుల పనులఫై ఇవి ప్రభావం చూపించాయి. సాంటా మరియా ప్రేస్సో సాన్ సటిరో (ఒక చిన్న 9వ శతాబ్తము నాటి చర్చి యొక్క పునర్నిర్మాణం), సాంటా మారియా డెల్లె గ్రేజీ యొక్క అందముగా ప్రకాశించే ట్రిబ్యూన్ మరియు సంట్' అంబ్రోగియోకు మూడు గుప్తా ప్రార్ధనాగారాలు, బ్రమంటే ఈ నగరములో నిర్మించిన కొన్ని భవనాలు. సాన్ లోరెంజో యొక్క బెసిలికా వంటి తొలినాటి క్రైస్తవ వాస్తుశాస్త్ర నిర్మాణాలు గురించి తాను చేసిన అధ్యయనం కూడా అతను నిర్మించిన ఈ భవనాల మీద ప్రభావం చూపించింది.[43]

1761లో పూర్తి అయిన 18వ శతాబ్దముకు చెందిన పలజ్జో లిట్ట యొక్క చెక్కుడు యొక్క కొత్త రూపం
మిలన్ కు చెందిన గొప్ప బెల్జియోజోసో కుటుంబము కొరకు, 1772 - 1781 కు మధ్య నిర్మించబడిన నియోక్లాస్సికల్ పలజ్జో బెల్జియోజోసో యొక్క రూపం

కౌంటర్ రీఫోర్మెషన్ సమయములో ఈ నగరము స్పెయిన్ వారి ఆధిపత్యము లో ఉండేది. అప్పుడు సెయింట్ చార్లెస్ బోర్రోమియో, అతని బంధువు, కార్డినల్ ఫెడెరికో బోర్రోమియో అనే ఇద్దరు ఈ కాలములోని ప్రాముఖ్యత కలిగిన ముఖ్యులు. వీళ్లు మిలన్ వాసులకు నైతిక మార్గదర్శులుగా వ్యవహరించి, సంస్కృతికి పెద్ద పీట వేశారు. బైబ్లియోటేక అంబ్రోసియానని ఫ్రాన్సేస్కో మారియా రిక్కినో రూపకల్పన చేసిన ఒక భవనములో సృష్టించారు. సమీపంలోనే పినకోటేక అంబ్రోసియానని కూడా నెలకొల్పారు. అనేక అందమైన చర్చిలు, బరోక్ భవనాలు వాస్తు కళారంగం వర్ధిల్లిన రోజులలో ఈ నగరములో పెల్లెగ్రినో టిబల్డి, గలేస్సో అలేస్సి మరియు రిక్కినోనే స్వయంగా నిర్మించారు.[44]

18వ శతాబ్దములో మిలన్ లో భవనాలకు మరమత్తులు గణనీయంగా జరగడానికి ఆస్ట్రియాకు చెందిన మరియా తెరెసా చక్రవర్తిణి కారకులయ్యారు. సాంఘిక మరియు పౌర రంగాలలో ఆమె గణనీయమైన మార్పులు తెచ్చారు. ఈ నాటికి నగరానికి గర్వకారణంగా నిలుస్తున్న వంటి అనేక భవనాలు ఆమె ఆధ్పర్యములో నిర్మించబడ్డాయి. 1778 ఆగస్టు 3 ప్రారంభించబడిన టియట్రో అల్లా స్కాల ఈనాడు ప్రపంచములోనే అత్యంత సుప్రసిద్ధమైన ఒపేరా హౌస్ లలో ఒకటిగా నిలుస్తుంది. దీనిలో అనుసంధానం చేసి ఉన్న మ్యుసియో టీట్రేల్ అల్లా స్కాలా లో ఒపేరాకు మరియు ల స్కాలా యొక్క చరిత్ర గురించిన వర్ణచిత్రాలు, ముసాయిదాలు, శిల్పాలు, దుస్తులు మరియు ఇతర దస్తావేజులు ప్రదర్శించబడుతున్నాయి. టియాట్రో అల్లా స్కాలా యొక్క బాలే స్కూల్ కూడా లా స్కాలా లోనే ఉంది. ఆస్ట్రియా రాజులు మిలన్ లో అనేక సాంస్కృతిక కలాపాలు చేపట్టారు. బ్రేరా జిల్లాలో ఉన్న పురాతనమైన జేస్యిట్ కాలేజ్ ఒక వైజ్ఞానిక మరియు సాంస్కృతిక కేంద్రంగా మార్చబడింది. అక్కడ ఒక గ్రంథాలయం, ఖగోళ వేదశాల మరియు ఒక ఉద్యానవనము ఉండేది. ఇప్పుడు ఒక ఆర్ట్ గ్యాలరి మరియు అకాడెమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రక్క ప్రక్కనే స్థాపించబడ్డాయి.

పందొమ్మిదవ శతాబ్దములోని గల్లేరియా విత్తోరియో ఎమాన్యుయెల్ II యొక్క స్థూప ఆకారములోని క్రాసింగ్
1770 లలో నిర్మించిన టియట్రో అల్లా స్కాల యొక్క పందొమ్మిదవ శతాబ్దపు చిత్రీకరణ

18వ శతాబ్దము చివరిలో మరియు 19వ శతాబ్దము ప్రారంభములో నెలకొన్న నియోక్లాసికల్ ఉద్యమం మిలన్ మీద విస్తృతంగా ప్రభావం చూపించి, నగర వాస్తుకళ శైలినే మార్చివేసింది. 1800ల మొదట్లో నెపోలియన్ బోనపార్టీ నగరాన్ని పాలించినప్పుడు, అనేక సుందరమైన నియోక్లాసికల్ భవనాలు మరియు విల్లా రియాలే వంటి రాజగృహాలు నిర్మించబడ్డాయి. ఈ రాజగృహము సామాన్యంగా విల్లా డేల్ బెల్జియోజోసో అని పిలవబడుతుంది. (దీనికి పాలసో బెజియోజోసోకు సంబంధం లేదు). ఇది గయర్డిని పుబ్లిసి సమీపంలో వయ పాలెస్ట్రో లో ఉంది. దీన్ని 1790లో లియోపోల్డో పొల్లాక్ కట్టారు.[45] ఇక్కడే బోనాపార్టే కుటుంబము నివసించేది. ముఖ్యంగా జోసేఫిన్ బోనపార్టేతో పాటు కౌంట్ జోసెఫ్ రాడేట్స్కి వాన్ రాడేట్జ్, యూజీన్ డి బ్యుహర్నిస్ వంటి అనేక ఇతర ప్రముఖులు ఇక్కడే నివసించేవారు.[45] ఈ రాజభవనము మిలన్ మరియు లోమ్బార్డిలలో నియోక్లాసికల్ వాస్తుకళకు ఒక ఉత్తమ నిదర్శనంగా భావించబడుతున్నది. దీని చుట్టూ ఆంగ్లేయ ఉద్యానవనము ఉంది. ఈనాడు ఇక్కడ గల్లెరియా డి' ఆర్టే కాంటెమ్పోరనియా (ఆంగ్లం లో:గేలరీ అఫ్ కాంటెంపరరీ ఆర్ట్ ) ఉంది. దాని లోపల సుందరంగా అలంకరించబడిన సాంప్రదాయ స్థూపాలు, విశాలమైన పెద్ద మందిరాలు, పాలరాయి శిల్పాలు, స్పటిక దీపవిన్యాసాలు ఉన్నాయి.[45]

పాలస్సో బెల్జియోజోసో కూడా ఒక బ్రహ్మాండమైన భవనము. ఇది కూడా నెపోలియన్ కుటుంబము యొక్క నివాసస్థలముగా ఉండేది. ఈ భవనము మిలన్ లోని నియోక్లాసికల్ భవననిర్మాణకళకు ఉన్న గొప్ప ఉదాహరణలలో ఒక్కటి. ఈ నగరములో ఇంకా అనేక ముఖ్యమైన నియోక్లాసికల్ స్మారక భవంతిలు ఉన్నాయి. అర్కో డెల్లా పేస్ లేక ఆర్చ్ అఫ్ పీస్ వానిలో ఒకటి. ఈ భవంతిని ఆర్కో సేమ్పియోన్ (సేమ్పియోన్ ఆర్చ్) అని కూడా కొన్ని సార్లు పిలుస్తారు. ఇది పియాజా సేమ్పియోన్ లో పార్కో సేమ్పియోన్ కు చిట్టచివరన ఉంది. దీన్ని పారిస్ లో ఉన్న ఆర్క్ డి ట్రైమ్ఫ యొక్క చిరు రూపముతో పోల్చబడుతుంది. ఈ వంపు తిరిగిన కట్టడము యొక్క నిర్మాణపు పని 1806లో నెపోలియన్ I ఆధ్బర్యంలో మొదలయింది. దీన్ని ల్యిగి కాగ్నోల రూపకల్పన చేశారు. నెపోలియన్ 1826లో వాటర్లూ యుద్ధంలో ఓటమితో తరువాత ఆర్క్ డి ట్రైమ్ఫతో పాటు ఈ స్మారకపు వంపు తిరిగిన కట్టడం యొక్క నిర్మాణం కూడా ఆగిపోయింది. అయితే ఆస్ట్రియా చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్ (ఫ్రాన్సిస్ జోసెఫ్) I ఈ వంపు తిరిగిన కట్టడం యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయవలసిందిగా ఆదేశించాడు. ఇది వియన్నా కాంగ్రెస్ మరియు 1815 నాటి శాంతి ఒప్పందానికి గౌరవ చిహ్నంగా ఉంటుందని అతని ఆలోచన. దీన్నీ ఫ్రాన్సిస్కో పెవేరేల్లి 1838 సెప్టెంబరు 10 నాడు పూర్తి చేశాడు.[45] 1817లో పియరో గిలర్దోని నిర్మించిన పలజ్జో డెల్ గవర్నో కూడా మరొక పేరుపొందిన నియోక్లాసికల్ భవంతి.[45]

BBPR ద్వారా నిర్మించబడిన 1950 లలోని మిలన్ యొక్క చిహ్నమైన థ టోర్రె వేలాస్క

19వ శతాబ్దము యొక్క రెండవ భాగములో మిలన్ ద్వీపకల్పము లోని ప్రధాన పారిశ్రామిక నగరముగా హొదా సాధించింది. రెండవ పారిశ్రామిక విప్లవానికి, తద్వారా గొప్ప సామాజిక మార్పు నకునూ దారి తీసిన సరిక్రిత్త సాంకేతిక పరిజ్ఞానానికి కేంద్రంగా భాసిల్లిన మిలన్, ఇతర ఐరోపా రాజధానుల నుండి నగరీకరణ విషయంలో ప్రేరణ పొందింది. గల్లెరియా విట్టోరియో ఏమన్యువేల్ II అనేది పియజా డెల్ డుయోమో, మిలన్ని లా స్కాలాకు ఎదురుగా ఉన్న ఒక మైదానాన్ని కలిపే ఒక బ్రహ్మాండమైన పైకప్పుతో ఉన్న దారి. దీన్ని సంయుక్త ఇటలీ యొక్క మొదటి రాజైన విట్టోరియో ఏమన్యువేల్ IIకు గుర్తుగా 1865-1877 మధ్య గియుసేప్ మెంగొని నిర్మించారు. ఈ దారికి వంపు తిరిగిన గాజు, పోత ఇనుములతో కూడిన కట్టడము గల పై కప్పు ఉంది. ఈ విధమైన రూపకల్పనే 19వ శతాబ్దములో ప్రఖ్యాతమైనది. లండన్ లోని బర్లిన్గ్టన్ ఆర్కేడ్ లో కూడా ఇదే విధమైన పై కప్పు రూపకల్పన ఉండేది. బ్రస్సేల్స్ లోని సెయింట్-హుబెర్ట్ గేలరీ, సెయింట్ పీటర్స్బర్గ్ లోని పస్సజ్ వంటి పెద్ద వంపైన గాజు కట్టడాలతో కూడిన షాప్పింగ్ ఆర్కేడ్ లకి ఈ తరహా రూపకల్పన ఉండేది. 19వ శాతాబ్ధము చివరిలో నగరములో నిర్మించబడిన మరొక ఎక్లేక్టిక్ స్మారక భవంతి, సిమెటరో మాన్యుమెంటల్ (మాన్యుమెంటల్ సిమెట్రీ లేదా స్మశానము అని అర్ధము కలిగినది). ఈ భవంతి నగరములోని స్టాజియోన్ జిల్లాలో ఉంది. దీన్ని అనేక మంది వాస్తుకళా నిపుణులు 1863 నుండి 1866 సంవత్సరాల మధ్య కాలములో నియో-రోమనెస్క్ శైలిని ఉపయోగించి నిర్మించారు.

20వ శతాబ్దంలోని గందరగోళ పరిస్థితులలో కూడా వాస్తుకళలో అనేక విన్నూత్న ప్రయోగాలు జరిగాయి. స్మారక భవంతులు కలిగి ఉన్న ఈ నగరంలోని సెంట్రల్ స్టేషను (స్తజియోన్ సెంట్రెల్) నిర్మాణములో ఆర్ట్ నౌవీ, ఆర్ట్ డేకో మరియు ఫాసిస్ట్ శైలిలో నిర్మించబడింది. రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం నెలకొన్న పునఃనిర్మాణ కాలములో అతివేగంగా ఆర్ధిక అభివృద్ది జరిగింది. అదే సమయములో జనాభా పెరిగి క్రొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అంతే కాక, వాస్తుకళ కూడా క్రొత్త మలుపు తిరిగి నగర వాస్తుకళ చరిత్రలో కొన్ని మైలురాళ్లైన భవంతులు నిర్మించబడ్డాయి. వాటిలో కొన్ని, జియో పొంటి యొక్క పిరెల్లి టవర్ (1955–59), వెలస్కా టవర్ (1958), నూతన నివాస జిల్లాలు మరియు ఇటీవల కాలాల్లో రో లో నిర్మించబడిన ప్రదర్శనా కేంద్రం వంటివి ఉన్నాయి. దానితో పాటు ఒక నాటి పారిశ్రామిక ప్రాంతాలని మరల నగరీకరణ చేసి వాటిని సిటీ లైఫ్ వ్యాపార మరియు నివాస కేంద్రం వంటి ఆధునిక నివాస జిల్లాలుగా మార్చడం కూడా జరిగింది.

ఉద్యానవనాల మరియు తోటలు[మార్చు]

నగరము లోని ప్రధాన ఉద్యానవనము అయిన థ పార్కో సేమ్పయోన్
1780 లలో ఏర్పాటు చేయబడిన మిలన్ లో మిగిలిన అత్యంత పురాతన ప్రజా ఉద్యానవనాలలో ఒకటైన థ గయార్దిని పబ్లిసి డి పోర్ట వేనేజియ

మిలన్ నగరం వంటి పరిమాణం గల ఇతర నగరాలతో పోల్చినప్పుడు మిలన్ లో అతి తక్కువ పచ్చదనం ఉన్నప్పటికీ,[46] ఈ నగరములో అనేక రకాల ఉద్యానవనాలు, తోటలు ఉన్నాయి. మొట్ట మొదటి ప్రజా ఉద్యానవనాలు 1857 మరియు 1862 లలో, గియసేప్ బాల్సరేట్టో రూపకల్పనలో స్థాపించబడ్డాయి. ఇవి పియజెల్ ఒబెర్డాన్ (పోర్టా వేనేసియా), కర్సో వేనేసియ, వయ పాలెస్ట్రో మరియు వయ మనిన్ ప్రాంతాలలో ఉన్న ఒక "హరిత ఉద్యానవన జిల్లా" లో ఉన్నాయి.[47] వీటిలో చాలా ఉద్యానవనాలు నియో క్లాసికల్ శైలిలో రూపొందించబడ్డాయి. ఇవి సాంప్రదాయక ఆంగ్లేయుల తోటలని పోలి, ఎక్కువ వృక్ష సంపద కలిగి ఉన్నాయి.[47] మిలన్ ప్రాంతంలో ఉన్న అతి ముఖ్యమైన ఉద్యానవనాలు: పార్కో సేమ్పియోన్ (కాస్టెల్లో స్ఫోర్సేస్కో సమీపంలో), పార్కో ఫోర్లని, గయర్డిని పబ్లిసి, గయర్దినో డెల్ల విల్లా కమ్యునేల్, గయర్డిని డెల్ల గువాస్టల్ల మరియు పార్కో లంబ్రో. పార్కో సేమ్పియోన్ కాస్టెల్లో స్ఫోర్సేస్కోకు ఆర్చ్ అఫ్ పీస్ (అరకో డెల్ల పేస్) కు మధ్య, పియస్సా సేమ్పియోన్ సమీపంలో ఉన్న ఒక పెద్ద ప్రజా ఉద్యానవనం. దీన్ని ఏమిలియో అలేమాగ్న నిర్మించారు. ఇక్కడ ఒక నేపోలియనిక్ ఏరీనా, సివికో అక్వరియో డి మిలానో (మిలన్ లోని సివిక్ అక్వేరియం), ఒక స్థూపం, ఒక కళా ప్రదర్శనా కేంద్రం, కొన్ని చెరువులు మరియు ఒక గ్రంథాలయం ఉన్నాయి.[47] ఇంకా మిలన్ లోని 235 హెక్టేర్ల విస్తీరణమ కలిగిన అతి పెద్ద ఉద్యావనం, పార్కో ఫోర్లని.[47] ఇక్కడ ఒక కొండ, ఒక చెరువు ఉన్నాయి. 1783 నవంబరు 29లో స్థాపించబడి, 1790లో పూర్తి చేయబడిన గియర్డిని పబ్లిసి, మిలన్ లోనే అతి పురాతనమైన ప్రజా ఉద్యావనాలలో ఒకటి.[48] ఇది ఆంగ్లేయ నియో క్లాసికల్ శైలి లో రూపొందించబడిన ఉద్యానవనం. దీనిలో ఒక చెరువు, మ్యూసియో సివికో డి స్టోరియ నాచ్యురేల్ డి మిలాన్ఓ మరియు విల్లా రియేల్ ఉన్నాయి. గియర్డిని డెల్ల గువాస్టల్ల మిలన్ లోని మరొక పురాతనమైన తోటలలో ఒకటి. దీనిలో ముఖ్యంగా అలంకరించబడిన చేపల చెరువు ఒకటి ఉంది.

