Jump to content

భారతమాల

వికీపీడియా నుండి

భారతమాల
దేశంభారతదేశం
మంత్రిత్వ శాఖభారత ప్రభుత్వ రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
స్థాపన31 జూలై 2015; 9 సంవత్సరాల క్రితం (2015-07-31)
స్థితిపనులు జరుగుతున్నాయి

భారతమాల ప్రాజెక్టు, భారతదేశం లోని 550 జిల్లా ప్రధాన కార్యాలయాలను కనీసం 4-వరుసల రహదారుల ద్వారా అనుసంధించే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు ముందు 300 జిల్లా ప్రధాన కేంద్రాలకు ఈ అనుసంధానం ఉండేది. ఈ ప్రాజెక్టులో భాగంగా హైవే కారిడార్‌ల సంఖ్య ప్రస్తుతమున్న 4 నుంది 50 కి పెరుగుతుంది. 8,000 కిలోమీటర్ల పొడవున ఉన్న 24 లాజిస్టిక్ పార్కులు, 66 అంతర్గత కారిడార్లు, 7,500 కిలోమీటర్ల పొడవున ఉన్న 116 ఫీడర్ మార్గాలను, 7 ఈశాన్య బహుళ-మోడల్ వాటర్‌వే పోర్టులను అనుసంధిస్తారు. దేశంలో జరిగే మొత్తం సరుకు రవాణాలో 80% ని రహదారుల ద్వారా జరపాలనేది (ప్రస్తుతం ఇది 40% గా ఉంది) ఈ ప్రాజెక్టు సంకల్పం.[1] ఈ ప్రాజెక్టులో భాగంగా అనేక సొరంగాలు, వంతెనలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లైఓవర్‌లు, ఓవర్‌పాస్, ఇంటర్‌ఛేంజ్‌లు, బైపాస్‌లు, రింగురోడ్లు మొదలైన వాటిని అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా అనేక ప్రదేశాల మధ్య దూరం తగ్గి, ట్రాఫిక్ ఇబ్బందులు లేని అనుసంధానం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వపు నిధులతో భారత ప్రభుత్వం చేపట్టిన రహదారుల ప్రాజెక్టు ఇది.[2]

1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుతో (NHDP) సహా ఇప్పటికే ఉన్న అన్ని హైవే ప్రాజెక్టులన్నీ ఈ ఈ ప్రతిష్టాత్మక గొడుగు కార్యక్రమం - భారతమాల ప్రాజెక్టులో - మిళితమై పోతాయి. భారతమాల ప్రధానంగా బెంగళూరు, పూణే, హైదరాబాద్ వంటి మెగాసిటీలకు ఉన్న ఉపగ్రహ పట్టణాలను, మారుమూల ప్రాంతాలను అనుసంధానించడంపై దృష్టి సారించింది. 83,677 కిలోమీటర్ల కొత్త రహదారులకు[3] అయ్యే పెట్టుబడి రూ. 10.63 లక్షల కోట్లని అంచనా వేసారు. 2022 మార్చి నాటికి ఇది రహదారి నిర్మాణాలకు ప్రభుత్వం చేస్తున్న ఏకైక అతిపెద్ద వ్యయం. ఈ ప్రాజెక్టు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా నుండి హైవేలను నిర్మిస్తుంది. తరువాత హిమాలయ భూభాగాలైన జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లను, ఆపై ఉత్తరప్రదేశ్ బీహార్ సరిహద్దుల్లోని టెరాయ్ లు పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాంలో ఇండో-మయన్మార్ సరిహద్దు వరకు కవర్ చేస్తుంది.[2] గిరిజన, వెనుకబడిన ప్రాంతాలతో సహా సుదూర సరిహద్దు, గ్రామీణ ప్రాంతాలకు కనెక్టివిటీని అందించడంపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులతో కూడిన NHDP సంబంధిత ప్రాజెక్టులే కాకుండా, ఇప్పటికే ఉన్న 4 వరుసల హైవేలను 6 వరుసల హైవేలుగా విస్తరించే బ్రౌన్‌ఫీల్డ్ నేషనల్ హైవే ప్రాజెక్టులు కూడా ఇందులో ఉన్నాయి.[4] ఈ ప్రాజెక్టు కింద అనేక రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మారుస్తారు.[5] ఇండస్ట్రియల్ కారిడార్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, సేతు భారతం, సాగరమాల, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు (DFC), ఉడాన్-RCS, డిజిటల్ ఇండియా, BharatNet, పర్వతమాల వంటి ఇతర కీలకమైన భారత ప్రభుత్వ పథకాలను ఇది సశక్తం చేస్తూనే, వాటి లబ్దిదారుగా కూడా ఉంటుంది.

