తిరుమలై కృష్ణమాచార్య
స్వరూపం
కృష్ణమాచార్య | |
---|---|
జననం | చిత్రదుర్గ జిల్లా, మైసూరు సామ్రాజ్యం | 1888 నవంబరు 18
మరణం | 1989 ఫిబ్రవరి 28 మద్రాసు | (వయసు 100)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | యోగాధ్యాపకుడు, పండితుడు, ఆయుర్వేద వైద్యుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఆధునిక యోగా పితామహుడు |
తిరుమలై కృష్ణమాచార్య (1888 నవంబరు 18 - 1989 ఫిబ్రవరి 28)[1][2] భారతీయ యోగా గురువు, ఆయుర్వేద వైద్యుడు, పండితుడు. ఈయనను ముఖ్యమైన యోగా గురువుల్లో ఒకడిగా, ఆధునిక యోగా పితామహుడిగా భావిస్తారు.[3] యోగాసనాలతో ఆయన విశేషమైన ప్రభావం కనబరిచాడు.[4][5] ఈయన హఠయోగాన్ని పునరుద్ధరించడంలో కృషి చేశాడు.[6][7]
కృష్ణమాచార్యులు ఆరు భారతీయ దర్శనాల్లోనూ (షడ్దర్శనములు) డిగ్రీలు కలిగి ఉన్నాడు. మైసూరు మహారాజైన నాలుగవ కృష్ణరాజ ఒడయారు ప్రాపకంలో ఈయన భారతదేశమంతా పర్యటించి యోగా విశిష్టతను గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు. హృదయ స్పందనను ఆపడం లాంటి విశేషమైన ప్రతిభను ప్రదర్శించాడు.[8] ఈయన యోగా మీద నాలుగు పుస్తకాలు రాశాడు. యోగా మకరంద (1934), యోగాసనాలు (1941),[9] యోగ రహస్య, యోగావళి. ఇంకా కొన్ని వ్యాసాలు, పద్యాలు రాశాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ Mohan 2010, p. 125.
- ↑ "Krishnamacharya Yoga Mandiram". Archived from the original on 11 ఏప్రిల్ 2015.
- ↑ Singleton & Fraser 2014, pp. 83–106.
- ↑ Mohan, A. G.; Mohan, Ganesh (5 April 2017) [2009]. "Memories of a Master". Yoga Journal. Archived from the original on 15 March 2010.
- ↑ "The YJ Interview: Partners in Peace". Yoga Journal. Archived from the original on 21 May 2016.
- ↑ Pagés Ruiz 2001.
- ↑ 7.0 7.1 Singleton 2010, p. 111.
- ↑ Mohan 2010, p. 7.
- ↑ Singleton 2010, p. 240.