మిలన్ లో మూడు ముఖ్యమైన, వృక్షాలు, చెట్లు కలిగిన వృక్షశాస్త్రమునకు సంబంధించిన తోటలు ఉన్నాయి: ఆర్టో బొటనికో డిడట్టికో స్పేరిమెంటల్ డెల్'యునివేర్సిటా డి మిలానో (ఇన్స్టి ట్యూటో డి సైన్జే బొటానికే ఆధ్వర్యములో నడుస్తున్న ఒక చిన్న ఉద్యానవనము), ఆర్టో బొటానికో డి బ్రెర ( ఆస్ట్రియా చక్రవర్తిణి మరియా తెరెసా ఆదేశాల మేరకు మటాతిపతి ఫుల్జెంజియో విట్మన్ 1774లో స్థాపించిన మరొక ఉద్యానవనం. అనేక సంవత్సరాలు పట్టించుకోకుండా వదిలేసిన తరువాత 1998లో పునర్నిర్మించబడినది) మరియు ఆర్టో బొటానికో డి కాస్కినా రోసా.

2003 జనవరి 23 న మోంటే స్టెల్లా లో మానవజాతికి వ్యతిరేకంగా చేసే కుట్రలని, మారణకాండలని వ్యతిరేకించిన వారిని నివాళులు అర్పిస్తూ వారి గుర్తుగా గార్డెన్ అఫ్ ది రైటియస్ స్థాపించబడింది. మోషే బెజ్స్కి, అన్డ్రే సకరోవ్, లకు అంకితం చేయబడిన వృక్షాలు ఇక్కడ ఉన్నాయి. వీరు యెరెవన్, సారజేవో, స్వేట్లన బ్రోజ్, పియట్రో కుసియుకియాన్ మరియు ఇతర ప్రాంతాలలో ఈ గార్డెన్ అఫ్ ది రైటియస్ లను స్థాపించినవారు. ఒక "ఉత్తముడైన" వ్యక్తిని గౌరవించే పనిని ప్రతి సంవత్సరం గొప్ప వ్యక్తులు సభ్యులుగా ఉన్న ఒక కమిషన్ నిర్ణయిస్తుంది.

జనాభా విశేషాలు[మార్చు]

పియజ్జ డెల్ డ్యూమో లోని వివిధ ప్రజలు మిలన్ లోని 14% జనం విదేశాలలో జన్మించినవారు కాబట్టి, ఈ నగరము ఇటలీ యొక్క అత్యుత్తమ కాస్మోపాలిటన్ నగరాలలో ఒకటిగానూ మరియు దేశములోనే అత్యధికంగా వలస ప్రజల సమాజము కలిగిన నగరాలలో ఒకటిగానూ ఉంది. వలస ప్రజలలోని అధిక భాగము ఉత్తర ఆఫ్రికా, తూర్పు యూరోపు మరియు సుదూర తూర్పు ఆసియా దేశాలకు చెందినవారయినా ఇతర దేశాల నుండి వచ్చిన ప్రజా సమూహాలు మరియు అనేక వలస ప్రజానీకము కూడా ఉన్నారు.
జనాభా వివరాలు
సంవత్సరము జనాభా   ±%  
1861 2,67,618 —    
1871 2,90,514 +8.6%
1881 3,54,041 +21.9%
1901 5,38,478 +52.1%
1911 7,01,401 +30.3%
1921 8,18,148 +16.6%
1931 9,60,660 +17.4%
1936 11,15,768 +16.1%
1951 12,74,154 +14.2%
1961 15,82,421 +24.2%
1971 17,32,000 +9.5%
1981 16,04,773 −7.3%
1991 13,69,231 −14.7%
2001 12,56,211 −8.3%
2009 Est. 13,01,394 +3.6%
Source: ISTAT 2001

ఏప్రిల్ 2009 నాటికి ఈ నగర జనాభా 1,301,394. 1971లో జనాభా ఉచ్చానికి చేరినప్పటి నుండి, నగర జనాభా సుమారు మూడవవంతు తగ్గింది. గత మూడు దశాబ్దాలుగా పారిశ్రామికీకరణం తగ్గుతూ ఉన్నందున జనము నగరపరిసర ప్రాంతాలకు తరలిపోవటమే దీనికి ముఖ్య కారణము. మిలన్ నగర ప్రాంతము, నగర పరిపాలక ప్రావిన్స్ రెండు దాదాపు ఒకటే. ఇది 4.3 మిలియను జనాభా కలిగి E.U. లోనే ఐదవ పెద్ద నగర ప్రాంతముగా ఉంది. నగరము యొక్క పరిసర ప్రాంతాలు అభివృద్ది చెందటము, 1950-60ల నాటి ఆర్ధిక పెరుగుదల తరువాత నగరము చుట్టూ ఏర్పడిన స్థావరాలు వంటి కారణాలు మిలన్ మెట్రోపాలిటన్ ప్రాంతం యొక్క జనాభా తీరు మారడానికి కారాణాలు. జనాభా మార్పుల బట్టి, నగరము యొక్క సామాజిక మరియు ఆర్ధిక సంబంధాలు నగర పరిధిని దాటి విస్తరించాయని అర్ధం అవుతుంది. ప్రస్తుతం మిలన్ మెట్రోపాలిటన్ ప్రాంతం యొక్క జనాభా 7.4 మిలియనుకు పెరిగి లంబార్ది ప్రాంతపు నడుమ భాగములోనికి విస్తరించింది.[49][50] మిలన్ మెట్రోపాలిటన్ ప్రాంతం, ఐరోపా లోని అత్యధిక జనాభా మరియు పరిశ్రమలు కలిగి ఉన్న బ్లూ బనానా అని పిలవబడుతున్న ప్రాంతములోని భాగము అని చెప్పబడుతుంది.[51]

వలస వచ్చి స్థిరపడినవారు[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధం మిగిసిన తరువాత, మిలన్ కు రెండు సార్లు అధిక సంఖ్యలో ప్రజలు వలస వచ్చారు. మొదటి సారి ఇటలీదేశమునుండే వస్తే, రెండవ సారి ద్వీపకల్పం బైట ప్రాంతం నుండి వచ్చారు. ఈ రెండు విడతల వలసలు రెండు వేరు వేరు ఆర్ధిక దశలలో జరిగాయి. తొలి విడతలోని వలస, 1950ల మరియు 1960 లలో సాంప్రదాయక పరిశ్రమలు మరియు ప్రజా హితమైన పనులు ఆధారంగా సాధించిన అసాధారణ అభివృద్ది కారణంగా జరిగింది. దీనికి విరుద్ధమైన ఆర్ధిక వ్యవస్థ నెలకొన్నప్పుడు రెండవ దఫా వలస రావడం జరిగింది. ఈ సమయములో సేవలు, లఘు పరిశ్రమలు మరియు పారిశ్రామిక అభివృద్ది తదనంతరం జరిగే మార్పుల ఆధారంగా జరిగింది. మొదటి దఫా వలస వచ్చిన ఇటలీ వాసులు, గ్రామాలనుండి, కొండప్రాంతాలనుండి మరియు దక్షిణ, తూర్పు దిశలో ఉన్న నగరాలనుండి లేదా ఇతర లోమ్బర్ది ప్రావిన్సుల నుండి వచ్చారు. రెండవ దఫా వచ్చిన ఇటలీకి చెందని వారు, రక రకాల దేశాలునుంది వచ్చారు. ముఖ్యంగా, ఉత్తర ఆఫ్రికా, సబ్-సహారన్ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, మధ్య అమెరికా, కారిబ్బియన్, దక్షిణ అమెరికా, ఆసియా, ఒషానియా, మరియు తూర్పు ఐరోపా నుండి వచ్చారు. 1990ల చివరిలో, మిలన్ లో విదేశాలనుండి వలస వచ్చిన వారు 10% మంది ఉన్నారు. వీరిలో అధిక భాగం చిరు ఉద్యోగులుగా పనిచేస్తూ ఉండేవారు (హోటల్ పనివారు, శుభ్రం చేసేవారు, పని మనుషులు, ఇంటిపని చేసే వారు) లేదా కర్మాగారాల్లో పని చేసేవారు.[52] విదేశాలలో జన్మించి మిలన్ కు వలస వచ్చిన వారి సంఖ్య జనవరి 2009 నాటికి 181,393 అని, అనగా మొత్తము జనాభాలో 14% అని, ఇటలీ యొక్క దేశీయ గణాంకాల సంస్థ ISTAT వారి అంచనా తెలిపింది.[5]

మిలన్ లో ఉన్న చైనా వాసులు సమాజం కూడా ముఖ్యమైనది. వీరు ఎక్కువగా నివసిస్తున్న, "మిలన్ చైనాటౌన్" అని తరచుగా పిలవబడే వయ పవోల సర్పి ప్రాంతము 1930 లలో స్థాపించబడింది.ఇదే ఇటలీ లో ఉన్న అతి పురాతనమైన, అతి ముఖ్యమైన మరియు అతి పెద్దదైన చైనీయుల ప్రాంతము.

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

మిలన్ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాపార మరియు ఆర్ధిక కేంద్రాలలో ఒకటి. 2004లో మిలన్ యొక్క GDP € 241.2 బిలియను (US$ 312.3 బిలియను)[53]గా ఉంది. మిలన్ మెట్రోపాలిటన్ ప్రాంతము GDPలో ఐరోపాలో 4వ స్థానం లో ఉంది: మిలన్ కనుక ఒక దేశమైతే, అది ప్రపంచంలోనే ఇరవై ఎనిమేదో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ గా, దాదాపు ఆస్ట్రేలియా మాదిరిగా ఉండేది.[54]

మధ్య మిలన్ లో ఉన్న రద్దీగా ఉన్న పిజ్జాలే కొర్డుసియో అనే వాణిజ్య కేంద్రం. ప్రధాన పోస్ట్ ఆఫీస్, క్రెడిటో ఇతలియనో యొక్క రాజభవనము, అస్సికుర్జ్జియోని గేనేరాలి అనే అతి పెద్ద సంస్థ యొక్క ప్రధాన న్కార్యలయం వంటి అనేక ముఖ్యమైన భవనాలు ఇక్కడి ఉన్నాయి. ఇది కూడా పాత మిలన్ స్టాక్ ఏక్స్చంజ్ యొక్క సైట్.

ఈ నగరములోనే ఇటలీ స్టాక్ ఎక్స్చేంజ్ (బోర్స ఇటలీ యానా) ఉంది. పరిసర ప్రాంతము, ఇటలీ లోనే అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతము. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యుషన్కు చెందిన పీటర్ జే. టైలర్ మరియు రాబర్ట్ ఈ. లాంగ్, "'ప్రపంచ నగరాల నెట్వర్క్' లో U.S. నగరాలు" (కీ ఫైన్డిన్గ్స్Full Report PDF (940 KB)) అనే తమ ఆర్ధిక నివేదికలో, పది ఆల్ఫా ప్రపంచ నగరాల జాబితాలో మాడ్రిడ్, సియోల్, మోస్చో, బ్రస్సేల్స్, టోరాన్టో, ముంబై, బ్యూనస్ ఎయర్స్, కౌలాలంపూర్ నగరాలతో పాటు మిలన్ ని చేర్చారు.

12వ శతాబ్దము చివరిలో కళారంగం బాగుగా వికసించింది. కవచము తయారీలో అతి ముఖ్యమైన పరిశ్రమగా భాసిల్లింది. ఈ కాలములోనే లోమ్బార్డ్ ప్రదేశానికి నీటిపారుదల ఏర్పాటులు ప్రారంభమయి, ఆ సమతల ప్రదేశాన్ని సారవంతమైన తోటగా మార్చివేశాయి. ఉన్ని వర్తకము అభివృద్ది చెందడముతో, పట్టు తయారీకి పునాదిగా నిలిచింది.

వెనిస్, ఫ్లోరెన్స్ ల మాదిరిగా, విలాస వస్తువుల తయారీ అతి ముఖ్యమైన పరిశ్రమగా నిలిచింది. దీనివల్ల 16వ శతాబ్దములో ఈ నగరము "మిలనేర్ ” లేదా “మిల్లనేర్ ” అనే ఆంగ్ల పదాలకు మూలంగా నిలిచింది. ఈ పదాలకు నగలు, వస్త్రాలు, టోపీలు, ఖరీదైన విలాస వస్త్రాలు వంటి సున్నితమైన మరియు చక్కనైన వస్తువలు అని అర్ధము. 19వ శతాబ్దము నాటికి, టోపీలని చేసేవారు లేదా అమ్మేవారు అనే అర్ధము గల “మిల్లినేరి” అనే మరొక పదం వాడుకలోకి వచ్చింది.

ఉత్తర ఐరోపా లో జరిగిన పారిశ్రామిక విప్లవం, మిలన్ ఉత్తర ప్రాంతానికి క్రొత్త ప్రాముఖ్యత తెచ్చింది. ఈ ప్రాంతము, ఆల్ప్స్ మీదగా సరుకు రవాణా చేసే వర్తక మార్గములో ఉంది. అనేక నదులు, సరస్సుల నీరు యొక్క శక్తిపై ఆధారపడిన మిల్లులు ఇక్కడ నిర్మించబడ్డాయి.

19వ శతాబ్దము మధ్యలో, ఆసియా నుండి చౌకైన పట్టు దిగుమతి ప్రారంభమయింది. ఫిల్లోక్జేరా అనే పురుగు పట్టు మరియు వైన్ తయారీని నాశనం చేసింది. ఆ తరువాత పారిశ్రమీకరణకు మరి కొంత భూమి ఈయబడింది. వస్త్రాల తయారీ మొదలయి, తరువాత లోహాలు, యంత్రాలు మరియు సామాను తయారీ మొదలయ్యాయి.

ఈ రోజు బట్టలు మరియు దుస్తులు, వాహనాలు (ఆల్ఫా రోమియో), రసాయన పదార్థాలు, పారిశ్రామిక ఉపకరణాలు, భారీ యంత్రాలు, పుస్తకాల మరియు సంగీత ప్రచురణలు వంటి అంశాలకు మిలన్ ఒక ముఖ్య కేంద్రంగా ఉంది.

ఫియరమిలానో అనే ప్రదర్శనా కేంద్రములో, "ఫియరమిలానోసిటీ " అని పిలవబడిన ఒక ప్రదర్శనా మైదానము ఉండేది. నగరము నడుమన ఉన్నందున, సిటిలైఫ్ అనే నగర అభివృద్ది కార్యక్రమము కొరకు కొన్ని ఆసక్తికర భవనాలు ('20 లలో కట్టబడిన సైకిల్ క్రీడా స్టేడియంతో సహా) మాత్రమే మిగిల్చి, మిగతా ప్రదర్శనా కేంద్రం మొత్తం కూల్చివేయబడింది. రో యొక్క వాయువ్య దిశలో ఉన్న నగర పరిసర ప్రాంతంలో ఒక క్రొత్త ప్రదర్శనా మైదానము ఏప్రిల్ 2005 లో ప్రారంభించబడింది. ఈ ఫియర మిలానో ప్రపంచములోనే అతి పెద్ద వర్తక ప్రదర్శనా భవన సముదాయము.