2014 లో ఈశాన్య భారతదేశంపై నిర్దుష్ట దృష్టితో జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వపు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసారు.[6][7]

కేంద్రీయ రోడ్డు నిధి (CRF)

[మార్చు]

"సెంట్రల్ రోడ్ ఫండ్ యాక్ట్ 2000" కింద పెట్రోలు, డీజిల్‌లపై సెస్ విధించి జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్లు, గ్రామీణ రోడ్లు, రైల్వే వంతెనలు, జాతీయ జలమార్గాలను నిర్మించడానికి అప్‌గ్రేడ్ చేయడానికీ కేంద్రీయ రోడ్డు నిధి (CRF) ని ఏర్పాటు చేసారు. . [8]

ప్రభావం

[మార్చు]

భారతమాల వలన హైవే మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరుగుతాయి: [1]

  • 6 NC కారిడార్‌లను 50 కారిడార్‌లకు పెంచడం (6 NC, 44 EC)
  • జాతీయ రహదారులపై 40% గా ఉన్న సరుకు రవాణాను 80%కి పెంచడం
  • కనీస 4-లేన్ హైవేలతో అనుసంధానించబడిన 300 జిల్లాల సంఖ్యను 550 జిల్లాలకు పెంచడం.

పరిధి

[మార్చు]

సందర్భం

[మార్చు]

భారతదేశపు 6,215,797 కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్కు ప్రపంచంలో రెండవ అతిపెద్దది. ఇందులో కేవలం 2% (~1,60,000 కి.మీ.) మాత్రమే ఉన్న జాతీయ రహదారులపై 40% ట్రాఫిక్‌ ప్రవహిస్తుంది.[9] భారతమాల దశ-I లో మొత్తం 718 జిల్లాల్లోను 80% లేదా 550 జిల్లాలకు జాతీయ రహదారుల అనుసంధానం పెరుగుతుంది.[10] 2017 డిసెంబరు నాటికి ఇది 300 జిల్లాలు, 42% గా ఉంది. [9] భారతమాల ప్రాజెక్టు కోసం భారతదేశంలో 90% సరుకు రవాణా చేసే 12,000 మార్గాలకు సంబంధించి అతి తక్కువ మార్గాన్ని మ్యాపింగు చెయ్యడం, 600 జిల్లాల్లో సరుకు రవాణాపై సరుకుల వారీగా సర్వే, దేశవ్యాప్తంగా 1,500 పైచిలుకు పాయింట్లకు ఆటోమేటెడ్ ట్రాఫిక్ సర్వేలు జరపడం, ఉన్నతీకరణ అవసరాలను గుర్తించడం కారిడార్‌ల శాటిలైట్ మ్యాపింగు చెయ్యడం వంటివి జరిగాయి. [1]

భాగాలు

[మార్చు]

జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్ (NHDP)

[మార్చు]

NHDP ప్రాజెక్టు 48,793 కి.మీ. (30,319 మై.) కవర్ చేస్తుంది. ఇందులో ఈసరికే పూర్తైన 28,915 కి.మీ. (17,967 మై.) తో పాటు, నిర్మాణంలో ఉన్న 10,574 కి.మీ. (6,570 మై.), ఇంకా పని చేపట్టని 9,304 కి.మీ. (5,781 మై.) ఉన్నాయి (2017 మే నాటికి). [11] NHDP కింద అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు కూడా భారతమాలలో భాగమౌతాయి. [9] NHDP మట్టి రోడ్లను, 1/2 లేన్ రోడ్లను 4 లేన్ల రోడ్లనూ జాతీయ రహదారులుగా మార్చడానికి ఉద్దేశించబడింది.

