Jump to content

హఠయోగం

వికీపీడియా నుండి
హఠయోగం

హఠయోగం అనేది యోగాలో ఒక విభాగం. ఇది శారీరక, మానసిక వ్యాయామాల ద్వారా బుద్ధిని బాహ్య వస్తువుల నుంచి దూరంగా వచ్చునని తెలియజేస్తుంది.[1] సంస్కృతంలో హఠ అంటే బలవంతంగా అని అర్థం. ప్రాచీన భారతీయులు ఈ విధానాన్ని అవలంభించడం శ్రమతో కూడుకున్నది కాబట్టి ఈ అర్థాన్ని ఆపాదించి ఉండవచ్చు.[2] హఠయోగం యోగా అనే బృహత్తర విధానంలో కొన్ని భౌతిక విధానాలను సూచిస్తుంది.[3]: 770,  [4]: 527 హ-ఠ అనే రెండక్షరాలు, సూర్యచంద్రుల సాంగత్యాన్ని తెలుపుతున్నవనీ, శివభక్తుల సాంగత్యానికి సూచికలని కూడా అంటారు.ఈ యోగానికి ఆంధ్రదేశంలో ఎక్కువ ప్రచారం ఉండేదనేవారు.

భారతదేశంలో హఠయోగం నాథ్ సాంప్రదాయానికి చెందిన మత్స్యేంద్రనాథ్ అనే సన్యాసి ద్వారా ఎక్కువ ప్రాచుర్యం పొందింది. హఠయోగానికి చెందిన చాలా పుస్తకాలు కూడా నాథ సాంప్రదాయానికి చెందిన యోగులు రాసినవే. వీటిలో ముఖ్యమైనవి మత్స్యేంద్రనాథ్ శిష్యుడైన గోరఖ్ నాథ్ లేదా గోరక్ష నాథ్ అనే యోగి రాసినవి.[5] మత్స్యేంద్రనాథ్ కే మీనా నాథ్ అనీ టిబెట్ లో మినపా అని కూడా వ్యవరిస్తుంటారు. ఈయనను హిందు, బౌద్ధ తాంత్రిక విధానాల్లో ఈయనను సమానంగా గౌరవిస్తారు. జేమ్స్ మాలిసన్ మాత్రం హఠయోగం దశనామీ సాంప్రదాయానికి చెందినదని, అందుకు మూలపురుషుడు దత్తాత్రేయ స్వామి అని భావించాడు.[6][7] దత్తాత్రేయ యోగశాస్త్రం ప్రకారం హఠయోగంలో రెండు విధానాలున్నాయి. ఒకటి యజ్ఞవల్క్యుడు అవలంభించిన అష్టాంగ యోగం. ఇంకొకటి కపిల మహర్షి అనుసరించిన అష్టముద్ర యోగం.

ప్రస్తుతం హఠయోగాన్ని వివరించే అతి పురాతనమైన వచనం, సా. శ 11 వ శతాబ్దానికి చెందిన అమృతసిద్ధి అనే గ్రంథం. ఇది తాంత్రిక బౌద్ధ మూలాలు నుండి వచ్చింది. [8] హఠ అనే పదం వాడిన అత్యంత ప్రాచీన గ్రంథాలు కూడా వజ్రయాన బౌద్ధమతానికి సంబంధించినవే. ఈ యోగానికి సంబంధించిన మరొక ముఖ్యమైన గ్రంధం హఠరత్నావళి.దీని కర్త శ్రీ.శ్రీనివాస భట్ట మహాయోగీంద్రుడు పెక్కు శాస్త్రాలలో గొప్ప విద్వాంసుడనీ, కృష్ణానదీ తీరవాసియై ఉండవచ్చిననీ, ఆతనికి ఆత్మారాముడనేవారు. ఆత్మారామ, స్వాత్మారామ దీక్షానామం కల శ్రీనివాస మరికొందరుకూడా ఉన్నారు. ఒక ఆత్మారామ హఠయోగికి-కుంభికా పురాన్ని (నేటి కుమిలెను) పాలిస్తూ వుండిన గజపతిమహారాజులు ఒక అగ్రహారాన్ని ఇచ్చారు.నేటి హంపీ విజయనగరం ఏర్పడక మునుపు గజపతిరాజులకు దాని సమీపంలోని కుంభికాపురమే (కుమిలియే) రాజధానిగా ఉండేది.హఠరత్నావళి కర్త 15వ శతాబ్ది మధ్యభాగానికి ముందుభాగమే ఉండివుండవచ్చునని తెలుస్తున్నది.

20 వ శతాబ్దంలో హఠయోగం యొక్క అభివృద్ధి, ముఖ్యంగా ఆసన (భౌతిక భంగిమలు) పై దృష్టి సారించి, ప్రపంచవ్యాప్తంగా ఒక శారీరక వ్యాయామం రూపంగా ప్రాచుర్యం పొందింది. ఇది ఇప్పుడు విస్తృతమైన అర్థంలో "యోగా" అని పిలువబడుతుంది.

References

[మార్చు]
  1. Encyclopedia Britannica 2007.
  2. James Mallinson 2011, p. 770.
  3. Mallinson, James (2011).
  4. Birch, Jason (2011), The Meaning of haṭha in Early Haṭhayoga Journal of the American Oriental Society 131.4.
  5. White, David Gordon (2012). The Alchemical Body: Siddha Traditions in Medieval India. University of Chicago Press. p. 57. ISBN 9780226149349.
  6. James Mallinson (2014). The Yogīs' Latest Trick. Journal of the Royal Asiatic Society (Third Series), 24, pp 165-180. doi:10.1017/S1356186313000734.
  7. Yoga and Yogis. March 2012. James Mallinson. pg. 26–27.
  8. Mallinson, James (2016). [1] The Amṛtasiddhi: Hathayoga's tantric Buddhist source text
"https://te.wikipedia.org/w/index.php?title=హఠయోగం&oldid=3311953" నుండి వెలికితీశారు