మిలన్ మరియు భవిష్యత్తు[మార్చు]

దస్త్రం:Expo2015Milan.jpg
ఎక్స్పో 2015 లోగో

మిలన్ నగరము ప్రస్తుతం పునఃరూపకల్పన దశలో ఉంది. పరిసరాలలో వాడుకలో లేని పారిశ్రామిక ప్రాంతాలను మరల ఉపయోగించుకోవడానికి వీలుగా క్రొత్త నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. టియట్రో అల్లా స్కాలకు అదనపు మార్పులు; పాత "ఫియర" స్థలములో సిటిలైఫ్ పధకము; సాంటా గియులియ అనే క్రొత్త నివాస గృహాలు; గరిబాల్ది-రిపబ్లికా ప్రాంతములో పోర్త న్యోవా పధకం వంటివి ఈ పధక రచనలో ఉన్నాయి. రెంజో పియానో, నార్మన్ ఫోస్టర్, జాహ హడిడ్, మస్సిమిలియనో ఫుక్సాస్, డానియల్ లిబెస్కిండ్ వంటి ఎందరో ప్రసిద్ధ వాస్తుకళానిపుణులు ఈ పధకములో పాల్గొంటున్నారు. ఈ పధకము పూర్తి అయినప్పుడు, మిలన్ యొక్క రూపురేఖలే మారిపోతాయి. ఇప్పుడు ఉన్నట్లు డ్యూమో మరియు పిరెల్లి టవర్లు మిలన్ లోని ఆకాశ హర్మ్యాలుగా భాసిల్లటం అసాధ్యం.

ఈ ఆధునీకరణ తరువాత క్రొత్త రూపం దాల్చిన మిలన్ నగరం Expo 2015కు త్వరలో ఆతిధ్యం ఈయబోతుంది.

అంతర్జాతీయ హొదా[మార్చు]

ప్రపంచ సిటి పవర్ సూచిక ప్రకారము, 2008 సంవత్సరములో మిలన్ ఇరవై ఏడవ అతి శక్తివంతమైన నగరముగా పేర్కొనబడింది. 2009లో 203.5 స్కోర్ తో ఇరవై తొమ్మిదవ స్థానంలో, బీజింగ్, కౌలాలంపూర్ తరువాతి స్థానంలో ఉంది. అయితే బాంగ్ కాక్, [[ఫుకుయోక(/0), టైపేయ్, మాస్కో ల కంటే ముందు ఉంది.|ఫుకుయోక(/0), టైపేయ్, మాస్కో ల కంటే ముందు ఉంది.[10]]] ఈ అధ్యయనములో వివిధ రంగాలలో ప్రపంచములో మిలన్ యొక్క స్థాయి ఈ విధముగా ఉంది. ఆర్ధిక వ్యవస్థలో 29వ స్థానం, R&D లో 30వ స్థానం, సాంస్కృతిక కార్యకలాపాలలో 18వ స్థానం, సుఖ జీవనంలో 18వ స్థానం, పర్యావరణ విషయాలలో 27వ స్థానం మరియు అందుబాటులో ఉండటంలో 15వ స్థానములోనూ ఉంది.[10]

నివసించగలిగే వాతావరణము (లివబిలిటి) మరియు విలక్షణ వ్యక్తిగత వాతావరణముకు సంబంధించిన గణాంకాలలో ఈ నగరమ ఐరోపాలో నిర్వాహణలో 12వ స్థానమును, పరిశోధనలో 13వ స్థానమును, కళ మరియు పర్యాటక అవకాశాలలో 8వ స్థానమును మరియు నివాస యోగ్యతలో ఐరోపాలో 11వ ఉత్తమ నగరముగా మిలన్ నిలిచింది.[10]

పర్యాటకం[మార్చు]

అందమైన బ్రేరా ప్రాంతం అందలి పలజ్జో బెక్కరియ యొక్క దృశ్యము యాత్రికులకు ఎంతో ఆసక్తికరమైనది మరియు తరచుగా దర్శించే స్థలములలో ఒకటి.

EU లోని అతి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో మిలన్ ఒకటి; 2007లో 1.902 మిలియను మరియు 2008లో 1.914 మిలియను పర్యాటకులు మిలన్ కు వచ్చారు. ఈ రెండు సంవత్సరాలలో మిలన్ ప్రపంచంలోనే అత్యధికంగా పర్యాటకులు సందర్శించిన నగరాలలో 42వ మరియు 52వ స్థానాలలో ఉంది.[12] ఒక విశేషమైన నివేదిక ప్రకారం, మిలన్ కు వచ్చే అంతర్జాతీయ పర్యాటకులలో 56% ఐరోపా నుండి వస్తే 44% ఇటలీ నుండి వచ్చారు. 56% విదేశాలనుండి వచ్చారు.[46] అతి ముఖ్యమైనవి యురోపియన్ యునియన్ మార్కెట్ లు, యునైటెడ్ కింగ్డం (16%), జర్మనీ (9%) మరియు ఫ్రాన్సు (6%).[46] USA నుండి మిలన్ కు వచ్చేవారిలో అనేక మంది పని నిమిత్తం వస్తారని, చైనా మరియు జపాన్ నుండి వచ్చేవారు విరామం కోసం వస్తారని అదే అధ్యయనం చెపుతుంది.[46] ఈ నగరములో పర్యాటకులని ఆకర్షించే అనేక స్థలాలు ఉన్నాయి. వాటిలో కొన్ని, డ్యోమో, పియాజా, టియట్రో అల్లా స్కాల, సాన్ సిరో స్టేడియం, గల్లెరియ విట్టోరియో ఇమన్య్వేల్ II, కాస్టెల్లో స్ఫోర్జేస్కో, పినకోటేకా డి బ్రెర మరియు వయ మొన్టేనాపోలియోన్. అనేక మంది పర్యాటకులు మిలన్ కాథడ్రల్, కాస్టెల్లో స్ఫోర్జేస్కో, టియట్రో అల్లా స్కాలని సందర్శిస్తారు. బెసిలికా అఫ్ సంట్' అంబ్రోగియో, నవిగ్లి, బ్రెర అకాడెమీ మరియు జిల్లా వంటివి ఇతర ముఖ్యమైన స్థలాలు. వీటిని తక్కువ మంది మాత్రమే సందర్శిస్తారు కాబట్టి ఇవి తక్కువ ప్రాచుర్యమైనవని భావము.[46] నగరములో అనేక హోటల్ లు ఉన్నాయి. సొసైటి జేనేరెల్ డి సర్వేయ్లెన్స్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం, ప్రపంచంలోనే మొట్టమదటి ఏడు-నక్షత్ర హోటల్ అయిన టౌన్ హౌస్ గల్లెరియ ఇక్కడే ఉంది. ఈ అత్యధిక విలాసవంతమైన హోటల్ ప్రపంచంలోనే అతి గొప్ప హోటల్ లలో ఒకటి.[55] మిలన్ లో అనేక బోటిక్ లేదా ఫేషన్ హోటల్ లు ఉన్నాయి. అర్మని వరల్డ్ అనే ఇటువంటి ఒక క్రొత్త హోటల్, 2010 లో ప్రారంభం కానున్నది. ఇది ఒక 1930 నాటి భవనములో స్థాపించబడిన అతి పెద్ద హోటల్. ఇది వయ మంజోని లో (వయ మొన్టేనాపోలియోన్ ఫాషన్ జిల్లా) లో ఉంది. ఈ హోటల్ అర్మని పద్ధతిలో కట్టబడి, ఇందులో 95 గదులు ఉండాలని యోచిస్తున్నారు.[56] చారిత్రాత్మక గ్రాండ్ హోటల్ ఎట్ డి మిలన్ (ఇక్కడే గియుసేప్ వెర్డి మరణించాడు), హోటల్ ఫోర్ సీసన్స్, పియాజా డుక డి'అవోస్ట లో ఉన్న స్టేషను గ్రాండ్ హోటల్ గాల్లియా వంటి ఇతర పేరుపొందిన హోటల్ లు మిలన్ లో ఉన్నాయి.

సగటుగా ఒక పర్యాటకుడు మిలన్ లో 3.43 రాత్రులు గడుపుతాడు. విదేశీయులు ఇంకా ఎక్కువ రోజులు గడుపుతారు. వీరిలో 77% మంది సగటుగా 2 నుండి 5 రాత్రులు మిలన్ లో గడుపుతారు.[46] హోటల్ లో బస చేసే సందర్శకులలో అత్యధికమైన వారు 4-నక్షత్ర హోటల్ లలో ఉండటానికి ఇష్టపడుతున్నారు(47%). 5-నక్షత్ర హోటల్ లలో 11% మంది మరియు 3-నక్షత్రాలకంటే తక్కువ హోటల్ లలో 15% మంది ఉంటున్నారు.

సంస్కృతి[మార్చు]

ఉపమాన కళ[మార్చు]

రాఫెల్, పినకటేకా డి బ్రెర యొక్క మ్యారేజ్ అఫ్ ది వర్జిన్
లియోనార్డో యొక్క ది లాస్ట్ సప్పెర్.

శతాబ్దాల పాటు మిలన్ ఒక ముఖ్యమైన కళా కేంద్రంగా ఉండేది. అనేక కళా సంస్థలు, అకాడమీలు, గ్యాలరీలు బ్రెర అకాడమీ, పినసోటేక అంబ్రోసియాన వంటివి) నగరములో ఉన్నాయి.

మధ్యయుగ కాలములో మిలన్ లో కళలు ఎంతో వికసిల్లాయి. విస్కోంటి కుటుంబం గొప్ప కళాపోషకులుగా ఉన్నందున, నగరము గోతిక్ కళ మరియు భవననిర్మాణ కళలకు ఒక ముఖ్య కేంద్రమయింది. మిలన్ కేథడ్రల్ మిలన్ యొక్క గోతిక్ భవన నిర్మాణ కళకు గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది.[57] ఇంకా 14వ నుండి 15వ శతాబ్దాల మధ్య స్ఫోర్జా కుటుంబ పాలనలో మరొక మారు మిలన్ లో కళ మరియు భవననిర్మాణ కళలు వికసించాయి. స్ఫోర్జా కోట లో రాజసం ఒలికించు రేనైసన్స్ దర్బార్ సృష్టించగా, ఫిలరేట్ రూపకల్పన చేసిన ఒస్పెడేల్ మగ్గియోర్ అనే ప్రజా వైద్యశాల వంటి గొప్ప నిర్మాణాలు నిర్మించబడ్డాయి. లియోనార్డో డా విన్సి అంతటి గొప్ప కళాకారులు మిలన్ కు వచ్చి పనిచేసి లాస్ట్ సప్పర్, కోడెక్స్ అట్లాన్టికస్ వంటి వెలలేని అధ్బుత సృష్టులను రూపొందించారు.[58] బ్రమంటే కూడా మిలన్ కు వచ్చి కొన్ని అతి సౌందర్యమైన చర్చిలని నిర్మించారు; సంట మరియా డెల్లె గ్రజీ లో అందమైన ప్రకాశించే గొప్ప భవనము బ్రమంటే నిర్మంచినదే. అలాగే, సంట మరియా ప్రేస్సో శాం సటిరో చర్చి కూడా అతను నిర్మించినదే.

17వ మరియు 18వ శతాబ్దాలలో మిలన్ నగరము బరోక్ ప్రభావితమై, కరావగ్గియో వంటి అనేక ఆనాటి గొప్ప కళాకారులు, భవననిర్మాణ కళాకారులు, చిత్ర కళాకారులను ఆకర్షించింది. కరావగ్గియో యొక్క "బాస్కెట్ అఫ్ ఫ్రూట్ " అనే అధ్బుత బరోక్ సృష్టి మిలన్ లోని బిబ్లియోటేకా అంబ్రోసియానా లోనూ, అతని "సప్పర్ అట్ ఏమ్మాస్ " బ్రెర అకాడెమి లోనూ ఉన్నాయి.[57] రొమాంటిక్ కాలములో మిలన్ ఒక ముఖ్య ఐరోపా కళా కేంద్రంగా ఉండేది. ఆ సమయములో మిలన్ ని పాలిస్తున్న ఆస్ట్రియా వారి ప్రభావం మిలనీస్ రొమాంటిక్ మీద ఉండేది. బహుశా మిలన్ లో ఉన్న అతి ముఖ్యమైన రొమాంటిక్ చిత్రమైన ఫ్రాన్సేస్కో హఎస్ యొక్క "ద కిస్ " ఇప్పుడు బ్రెర అకాడమీ లో ఉంది.[57]

తరువాత 20వ శతాబ్దము లో మిలన్ మరియు ఇటలీ మొత్తం మీద ఫ్యుచరిసం ప్రభావం పడింది. ఇటలీ యన్ ఫ్యుచరిసంని స్థాపించిన ఫిలిప్పో మరినేట్టి, 1909లో రాసిన "ఫ్యుచరిస్ట్ మానిఫెస్టో " (ఇటలీ యన్ భాషలో మానిఫెస్టో ఫ్యుచరిస్టికో )) అనే పుస్తకములో ఈ విధంగా వ్రాశారు: మిలన్ "గ్రాండే ...ట్రేడిషనేల్ ఇ ఫ్యుచరిస్టా " (ఆంగ్లంలో "గొప్ప ...సాంప్రదాయమైన మరియు భవిష్యత్తుగల "). అమ్బెర్టో బోస్సియోని కూడా నగరములో ఒక ముఖ్యమైన భవిష్యత్తు కళాకారుడు.[57] ఈ రోజు మిలన్, అనేక ఆధునిక ప్రదర్శనలతో, భవిష్యత్తు మరియు సమకాలీన కళకు ఒక పెద్ద అంతర్జాతీయ వేదికగా నిలుస్తుంది.[57]

రూపకల్పన[మార్చు]

దస్త్రం:SofaDueFoglie.png
గియో పొంటి యొక్క డ్యు ఫోగ్లీ సోఫా

పరిశ్రమల మరియు ఆధునిక రూపకల్పనలో అంతర్జాతీయ రాజధానులలో ఒకటిగా మిలన్ ఉంటుంది. ఈ రంగాలలో ప్రపంచంలోనే అత్యధికంగా ప్రభావితం చేసే నగరాలలో ఒకటిగా మిలన్ భావించబడుతుంది.[59] అత్యుత్తమ నాణ్యత కలిగిన పురాతన మరియు ఆధునిక సామగ్రి మరియు పారిశ్రామిక వస్తువులు తయారీలో మిలన్ కు విశేషమైన ప్రఖ్యాతి ఉంది.

ఐరోపా లోనే అతి పెద్దదైన మరియు ప్రపంచంలోనే గొప్ప ప్రతిష్ఠాత్మికమైన సామగ్రి మరియు రూపకల్పన రంగ ప్రదర్శనలలో ఒకటైన ఫియరమిలనో ప్రదర్శన మిలన్ లోనే జరుగుతుంది.[59] "ఫ్యువోరి సలోన్ ", "సలోన్ డెల్ మొబైల్ " వంటి అతి పెద్ద రూపకల్పన మరియు భవననిర్మాణ కళకు సంబంధించిన ఘటనలు మిలన్ లో జరుగుతాయి.

1950లు మరియు 60లలో ఇటలీ యొక్క ముఖ్య పారిశ్రామిక కేంద్రముగా మిలన్ ఉండేది. ఐరోపాలోని అత్యుత్తమ అభ్యుదయ మరియు చైతన్యవంతమైన నగరాలలో ట్యురిన్తో పాటు మిలన్ కూడా యుద్ధానంతరం ఇటలీ యొక్క రూపకల్పన మరియు భావననిర్మాణకళా రంగాలకు రాజధానికి ఉండేది.


పైరేల్లి టవర్, టోర్రె వెలస్క వంటి ఆకాశహర్మ్యాలు నిర్మించబడ్డాయి. బ్రునో మునారి, లుషియో ఫోన్టన, ఎన్రికో కాస్టేల్లాని, పియరో మంజోని వంటి ఎంతో మంది గొప్ప భవననిర్మాణ కళాకారులు ఈ నగరములో ఉండటం కానీ పని చేయటం కానీ జరిగింది.[60]

సాహిత్యం[మార్చు]

అలెస్సండ్రో మంజోని.