నేషనల్ కారిడార్లు (NC)

[మార్చు]

నేషనల్ కారిడార్ ఆఫ్ ఇండియా (NC) 6 హై వాల్యూమ్ కారిడార్లు, వీటిలో 4 గోల్డెన్ క్వాడ్రిలేటరల్‌లు, 2 ఉత్తర-దక్షిణ, తూర్పు-పశ్చిమ కారిడార్‌లు ఉన్నాయి. ఇందులో ముంబై - కోల్‌కతా హైవే (NH6)ని ఈస్ట్ కోస్ట్ - వెస్ట్ కోస్ట్ కారిడార్ అని పిలుస్తారు. భారతదేశ సరకు రవాణాలో 35% వీటి గుండా జరుగుతుంది. [9] నేషనల్ కారిడార్లలో రద్దీని తగ్గించడానికి 6 నుండి 8 వరుసలకు విస్తరణ, రింగ్ రోడ్లు, బైపాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్‌లను భారతమాలలో భాగంగా నిర్మించనున్నారు. [9] జాతీయ కారిడార్ల వెంబడి లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేస్తారు. [9] అత్యంత రద్దీగా ఉండే జాతీయ కారిడార్‌లను ఎక్స్‌ప్రెస్‌వేలుగా మార్చనున్నారు. [9] 8,000 కి.మీ. (5,000 మై.) ఇంటర్-కారిడార్లు, 7,500 కి.మీ. (4,700 మై.) ఫీడర్ మార్గాలను నిర్మిస్తారు.[9] అదనంగా, 3,300 కి.మీ. (2,100 మై.) సరిహద్దు రోడ్లు, 6 జాతీయ కారిడార్లను అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు అనుసంధానించడానికి 2,000 కి.మీ. (1,200 మై.) అంతర్జాతీయ రహదారులను నిర్మిస్తారు.[9]

నేషనల్ కారిడార్స్ ఎఫిషియెన్సీ ప్రోగ్రామ్ (NCEP)

[మార్చు]

నేషనల్ కారిడార్స్ ఎఫిషియెన్సీ ప్రోగ్రామ్ (NCEP) మొదటి దశలో భాగంగా 34 6-8 వరుసలకు పెంపులు, 45 బైపాస్‌లు, 6 జాతీయ కారిడార్లకు 30 రింగ్ రోడ్లను నిర్మించి, 5,000 కి.మీ. (3,100 మై.) పొడవు రహదార్లలో 185 చోక్ పాయింట్‌ల రద్దీని తగ్గిస్తారు.[9][1][12]

భారతమాలలోని కొత్త రింగ్ రోడ్లు:

ఆర్థిక కారిడార్లు

[మార్చు]

26,200 కి.మీ. (16,300 మై.) పొడవున్న 44 ఆర్థిక కారిడార్స్ లేదా పారిశ్రామిక కారిడార్లను గుర్తించారు. మొదటి దశలో 9,000 కి.మీ. (5,600 మై.) చేపడతారు. వీటిలో 6 జాతీయ కారిడార్లు భాగం కాదు. ఈ కారిడార్లలో 8,000 కి.మీ. (5,000 మై.) పొడవున్న 66 ఇంటర్-కారిడార్లు (IC), 7,500 కి.మీ. (4,700 మై.) పొడవున్న 116 ఫీడర్ మార్గాలను (FR) గుర్తించారు. [1] [9]44 ఆర్థిక కారిడార్ల జాబితా (EC): [1]

లాజిస్టిక్స్ పార్కులు

[మార్చు]

హబ్-అండ్-స్పోక్ మోడల్‌ను అభివృద్ధి చేయడంలో భాగంగా, ఆర్థిక కారిడార్ల (EC) ద్వారా అనుసంధానించేందుకు దేశంలో 45% సరుకు రవాణా రవాణా చేసే లాజిస్టిక్స్ పార్కులను గుర్తించారు. హబ్ నుండి హబ్‌కు రవాణా 30 టన్నుల వాహనాల ద్వారా జరుగుతుంది. హబ్ నుండి స్పోక్‌కు 10 టన్నుల వాహనాల ద్వారా జరుగుతుంది.[1] [12]

ఈశాన్య భారత కనెక్టివిటీ

[మార్చు]

నార్త్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ బ్రహ్మపుత్రలో 7 రాష్ట్ర రాజధానులను, 7 మల్టీమోడల్ వాటర్‌వేస్ టెర్మినల్స్‌నూ భారతమాల కలుపుతుంది. [1]

అంతర్జాతీయ అనుసంధానం

[మార్చు]

భారతమాలలో భాగంగా లుక్-ఈస్ట్ కనెక్టివిటీని మరింత అభివృద్ధి చేస్తారు. [1]

  • 24 ఇంటెగ్రేటెడ్ చెక్ పోస్టులు (ICPలు)
  • బంగ్లాదేశ్ ద్వారా ఈశాన్య భారతదేశానికి మెరుగైన రవాణా సౌకర్యాలు
  • బంగ్లాదేశ్-భూటాన్-నేపాల్-మయన్మార్-థాయ్‌లాండ్ BIMSTEC కారిడార్‌లను సమగ్రపరచడం.

