Jump to content

ధనంజయ్ ఛటర్జీ

వికీపీడియా నుండి
ధనంజయ్ ఛటర్జీ
జననం.ధనంజయ్ ఛటర్జీ
(1965-08-14)1965 ఆగస్టు 14
కులుదిహి, పశ్చిమ బెంగాల్, భారతదేశం
మరణం2004 ఆగస్టు 15(2004-08-15) (వయసు 39)
అలీపూర్ జైలు, కోల్‌కతా, భారతదేశం
నేరాలుమానభంగం
హత్య

ధనంజయ్ ఛటర్జీ (1965 ఆగస్టు 14 - 2004 ఆగస్టు 15) 21వ శతాబ్దంలో అత్యాచారం, హత్య కేసులో భారతదేశంలో ఉరితీయబడిన మొదటి వ్యక్తి. ఉరిశిక్షను 2004 ఆగస్టు 15న కోల్‌కాతా అలీపూర్ జైలులో అమలు చేశారు.[1][2] 1990లో 18 ఏళ్ల పాఠశాల బాలిక హెటల్ పరేఖ్ పై అత్యాచారం, హత్య నేరాలకు పాల్పడినట్లు ఆయనపై అభియోగాలు మోపారు.[3]

1991 ఆగస్టు 21 తర్వాత పశ్చిమ బెంగాల్ లో అలిపోర్ జైలులో ఉరి తీయడం ఇదే మొదటిసారి.[4][5][6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ధనంజయ్ ఛటర్జీ భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ కులుడిహిలో జన్మించాడు. అతను కోల్‌కాతాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసాడు.[7] అతను హెటల్ పరేఖ్ కేసులో అరెస్టు కావడానికి కేవలం ఎనిమిది నెలల ముందు తాను సెక్యూరిటీ గార్డుగా ఉన్నప్పుడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేస్తున్నానని తప్పుగా చెప్పి పూర్ణిమను వివాహం చేసుకున్నాడు.[8] పూర్ణిమ నెలకు 1,200 రూపాయల జీతంతో అంగన్వాడి కార్యకర్తగా పనిచేస్తుంది. అతనిని ఉరితీసిన తరువాత ఆమె తల్లిదండ్రులతో కలిసి నివసించింది. భర్తను ఉరితీసిన తరువాత కూడా ఆమె తిరిగి వివాహం చేసుకోవడానికి నిరాకరించింది.[9][10]

కేసు వివరాలు

[మార్చు]

హెటల్ పరేఖ్ కోల్‌కాతాలోని బౌబజార్ వెలాండ్ గోల్డ్ స్మిత్ పాఠశాలలో చదువుకుంది. ఆమె తన తల్లిదండ్రులు, అన్నయ్యతో కలిసి భవానీపూర్ ఆనంద్ అపార్ట్మెంట్ లోని మూడవ అంతస్తులో ఉండేవారు. ఆమె 1987లో ఈ ఫ్లాట్ కు మారింది. ధనంజయ్ ఇక్కడ సెక్యూరిటీ గార్డుగా ఉండేవాడు. ఆయన ఆ భవనంలో దాదాపు మూడు సంవత్సరాలు పనిచేసాడు.

1990 మార్చి 5న, ధనంజయ్ ఉదయం షిఫ్ట్ సమయంలో (ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు) భద్రతా విధులను నిర్వర్తించాడు. హెటల్ పరేఖ్ ఉదయం 7:30 గంటలకు తన ఐసిఎస్ఇ పరీక్షకు బయలుదేరింది. పరీక్ష అనంతరం ఇంటికి తిరిగి వచ్చింది. మధ్యాహ్నం సమయంలో ఫ్లాట్లో ఆమె, ఆమె తల్లి మాత్రమే ఉన్నారు.

ఆమె తల్లి మధ్యాహ్నం పక్కనే ఉన్న ఒక ఆలయానికి వెళ్ళింది. ఆలయం నుండి తిరిగి వచ్చిన ఆమె తన ఇంటి తలుపు ఎంత తట్టినా తీయకపోవడంతో, ఇతర ఫ్లాట్లలోని వారి సహాయంతో తలుపు పగలగొట్టారు. పరేఖ్ దంపతుల పడకగదితో లివింగ్ రూమ్ ను అనుసంధానించే తలుపు దగ్గర హెటల్ శవమై కనిపించింది, ఆమె ముఖం మీద, నేలపై రక్తపు మరకలు ఉన్నాయి. ఇద్దరు స్థానిక వైద్యులు హెటల్ ను పరీక్షించి చనిపోయినట్లు ప్రకటించారు.

హత్య జరిగిన విషయం తెలిసిన తర్వాత ధనంజయ్ ఆ ప్రాంతంలో కనిపించలేదు. పోలీసుల విచారణలో ఆయన కేంద్ర బిందువుగా మారాడు. చివరికి 1990 మే 12 తెల్లవారుజామున బంకురాలోని ఛత్నా సమీపంలో కులుడిహి వద్ద అతని ఇంట్లో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

ఈ కేసును కోల్‌కాతా డిటెక్టివ్ డిపార్టుమెంట్ ఆఫ్ పోలీస్ దర్యాప్తు చేసింది. పోలీసుల ఛార్జ్ షీట్ లో అత్యాచారం, హత్య, చేతి గడియారం దొంగతనం వంటి అభియోగాలు ఉన్నాయి. అలిపోర్ లోని అదనపు సెషన్స్ జడ్జి రెండవ కోర్టులో విచారణ జరిగింది. హత్యకు ప్రత్యక్ష సాక్షి లేనందున, కేసు కేవలం పరిస్థితుల ఆధారాలపై ఆధారపడి ఉంది. సెషన్స్ కోర్టు ధనంజయ్ ఛటర్జీను అన్ని నేరాలకు దోషిగా నిర్ధారించి, అతనికి మరణశిక్ష విధించిన తరువాత, కలకత్తా హైకోర్టు, భారత సుప్రీంకోర్టు ఈ నేరారోపణను, మరణశిక్షను సమర్థించాయి.