18వ శతాబ్దము చివరలో మరియు 19వ శాతాబ్ధమంతటా వివేకముతో కూడిన చర్చలు మరియు సాహిత్యములో క్రొత్తదనమునకు మిలన్ ఒక ముఖ్య నెలవుగా ఉండేది. జ్ఞానోదయము ప్రాప్తించుటకు మిలన్ ఒక సారవంతమైన ప్రదేశముగా ఉండేది. సిసేర్, బెక్కారియ యొక్క మార్కిస్, ప్రసిద్ధి చెందిన అతని డే డెలిట్టి ఈ డెల్లె పెన్ మరియు కౌంట్ పియట్రో వెర్రి మరియు Il కఫే అనే సంచిక ద్వారా క్రొత్తగా ఆవిర్భవిస్తున్న మధ్య తరగతి సంస్కృతి మీద అమిత ప్రభావం చూపించగలిగారు. దీనికి విశాల భావన కలిగి ఉన్న అప్పటి ఆస్ట్రియన్ పరిపాలన కూడా తోడ్పడింది. 19వ శతాబ్ద మొదట్లో రొమాంటిక్ ఉద్యమం యొక్క సిద్ధాంతాలు నగర సాంస్కృతిక జీవితం మీద ప్రభావం చూపించాయి. ఈ నగరములోని పెద్ద రచయితలు సాంప్రదాయక కవిత్వం, రొమాంటిక్ కవిత్వం వీటిలో గొప్పది ఏది అని వాదించేవారు. ఇక్కడ కూడా గియసేప్ పరిని, మరియు యుగో ఫోస్కోలో వాళ్ల అతి ముఖ్యమైన కవిత్వాలను ప్రచురించారు. వీరిని నైతిక గురువులని, సాహిత్య నిపుణులని యువ కవులు ఎంతో ఆరాధించేవారు. ఫోస్కోలో యొక్క కవిత డెయి సేపోల్క్రి నగరవాసుల అనేక మంది ఇష్టానికి వ్యతిరేకంగా ఈ నగరానికి అన్వయించి, అమలు చేయబడిన ఒక నెపోలియన్ చట్టమే ఈ కవిత్వానికి ప్రేరణ.

19వ శాతాబ్ధపు మూడో దశాబ్దములో అలెస్సండ్రో మంజోని, ఐ ప్రోమేస్సి స్పోసి, అనే నవలని వ్రాశారు. ఇది, మిలన్ కేంద్రంగా ఉన్న ఇటలీ యన్ రోమాంటిసిసం యొక్క మానిఫెస్టో అని భావించబడుతున్నది. రొమాంటిక్ కవిత్వం వ్రాసి, రాజాకీయాల్లో దేశభక్తి చూపించిన సిల్వియో పెల్లికో, గియోవన్ని బెర్చేట్, లుడోవికో డి బ్రేమే వంటి వారి రచనలు ఇల్ కన్సిలియేటర్ అనే సంచికలో ప్రచురించబడేవి.

1861లో ఇటలీ ఐక్యత అనంతరం, మిలన్ రాజకీయ ప్రాముఖ్యత అంతరించింది; అయినప్పటికీ, సాంస్కృతిక వాదనలకు మిలన్ ఒక ముఖ్య కేంద్రంగా కొనసాగింది. ఇతర ఐరోపా దేశాలనుండి కొత్త ఆలోచనలు, ఉద్యమాలు ఆమోదించబడి, చర్చించబడ్డాయి; రియలిజం, నాచ్యురలిజం వంటి ఆలోచనలు వెరిస్మో అనే ఒక ఇటలీ ఉద్యమం ఏర్పడటానికి దారి తీసింది. గియోవన్ని వేర్గ అనే గొప్ప వేరిస్టా నవలా రచయిత సిసిలీ లో జన్మించారు. అయితే మిలన్ లోనే తన అతి ముఖ్యమైన పుస్తకాలని వ్రాశారు.

సంగీతం మరియు ప్రదర్శక కళలు[మార్చు]

ప్రతిష్ఠాత్మకమైన లా సకలా ఒపేరా హౌస్ యొక్క లోపలి దృశ్యం

ప్రదర్శక కళకు, ముఖ్యంగా ఓపేరాకు ఒక పెద్ద దేశీయ మరియు అంతర్జాతీయ కేంద్రంగా మిలన్ ఉంది. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఒపేరా హౌస్ లలో ఒకటైన ల స్కాలా ఒపేరా హౌస్ మిలన్ లోనే ఉంది. అంతే కాక, చరిత్రలో, ఇంకా అనేక ఓపెరా ల ఆరంగేట్రాలు కూడా మిలన్ లోని ఈ ఓపెరా హౌస్ లోనే జరిగాయి. 1842లో గియసేప్ వెర్డి యొక్క నబుక్కో, 1904లో అమిల్కారే పొంచియెల్లి యొక్క ల గియోకొండ మరియు గియకోమో పుస్సిని యొక్క మేడమ్ బటర్ ఫ్లై, 1926లో గియకోమో పుస్సిని యొక్క ట్యురండోట్ మరియు ఈ మధ్య కాలములో 2007లో ఫాబియో వచ్చి యొక్క టేనేకే వంటి ఓపెరాలు మిలాన్లో జరిగిన వానిలో కొన్ని. మిలన్ లో ఉన్న ఇతర పెద్ద ధియేటర్ లలో కొన్ని, టియట్రో దేగ్లి అర్కిమ్బోల్ది, టియట్రో దాల్ వేర్మే, టియట్రో లిరికో (మిలన్), టియట్రో రేజియో డ్యుకల్. ఈ నగరములో ప్రఖ్యాతి చెందిన సింఫనీ ఆర్కెస్ట్రా మరియు మ్యూసికల్ కన్సర్వేటరి ఉన్నాయి; చరిత్ర అంతటా మిలన్ సంగీతానికి ఒక పెద్ద కేంద్రంగా ఉంటూ వస్తుంది: గియోసేప్ కైమో, సైమన్ బోయ్లయు, హోస్టె డా రేగ్గియో, వెర్డి, గియులియో గట్టి-కాసస్సా, పోలో చేరిసి, యాలిస్ ఈడున్ వంటి అనేక ప్రసిద్ధ సంగీత రచయితలు, సంగీత విద్వాంసులు మిలన్ లోనే ఉన్నారు లేదా ఉండేవారు. లేదా మిలన్ ని తమ నివాసంగా చెపుతారు లేదా చెప్పేవారు. డైనమిస్ ఎన్సేమ్బెల్, స్టార్మి సిక్స్, కామరేటా మీడియోలనేన్స్ వంటి అనేక ఆధునిక ఎన్సేమ్బెల్ లు, బాండ్ లు ఈ నగరములో ఏర్పడ్డాయి.

ఫ్యాషన్[మార్చు]

"మిలన్ ఫేషన్ చతుర్బుజం" వీదులలో ఒకటైన కోర్సో వేనేజియ
మిలన్ లోని మరొక షాపింగ్ వీధి అయిన వయ డాంటే. ఇది పియజ్జెల్ కొర్డుసియోను కాస్టెల్లో స్ఫోర్జెస్కో

న్యు యార్క్, పారిస్, రోం, లండన్ లతో పాటు మిలన్ కూడా ప్రపంచ ఫేషన్ రాజధానులలో ఒకటిగా భావించబడుతుంది. ( ప్రతి ఏడాది ప్రపంచ ఫేషన్ రాజధానులని ప్రకటిస్తున్న గ్లోబల్ లాంగ్వేజ్ మోనిటర్ అనే సంస్థ, 2008లో అత్యుత్తమ ఆర్ధిక మీడియా ప్రపంచ ఫేషన్ రాజధానిగా మిలన్ ని పేర్కొంది).[61] వలెన్టినో, గక్కి, వెర్సస్, ప్రాడ, అర్మనీ, డోల్స్ & గబ్బన వంటి ఇటలీ యొక్క పెద్ద ఫేషన్ బ్రాండ్ లకి మిలన్ నగరములోనే స్థాపించబడ్డాయి. అనేక అంతర్జాతీయ ఫేషన్ లేబుల్ లు మిలన్ లో విక్రయ దుకాణాలను నడుపుతున్నాయి. అబెర్క్రోమ్బీ & ఫిట్చ్ యొక్క ప్రతిష్ఠాత్మిక విక్రయశాల మిలన్ లో ముఖ్య ఆకర్షణగా మారింది. పారిస్, లండన్, టోక్యో, న్యు యార్క్ వంటి ఇతర అంతర్జాతీయ కేంద్రాలు మాదిరిగా ఏడాదికి రెండు సార్లు మిలన్ లో ఫేషన్ వీక్‌లు జరుగుతాయి. "క్వాడ్రిలేటేరో డెల్ల మోడ " (ఫేషన్ క్వాడ్రిలేటరల్ అని అర్ధము) అనే ప్రాంతమే మిలన్ లో ముఖ్య ఫేషన్ జిల్లా. (వయ మొన్టేనపోలియోన్, వయ డెల్ల స్పిగా, వయ సంట్'ఆండ్రీ, [[వయ మంజోని{/1 {1}కోర్సో వేనేజియ]]) వంటి ప్రతిష్ఠాత్మికమైన షాపింగ్ వీధులు ఈ నగరములో ఉన్నాయి. గల్లెరియ విట్టోరియో ఇమాన్యువేల్ II, పియజ్జా డెల్ డ్యుమో, వయ డాంటే, కోర్సో బ్యూనస్ ఎయిర్స్ వంటివి మిలన్ లోని ఇతర ముఖ్య షాపింగ్ వీధులు మరియు ప్రదేశములు. ప్రాడ యొక్క స్థాపకడు అయిన మేరియో ప్రాడ ఇక్కడే జన్మించారు. మిలన్ ని ప్రపంచ ఫేషన్ రాజధానిగా రూపొందించడంలో అతను సహాయపడ్డారు.

ప్రసార సాధనాలు[మార్చు]

మిలన్ అనేక స్థానిక మరియు దేశమంతటికీ సంబంధించిన వార్తా పత్రికలు, సంచికలు, టెలివిజను మరియు రేడియో స్టేషన్ల ద్వారా వార్తా విశేషాలను, సందేశాలను పంపటానికి, వ్యాపారాలను నిర్వహించటానికి ఒక ప్రధాన కేంద్రము వంటిది.

వార్తపత్రికలు[మార్చు]

సంచికలు[మార్చు]

రేడియో స్టేషను లు[మార్చు]

సెలవుదినాలు[మార్చు]

మార్చ్ 18-మార్చ్ 22: 1848 విప్లవం గుర్తింపుగా లేదా మిలన్ యొక్క ఇదు రోజులు

ఏప్రిల్ 25: రెండవ ప్రపంచ యుద్ధ సమయములో జర్మనీ ఆక్రమణ నుండి మిలన్ కు విమోచనం.

డిసెంబరు 7: సెయింట్ అమ్బ్రోసే యొక్క విందు (ఫెస్ట డి సంట్'అంబ్రోగియో ).

డిసెంబరు 12: పియాజ్జా ఫోన్టాన బాంబుదాడుల గుర్తింపుగా

భాష[మార్చు]

పశ్చిమ లోమ్బార్డి లో సుమారుగా మూడులో ఒక వంతు జనాభా, ఇటలీ యన్‌తో పాటు, ఇన్సుబ్రిక్ అని కూడా పిలవబడే పశ్చిమ లోమ్బార్డ్ భాషని కూడా మాట్లాడగలరు. మిలన్ లో కొంత మంది స్వదేశియులు సాంప్రదాయక మిలనీస్ భాషని మాట్లాడగలరు.ఈ భాష పశ్చిమ లోమ్బార్డ్ భాష యొక్క నాగరికపు తీరు. ఇది మిలనీస్ భాష ప్రభావితం చేసిన ఇటలీ యన్ భాష యొక్క ప్రాంతీయ రకము రెండూ ఒకటే అని పొరబడకూడదు.

మతం[మార్చు]

నగరము యొక్క అతి ముఖ్యమైన మరి అతి పాతదైన చర్చిలలో ఒకటైన సంట్'అమ్బ్రోగియో యొక్క బసిలిక.
సెయింట్ లారెన్స్ యొక్క బసిలిక

ఇటలీ లో మాదిరిగానే మిలన్ జనాభా కూడా కథోలిక్ మతాన్నే ఎక్కువగా పాటిస్తున్నారు. రోమన్ కాథలిక్ ఆర్చ్డియోసెస్ అఫ్ మిలన్ కు ఇది స్థావరం . ఇక్కడ పాటిస్తున్న కొన్ని ఇతర మతాలు: ఆర్థోడాక్స్ర్స్ చర్చిలు,[62] బుద్ధిసము,[63] జుడాయిసం,[64] ఇస్లాం[65][66] మరియు ప్రొటెస్టన్టిసం.[67][68]

మిలన్ లో అంబ్రోషియన్ రైట్ (ఇటలీ యన్ భాషలో: రైటో అంబ్రోషియానో ) అనే ఒక చారిత్రాత్మక కాథలిక్ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇది ఒక కాథలిక్ ఆచారానికంటే (ఇతర అన్ని పశ్చిమ ప్రాంతాలలో పాటించబడుతున్న రోమన్ పద్దతి) కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ప్రార్ధనా పద్దతి లోను సమాహిక ఉత్సవాలలోను కాలెండర్ లోను కొద్దిగా తేడాలు ఉన్నాయి (ఉదాహరణకు సాధారణ తేదికి కొద్ది రోజులు తరువాత లెంట్ ప్రారంభ తేది ఉంటుంది. అందువల్ల కార్నివల్ తేది మారుతుంది). లోమ్బార్డి లోని ఇతర పరిసర ప్రాంతాలలోను మరియు టిసినో లోని స్విస్ తాలూకా లోను ఈ అమ్బ్రోషియన్ ఆచారము పాటించబడుతుంది.

ప్రార్ధనా పద్దతి సంగీతంలో ఒక ముఖ్యమైన తేడా ఉంది. మిలన్ మరియు పరిసర ప్రాంతాలలోను గ్రిగోరియన్ పాట పూర్తిగా వాడబడలేదు ఎందుకంటే వారి స్వంత అమ్బ్రోషియన్ అధికార పాటగా వాడబడింది కనుక. దీనిని గ్రెగోరియన్ పాట కంటే ముందుగా కచ్చితంగా ట్రెంట్ కౌన్సిల్ (1545–1563) రూపొందించింది.[69] ఈ సంగీతాన్ని సంరక్షించుకోవడం కొరకు ఒక ప్రత్యేకమైన స్కోల కంటొరం అనే ఒక కళాశాలని మరియు రోం లోని "పొంటిఫిషియల్ అమ్బ్రోశియన్ ఇన్స్టిట్యుట్ అఫ్ సాక్రేడ్ మ్యూసిక్" (PIAMS) భాగస్వామ్యంతో స్థాపించబడ్డాయి [2].

చలనచిత్రం[మార్చు]

అనేక (ముఖ్యంగా ఇటలీ యన్) చలనచిత్రాలు మిలన్ కేంద్రంగా రూపొందించబడ్డాయి. వాటిలో కొన్ని, "కాల్మి కువోరి అప్పస్సియనేటి", "ది ఇంటర్నేషనల్ (చలనచిత్రం)", "లా మల ఆర్డిన", " మిలానో కాలిబ్రో 9", " మిరకిల్ ఇన్ మిలన్", "లా నోట్టే", మరియు " రొక్కో అండ్ హిస్ బ్రదర్స్".

వంటకాలు[మార్చు]

పనేట్టన్, మిలన్ యొక్క సాంప్రదాయక క్రిస్తమస్ కేకు

ఇటలీ లోని అనేక నగరాల లాగే, మిలన్ మరియు దాని పరిసర ప్రాంతాలలో కూడా ప్రత్యేకమైన ప్రాంతీయ వంట విధానం ఉంది. ఇది లోమ్బార్డ్ వంటకాల మాదిరిగా, పాస్టా కంటే బియ్యం ఎక్కువగా వాడటం మరియు టమాటా దాదాపు పూర్తిగా వాడకపోవడం వంటి అంశాలు ఉంటుంది.

"కోటోలెట్ట అల్లా మిలనీస్" అనే దూడ మాంసం (పంది మాంసం లేదా టర్కీ కూడా వాడవచ్చు) ని బ్రెడ్ తో కలిపి వెన్నలో పెనంపై వేయించిన కట్లేట్ వలె (వియన్నాకు చెందిన "వియనేర్ష్నిట్సేల్" మాదిరిగా ఉంటుంది కనుక ఈ పద్దతి ఆస్ట్రియా నుండి వచ్చింది అని కొందరు అభిప్రాయం. అయితే మరి కొందరు కోటోలెట్ట అల్లా మిలనీస్" నుండే "వియనేర్ష్నిట్సేల్" వచ్చినదని చెపుతారు).