ఇందులో భాగాలు

పెట్టుబడి

[మార్చు]
  • 2017 నుండి 2022 వరకు 5 సంవత్సరాల పాటు భారతమాల ప్రాజెక్టుకు మొత్తం బడ్జెట్ 6,92,324 crore (US$87 billion) [13]
    • 1,57,324 crore (US$20 billion) అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారులు, SARDP-NE, ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్‌లు (EAP, ఉదా వరల్డ్ బ్యాంక్, ADB ), లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం రోడ్లు (LWE) వంటి ఇప్పటికే ఉన్న NH ప్రాజెక్ట్‌లను ఉపసంహరించారు. [9]
    • 5,35,000 crore (US$67 billion) దశ-I 2017-2019 డిసెంబరులో పూర్తవుతుంది: [9] [14] [13]
      • 2,09,000 crore (US$26 billion) మార్కెట్ రుణాల ద్వారా. [13]
      • 1,06,000 crore (US$13 billion) ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా. [13]
      • 2,19,000 crore (US$27 billion) సెంట్రల్ రోడ్ ఫండ్ (CRF) ద్వారా, టోల్‌ల ద్వారా: [13]
        • 97,000 crore (US$12 billion) CRF నుండి. [13]
        • 34,000 crore (US$4.3 billion) పూర్తయిన హైవేల కొత్త టోల్ మానిటైజేషన్ నుండి. [13]
        • 46,048 crore (US$5.8 billion) టోల్-పర్మనెంట్ బ్రిడ్జ్ ఫీజు ఫండ్ (PBFF) నుండి ప్రస్తుత టోల్ రుసుము నుండి). [13]
  • 2017-18: [15]
  • 10,000 కి.మీ. (6,200 మై.) 27 చొప్పున నిర్మించబడిన హైవేలు కిమీ/రోజు,
  • 65,000 crore (US$8.1 billion) జాతీయ బడ్జెట్‌లో కేటాయింపు ద్వారా.
  • Fy2018-19: [15]
    • 24,000 కి.మీ. (15,000 మై.) ప్రదానం చేయబడుతుంది.
    • 12,000 కి.మీ. (7,500 మై.) పూర్తవుతుంది.
    • 1,63,000 crore (US$20 billion) మొత్తం ఖర్చు:
      • 78,000 crore (US$9.8 billion) జాతీయ బడ్జెట్‌లో కేటాయింపు ద్వారా,
      • 60,000 crore (US$7.5 billion) బాండ్ల ద్వారా,
      • 25,000 crore (US$3.1 billion) 30 పూర్తయిన హైవేల టోల్ మానిటైజేషన్ ద్వారా.

అమలు దశలు: 2017-2022

[మార్చు]

83,677 కి.మీ. (51,994 మై.) పొడవున్న రోడ్ల నిర్మాణాన్ని ప్లాన్ చేస్తోంది. ఇందులో 34,800 కి.మీ. (21,600 మై.) అదనపు హైవేలు, రోడ్లు ఉన్నాయి. [15] సాగర్‌మాలతో భారతమాలకు పరస్పర శక్తి ఉంది.[16]

మొదటి దశ: 2022 డిసెంబరు నాటికి 34,800 కి.మీ

[మార్చు]

2022 డిసెంబరు నాటికి మొదటి దశ కింద 24,800 కి.మీ. (15,400 మై.) కొత్త రహదారులతో సహా మొత్తం 34,800 కి.మీ. (21,600 మై.) పొడవున్న హైవేలను నిర్మిస్తారు. మరో 10,000 కి.మీ. (6,200 మై.) NHDP కింద అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను పూర్తి చేస్తారు.[17] [16] [3] [18]

