Jump to content

డిజిటల్ ఇండియా

వికీపీడియా నుండి

డిజిటల్ ఇండియా అనునది మనదేశంలో సమాచార సాంకేతిక రంగఫలాలను సామాన్య ప్రజానీకానికి చేరువ చేయడాకిని కేంద్రప్రభుత్వము ప్రారంభించిన పథకము. 2015 జూలై 1న దీనిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రారంభించాడు.

2015 జూలై 01 న న్యూఢిల్లీలో జరిగిన డిజిటల్ ఇండియా వీక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘డిజిటల్ ఇండియా బుక్’ విడుదల చేశారు.]

నేపధ్యము ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ రంగాల్లోని విప్లవ ప్రజలకు చేరువచేయడం, ప్రభుత్వ పాలనను డిజిటల్‌ ఇన్‌ఫ్రాను ద్వారా ప్రజలు వినియోగించుకునే వెసులుబాటు కల్పించడం డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. బ్రాడ్‌బాండ్‌ హైవేస్‌ అభివృద్ధి, అందరికీ మొబైల్‌ కనెక్టివిటీ అందుబాటులోకి తేవడం, పబ్లిక్‌ ఇంటర్నెట్‌ యాక్సెస్‌ ప్రోగ్రామ్‌, టెక్నాలజీని వినియోగించి పాలనా రంగాన్ని ప్రక్షాళన చేయడం, సమాచారాన్ని, సర్కారు సర్వీసులను టెక్నాలజీ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవడం వగైరా ఇందులో భాగం.

భారతదేశంలో జరిగిన అనేక జీ20 సమావేశాలు భారతదేశాన్ని గ్లోబల్ కృత్రిమ మేధస్సు హబ్‌గా భావిస్తున్నాయి, డిజిటల్ ఇండియా ద్వారా సాధ్యమని చెప్పారు. 7 మిలియన్ల కృత్రిమ మేధస్సు (AI) నిపుణులు, $15 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ డిమాండ్‌ గురించి చెప్పారు, కొంతమంది వక్తలు, ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మేక్ ఇన్ ఇండియాలో కృత్రిమ మేధస్సుని ఏకీకృతం చేయాలని సూచించారు, డిజిటల్ ఇండియా IBPS విజయం ప్రస్తావించారు

లక్ష్యాలు

  1. 2.5 లక్షల పాఠశాలలకు [వైఫై] కనెక్షన్లు
  2. బహిరంగ ప్రదేశాల్లో వైఫై హాట్‌స్పాట్‌లు
  3. నాలుగు లక్షల ప్రజా అంతర్జాల లభ్యతా కేంద్రాలు
  4. రు.లక్ష కోట్లతో డిజిటల్‌ ఇండియా పథకాలు
  5. 2020 నాటికి ఎలక్ర్టానిక్‌ పరికరాల దిగుమతికి స్వస్తి
  6. 1.7 కోట్ల ప్రత్యక్ష ఉద్యోగాలు
  7. పరోక్షంగా 8.5 కోట్ల ఉద్యోగాలు
  8. మల్టీ సర్వీస్‌ కేంద్రాలుగా 1.5 లక్షల పోస్టాఫీసులు
  9. గ్రామీణ భారతంపై దృష్టి
  10. 42,300 గ్రామాలకు టెలిఫోన్‌ సదుపాయం
  11. 2.5 లక్షల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌
  12. కోటి మంది గ్రామీణ విద్యార్థులకు ఐటి శిక్షణ
  13. టెలికాం సంస్థలలో 50వేల మంది గ్రామీణులకు ఉపాధి