వయ మోన్టనపోలియోన్ జిల్లాలో మిలన్ లో ఉన్న కాఫ్ఫే కావ అనే ప్రసిద్ధ పస్టిసేరియ లో కేకులు, పాస్ట్రీలు వడ్డిస్తున్నారు.

కస్సౌల (ఉడికించిన పంది మాంసం ప్రక్కటెముకల ముక్కల చారు మరియు సవోయ్ కాబేజీ సాసేజ్), ఒస్సోబుకో (గ్రేమోలాట అనే సాస్లో ఉడికించిన దూడ కాళ్ళు), రిసోట్టో అల్లా మిలనీస్ (కుంకుమ పువ్వు మరియు గొడ్డు మాంసం మూలిగ తో), బుసేక్క (చిక్కుడు కాయలతో కలిపిన వండిన ఆవు యొక్క ఉదర భాగం) మరియు బ్రసటో (వైన్ మరియు బంగాళా దుంపలతో కలిపి వండిన గొడ్డు లేక పంది మాంసం) వంటివి ఇతర మిలన్ వంటకాలు. కార్నివల్ సమయములో చిక్కషియర్ (పంచదార చల్లిన చదునైన ముక్కలు), టోర్టేల్లి (వేయించిన గుండ్రని కూకీస్) సీసన్-సంబంధించిన పాస్ట్రి లు, ఈస్టర్ సమయములో కలోంబ (పావురం ఆకారములో ఉన్న మెరుస్తున్న కేక్), ఆల్ సోల్స్ డే కొరకు పనే డీ మోర్టి ("డెడ్స్' డే బ్రెడ్" అనగా సువాసన కొరకు దాల్చిన చెక్క వాడిన కుకీస్) మరియు క్రిస్మస్ సమయములో పనేట్టన్ అనేవి ఋతువులకు అనుగుణంగా చేయబడే పాస్ట్రీ వంటకాలు.

సలమే మిలానో అనే అతి సన్ననైన ధాన్యము కలిగిన సలమి ఇటలీ అంతటా విరివిగా చేయబడుతుంది. గొర్గొన్జోల అనేది చాలా ప్రసిద్ధి చెందిన మిలనీస్ జున్ను. ప్రక్కనే ఉన్న అదే పేరు గల ఒక్క నగరం పేరును బట్టి ఈ జున్నుకు ఆ పేరు వచ్చింది. అయితే, ప్రస్తుతం భారీ గొర్గొన్జోల తయారీదారులు పైడ్మోంట్ లో ఉన్నారు.

ప్రత్యేకమైన వంటకమే కాకుండా, మిలన్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రెస్టారంట్లు మరియు కేఫ్‌లు ఉన్నాయి. అనేక నాగరికమైన మరియు పై-స్థాయి రెస్టారంట్ లు చారిత్రాత్మిక కేంద్రములో ఉన్నాయి అయితే మరింత సాంప్రదాయకమైన మరియు ప్రసిద్ధి చెందిన రెస్టారంట్ లు ఎక్కువగా బ్రేరా మరియు నవిగ్లి జిల్లాలలోనే ఉన్నాయి. ప్రస్తుతం, మిలన్ లో నోబు అను ఒక జపనీస్ రెస్టారంట్ ఉంది. అది వయ మంజోని లోని అర్మాని వరల్డ్ లో ఉంది. ఇది నగరములోనే అతి నాగరిక రెస్టారంట్ లలో ఒకటి.[70] నగరములోని అతి నాగరిక కేఫ్ లేక పాస్టిక్కేరీ లలో ఒకటి అయిన, 1817లో, టీట్రో అల్లా స్కాల సమీపంలో స్థాపించబడిన కాఫ్ఫే కోవా అనే ఒక పురాతన మిలనీస్ కాఫీహౌస్. దీనికి హాంగ్ కాంగ్ లో కూడా ఫ్రాంచైస్ లు స్థాపించబడింది.[71] గల్లెరియా లోని బిఫ్ఫీ కఫే మరియు జుక్క అనే ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మిక కఫేలు మిలన్ లోనే ఉన్నాయి. మిలన్ లోని ఇతర రెస్టారంట్ లు, హోటల్ ఫౌర్ సీసన్స్, ‘లా బ్రికియోల’ మారినో అల్లా స్కేలా మరియు షాన్డేలియర్. ఈనాడు, గల్లెరియా విట్టోరియో ఇమాన్యువేల్ II లో మాక్ డొనాల్డ్స్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారంట్ మరియు వయ డెల్ల స్పిగా లోని రోబెర్టో కావాల్లి అనే విలాస ఫేషన్ వస్తువల బ్రాండ్ ఆధ్వర్యంలో నడుస్తున్న జస్ట్ కావాల్లి కేఫ్ వంటి కొన్ని క్రొత్త బోటిక్ కేఫ్ లు నగరములో ఉన్నాయి.

క్రీడలు[మార్చు]

ఐరోపా లోనే అతి పెద్ద స్టేడియంలలో ఒకటైన సాన్ సిరో స్టేడియం

ఈ నగరము లో జరిగిన కొన్ని ముఖ్యమైన క్రీడా కార్యక్రమాలలో కొన్ని: 1934 మరియు 1990 లలో జరిగిన ఫిఫా ప్రపంచ కప్, 1980లో UEFA యురోపియన్ ఫుట్ బాల్ చాంపియన్షిప్, ఇటీవల 2003 ప్రపంచ రోవింగ్ చాంపియన్షిప్ లు, 2009 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ లు మరియు 2010 లో FIVB ప్రపంచ చాంపియన్షిప్.

1990ల ప్రారంభములో, 2000 సుమ్మర్ ఒలింపిక్స్‌కు మిలన్ ప్రయత్నించింది కాని IOC కు వేలం పాట సమర్పించిన తరువాత, అప్పుడే వెలుగు చూస్తున్న టాన్జెన్టోపోలి కుంభకోణం దృష్ట్యా ఉపసంహరించుకుంది.

ఇటలి లో అత్యదికంగా జనాకర్షికమైన క్రీడా, ఫుట్ బాల్. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రెండు ఫుట్ బాల్ జట్టులు ఏ.సి. మిలన్, ఎఫ్.సి. ఇంటర్నజనేల్ మిలనో మిలన్ లోనే ఉన్నాయి. ముందు చెప్పబడిన జట్టు, "మిలన్" (గమనిక: నగరము యొక్క ఆంగ్ల మరియు మిలనీస్ పేరు మాదిరిగా కాకుండా, మొదటి అక్షరమును నొక్కి పలకాలి) అని పిలవబడగా, రెండవది "ఇంటర్" అని పిలవబడుతుంది. ఈ రెండు జట్టుల మధ్య జరిగే ఆటని మిలన్ డేర్బి లేక డేర్బి డెల్ల మడోన్నిన (మిలన్ లోని ముఖ్యమైన స్థలాలో ఒకటైన డ్యోమో డి మిలనో పైన ఉన్న వర్జిన్ మేరి విగ్రహం "మడోన్నిన" గౌరవార్థం) అని పిలుస్తారు.

యురోపియన్ కప్ ( ప్రస్తుతుం 0}UEFA చాంపియన్స్ లీగ్ అని పిలవబడుతుంది) మరియు ఇంటర్ కాంటినేన్టల్ కప్ ( ప్రస్తుతుం FIFA క్లబ్ వరల్డ్ కప్ అని పిలవబడుతుంది) రెండిటిని గెలిచిన ఒకేఒక్క ఐరోపా నగరము మిలన్ (ఏ.సి. మిలన్) మాత్రమే. మొత్తము తొమ్మిది చాంపియన్స్ లీగ్ పట్టాలని గెలుచుకొని, మిలన్ మాడ్రిడ్ తో సమానంగా, అత్యధిక పట్టాలు గెలిచిన నగరముగా పేరు పొందింది. రెండు జట్టులు, సాన్ సిరో అని పిలవబడే UEFA 5-స్టార్ రేటింగ్ ఉన్న 85,700 మంది కూర్చోగల గియుసేప్ మీస్సా స్టేడియం లో ఆడుతాయి. సెరీ A లోని అతి పెద్ద స్టేడియం లలో ఒకటి సాన్ సిరో. తమ చరిత్ర అంత సెరీ A లోనే గడిపిన ఒకే జట్టు ఇంటర్ అయితే, మిలన్ రెండు పర్యాయాలు తప్ప మిగిలిన సమయమంతా ఇక్కడే గడిపింది.

అనేక ప్రసిద్ధ ఫుట్ బాల్ క్రీడాకారులు మిలన్ లో గాని ఈ ప్రాంతములో గాని జన్మించిన వారే. మిలన్ లో జన్మించిన కొందరు క్రీడాకారులు : వలెన్టినో మజ్జోల, పోలో మల్డిని, గిసేప్ప్ మేజ్జా, గేటనో స్సిరియ, గిసేప్ప్ బెర్గోమి, వాల్టర్ జెంగ, గియోవన్ని ట్రాపట్టని ఇంకా అనేకులు.

మిలన్ ఇటాలియన్ సెరీ A ఫుట్ బాల్ లో ఏసి మిలన్ అనే తమ సొంత ఫుట్ బాల్ సంస్థ కలిగి ఉండటం ద్వారా కూడా ప్రసిద్ధి చెందింది. 2010 ప్రపంచ కప్ లో బ్రజుల్ కు ఆడనున్న రోనాల్దినో వంటి ఫుట్ బాల్ లెజెండ్ లు ఈ జట్టులో ఉన్నారు.

ఇటలియన్ గ్రాండ్ ప్రి జరిగే మొన్జా మోటర్ సపోర్ట్ రేస్ ట్రాక్

ప్రసిద్ధ మొన్జా ఫార్ముళా వన్ సిర్క్యుట్ నగర సమీపములోని ఒక విశాలమైన ఉద్యానవనములో ఉంది. ఇది ప్రపంచంలోనే పురాతనమైన కార్ రేసింగ్ సిర్క్యూట్ లలో ఒకటి. ప్రస్తుతం F1 రేసులని 137,000 ప్రేక్షకులు చూడవచ్చు. అయితే 1950లలో 250,000 కంటే ఎక్కువ మంది ఇక్కడ చూసే వీలు ఉండేది. 1980లో తప్ప, ప్రతి ఏడాది మిలన్ లో ఒక F1 రేసు, పోటి ప్రారంభమయినప్పుడు నుండి జరుగుతూ ఉంది.

ఒలింపియ మిలానో (అర్మని సమర్పిస్తున్న) ఒక విజయవంతమైన ఇటాలియన్ మరియు యురోపియన్ బాస్కెట్ బాల్ జట్టు. ఇది అతి ముఖ్యమైన మరియు వియవంతమైన ఇటాలియన్ జట్టలో ఒకటి. ఇది ఐరోపా లోని అతి గొప్ప జట్టులలో ఒకటి కూడా. ఒలింపియ డాట్చ్ ఫోరం అరెన (14,000 మంది చూడవచ్చు) లో ఆడుతుంది.

రినోస్ మిలానో అమెరికన్ ఫుట్ బాల్ క్లబ్ మిలన్ లో ఉన్న అతి పాతదైన అమెరికన్ ఫుట్ బాల్ జట్టు. ఇది నాలుగు ఇటాలియన్ సూపర్ బౌల్ లను గెలిచింది. ఇటాలియన్ ఫుట్ బాల్ లీగ్ యొక్క ఇదు ఫౌండేషన్ క్లబ్ లలో ఇవి కూడా ఉన్నాయి.

CUS మిలానో బేస్ బాల్, మిలన్ లోని అతి పాతదైన బేస్ బాల్ క్లబ్. ఇది ఎనిమిది ఇటలీ యన్ స్కుడెట్టి లని గెలిచింది.

అమటోరి రగ్బి మిలానో 18 నేషనల్ ఛాంపియన్షిప్ లని గెలిచింది. ఇది ఇటలీ లోని అతి ముఖ్యమైన మరియు అత్యధిక ప్రసిద్ధి చెందిన రగ్బీ జట్టు. నేషనల్ ఇటాలియన్ ఛాంపియన్షిప్ వారి సంవత్సరపు ఉత్తమ క్రీడాకారుడు అనే బిరుదుకు వరుసుగా 3 సంవత్సరాలు ప్రతిపాదించబడిన ఏకైక ఇటాలియన్ రగ్బీ చెంపోయన్షిప్ క్రీడాకారుడు, మిలన్ కు చెందిన రాఫ్ఫెల్ బక్కోమో.

మిలన్ కు చెందిన వివిధ మంచు హాకీ జట్టులు 30 నేషనల్ ఛాంపియన్షిప్ లు గెలుచుకున్నాయి. వైపర్స్ మిలానో గత 7 నేషనల్ ఛాంపియన్షిప్ లని గెలుచుకోగా, అల్పెంలిగా మరియు అనేక కోప్ప ఇటలియా, ఈ ఆటలో ఇటలీ లోనే గొప్ప జట్టులు. వీరు అగోర స్టేడియం (4,500 మంది కూర్చోవచ్చు) లో మామూలు సీసన్ సమయములోను ఫోరం లో ఖాళీ సమయాలలో ఆడుతారు.

ప్రతి ఏడాది, బొంఫిగ్లియో ట్రోఫి అండర్ 18 టెన్నిస్ టోర్నమెంట్ మిలన్ లో జరుగుతుంది. ఇది ప్రపంచములోనే అతి ముఖ్యమైన యువత టోర్నమెంట్. ఇది మిలన్ టెన్నిస్ క్లబ్ లో జరుగుతుంది. ఇక్కడి కేంద్ర కోర్ట్ లో 8000 మంది కూర్చోవచ్చు. గతములో ఈ టోర్నమేంట్ ని గెలిచినవారిలో కొందరు: జాన్ కొడేస్, అడ్రినో పనట్ట, కర్రాడో బరజ్జుట్టి, మోరెనో, జార్న్ బోర్గ్, స్మిడ్, ఇవాన్ లేన్డల్, గుయ్ ఫర్గేట్, జిం కొరియర్, గోరన్ ఇవనిసేవిక్, యెవ్జెనీ కఫెల్నికోవ్, మరియు గిల్లెర్మో కొరియా.

గిరో డి'ఇటాలియా యొక్క చివరి అంకం సాంప్రదాయంగా మిలన్ లోనే ఉంటుంది.

మిలన్ మారథాన్ వార్షికంగా మిలన్ లో నవంబరు నెలలో జరిగే ఒక మారథాన్ రేస్.

ఇటాలియన్ బ్యాండి ఫెడెరేషన్ ఈ నగరములోనే జరుగుతుంది.[72]

విజ్ఞానం మరియు సాంకేతికం[మార్చు]

1764లో స్థాపించబడిన చారిత్రాత్మిక బ్రెర అస్ట్రోనోమికల్ అబ్సేర్వెటరి.

చాల కాలముగా దేశములోనూ మరియు ఇరోపాలోనూ కూడా ఒక ముఖ్యమైన వైజ్ఞానిక కేంద్రంగా మిలన్ ఉంది. తొలి ధశాలలోనే పారిశ్రామీకరణ అయిన ఇటలీ నగరాలలో ఒకటైన మిలన్ లో ఆధునిక విజ్ఞానం పెంపొంది 1800ల ఆఖరిలో మరియు 1900ల ప్రారంభములోనే ఈ నగరము "ప్రయోగశాల నగరాలలో" ఒకటిగా, బ్రస్సెల్స్, లండన్, పారిస్ మరియు ఖండములో ఉన్న ఇతర పెద్ద ఆర్ధిక మరియు పారిశ్రామిక కేంద్రాలతో పాటుగా ఉండేది.[73] సమీపములో ఉన్న పవియ యొక్క వైజ్ఞానిక అతేనం (ఇక్కడే ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన విద్యాభ్యాస కాలములో కొన్ని సంవత్సరాలు గడిపారు) నుండి గట్టి పోటి ఉండటం వల్ల, మిలన్ ఒక ఆధునిక సాంకేతిక మరియు వైజ్ఞానిక రంగాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించి అనేక ఆకాడమీలు, సంస్థలు స్థాపించబడ్డాయి.[73] "మిలానో, సిటీ అఫ్ సైన్స్" ( ఇటాలియన్ భాషలో మిలానో, సిట్ట డెల్లె సైన్జ్ ), అనే ఒక ఆసక్తికరమైన పధకం అంతర్జాతీయ సెంపియోన్ ప్రదర్శన లో మిలన్ లో జరగబోతుంది. మిలన్ లో జరిగిన విజ్ఞాన సంబంధిత కార్యక్రమాలలో ఒకటి, 1997 సెప్టెంబరు 13 నాడు ఫోన్దజియోన్ స్టీల్లైన్ లో విజ్ఞాన ప్రదర్శనలో జరిగిన యువ శాస్త్రవేత్తలకు యురోపియన్ యునియన్ కాంటెస్ట్.[74]

బ్రేరా అస్ట్రోనోమికల్ అబ్సేర్వేటరి నే బహుశా మిలన్ లోని అతి ముఖ్యమైన మరియు పురాతనమైన అబ్సేర్వేటరి. ఇది 1764లో జేస్యుట్ లచే స్థాపించబడి, 1785లో అమలు చేయబడిన ఒక చట్టం ద్వారా ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది.