మరణశిక్ష

[మార్చు]

ధనంజయ్ ఛటర్జీ ఉరిశిక్షను 2004 జూన్ 25న అమలు చేయాలని నిర్ణయించారు. అతని కుటుంబం భారత సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసి, అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసిన తరువాత అది నిలిపివేయబడింది.[11] 2004 జూన్ 26న, ధనంజయ్ ఉరి తీయడానికి ఒక ప్రచారం ప్రారంభించబడింది. పశ్చిమ బెంగాల్ అప్పటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ భార్య మీరా భట్టాచార్జీ ఈ ప్రచారానికి నాయకత్వం వహించింది.[11][12][13][3] ఈ మరణశిక్షను వ్యతిరేకించడానికి అనేక మంది వ్యక్తులు, మానవ హక్కుల సంఘాలు ముందుకు వచ్చాయి.[14][15] క్షమాభిక్ష పిటిషన్ ను చివరకు 2004 ఆగస్టు 4న రాష్ట్రపతి తిరస్కరించాడు.[16]

జైళ్లు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బిశ్వనాథ్ చౌదరి కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ధనంజయ్ ఉరిశిక్ష తేదీని నిర్ణయించారు.[17] 2004 ఆగస్టు 15న అతడికి ఉరిశిక్ష విధించబడింది. అతని మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబం నిరాకరించింది, తరువాత దానిని దహనం చేశారు.[15][18]

మీడియా

[మార్చు]

ఈ కేసు సంఘటనల ఆధారంగా ధనంజయ్ అనే చిత్రం 2017 ఆగస్టు 11న ప్రాంతీయంగా, అమెజాన్ ప్రైమ్ లలో విడుదలైంది.[19][20][21] అరిందమ్ సిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనిర్బన్ భట్టాచార్య, మిమి చక్రవర్తి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం "అదాలత్-మీడియా-సమాజ్ ఎబాంగ్ ధనంజయర్ ఫషి" అనే పుస్తకం ఆధారంగా రూపొందించబడింది. ఈ ప్రాజెక్ట్ కి మొదట అంగీకరించిన తరువాత ధనంజయ్ కుటుంబం నుండి కూడా ఈ చిత్రానికి అభ్యంతరం వచ్చింది [22]

మూలాలు

[మార్చు]
  1. "Six convicts in death row in Bengal jails". The Times of India. 5 September 2012.
  2. "Front Page : Dhananjoy hanged". The Hindu. 2004-08-15. Archived from the original on 2015-01-28.
  3. 3.0 3.1 "Judgment in the case of Dhananjoy Chatterjee vs. State of West Bengal". A. S. Anand and N. P. Singh, JJ, para 1, page 226. Supreme Court of India. 11 January 1994. Archived from the original on 8 December 2015. Retrieved 1 December 2015.
  4. "I hanged my first victim when I was 16". indianexpress.com.
  5. "The Telegraph - Calcutta : Metro". telegraphindia.com. Archived from the original on 3 January 2005.
  6. https://www.amnesty.org/ar/documents/asa20/039/1991/ar/. Retrieved 2015-01-28. {{cite web}}: Missing or empty |title= (help)
  7. N., Jayaram (21 July 2015). "How India hanged a poor watchman whose guilt was far from established". scroll.in. Retrieved 9 December 2015.
  8. "Dhananjoy's family stood rock-like behind him". Outlook. 15 August 2004. Retrieved 6 March 2020.
  9. "Dhananjoy widow seeks peace". Naresh Jana. The Telegraph. 22 January 2005. Retrieved 6 March 2020.
  10. "A matter of life and death". The Telegraph. 23 August 2005. Retrieved 6 March 2020.
  11. 11.0 11.1 Bhattacharyya, Malabika (30 June 2004). "Controversy rages over Dhananjoy issue". The Hindu. Retrieved 2 December 2015.
  12. "Wife adds tears to Buddha's hang-him cry - Meera Bhattacharjee joins campaign to ensure condemned rapist 'gets what he deserves'". The Telegraph, Calcutta. Archived from the original on 1 January 2005. Retrieved 2 December 2015.
  13. "Dhananjay's execution demanded at open debate in city". Outlook. Retrieved 2 December 2015.
  14. Chattopadhyay, Suhrid Sankar (14 August 2004). "The case of death sentence". Frontilne. Retrieved 2 December 2015.
  15. 15.0 15.1 "India carries out rare execution". BBC News. 14 August 2004. Retrieved 2 December 2015.
  16. Singh, Onkar (4 August 2004). "Kalam rejects Dhananjoy's mercy petition". rediff.com. Retrieved 2 December 2004.
  17. "Dhananjoy hanging: August 14, 0430 IST". rediff.com. 10 August 2004. Retrieved 2 December 2015.
  18. Bhattacharya, Malabika (15 August 2004). "Dhananjoy hanged". The Hindu. Archived from the original on 28 January 2015. Retrieved 2 December 2015.
  19. "Film on Dhananjoy hanging case". The Times of India. Retrieved 12 December 2016.
  20. "Dhananjay The Movie is All Set to Ask Uncomfortable Questions". News18. 6 August 2017.
  21. "Movie on Dhananjay: Family members say 'betrayed', director claims they were happy". 14 August 2017.
  22. Dasgupta, Priyanka (July 27, 2017). "Dhananjoy's family objects to Arindam Sil's film". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-07.