రోడ్డు రకం మొత్తం పొడవు మొదటి దశలో పొడవు [9] గమనికలు
ఆర్థిక కారిడార్లు 26,200 కి.మీ. (16,300 మై.) 9,000 కి.మీ. (5,600 మై.) 44 ఆర్థిక కారిడార్లు, 6 జాతీయ కారిడార్లు కాకుండా.
ఇంటర్ కారిడార్లు & ఫీడర్ రూట్లు 15,500 కి.మీ. (9,600 మై.) 6,000 కి.మీ. (3,700 మై.) 66 8,000 కి.మీ. (5,000 మై.) ఇంటర్ కారిడార్లు (IC) & 116 7,500 కి.మీ. (4,700 మై.) ఫీడర్ రూట్లు (FR).[1][9]
జాతీయ కారిడార్ల ఎఫిషియెన్సీ కార్యక్రమం 5,000 కి.మీ. (3,100 మై.) 6-8 వరసలకు పెంపు, 6 జాతీయ కారిడార్లకు బైపాసులు, రింగు రోడ్లు.[9]
సరిహద్దు & అంతర్జాతీయ అనుసంధాన రోడ్లు 5,300 కి.మీ. (3,300 మై.) 2,000 కి.మీ. (1,200 మై.) 3,300 కి.మీ. (2,100 మై.) సరిహద్దు రోడ్లు, 6 జాతీయ కారిడార్లను అంతర్జాతీయ మార్గాలకు కలిపే 2,000 కి.మీ. (1,200 మై.) ఉదాహరణకు: BIMSTEC, MIT, BIN (బంగ్లాదేశ్, భారత్, నేపాల్).[9]
తీరప్రాంత & రేవుల అనుసంధాన రోడ్లు 2,000 కి.మీ. (1,200 మై.) సాగరమాలతో సమ్మిళిత శక్తి
ఎక్స్‌ప్రెస్‌వేలు 1,600 కి.మీ. (990 మై.) 800 కి.మీ. (500 మై.) జాతీయ కారిడార్లను ఎక్స్‌ప్రెస్‌వేలుగా మారుస్తారు.[9]
భారతమాల కింద మొత్తం 24,800 కి.మీ. (15,400 మై.)
NHDP కింద మిగిలిన జాతీయ రహదారులు 10,000 కి.మీ. (6,200 మై.) 10,000 కి.మీ. (6,200 మై.)
మొత్తం నిర్మించాల్సినవి, ఉన్నతీకరించాల్సినవి 83,677 కి.మీ. (51,994 మై.)[3] 34,800 కి.మీ. (21,600 మై.)

మూలాలు

[మార్చు]
  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 Bharatmala presentation
  2. 2.0 2.1 "Bharat Mala: PM Narendra Modi's planned 14,000 crore (US$1.8 billion) road from Gujarat to Mizoram", The Economic Times, New Delhi, 29 April 2015, archived from the original on 2016-09-17, retrieved 2024-06-23
  3. 3.0 3.1 3.2 "Ministry proposes construction of 20,000 km of roads under Bharat Mala project", The Economic Times, New Delhi, 9 January 2016, archived from the original on 2016-09-12, retrieved 2024-06-23
  4. "Brownfield National Highway Project | CEPT - Portfolio".
  5. "Centre to convert State Highways with high traffic to national highways: Gadkari". 15 October 2022.
  6. National Highway Infrastructure Development Corporation Limited to award first project for North-East in October, Economic Times, 9 Oct 9 2014.
  7. NHIDCL intro.
  8. What is Central Road Fund (CRF)?, Indian Economy.
  9. 9.00 9.01 9.02 9.03 9.04 9.05 9.06 9.07 9.08 9.09 9.10 9.11 9.12 9.13 9.14 9.15 9.16 9.17 BHARATMALA PARIYOJANA, PHASE-I
  10. "Home | Know India: National Portal of India". Archived from the original on 16 August 2017.
  11. "About NHDP | National Highways Authority of India, Government of India". nhai.gov.in (in ఇంగ్లీష్). Retrieved 2018-02-03.
  12. 12.0 12.1 Investment approval for Phase 1
  13. 13.0 13.1 13.2 13.3 13.4 13.5 13.6 13.7 new release
  14. "Govt plans Bharat Mala, a 5,000km road network", The Times of India, New Delhi, 30 April 2015
  15. 15.0 15.1 15.2 Transport ministry seeks Rs 78,000 crore to help fund Bharatmala, Economic Times, 24 Dec 2017.
  16. 16.0 16.1 Nitin Gadkari press conference highlights: BharatMala, SagarMala to be 'varmala' of India, says minister, First Post, 25 Oct 2017.
  17. "First phase of Bharatmala Pariyojana to start by end of 2018: Gadkari". Moneycontrol (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-10-29.
  18. "Highway construction target for Nitin Gadkari-led Road Transport Ministry: Is 30 km per day too much of a stretch?". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-06-05. Retrieved 2017-08-08.
"https://te.wikipedia.org/w/index.php?title=భారతమాల&oldid=4356919" నుండి వెలికితీశారు