విద్య[మార్చు]

పోలిటేక్నికో డి మిలానో ముఖ్య భవనం
దస్త్రం:Bocconi-entrance-vel.jpg
బొక్కొని యూనివెర్సిటి వెలోడ్రోం
మిలన్ యూనివెర్సిటి యొక్క కేంద్ర భవనం. రినైసంస్ సమయములో నగర ఆసుపత్రి లాగా కట్టబడింది: ఒస్పేడేలె మగ్గియోర్
కాతోలిక్ యునివెర్సిటీ అఫ్ సక్రేడ్ హార్ట్ యొక్క ప్రాంగాణం
బ్రెర అకాడెమి యొక్క లోపలి భాగం

మిలన్ యొక్క ఉన్నత విద్య వ్యవస్థలో 39 విశ్వవద్యాలయ కేంద్రాలు (44 అధ్యాపక బృందం, ప్రతి ఏడాది 174,000 క్రొత్త విద్యార్థులు. ఇటలీ యొక్క మొత్తము విశ్వవిద్యాలయ వ్యవస్థ యొక్క విద్యార్థి సంఖ్యలో 10 శాతానికి సమానం).[75] అంతే కాక, ఇక్కడ ఇటలీ లోనే అత్యధిక సంఖ్యలో విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. (34,000 మరియు 5,000 వరుసగా).[76]

విద్యా సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలు[మార్చు]

1863 నవంబరు 29 స్థాపించబడిన పోలిటేక్నికో డి మిలనో మిలన్ లోనే అతి పాతదైన విశ్వవిద్యాలయం.

ఫ్రాన్సేస్కో బ్రియోస్చి (సంస్థ యొక్క మొదటి అధిపతి) అనే గణిత శాస్త్రజ్ఞుడు, ల్యుగి క్రేమొన మరియు గియులియో నట్ట (1963లో రసాయనములో నోబెల్ బహుమతి) వంటి వారు ఈ సంస్థ లో పనిచేసిన ప్రసిద్ధ ఆచార్యులు. ఈ మధ్య కాలములో పోలిటేక్నికో డి మిలనో 16 విభాగాలుగా ఏర్పాటు చేయబడి ఉంది. ఇంజినియరింగ్, ఆర్కిటెక్చర్, ఇండస్ట్రియల్ డిజైన్ లకు 9 విద్యాలయాలు ఉన్నాయి. ఇవి అన్ని లొంబార్డి ప్రాంతములో 7 కంపాస్ లలో ఉండి, ఒక కేంద్ర పరిపాలన మరియు యాజమాన్యం క్రింద నడుపబడుతాయి. 9 విద్యాలయాలు విద్యాబోధన చేస్తుంటే, 16 విభాగాలు పరిశోధనకు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. అన్ని ప్రాంగణాలలో కలిపి మొత్తము 40,000 విద్యార్థులు చదువుతున్నారు. పోలిటేక్నికో డి మిలనో ఇటలీలోనే అతి పెద్ద సాంకేతిక విశ్వ విద్యాలయంగా ఉంది.[77]

మిలన్ విశ్వవిద్యాలయం 1923 సెప్టెంబరు 30 నాడు స్థాపించబడింది. ఇది ఒక ప్రభుత్వ బోధనా మరియు పరిశోధనా విశ్వవిద్యాలయం. ఇక్కడ 9 అధ్యాపక బృందము, 58 విభాగాలు, 48 ఇన్స్టిట్యుట్ లు కలిగి ఉండి, మొత్తము 2,500 ఆచార్యులు కల బోధనా సిబ్బంది ఉన్నారు. ఈ ప్రాంతములోనే అతి పెద్ద విశ్వవిద్యాలయం అయిన మిలన్ విశ్వవిద్యాలయం ఇటలీ మరియు ఐరోపా లోనే వైజ్ఞానిక ఉత్పాదన రంగంలో అతి పెద్ద విశ్వవిద్యాలయం. ఇక్కడ 65,000 విద్యార్థులు చదువుతున్నారు; ఇది ఆ సామాజిక-ఆర్ధిక నేపథ్యంలో ముఖ్య పాత్ర వహిస్తుంది.[78]

యునివర్సిటీ అఫ్ మిలన్ బికొక్క 1998 జూన్ 10 నాడు ఉత్తర ఇటలీ విద్యార్థుల కొరకు స్థాపించబడింది. చారిత్రాత్మిక మిలన్ యునివర్సిటీలో రద్దీ పెరగడంతో వారికి దాని మీద ఉన్న ఒత్తిడి తగ్గించడము కోసం ఈ విశ్వవిద్యాలయం స్థాపించడము జరిగింది. ఇది మిలన్ ఉత్తర ప్రాంతములోని బికొక్క అనే ప్రాంతములో స్థాపించబడింది. ఈ ప్రాంతంలో గతంలో పారిశ్రామిక కార్యకలాపాలు ఎక్కువగా ఉండేవి. ఉక్కు పరిశ్రమ, రసాయన పదార్ధాలు తయారి మరియు ఎలెక్ట్రో-మెకానిక్స్ వంటి రంగాలలో ఇటలీ లోనే అతి పెద్ద కర్మాగారాలు ఇక్కడ ఉండేవి. విజ్ఞాన విభాగానము లో B.Sc. నుండి Ph.D. వరకు మేటీరియల్స్ సైన్స్, బయోటెక్నాలజీ, పర్యావరణ శాస్త్రం వంటి సాంప్రదాయేతర డిగ్రీలు భౌతికశాస్త్రం, గణితం, జీవశాస్త్రం, రసాయనశాస్త్రం, లెక్కలు మరియు భూగోళ శాస్త్రం వంటి సాంప్రదాయక పాటాలతో జత చేయబడుతున్నాయి. ప్రస్తుతం, విశ్వవిద్యాలయములో మొత్తము 30,000 కంటే ఎక్కువ విద్యార్థులు చదువుతున్నారు.[79]

1902 లో స్థాపించబడిన లియుగి బొక్కొని కమేర్షియల్ యునివర్సిటీ ది వాల్ స్ట్రీట్ జర్నల్ అంతర్జాతీయ రాంకింగ్ లో మొదటి 20 అత్యుత్తమ బిసనస్ స్కూల్ లలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఈ విశ్వవిద్యాలయం యొక్క M.B.A. ప్రోగ్రాం, అతిపెద్ద బహుళజాతి కంపెనీలు గ్రాడ్యుయేట్ రేక్రూట్మెంట్ విషయములో, 2007 సంవత్సరములో ప్రపంచములో 17వ స్థానంలో ఉంది.[80]

డబ్బుకు విలువ అనే అంశంలో ఫోర్బ్స్ బొక్కొనిని ప్రపంచ మొదటి స్థానంలో నిలబెట్టింది.[81] మే 2008లో, ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్సేక్యుటివ్ విద్యలో అనేక ప్రసిద్ధ సాంప్రదాయక అంతర్జాతీయ బిసినెస్ స్కూల్ లని మించి ఐరోపాలో ఐదవ స్థానానికి మరియు ప్రపంచములో పదిహేనవ స్థానానికి ఎగబాకింది.[82]

1921లో ఫాదర్ అగోస్టినో జేమేల్లి చే స్థాపించబడిన కాథలిక్ యునివర్సిటీ అఫ్ ది సేక్రేడ్ హార్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద కాథలిక్ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో 42,000 విద్యార్థులు చదువుతున్నారు.[83]

1638లో స్థాపించబడిన యూనివర్సిటి అఫ్ లాంగ్వేజస్ అండ్ కమ్యునికేషన్ అఫ్ మిలన్ వినియోగదారులు మరియు సేవలు పరిశోధన, వ్యాపార కమ్యునికేషన్, ITC, పర్యాటకం, ఫేషన్, సాంస్కృతిక పారంపర్యం మరియు దానిని వాడటం, వ్యాపారానికి విదేశీ భాషలు, మార్కెటింగ్ మరియు వినియోగం వంటి అంశాలఫై ప్రత్యేకంగా ధృష్టి పెట్టుతుంది. మిలన్ మరియు ఫెల్టర్ రెండు కాంపస్ లలో మొత్తము 10,000 విద్యార్థులు చదువుతున్నారు.[84]

సెయింట్ రాఫెల్ యునివర్సిటీని మొదట్లో సెయింట్ రాఫెల్ హాస్పిటల్ యొక్క పరిశోధన ఆసుపత్రి వ్యవస్థగా స్థాపించబడింది. సెయింట్ రాఫెల్ హాస్పిటల్ లో విద్యార్థులు ప్రాధమిక పరిశోధనా ప్రయోగశాలల్లో న్యురాలజి, న్యూరోసర్జరీ, డయబెటాలజి, మాలిక్యులర్ బయాలజీ, AIDS అధ్యయనం వంటి అనేక రంగాలలో పరిశోధనలు జరుపుతున్నారు. అప్పటినుండి, ఇది విస్తరించి కాగ్నిటివ్ విజ్ఞానం మరియు తత్వశాస్త్రమును కూడా కలుపుకుంది.[85]

1996లో స్థాపించబడిన టెథిస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక లాభాపేక్ష లేని ప్రైవేట్ సంస్థ. తిమింగలాల మీద పరిశోధన చేయడం ఈ సంస్థ యొక్క ప్రత్యేకత. మెడిటర్రేనియన్ తిమింగలాల గురించిన అతి పెద్ద డాటాసెట్ లని టెథిస్ రూపొందించింది. 300కు పైగా క్రొత్త విషయాలు కనుగొని శాస్త్రీయ విజ్ఞానానికి దోహదం చేశారు. 200,000 కు పైగా తిమింగలాల ఫోటో ఆర్కివ్ లు టెథిస్ దగ్గిర ఉన్నాయి. వీని సహాయంతో ఏడు 1,300 మెడిటర్రేనియన్ జాతికి చెందిన తిమింగలాలని గుర్తించారు. ఈ నైపుణ్యం వల్ల టెథిస్, “యూరోఫ్లుక్స్” అనే ఒక EC-నిధులతో జరిగిన పూర్వపు పధకం లో ఒక ప్రాంతీయ సమన్వయకర్త పాత్ర పోషించడానికి దారి తీసింది.[86]

అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్ అఫ్ బ్రెర, ప్రపంచములోనే అతి గొప్ప విద్యా సంస్థగా ప్రఖ్యాతి పొందింది. ఈ ప్రభుత్వ రంగ విద్యా సంస్థ సృజనాత్మక కళలు (చిత్రకళ, శిల్పకళ, గ్రాఫిక్స్, ఫోటో, వీడియో వంటి) మరియు సాంస్కృతిక, చారిత్రాత్మిక రంగాలలో బోధన మరియు పరిశోధన చేస్తుంది.

ఇది ఇటలీలోనే అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులు కలిగి ఉన్న సంస్థ.ఇక్కడ 49 దేశాలకు చెందిన 850 విదేశీయులతో కలిపి మొత్తం 3,500 విద్యార్థులు చదువుతున్నారు. 2005లో UNESCO ఈ సంస్థలో బోధనకు "A5" గ్రేడ్ ఇచ్చింది.

1980లో స్థాపించబడిన న్యు అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్ అఫ్ మిలన్, బాచలర్ మరియు మాస్టర్ అఫ్ ఆర్ట్స్ డిగ్రీలు, అకాడమిక్ మాస్టర్ ప్రోగ్రామ్లు, డిప్లమా ప్రోగ్రాం మరియు సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రాంలు ఆంగ్లంలో జరుగుతాయి. ఇవి US యునివర్సిటీ సిస్టం చే అంగీకరించబడిన విషువల్ ఆర్ట్స్, గ్రాఫిక్ డిజైన్, డిజైన్, ఫేషన్, మీడియా డిజైన్, థియేటర్ డిజైన్ వంటి కార్యక్రమాలు జరుపుతున్న ఒక ప్రైవేట్ అకాడమీ. ఇటలీ మరియు 40 వివిధ దేశాలకు చెందిన 1,000 విద్యార్థులకు పైగా ఈ అకాడమీలో ప్రస్తుతం చదువుతున్నారు.[87]

యురోపియన్ ఇన్స్టిట్యూట్ ఊఫ్ డిజైన్ అనేది ఫేషన్, పారిశ్రామిక మరియు ఇన్టీరియర్ డిజైన్, ఆడియో/ వీడియో డిజైన్, ఫోటోగ్రఫి, అడ్వెర్తిజింగ్, మార్కెటింగ్, వ్యాపార కమ్యునికేషన్ వంటి అంశాలో ప్రత్యేక ధృష్టి పెట్టిన ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం. ఈ స్కూలు 1966లో స్థాపించబడింది. ఇందులో ప్రస్తుతం 8,000 విద్యార్థులకు పైగా చదువుతున్నారు.

మరంగొని ఇన్స్టిట్యూట్, మిలన్, లండన్ మరియు పారిస్ లలోని కాంపస్ లు ఉన్న ఒక ప్రసిద్ధ ఫేషన్ విద్యా సంస్థ. 1935లో స్థాపించడిన ఈ సంస్థ, ఫేషన్ మరియు డిజైన్ పరిశ్రమలో అత్యధిక నైపుణ్యం కలిగిన నిపుణులని తయారు చేస్తుంది.

మిలన్ కన్సేర్వటరి అనే సంస్థ, నెపోలియనిక్ ఇటలీ రాజ్యం యొక్క రాజధానిగా మిలన్ నగరం ఉన్నప్పుడు 1807 నాటి ఒక రాజ శాసనం ద్వారా స్థాపించబడిన ఒక సంగీత కళాశాల. మరుసటి సంవత్సరం, శాంటా మరియా డెల్ల యొక్క బరాక్ చర్చి లో ఉన్న ప్రార్థనాగారములో ఇది తెరవవడింది. మొదట్లో స్త్రీపురుషుల ఇరువురూ కలిపి 18 మంది ఇక్కడ ఉండేవారు. 1700 విద్యార్థులు, 240కు పైగా అధ్యాపకులు, 20 మజర్ లు కలిగిన ఇటలీలోని అతి పెద్ద సంగీత విశ్వవిద్యాలయం ఇది.[88]

సాంస్కృతిక సంస్థలు, కళా గ్యాలరీలు మరియు మ్యుసియంలు[మార్చు]

మిలన్ నగరములో అనేక సాంస్కృతిక సంస్థలు,మ్యుజియంలు, గ్యాలరీలు ఉన్నాయి. వీటిలో కొన్ని అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక ప్రాముఖ్యత పొందినవి.[89]

పోల్ది పెజ్జోలి ముజియం.

బాగట్టి వల్సేక్చి ముజియం నగర కేంద్రములో మొన్టేనాపోలియోన్జిల్లాలో[90] ఉన్న ఒక లాభాపేక్ష లేని చారిత్రాత్మిక ఇంటి ముజియం . ఇటలీ రేనైసంస్ కళ మరియు బాగట్టి వల్సేక్చి బారోన్ ల అలంకరణ కళ సేకరణలు వారి అభీష్టం మేరకు వారి గృహాలలోనే ప్రదర్శింపబడుతున్నాయి. అందువల్ల దర్శకులు ఆ కళా వస్తువులనే కాకుండా, 19వ దశాబ్దాల నాటి యథార్థమైన మిలనీస్ అభిరుచులతో నిర్మించబడిన వారి నివాసాలను కూడా చూడవచ్చు. ఇక్కడ క్రిస్ట్ ఇన్ మజేస్టి, వర్జిన్, క్రిస్ట్ చైల్డ్ అండ్ సైన్ట్స్, గియంపియ్త్రినో అని కూడా పిలవబడే గియోవన్ని పియట్రో రిస్సోలి, 1540లు (చిత్రకారుడు లియోనార్డో డా విన్సి నుండి పొందిన స్ఫూర్తితో) వంటి చిత్రాలు ఉన్నాయి.

పినసోటేక డి బ్రెర, మిలన్ లోని అత్యధిక ప్రాముఖ్యత ఉన్న కళా గేలరీ. ఇటాలియాన్ చిత్రకళకు చెందిన తొలినాటి చిత్రాల యొక్క సేకరణకు సంబంధించిన బ్రేరా అకాడమీ యొక్క సాంస్కృతిక కార్యక్రమ విస్తరణ ఇందులో భాగంగా ఉంది. ఈ గేలరీ బ్రేరా అకాడెమీ యొక్క స్థలములోనే ఉంది. పియరో డెల్ల ఫ్రాన్సేస్క యొక్క బ్రెర మడోన్న అనే గొప్ప చిత్రము కూడా ఇక్కడే ఉంది.

మిలన్ లోని సహజ చరిత్ర యొక్క సివిక్ మ్యుజియం.

మిలన్ కోట అయిన కాస్టెల్లో స్ఫోర్సేస్కోలో ప్రస్తుతం అనేక కళా సేకరణలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఉన్న పౌరుల మ్యుజియములలో అత్యుత్తమమైనది పినసోటేక డెల్ కాస్టెల్లో స్ఫోర్సేస్కో. మైకేలన్గేలో యొక్క ఆఖరి శిల్పం, రోన్డనిని పియేటా, ఆండ్రీ మంటేగ్న యొక్క ట్రివుల్జియో మడోన్న మరియు లియోనార్డో డా విన్సి వ్రాసిన కోడెక్స్ ట్రివుల్జియనుస్ అను పత్రము సైతం ఇక్కడే ఉన్నాయి. పురాతన కళా మ్యూసియము, సామాను యొక్క మ్యూసియము, సంగీత వాయిద్యాలు మరియు అప్లైడ్ ఆర్ట్స్ సముదాయము యొక్క మ్యూసియము, పురావస్తుశాస్త్ర మ్యూసియము యొక్క ఈజిప్షియన్ మరియు చరిత్రకు ముందు కాలమునాటి వాని విభాగాలు, ఎకిల్ బేర్టరెల్లి ప్రింట్ ల యొక్క సముదాయము కాస్టేల్లో ప్రాంగాణంలోనే ఉన్నాయి.

ముసియో సివికో డి స్టోరియ నాచ్యురేల్ డి మిలన్ (మిలన్ యొక్క ప్రకృతి చరిత్ర మ్యూసియము) 1838లో గియుసేప్ప్ డే క్రిస్టోఫోరిస్ (1803–1837) తన సేకరణలని నగరానికి విరాళంగా ఇచ్చిన సందర్భములో ప్రారంభించబడింది. దీని మొదటి అధ్యక్షుడు జియోర్జియో జాన్ (1791–1866).

మ్యుసియో డెల్ల సైన్జా ఈ డెల్ల టెక్నోలోజియ "లియోనార్డో డా విన్సి" మిలన్ లోని విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానమునకు సంబంధించిన ఒక రాష్ట్రీయ మ్యుసియాము. ఇది చిత్రకారుడు మరియు శాస్త్రవేత్త అయిన లియోనార్డో డా విన్సికి అంకితం చేయబడింది.

నగరములో ఉన్న మరొక అతి ముఖ్యమైన మరియు ప్రతిష్ఠాత్మక మ్యూసియం మ్యూసియో పోల్డి పెస్సోలి. ఇది 19వ శతాబ్దములో, గియన్ గియకోమో పోల్డి పెస్సోలి మరియు అతని తల్లి రోసా ట్రివుల్జియో యొక్క వ్యక్తిగత సేకరణగా ప్రారంభించబడింది. వీరు గియన్ గియకోమో ట్రివుల్జియో కాండోట్టియరో కుటుంబానికి చెందినవారు. ఉత్తర ఇటలీ మరియు (ఇటలీ కొరకు) నేధర్లాన్డిష్ / ఫ్లెమిష్ కళాకారుల సేకరణ ఈ మ్యూసియంలో ఉన్నాయి.

పినకోటేక డి బ్రెర.

ముసియో టీట్రేల్ అల్లా స్కాల మిలన్ లోని టీట్రో అల్లా స్కాలతో అనుసంధానం చేయబడిన థియేటర్ వంటి మ్యూసియం మరియు గ్రంథాలయం.

దీనికి ఒపేరా మరియు ఒపేరా హౌస్ చరిత్ర యందు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నప్పటికీ, ఇటలీ నాటకాల యొక్క చరిత్ర మొత్తానికీ అందునా కొమేడియ డెల్’ఆర్టే మరియు సుప్రసిద్ధ రంగస్థల నటి ఎలియోనోర డ్యుస్ వంటి వారి ప్రదర్శనలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి.

రిసోర్జిమేన్టో మ్యూసియం (మ్యుసియో డెల్ రిసోర్జిమేన్టో ) 1796 (నెపోలియన్ యొక్క మొదటి ఇటాలియన్ దండయాత్ర) నుండి 1870(ఇటలీ రాజ్యంతో రోమ్ ను అనుసంధానించడం) మరియు ఇందులో మిలన్ యొక్క పాత్ర (ముఖ్యంగా మిలన్ యొక్క ఇదు రోజులు) వరకు ఇటలీ యొక్క ఏకీకరణ చరిత్ర గురించి తెలిపే మిలన్ లో ఉన్న ఒక మ్యుసియం. ఇది 18వ శతాబ్దానికి చెందిన పలజ్జో మొరిగ్గియ లో నెలకొని ఉంది. ఇక్కడ ఉన్న సేకరణలలో కొన్ని: బల్డస్సారే వేరజ్జి యొక్క ఎపిసోడ్ ఫ్రొం ది ఫైవ్ డేస్ మరియు ఫ్రాన్సేస్కో హయేజ్ చే చక్రవర్తి ఫెర్డినండ్ I ఆఫ్ ఆస్ట్రియా యొక్క 1840 నాటి వర్ణచిత్రం .

లా ట్రయెన్నెల్ డి మిలనో ఒక డిజైన్ మ్యుసియం మరియు సభా వేదిక. ఇది పేలస్ ఆఫ్ ఆర్ట్ భవనములో కాస్టెల్లో స్ఫోర్జేస్కో ప్రక్కన ఉన్న పార్కో సేమిప్యోనే ఉద్యానవనం లో భాగంగా ఉంది. సమకాలీన కళకు మరియు పరిశ్రమలకు ఉన్న సంబంధాలను విశదపరచేందుకు ఇటాలియన్ డిజైన్ లు, నగర నిర్మాణం, వాస్తుకళ, సంగీతం, మీడియా కళలకు సంబంధించిన ప్రదర్శనలు, సభలు ఇక్కడ జరుగుతాయి.

రవాణా[మార్చు]

మిలానో సెంట్రాలే రైల్ స్టేషను యొక్క ముఖ ద్వారము

బోలోగ్నా తరువాత, మిలన్ ఇటలీ యొక్క రెండవ రైల్వే హబ్ గా నిలిచింది. మిలన్ లోని ఇదు పెద్ద స్టేషను లలో ఒకటైన మిలన్ సెంట్రల్ స్టేషను, ఇటలీలోనే చాలా రద్దీగా ఉన్న స్టేషనులలో ఒకటి. మిలన్ లో నిర్మించిన మొదటి రైల్రోడ్ అయిన మిలన్ అండ్ మొన్జా రైల్ రోడ్, 1840 ఆగస్టు 17 నాడు తన సేవలను ప్రారంభించింది.

2009 డిసెంబరు 13 నుండి రెండు అతివేగ రైల్ లైన్ లు మిలన్ ను ఒక వైపు న బోలోగ్న, ఫ్లోరెన్స్, రోం, నేపుల్స్, సలేర్నో లకు కలపగా, మరో వైపున టురిన్ కు కలుపుతాయి.

అజిండ ట్రాస్పార్టి మిలనేసి (ATM) మెట్రోపాలిటన్ ప్రాంతములో సేవలు నడుపుతుంది. ఇది మూడు మెట్రోపాలిటన్ రైల్వే లైన్ లు, ట్రాం, ట్రాల్లీ-బస్, బస్ లైన్ లు వీటితో కూడిన ఒక ప్రజా రవాణా వ్యవస్థ. ATM ట్రామ్వే సముదాయములో 1928 లో మొదటిగా నిర్మింపబడి ఇప్పటికీ పనిచేస్తున్న అనేక పీటర్ విట్ కార్లు ఉన్నాయి. మొత్తం మీద, ఈ నెట్ వర్క్ లోని లైన్ లు 86 మునిసిపాలిటీలలో సుమారుగా 1,400 కిమీ దూరం విస్తరిస్తాయి. ప్రజారవాణాతో పాటు, సాష్టమిలనో పార్కింగ్ కార్డ్ వ్యవస్థని ఉపయోగించి ఇంటర్ చేంజ్ పార్కింగ్ స్థలాలు మరియు చారిత్రాత్మిక కేంద్రములోని మరియు వాణిజ్య ప్రదేశాలలో ఉన్న వీధిలో ఉన్న పార్కింగ్ స్థాలాలని ATM నిర్వహిస్తుంది.

మిలన్ లో మిలన్ మెట్రో అనే పేరుగల మూడు సబ్వే లైన్ లు 80 కిమీ లకంటే ఎక్కువైన ఒక నెట్ వర్క్ కలిగి ఉన్నాయి. ఈ వ్యవస్థలో మూడు లైన్ లు ఉన్నాయి; ఈశాన్యం, పశ్చిమ దిశలలో నడుస్తున్న ఎర్ర లైన్, ఈశాన్యం, నైరుతి దిశలలో నడుస్తున్న పచ్చ లైన్ మరియు ఉత్తరం, దక్షిణం దేశాలలో నడుస్తున్న పసుపు లైన్ లు.

మిలన్ మెట్రో నెట్ వర్క్ యొక్క దేశపటం నీలి రంగు సబర్బన్ రైల్వేస్ యొక్క పసంటే నగర ట్రాక్ ని సూచిస్తుంది
మిలన్ లో పిజ్జా ఫోన్టనని దాటుతున్న ట్రాం

సబర్బన్ రైల్వే సర్వీస్ లైన్ లు పది సబర్బన్ లైన్ లు ఉన్నాయి. ఇవి మిలన్ అగ్లామేరేషన్ ని మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని కలుపుతాయి. 2008 సంవత్సరములో మరి కొన్ని లైన్ లు ప్రారంభించవలసి ఉంది. కాని జనవరి 2009 నాటికి అవి ఏవీ పూర్తి కాలేదు. మరొక ప్రక్కన, రీజనల్ రైల్వే సర్వీస్ మిలన్ ని లొంబార్డి లోని ఇతర ప్రాంతాలతోను మరియు దేశీయ రైల్వే వ్యవస్థ తోనూ కలుపుతుంది. నగర ట్రాం నెట్ వర్క్ లో సుమారుగా 160 kilometres (99 mi) ట్రాక్ మరియు 19 లైన్ లు ఉన్నాయి.[91] బస్ లైన్ లు సుమారు 1,070 కిమీ దాటి వ్యాపించాయి.

మిలన్ నగరంలో (కంయునే డి మిలనో ) ఇచ్చిన లైసెన్స్ తో ప్రైవేట్ సంస్థలు ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక టాక్సీ సర్వీస్ ఉంది. టాక్సీలు అన్ని ఒకే రకంగా తెల్ల రంగులో ఉంటాయి. ముందు ఒక నిర్ణీత బాడుగ నిర్ణయించబడుతుంది. తరువాత, ప్రయాణానికి తీసుకున్న సమయము మరియు దూరం ఆధారంగా అదనపు బాడుగ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టాక్సీ డ్రైవర్ ల ప్రయత్నాల వలన, లైసెన్స్ ల సంఖ్య తక్కువుగానే ఉంచబడుతుంది. రద్దీ సమయములో లేక వర్షా కాలములో టాక్సీ దొరకడం కష్టంగా ఉండవచ్చు. తరుచుగా జరిగే పబ్లిక్ రవాణా సమ్మె సమయములో దాదాపు టాక్సీ దొరకడం అసాధ్యం.

మిలన్ నగరములో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇటలీ యొక్క రెండవ పెద్ద విమానాశ్రయం అయిన మల్పెంస అంతర్జాతీయ విమానాశ్రయం మిలన్ మధ్య ప్రాంతం నుండి సుమారు 50 కిమీ దూరములో ఉంది. ఇక్కడనుండి "మల్పెంస ఎక్స్ ప్రెస్ " ద్వారా నగర నడుబొడ్డుకు వెళ్లవచ్చు. 2007లో 23.8 మిలియనుకు పైగా ప్రయాణికులు ఈ విమానాశ్రయాన్ని వాడారు. నగర పరిధిలో ఉన్న లినేట్ విమానాశ్రయం, స్వదేశీ మరియు తక్కువ దూరం వెళ్లే అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు ఎక్కువగా ఉపయోగిస్తుంది. 2007లో ఈ విమానాశ్రయాన్ని తొమ్మిది మిలియనుల కంటే ఎక్కువ ప్రయాణికులు వాడారు. బెర్గామో నగరానికి సమీపములో ఉన్న ఓరియో అల్ సేరియో విమానాశ్రయం మిలన్ లో తక్కువ-ధర విమాన సేవలని అందిస్తుంది (2007లో సుమారు 6 మిలియను ప్రయాణికులు).

అంతర్జాతీయ సంబంధాలు[మార్చు]

జంట నగరాలు - సోదరి నగరాలు[మార్చు]

మిలన్ తో జతగా ఉన్న నగరాలు:[92]

Other forms of cooperation, partnership and city friendship

Jordanజోర్డాన్ లోని అమ్మన్

థాయిలాండ్ థాయిలాండ్ లోని బ్యాంగ్ కాక్

Serbia (సెర్బియా లోని బెల్గ్రేడ్)

Brazil బ్రెజిల్ లోని బేలో హొరిజోంటే

Argentina అర్జంటీనా లోని బ్యూనస్ ఎయిర్స్

South Korea దక్షిణ కొరియా లోని డేగూ

Colombia కొలంబియా లోని మెడల్లిన్

Belarus బెలారస్ లోని మిన్స్క్

కెనడా కెనడా లోని మొన్ట్రియల్

Bulgaria బల్గేరియా లోని సోఫియా

Croatia క్రొయేషియా లోని జాగ్రెబ్

ఇవి కూడా చూడండి[మార్చు]

Lua error in package.lua at line 80: module 'Module:Portal/images/i' not found.

భిన్న రకాలు[మార్చు]

"ఇన్ అగోస్ట్, గియో ఎల్ సోల్ ఘ'ఎ ఫోస్చ్ (మిలనీస్)
ఇన్ అగోస్తో, క్వండో స్సెండే ఇల్ సోల్ చ'ఎ బయో (ఇటాలియన్)


(ఇంగ్లీష్) ఆగస్ట్ లో సూర్యాస్తమయం వేళ చీకటిగా ఉంటుంది. " [105]

"మిలానో ల గ్రాండే, వేనేజియా ల రిక్కా, జేనోవ ల సూపర్బా ,బోలోగ్న ల గ్రస్సా.
(అనువాదము) మిలన్ పెద్దదైనది, వెనిస్ ధనవంతమైనది, జినోవా అద్బుతమైనది, బోలోగ్నా లావుపాటిది. [106]

సూచనలు[మార్చు]

గ్రంథ వివరణ[మార్చు]

 • యాక్ట్స్ అఫ్ ఇంటర్ నేషనల్ కన్వెన్షన్ "మిలన్ కాపిటల్"), కాంవేగ్నో అర్చెఒలోగికొ ఇన్తెర్నజిఒనలె మిలానో కాపితలే డెల్'ఇమ్పెరో రొమనో 1990; మిలానో అల్ట్రి ఆటోరి: సేన చిఎస, గెమ్మ అర్సలన్, ఎర్మన్నో ఏ.
 • అగోస్తినో అ మిలానో: ఇల్ బట్టేసిమో - అగోస్టినో నెల్లె టెర్రె డి అమ్బ్రోగియో: 22-24 అప్రిలే 1987 / (రెలజిఒని డి) మర్ట సోర్డి (ఎట్ అల్.) ఆగుస్టినస్ పుబ్ల్.
 • అన్సేల్మో, కంటే డి రోసటే: ఇష్టోరియ మిలనేసే అల్ టెంపో డెల్ బర్బరోస్సా / పియట్రో బెనేవేంటి, యురోపియ పుబ్ల్.
 • ది డిక్లైన్ అండ్ ఫాల్ అఫ్ ది రోమన్ ఎమ్పయర్ (ఎడ్వర్డ్ గిబ్బోన్)
 • ది లెటర్ రోమన్ ఏమ్పయర్ (జోన్స్), బ్లాక్వేల్ మరియు మొట్ట, ఆక్స్ఫోర్డ్
 • మిలానో రోమాన / మారియో మిరబెల్ల రోబెర్టి (రుస్కోని పుబ్లిషెర్) 1984
 • మార్చేసి, ఐ పెర్కొర్సి డెల్ల స్టోరియ మినేర్వ ఇటాలిక (ఇట్)
 • మిలానో ట్రా ఎల్'ఏట రేపుబ్బ్లికన ఇ ఎల్'ఏట ఆగుస్టా: అట్టి డెల్ కాంవేగ్నో డి స్టూడి, 26-27 మార్జో 1999, మిలానో
 • మిలానో కపిటలే డెల్'ఇమ్పెరో రొమనో: 286-402 డి.సి. – (మిలానో) : సిల్వన, (1990). – 533 పే.: ఇల్. ; 28 సేమీ.
 • మిలానో కపిటలే డెల్'ఇమ్పెరో రొమనో: 286-402 డి.సి. - ఆల్బం స్టోరికో అర్కియోలోగిచో. – మిలానో: కరిప్లో: ET, 1991. – 111 పే.: ఇల్.; 47 సేమీ. (ఒక్కసిఒనె డెల్ల మొస్ట్రా టేనుట ఎ మిలానో నెల్ లో ప్రచురించబడింది) 1990.
 • Torri, Monica (23 January 2007). Milan & The Lakes. DK Publishing (Dorling Kindersley). ISBN 9780756624439. Retrieved 10 March 2010. 
 • Welch, Evelyn S (1995). Art and authority in Renaissance Milan. Yale University Press, New Haven, Connecticut. ISBN 9780300063516. Retrieved 10 March 2010. 

గమనికలు[మార్చు]

 1. డేమోగ్రఫియా: ప్రపంచ వ్యాప్త నగర ప్రాంతాలు
 2. OECD. "Competitive Cities in the Global Economy" (PDF). Archived from the original (PDF) on 2007-06-14. Retrieved 2009-04-30. 
 3. 3.0 3.1 3.2 3.3 Britannica Concise Encyclopedia. "Milan (Italy) - Britannica Online Encyclopedia". Britannica.com. Retrieved 2010-01-03. 
 4. 4.0 4.1 4.2 "Milan Travel Guide". www.worldtravelguide.net. Retrieved 2010-01-04. 
 5. 5.0 5.1 అధికారిక ISTAT అంచనాలు
 6. "Milan, Italy - Milan Travel Guide". Sacred-destinations.com. Retrieved 2010-01-03. 
 7. "World's richest cities by purchasing power". City Mayors. Retrieved 2010-01-03. 
 8. [1][dead link]
 9. "Cost of living - The world's most expensive cities 2009". City Mayors. 2009-07-07. Retrieved 2010-01-03. 
 10. 10.0 10.1 10.2 10.3 http://www.mori-m-foundation.or.jp/english/research/project/6/pdf/GPCI2009_English.pdf
 11. "GaWC - The World According to GaWC 2008". Lboro.ac.uk. 2009-06-03. Retrieved 2010-01-03. 
 12. 12.0 12.1 "Euromonitor Internationals Top City Destinations Ranking > Euromonitor archive". Euromonitor.com. 2008-12-12. Retrieved 2010-01-03. 
 13. "Milan Tourism and Tourist Information: Information about Milan Area, Italy". www.milan.world-guides.com. Retrieved 2010-01-04. 
 14. 14.0 14.1 14.2 "The History of Milan". internationalrelations.unicatt.it. Retrieved 2010-01-14.  Text " Relazioni Internazionali - Università Cattolica del Sacro Cuore " ignored (help)
 15. మేడియస్ + లానుం ; అల్సియటో యొక్క "శబ్ద ఉత్పత్తి శాస్త్రం" ఉద్దేశపూర్వకంగానే నమ్మశక్యం కానిది.
 16. బితురిసిస్ వెర్వెక్ష్, హేడుఇస్ డాట్ సుకుల సిగ్నుం.
 17. లనిగేర్ హుయిక్ సిగ్నం సుస్ ఈశ్ట్, యానిమల్క్ బైఫోర్మే, యాక్రిబస్ హింక్ సెటిస్, లానిషియో ఇండే లేవీ.
 18. "Alciato, ''Emblemata'', Emblema II". Emblems.arts.gla.ac.uk. Retrieved 2009-03-13. 
 19. "313 The Edict of Milan". www.christianitytoday.com. Retrieved 2010-01-14.  Text " Christian History " ignored (help)
 20. వేర్సుం డే మేడియోలనో సివిటేట్ ని చూడండి.
 21. హెన్రీ ఎస్. లుకాస్, ది రేనైస్సంస్ అండ్ ది రేఫోర్మేషన్ (హర్పెర్ & బ్రోస్.: న్యు యార్క్, 1960) పే. 37.
 22. ఇబిడ్. , పే. 38.
 23. రాబర్ట్ ఎస్. హోయ్ట్ & స్టాన్లీ చోడోరౌ యూరోప్ ఇన్ ది మిడిల్ ఎజస్ (హర్కౌర్ట్ , బ్రెస్ & జోవనోవిచ్: న్యు యార్క్, 1976) పే. 614.
 24. 24.0 24.1 హెన్రీ ఎస్. లుకాస్, ది రేనైస్సంస్ అండ్ ది రేఫోర్మేషణ్ (హర్పెర్ & బ్రోస్.: న్యు యార్క్, 1960) పే. 268.
 25. జాన్ లోత్రోప్ మొట్లే, ది రైస్ అఫ్ ది డచ్ రిపబ్లిక్ వోల్. II (హర్పెర్ బ్రోస్.: న్యూ యార్క్, 1855) పే. 2.
 26. సిపోల్ల, కార్లో ఎం. ఫిఘ్తింగ్ ది ప్లేగ్ ఇన్ సెవెన్టీన్త్ సెంచురీ ఇటలీ . మాడిసన్: యునివేర్సితి అఫ్ విస్కాన్సిన్ ప్రెస్, 1981.
 27. Bloy, Marjie (30 April 2002). "The Congress of Vienna, 1 November 1814 — 8 June 1815". The Victorian Web. Retrieved 2009-06-09. 
 28. Graham J. Morris. "Solferino". Retrieved 2009-06-09. 
 29. 29.0 29.1 "Italian Population Life Tables by province and region of residence". demo.istat.it. Retrieved 2010-01-14. 
 30. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3556: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 31. Uy, Veronica (29 April 2008). "Filipinos populating Milan, as 3 are born there daily--exec". INQUIRER.net. Retrieved 2009-06-21. 
 32. "L'uomo che inventò la Milano da bere". Lastampa.It. 2008-01-04. Retrieved 2010-03-25. 
 33. "Storia di Milano ::: dal 1991 al 2000". Storiadimilano.it. Retrieved 2010-03-25. 
 34. "Storia di Milano ::: dal 2001". Storiadimilano.it. Retrieved 2010-03-25. 
 35. 35.0 35.1 Eco-milanese.doc "La Locomotive if il fiatone" Check |url= value (help). Retrieved 2008-12-07. 
 36. మిలన్ వెబ్ సైట్ [dead link]
 37. http://upload.wikimedia.org/wikipedia/commons/3/32/World_Koppen_Map.png
 38. 38.0 38.1 "Milan, Italy facts, Milan, Italy travel videos, flags, photos - National Geographic". travel.nationalgeographic.com. Retrieved 2010-01-04. 
 39. 39.0 39.1 "Duomo". Frommer's. Retrieved 2009-06-01. 
 40. ‘ది కాసిల్ రేకోన్స్త్రుక్టడ్ బై ది స్ఫోర్జా’, కాస్టెల్లో స్ఫోర్జేస్కో వెబ్ సైట్.
 41. ‘ఫస్ట్ మిలనేసే పీరియడ్ 1481/2 - 1499 (1487)’, యునివేర్సల్ లియోనార్డో.
 42. ‘ఫస్ట్ మిలనేసే పీరియడ్ 1481/2 - 1499 (1488)’, యునివేర్సల్ లియోనార్డో.
 43. Murray, Peter (1986). "Milan: Filarete, Leonardo Bramante". The Architecture of the Italian Renaissance. Thames and Hudson. pp. 105–120. 
 44. Wittkower, Rudolf (1993). "Art and Architecture Italy, 1600-1750". Pelican History of Art. 1980. Penguin Books. 
 45. 45.0 45.1 45.2 45.3 45.4 "Monuments in Milan". Aboutmilan.com. Retrieved 2010-03-14. 
 46. 46.0 46.1 46.2 46.3 46.4 46.5 "Tourist Characteristics and the Perceived Image of Milan". Slideshare.net. Retrieved 2010-01-03. 
 47. 47.0 47.1 47.2 47.3 "Gardens and Parks in Milan". Aboutmilan.com. Retrieved 2010-01-03. 
 48. "Storia di Milano ::: Giardini pubblici". Storiadimilano.it. Retrieved 2010-01-03. 
 49. OECD టెర్రీటోరియల్ రివ్యూ - మిలన్, ఇటలీ
 50. మిలన్ మరియు మెట్రోపాలిటన్ ప్రాంతం యొక్క పోటితత్త్వం
 51. Gert-Jan Hospers (2002). "Beyond the Blue Banana? Structural Change in Europe's Geo-Economy" (PDF). 42nd EUROPEAN CONGRESS of the Regional Science Association Young Scientist Session - Submission for EPAINOS Award August 27–31, 2002 - Dortmund, Germany. Archived from the original (PDF) on 2007-09-29. Retrieved 2006-09-27. 
 52. John Foot. "WMapping Diversity in Milan. Historical Approaches to Urban Immigration" (PDF). Department of Italian, University College London. Retrieved on 2009-10-12.
 53. యురోపియన్ యునియన్ లోని మెట్రోపాలిటన్ ప్రాంతాల జాబితా, GRP ప్రకారం
 54. GDP ప్రకారం దేశాల జాబితా (నామినల్)
 55. "Heaven at Milan's Town House Galleria hotel". The Age. 7 January 2009. Retrieved 21 January 2009. 
 56. "Milan: a new Hotel for Armani | LUXUO Luxury Blog". Luxuo.com. 2009-08-05. Retrieved 2010-03-14. 
 57. 57.0 57.1 57.2 57.3 57.4 "Art and Culture of Milan: from the past to the contemporary". Aboutmilan.com. Retrieved 2010-01-03. 
 58. కాస్టెల్లో స్ఫోర్జేస్కో
 59. 59.0 59.1 "Design City Milan". Wiley. Retrieved 2010-01-03. 
 60. "Frieze Magazine | Archive | Milan and Turin". Frieze.com. Retrieved 2010-01-03. 
 61. "The Global Language Monitor » Fashion". Languagemonitor.com. 2009-07-20. Retrieved 2010-01-03. 
 62. "chiesa ortodossa milano - Google Maps". Maps.google.it. Retrieved 2009-03-13. 
 63. "Lankarama Buddhist Temple - Milan,Italy". Lankaramaya.com. Retrieved 2009-03-13. 
 64. "Jewish Community of Milan". Mosaico-cem.it. Retrieved 2009-03-13. 
 65. "Islam in Italy » Inter-Religious Dialogue » OrthodoxEurope.org". OrthodoxEurope.org<!. 2002-12-04. Retrieved 2009-03-13. 
 66. "Milan: The Center for Radical Islam in Europe". American Chronicle. Archived from the original on 2012-07-20. Retrieved 2009-03-13. 
 67. Cini. "Centro Culturale Protestante - Protestanti a Milano delle Chiese Battiste Metodiste Valdesi" (in (in Italian)). Protestantiamilano.it. Retrieved 2009-03-13. 
 68. "Chiesa Evangelica Valdese - Milano". Milanovaldese.it. Retrieved 2009-03-13. 
 69. "Catholic Encyclopedia: Ambrosian Chant". Newadvent.org. 1907-03-01. Retrieved 2009-03-13. 
 70. "Milan Restaurants". Worldtravelguide.net. Retrieved 2010-01-22. 
 71. "Cova Pasticceria Confetteria - dal 1817". Pasticceriacova.com. Retrieved 2010-01-22. 
 72. "Federation of International Bandy-About-About FIB-National Federations-Italy". Internationalbandy.com. Retrieved 2010-01-03. 
 73. 73.0 73.1 info@area97.it. "MILANO Città delle Scienze". Milanocittadellescienze.it. Retrieved 2010-01-22. 
 74. "Young scientists in Milan". Iop.org. 1997-09-13. Retrieved 2010-01-22. 
 75. "official website". Comune.milano.it. Retrieved 2009-03-13.  Text "Milan " ignored (help)
 76. "European Society pieg.qxp" (PDF). Retrieved 2009-07-08. 
 77. "Politecnico di Milano - POLInternational English - About the University". Polimi.it. Retrieved 2009-03-13. 
 78. "The University of Milan - Welcome". Unimi.it. Retrieved 2009-03-13. 
 79. PCAM. "PCAM - University of Milano-Bicocca". Pcam-network.eu. Retrieved 2009-03-13. 
 80. "Conferenze, ospiti, news ed eventi legati agli MBA della SDA Bocconi | MBA SDA Bocconi". Mba.sdabocconi.it. Retrieved 2009-03-13. 
 81. "Gatech :: OIE :: GT Study Abroad Programs". Oie.gatech.edu. 2006-04-07. Retrieved 2009-03-13. 
 82. "Sda Bocconi supera London Business School - ViviMilano". Corriere.it. Retrieved 2009-03-13. 
 83. "Autore" (PDF). Retrieved 2009-07-08. 
 84. "Libera Università di Lingue e Comunicazione IULM". Crui.it. Retrieved 2009-03-13. 
 85. "Vita-Salute San Raffaele University - Università Vita-Salute San Raffaele". Unisr.it. Retrieved 2009-03-13. 
 86. "Tethys Research Institute". Tethys.org. Retrieved 2009-03-13. 
 87. "NABA Nuova Accademia di Belle Arti Milano". Naba.it. Retrieved 2009-03-13. 
 88. "Conservatorio di musica "G.Verdi" di Milano". Consmilano.it. Retrieved 2009-03-13. 
 89. "Museums in Milan". Aboutmilan.com. Retrieved 2010-01-03. 
 90. http://www.museobagattivalsecchi.org/english/montenapoleone/
 91. "world.nycsubway.org/Europe/Italy/Milan (Urban Trams)". World.nycsubway.org. 2003-12-08. Retrieved 2009-03-13. 
 92. 92.00 92.01 92.02 92.03 92.04 92.05 92.06 92.07 92.08 92.09 92.10 92.11 92.12 "Milano - Città Gemellate". © 2008 Municipality of Milan (Comune di Milano). Retrieved 2009-07-17. 
 93. "Partner Cities". Birmingham City Council. Retrieved 2009-07-17. 
 94. "Frankfurt -Partner Cities". © 2008 Stadt Frankfurt am Main. Retrieved 2008-12-05.  External link in |publisher= (help)
 95. "::Bethlehem Municipality::". www.bethlehem-city.org. Retrieved 2009-10-10. 
 96. "Twinning with Palestine". © 1998-2008 The Britain - Palestine Twinning Network. Retrieved 2008-11-29. 
 97. బెత్లేహం నగరము ఈ క్రింద నగారలతో జంట చేసే అంగీకారాలు కుదుర్చుకుంది బెత్లేహెం మునిసిపాలిటి.
 98. "Kraków otwarty na świat". www.krakow.pl. Retrieved 2009-07-19. 
 99. "Partner Cities of Lyon and Greater Lyon". © 2008 Mairie de Lyon. Retrieved 2008-11-29. 
 100. "City of Melbourne — International relations — Sister cities". City of Melbourne. Retrieved 2009-07-07. 
 101. "Saint Petersburg in figures - International and Interregional Ties". Saint Petersburg City Government. Retrieved 2008-10-23. 
 102. 102.0 102.1 "São Paulo - Sister Cities Program". © 2005-2008 Fiscolegis - Todos os direitos reservados Editora de publicações periodicas - LTDA / © 2008 City of São Paulo. Retrieved 2008-12-09.  ఉదహరింపు పొరపాటు: Invalid <ref> tag; name "São Paulo" defined multiple times with different content
 103. అంతర్జాతీయ సంభందాలు - సో పులో సిటీ హాల్ - అధికారిక సోదరి నగరాలు
 104. "Tel Aviv sister cities" (in Hebrew). Tel Aviv-Yafo Municipality. Retrieved 2009-07-14. 
 105. 105.0 105.1 "Proverbi milanesi - Wikiquote" (in (in Italian)). It.wikiquote.org. 2010-02-19. Retrieved 2010-03-28. 
 106. 106.0 106.1 "Milano - Wikiquote" (in (in Italian)). It.wikiquote.org. 2010-02-23. Retrieved 2010-03-28. 

బాహ్య లింక్లు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మిలన్&oldid=2489036" నుండి వెలికితీశారు